22-07-2022, 02:13 PM
(This post was last modified: 22-07-2022, 04:19 PM by Pallaki. Edited 2 times in total. Edited 2 times in total.)
గుణ : అన్నా.. నేను కూడా వస్తనన్న పెళ్ళికి.
వీర : నువ్వు దేనికిరా..
గుణ : ఊరికే అన్న ఇక్కడ మస్తు బోర్.. నేను కూడా వచ్చి పెళ్లి చూస్త అన్న.
వీర : సరే పో.. రెడీగా..
గుణ : యే... అనుకుంటూ రెడీ అవ్వడానికి బాత్రూంలోకి దూరాడు.
≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈
గుణ కార్ ఎక్కుతూ.. అన్నా పెళ్లి ఎక్కడా..
వీర : వైజాగ్.. బీచ్ దెగ్గర.. హోటల్లో.
శంకర్ : వీరా... ఆ SI మణికన్నన్ గాడి ఫ్యామిలీని ఏం చేద్దాం..
వీర : వదిలెయ్యండి.. వాడు డ్యూటీలో ఉండగా పోయడానికి మేనేజ్ చేసి వాడి భార్యకి రావాల్సిన డబ్బు గవర్నమెంట్ నుంచి ఇప్పించండి.. ఎవ్వరు వాళ్ళ జోలికి వెళ్లొద్దు.. నేను వెళ్తున్నాను నాన్న జాగ్రత్త.. అని స్కోర్పియో ని ముందుకి పోనిచ్చాడు.
బండి నేరుగా వైజాగ్ వెళ్లి ఆగింది.. హోటల్ కి వెళ్లి రూమ్ తీసుకున్నారు..
వీర : గుణా నువ్వు పడుకో నేనలా బైటికి వెళ్ళొస్తాను.
గుణ : అలాగే అన్నా..
కొంత సేపటికి డోర్ చప్పుడుకి లేచి డోర్ తీసాడు..
గుణ : అన్నా... నువ్వేనా.. షేవింగ్ కటింగ్ చేస్కొని వచ్చినవా.. మస్తున్నవ్.
వీర : అట్లనా... నువ్వు పక్కకి జరిగితే పొయ్యి స్నానం జెస్తా... అని గుణ తల మీద మొట్టికాయ వేసి లోపలికి వెళ్లి మంచం మీద కవర్ పడేసి వెళ్ళాడు.
గుణ : అన్నా.. ఎంటివి.. డ్రెస్సులు.. అబ్బా మస్తున్నయి.. స్టైల్ గా.. మన ఇద్దరికా..
వీర : అవునురా..
ఇద్దరు రెడీ అయ్యి కొత్త బట్టలు వేసుకున్నారు ..
గుణ : అన్నా.. హీరో లెక్కున్నవ్.. మస్తున్నవ్ అన్నా.. నిన్ను చూస్తే ఎవ్వరైనా ఫ్లాట్ గావాల్షిందే..
వీర : చాల్లే పదా..
ఇద్దరు రెడీ అయ్యి పెళ్లి దెగ్గరికి వెళ్లారు.. లోపలికి వెళ్ళగానే అందరూ కుర్చీల్లో కూర్చుని ముచ్చట్లు పెట్టుకుంటున్నారు. అక్కడ జానకి కనిపించింది.
గుణ : అన్నా.. వదిన..
వీర : ఎక్కడా?
గుణ : అదిగో.. వదినా.. వదినా...
గుణ గొంతు గుర్తుపట్టి జానకి వెనక్కి తిరిగింది.. చాలా రోజుల తరువాత జానకిని చీరలో చూసి ఎలా వీరా స్టన్ అయ్యాడో అంత కంటే ఎక్కువగా వీరాని ఇలా కొత్త బట్టలు నీట్ గా చూసేసరికి మళ్ళీ కాలేజీ రోజులు గుర్తొచ్చాయి..
జానకి : వీరా.. భలే ఉన్నావ్.. చూసి ఒక్కసారి నువ్వేనా అన్న డౌట్ వచ్చింది.
వీరా : పదండి లోపలికి వెళదాం..
