Thread Rating:
  • 5 Vote(s) - 2.6 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
కధా స్రవంతి ❤️
#88
(21-07-2022, 10:09 PM)Takulsajal Wrote:
ఆరు చెంచాలు
4



విక్కీ కార్ ఎక్కి రోడ్ మీదకి ఊరికించాడు, సెక్యూరిటీ ఆఫీసర్లు వెనక పడ్డారు కానీ ఏం లాభం, విక్కీ కార్ నడిపితే రేసర్లే పట్టుకోలేరు ఇక మాములు సెక్యూరిటీ ఆఫీసర్లు వీళ్ళేంత... కానీ ఒక్క నల్ల స్పోర్ట్స్ కార్ మాత్రం విక్కీని ఫాలో అయ్యింది ఎవరో కాదు మిత్ర.

సరదాగా డ్రైఫ్ట్ చెయ్యడం అత్యధిక వేగంలొ కారుని ఎలా కంట్రోల్ చెయ్యాలో విక్కీ దెగ్గరే నేర్చుకుంది మరీ.. విక్కీ తన డెన్ లోకి వెళ్ళగానే అక్కడనుంచి వెళ్ళిపోయింది.

అప్పటి నుంచి మిత్ర ఇన్ఫోర్మర్స్ ని పెట్టింది, ఒక రోజు విక్కీ కార్ తీసుకుని బైటికి వెళ్లడం గమనించి, ఒక్కటే కార్ తీసుకుని విక్కీ వాళ్ళ డెన్ కి వెళ్ళింది.

అక్కడ మిత్రని చూసి అందరూ బెదిరిపోయారు, కిరణ్ మాత్రం తప్పించుకోడం ఎలా అని ఆలోచిస్తున్నాడు.

మిత్ర : భయపడకండి.. నేను ఒంటరిగా వచ్చాను, మీరు ఇక్కడున్నట్టు నాకు తప్ప ఇంకెవ్వరికి తెలీదు.

కిరణ్ : మమ్మల్ని పట్టుకోడానికి కాకపోతే మరి ఎందుకోచ్చావ్?

మిత్ర : మీకు విక్కీ గురించి ఏం తెలుసో తెలుసుకుందామని వచ్చాను.

మదన్ : విక్కీ ఎవరు?

మిత్ర : ఒహ్ సారీ... మీకు తన అస్సలు పేరు కూడా తెలీదు కదా.. అదే మీ ఫ్రెండ్ విశ్వా.. తన అస్సలు పేరు విశ్వ కాదు విక్కీ.. తను మిమ్మల్ని వాడుకుంటున్నాడు అది చెపుదామనే వచ్చాను.

రియా : తన గురించి నీకేం తెలుసు?

మిత్ర : వాడి గురించి నాకేం తెలుసా... హహ.. నా మెడలో ఉన్న లాకెట్ చూసారా V అని ఉంటుంది, అది ఎవరు ఇచ్చారో తెలుసా నా భర్త విక్కీ.. అలియాస్ మీ ఫ్రెండ్ విశ్వా.. వాడు వచ్చింది మా నాన్న మీద పగతో వాడి పగ కోసం మిమ్మల్ని గొర్రెలని చేసి ఆడుకుంటున్నాడు.

ముందే చెప్తున్నాను ఎవ్వరినీ వదలను, మా నాన్న వదలడు విక్కీ అంటే నా భర్త వాడిని ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసు కానీ మీ సంగతి.. మిమ్మల్ని మీరు ఎలా కాపాడుకోవాలో మీరే తెల్చుకోండి. అని అక్కడ నుంచి వెళ్ళిపోయింది.

అక్కడున్న వాళ్ళకి ఏం మాట్లాడాలో తెలియలేదు, మిత్ర వెళ్లిపోయాక ఎవరికి వాళ్లు మౌనంగా కూర్చున్నారు, కొంత సేపటికి విశ్వ లోపలికి వచ్చాడు, విశ్వ అలియాస్ విక్కీ రాగానే అందరూ లేచి నిలబడ్డారు.

విశ్వ : ఏంటి.. అందరూ అలా ఉన్నారు?

కిరణ్ : IPS మిత్ర నీ భార్యా?

మదన్ : నువ్వు సీఎం ని చంపడానికే ఇక్కడికి వచ్చావా?

రియా : ఇదంతా నీ పర్సనల్ గొడవ, మమ్మల్ని వాడుకున్నావ్ కదూ..

విశ్వ : మిత్ర వచ్చిందా... అంటూ.. కుర్చీలో కూర్చుని అవును నిజమే ఇద్దంతా నా పర్సనల్ గొడవ మీరు చెప్పిందంతా నిజమే కానీ మిమ్మల్ని వాడుకోలేదు, ఇది మాత్రం నిజం.