జానకి వీరాని కౌగిలించుకుని ఏడ్చేసింది..
జానకి : ఒక్క సరైనా... నవ్వరా.. నాకు నా పాత వీరా కావాలి.. ఎన్ని రోజులైందో నీ మొహం మీద నవ్వు చూసి.. అని గట్టిగా వాటేసుకుంది.. అది చూసి గుణ కూడా కళ్ళు తుడుచుకున్నాడు.
ముగ్గురు లోపలికి వెళ్లగానే గుణని చూసిన తన పాత స్నేహితులు లేచి హత్తుకుని ఒక్కొక్కరు ఏం చేస్తున్నారని పలకరించుకున్నారు.. వీరా మాత్రం తన గురించి ఏం చెప్పలేదు..
అక్కడికి రాధ మేడం వచ్చి అందరినీ పలకరించి వీరాని చూసి ఆశ్చర్యపోయి..
రాధా : వీరా.. ఇలా రా.. ఎన్ని రోజులైందిరా.. నిన్ను ఇలా చూసి.. అని పెళ్లి కూతురు రూమ్ దెగ్గరికి తీసుకెళ్ళింది...చాలా బాగున్నావ్ వీరా.. నీకు గుర్తుందా.. టీచర్స్ డే రోజు నాకు ప్రపోస్ చేసావ్.. అప్పుడు చిన్నవాడివి కానీ ఇప్పుడు మళ్ళీ ప్రొపోజ్ చేస్తే నీకు పడిపోతానేమో.
వీరా : ఊరుకోండి మేడం.. మీరు మరీ... ఎత్తేస్తున్నారు. ఇంతకీ పెళ్లి కొడుకు ఏం చేస్తుంటాడు.. అప్పుడేదో పనిలో ఉండి అడగటం మరిచిపోయాను.
రూమ్ డోర్ తీసి.. లోపలికి తీసుకెళ్ళింది..
రాధా : ప్రణీత... అన్నయ్య వచ్చాడు.
ప్రణీత లేచి వీరాని చూసి చుట్టు ఉన్న అందరినీ పక్కకి నెట్టి వెళ్లి వీరాని కౌగిలించుకుంది.
ప్రణీత : అన్నయ్య... బాగున్నావా..
వీరా : సూపర్ గా ఉన్నావ్..
ప్రణీత : పో.. అన్నయ్యా.. ఎప్పుడు రమ్మన్నా రావు.. మమ్మల్ని దూరంగా పెట్టేసావు.. నా పెళ్లికైనా వస్తావో రావో అని భయపడ్డాను తెలుసా..
రాధా : వీరా.. రా పెళ్ళికొడుకుని పరిచయం చేస్తాను..
వీర : ఏం చేస్తుంటాడు..
రాధ : ముంబైలో అమ్మాయి ఆఫీస్ లో కొలీగ్.. ఇద్దరు ప్రేమించుకున్నారు.. అందుకే.. అదిగో తనే.. పెళ్లి కొడుకు.. పేరు సుధీర్.. మన తెలుగు వాళ్లే కానీ ఎప్పుడో ముంబైకి వెళ్లి సెటిల్ అయ్యారట.
మాట్లాడుతుండగానే.. సుధీర్ రాధా దెగ్గరికి వచ్చాడు..
రాధా : సుధీర్.. నేను చెప్పానే వీరా అని.. తనే మా వీరా..
సుధీర్ : హాయ్.. అండి.. మీ గురించి ప్రణీత చాలా చెప్పింది.. సాఫ్ట్వేర్ ఎంప్లొయ్ కదా.. అంతలోనే అక్కడికి ఒకావిడ వచ్చింది... నవ్వుతూ సుధీర్ భుజం మీద చెయ్యి వేసింది..
రాధా : వీరా.. తను సుధీర్ వాళ్ళ అమ్మ... భవాని గారు.. అనగానే.. పలకరిద్దామని భవాని వీరాని చూసింది.
వీరా కళ్ళలో నీళ్లు.. కోపం.. అన్నీ భవాని గమనించింది.. అన్నిటికంటే ఆ మొహం.. మర్చిపోలేని పోలికలు చూసి రెండు అడుగులు వెనక్కి వేసింది... వీరా చేతికున్న రుద్రాక్ష తెగి కింద పడింది.
సుధీర్ : ఇప్పుడు సాఫ్ట్వేర్ జాబ్స్ ఎలా ఉన్నాయి బ్రదర్.. అనగానే.. వీరా తెరుకుని సుధీర్ వైపు చూసాడు.. భవాని ఇంకా షాక్ లోనే ఉంది.. అయోమయంలో...
వీరా : ప్రణీత నీకు అబద్ధం చెప్పింది..
వీరా మాటలు విన్న రాధ.. వీరా షర్ట్ పట్టుకుని లాగడం మొదలుపెట్టింది..
వీరా : నేనొక గుండాని.. సెటిల్మెంట్స్.. కబ్జాలు మర్డర్లు చేస్తుంటాను.. పైసలిస్తే ఎవరి గోంతైనా కోస్త.. అని వార్నింగ్ ఇచ్చినట్టే చెప్పి.. తన అమ్మ భారతిని ఒకసారి చూసి వెనుతిరిగి వెళ్ళిపోయాడు..
రాధ గమనించి వీరా దెగ్గరికి వెళ్తుంటే.. భవాని ఆపి... వదిన గారు ప్రణీత మిమ్మల్ని పిలుస్తుంది.. అని చెప్పి వీరా వెనకాల వెళ్ళింది..
భవాని : బాబు.. బాబు... అని పిలుస్తున్నా.. వీరా ఆగకుండా వెళ్ళిపోయాడు..
వీరా గుణ దెగ్గరికి వెళ్లి.. రేయి.. పదా వెళదాం..
జానకి : ఏమైంది.. ఎందుకు..
గుణ : ఏమైందన్నా..
వీరా : వస్తవా రావా..
గుణ : వస్తున్న.. బాయ్ వదినా.
భవాని నేరుగా జానకి దెగ్గరికి వెళ్ళింది..
జానకి : హాయ్ ఆంటీ.. మీరు మా ప్రణీత అత్తగారు కదా..
భవాని : అవునమ్మా ... నిన్ను ఎక్కడో చూసినట్టుంది... నీతో ఇప్పుడు మాట్లాడిన ఆ అబ్బాయి పేరేంటి?
జానకి : వీరా ఆంటీ.. మా బావ..
భవాని : అలాగా.. నీ పేరు?
జానకి : జానకి ఆంటీ..
భవాని : (అమ్మ పేరు.. ) మీ నాన్న పేరు.. రాజేంద్ర?
జానకి : అవును ఆంటీ.. మీకు మా నాన్న తెలుసా..?
భవాని : అంటే వాడు.. భద్రా..? అని నోటి మీద చెయ్యి వేసుకుని ఏడ్చేసింది..
జానకి కంగారుపడుతూ.. ఆంటీ ఏమైంది.. అవును తన పూర్తి పేరు వీర భద్ర..
భవాని : జానకి.. నేను నీ అత్తని.. భారతి..
ఆమాట వినగానే భారతి చేతులు పట్టుకున్న జానకి కోపంగా వదిలేసింది.. అది భారతి చూసి..
భారతి : జానకి నన్ను వాడి దెగ్గరికి తీసుకెళ్ళు..
జానకి : అవసరంలేదు.. ఇన్నేళ్లుగా లేనిది ఇప్పుడెందుకు వదిలేయి వాడిని..
భారతి కళ్ళలో నీళ్లు చూసి మాట్లాడడం ఆపేసినా తన కోపం తగ్గలేదు.. భారతి కుర్చీలో కూర్చుని ఏడుస్తుంటే అది చూసిన రాధ దెగ్గరికి వచ్చింది ఏమైందంటూ..
భారతి జానకిని చూసి.. నా తప్పు లేదు పరిస్థితులవల్ల..
జానకి : అవును నీ జీవితం నీ ఇష్టం.. మావయ్య నిన్ను బలవంతంగా తీసుకొచ్చాడు.. నీకు నచ్చక నువ్వు వెళ్లిపోయావ్ ఇందులో నీ తప్పేం లేదు.. నేను నిన్ను ఏమనలేదు.. కానీ వాడిని కలవాలని అడగకు..
గొడవ జరుగుతుందని తెలుసుకున్న సుధీర్ ప్రణీత ఇద్దరు అక్కడికి వచ్చి.. జానకి తన అమ్మని తిడుతుంటే.. సుధీర్ ముందుకు వెళ్ళబోగా.. ప్రణీత ఆపి.. జానకి చెయ్యి పట్టుకుంది.
ప్రణీత : వదినా.. ఏమైంది.. అన్నయ్య ఏడి..?
ఇంతలో భారతి లేచి : ఒక్కసారి చూపించరా.. వాడికి నేను సంజాయిషీ ఇచ్చుకోవాలి..
జానకి ప్రణీత చెయ్యి వదిలించుకున : అవసరం లేదు.. నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చేసావ్.. నువ్వు వెళ్ళిపోయాక మావయ్య ఆయన జీవితం ఆయన చూసుకున్నాడు.. ఇంకో పెళ్లి చేసుకున్నాడు.. కానీ దాని వల్ల నష్టపోయింది నా బావ ఒక్కడే..
నువ్వెళ్ళిన దెగ్గరనుంచి ఒకటే ఏడుపట... అన్నం తినే వాడు కాదు.. నిద్ర పొయ్యేవాడు కాదట.. ఆ తరువాత కొన్ని రోజులు మా అందరి ముందు నవ్వుతూ కనిపించినా నాకొక్క దానికే తెలుసు వాడు నవ్వుతున్నాడో లేదో..
కాలేజీలో చేరాక నీకోసం పిచ్చి కుక్క లాగ వెతికాడు... నువ్వు దొరక్కపోయే సరికి కోపంతో పిచ్చెక్కి పోయేవాడు... నీ మీద కోపం పెంచుకుని.. కసిగా చదవడం మొదలు పెట్టాడు ఈ దేశం వదిలి పోడానికి.. కానీ మావయ్య వాడిని ఏమడిగాడో తెలీదు వారం తరువాత కత్తి పట్టాడు..
అందరినీ నరుకుతూ.. గొడవలు.. వాడి జీవితమే అల్లకల్లోలం అయ్యింది.. అదే నువ్వు వాడి పక్కన ఉంటే వాడి జీవితంలో ఇవన్నీ జరగనిచ్చేదానివా... ఇప్పుడు మళ్ళీ వాడిని కదిలించి.. వాడి మిగిలిన జీవితాన్ని కూడా నాశనం చెయ్యకు అని అక్కడ నుంచి కోపంగా వెళ్ళిపోయింది.
రాధ వెళుతున్న జానకి చెయ్యి పట్టుకుని ఆపింది.. జానకి వెనక్కి తిరిగి చూసింది.
రాధా : జాను.. వీరా వాళ్ళ అమ్మా..?
జానకి : మ్..
భారతి సుధీర్ ని వాటేసుకుని.. ఏడుస్తూ మాట్లాడుతుంది..
రాధా : జానకిని వెనక్కి లాగి.. జాను.. వాడి దెగ్గరికి తీసుకెళ్ళు..
జానకి : మేడం..
రాధా : తీసుకెళ్ళు.. వాళ్లిద్దరి బాధని ఒకేసారి తీర్చుకోనీ..
జానకి : ఇదే హోటల్లో రూమ్ నెం 112 లో ఉన్నాడు..
భారతి తన వెనకాలే సుధీర్ మరియు తన చెల్లెలు సుప్రియ భారతి వాళ్ళ ఆయన వెళ్లారు.. డోర్ కొట్టారు..
గుణ డోర్ తెరిచాడు.. అందరినీ చూసి.. అన్నా ఎవరో వచ్చారు..
వీరా.. బ్యాగ్ సర్దుతూ తల ఎత్తి చూసాడు.. ఎదురుగా భారతిని చూసి.. గుణా నువ్వు వదిన దెగ్గరికి పో.. నేను వస్తాను..
గుణ అలాగే అంటూ ఏడుస్తున్న భారతిని చూసి వెళ్ళిపోయాడు.
భారతి లోపలికి వస్తూ.. వెనకున్న తన వాళ్ళని చూసి సైగ చేసింది అందరూ కిందకి వెళ్లిపోయారు..
భారతి : భద్రా..
వీరా : ఎలా ఉన్నావ్?
భారతి ఏడ్చింది తప్పితే ఏం మాట్లాడలేదు..
వీరా : ఏడవకు.. నేను నిన్ను అర్ధం చేసుకున్నాను నా బాధంతా నువ్వు నన్ను వదిలి వెళ్ళిపోయాక కనీసం నన్ను చూడటానికో.. లేక నువ్వు ఎక్కడున్నావో కూడా నాకు తెలియనివ్వలేదు.. నన్ను ఒక బరువు లాగ వదిలించుకుని వెళ్లిపోయావ్.. అందుకే నీ మీద కోపం.. ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నావు నాకు అది చాలు..
ఎలాగో మనం కలవలేం.. నువ్వు నాకు అవసరమైనప్పుడు నా దెగ్గర లేవు.. ఇప్పుడు నాకు అవసరం లేదు.. ఉన్నా నీకు ఉన్న బంధాలు మనల్ని కలవనివ్వవు.. నేను వెళ్తున్నాను..
వీరా.. వెళ్ళిపోతూ.. "భారతి.. నువ్వు నన్ను కనకుండా ఉండాల్సింది" అని వెళ్ళిపోయాడు.. వెనక భారతి ఏడుస్తూ కుప్పకూలిపోయింది..
వీరా బైటికి వచ్చి జానకి రాధా దెగ్గరికి వెళ్లి .. గుణని చూస్తూ..
వీరా : గుణా.. ఇక్కడ ప్రణీత అత్తగారింటికి వెళ్ళిపోయాక రాధా మేడం ఒక్కటే ఉంటుంది.. తనకి తోడుగా ఉంటావా.. నీకు ఒక అమ్మ దొరుకుతుంది అని రాధని చూసాడు..
రాధకి అర్ధమయ్యి గుణ చెయ్యి పట్టుకుంది.. గుణకి కూడా కళ్ళలో నీళ్లు తిరిగాయి... జానకి చెప్పిందంతా విని..
గుణ : నువ్వు సంతోషంగా ఉంటే చాలన్నా.. అని కౌగిలించుకున్నాడు..
వీరా : జానకి పదా..
జానకి వీరా వెనుకే నడిచి.. గుణకి బాయ్ చెప్పి కార్ ఎక్కి కూర్చుంది.
కార్ హైవే మీదకి ఎక్కే వరకు ఇద్దరు ఏం మాట్లాడుకోలేదు.
జానకి : బావ..
వీరా : చెప్పు..
జానకి : నీకు అవసరం అయినప్పుడు అమ్మా నాన్నా ప్రేమ దొరకలేదు.. కానీ నేనలా కాదు బావా.. చిన్నప్పటి నుంచి నీకోసమే నీతోనే ఉన్నాను.. నిన్ను వాళ్ళలా వదిలి వెళ్ళిపోను బావా చావైనా బత్తుకైనా నీతోనే.. నన్ను తీసుకుని.. ఈ గొడవలకి దూరంగా మనకి పరిచయం లేని పచ్చటి ఊరికి నన్ను తీసుకెళ్లిపో.. నీకు నేను.. నాకు నువ్వు అంతే.. అని వీరా బుగ్గ మీద ఏడుస్తూ ముద్దు పెట్టింది..
వీరా కార్ నడుపుతూనే.. హైవే మీద నుంచి దిగకుండా వేగంగా పోనిచ్చాడు.. జానకి బావా మనం వెళ్ళాల్సింది అటు అని చెప్తూనే.. ఎదురుగా కొచ్చి.. 1400 కిమీ.. అన్న బోర్డు చూసి.. వీరాని ప్రేమగా చూస్తూ గట్టిగా హత్తుకుపోయింది..

సమాప్తం