కిరణ్ : సారీ.. మోసగాడితో నేను ఇక పని చెయ్యలేను.. నన్ను వదిలెయ్యండి.

రియా : అవును ఇదేదో పెద్ద రిస్క్ లాగా ఉంది.. నేను వెళ్లిపోతున్నాను.

మదన్ : సారీ విశ్వా... నేను కూడా.. అని బైటికి నడిచాడు.. తన వెనుకే సుమన్ కూడా వెళ్ళిపోయాడు.

విశ్వ : కావేరి నువ్వు కూడా వెళ్ళిపో...

కావేరి : అది కాదు వి..

విశ్వ : వద్దు.. అందరం కలిసుంటేనే టీం.. అయినా ఈ యుద్ధం నాది.. ఎవరున్నా లేకపోయినా ఆగే ప్రసక్తే లేదు.. వాళ్ళతో కలిసి వెళ్ళిపో..

కావేరి కూడా అక్కడ నుంచి వెళ్ళిపోయింది.. అక్కడే ఫ్రిడ్జ్ లో ఉన్న బీర్ తాగి సోఫాలో పడుకున్నాడు.. జరిగిందంతా మిత్ర తను పెట్టిన స్పై కెమెరాలో చూస్తుంది.

పొద్దున్నే లేచి రెడీ అయ్యి కార్ తీసాడు.. అది కెమెరాలో చూసిన మిత్ర అలెర్ట్ అయ్యి సెక్యూరిటీ ఆఫీసర్లని అప్రమత్తం చేసింది.

పొద్దున్నే పెళ్ళాం బర్తడే విషెస్ తో లేచిన సీఎం గారు.. రెడీ అయ్యి మధ్యాహ్నం వరకు అందరి దెగ్గర నుంచి విషెస్ బొకేలు అందుకుని కొన్ని మంచి పనులు చేసి ఇంకొన్ని వాగ్దానాలు చేసి.. ఆ తరువాత సాయంత్రం వరకు ఇంట్లో వాళ్ళతో గడిపి.. రాత్రికి గెస్ట్ హౌస్ కి వెళ్ళిపోయాడు ప్రైవేట్ పార్టీకి వెళ్ళిపోయాడు...

విశ్వ కార్ ఆక్సిలరేషన్ గట్టిగా నొక్కి.. వాకిటాకిలో స్టార్ట్ అన్నాడు... ఫస్ట్ గేర్ వేస్తూ..

విక్కి ఒక్కడే ఏం చేస్తాడులే అనుకుని రిలాక్స్ గా చూస్తున్న మిత్రకి ఎక్కడో తేడా కొట్టి.. విక్కీ డెన్ కి వెళ్ళింది.. అక్కడికి వెళ్లి చూస్తే.. తాను పెట్టిన స్పై కెమెరా ముందు.. ఆ రూమ్ ఫోటో ఒకటి తీసి రూమ్ కనిపిస్తున్నట్టుగానే కెమెరా ముందు అడ్జస్ట్ చేశారు.. పక్కనే ఉన్న గోడని చూసింది.. ఒక లాఫింగ్ భాఫోన్ బొమ్మ వేలాడ తీశారు.. మిత్ర కోపంగా.. వాకీటాకీ లో.. అలెర్ట్ అలెర్ట్ సీఎం థ్రెట్ అలెర్ట్ .. కంట్రోల్ రూమ్...సెక్యూరిటీ నీడెడ్ ఫర్ సీఎం ఎట్ హిస్ గెస్ట్ హౌస్.. మేక్ ఇట్ ఫాస్ట్.. ఓవర్.

పార్టీలో అందరూ తాగుతూ అమ్మాయిలతో చిందులు వేస్తుండగా అక్కడున్న ప్రొజెక్టర్ల లో సడన్ గా వీడియో ప్లే అయ్యింది. అందులో హ్యాపీ బర్త్ డే సీఎం అని రాసి టైమర్ రెండు నిముషాలకి కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది.

సడన్ గా అక్కడ వంట వండే పని మనిషి పరిగెత్తుకుంటూ వచ్చి సీఎం తల మీద గన్ పెట్టింది చూస్తే ఎవరో కాదు రియా..

సెక్యూరిటీ అందరూ గన్స్ పైకి ఎత్తి కాల్చడానికి రెడీగా ఉన్నారు.. ఇంతలో రెండు నిమిషాల టైమర్ అయిపోయింది.. ఆ వెంటనే గోడని బద్దలు కొట్టుకుంటూ ఒక ట్రక్ వచ్చింది.. డ్రైవర్ ఎవరో కాదు మదన్ తన పక్కనే సుమన్.. ఆ వెనుకే రెండు కార్లు.. ఒకదాంట్లో విశ్వ ఇంకోదాంట్లో కిరణ్..

సెక్యూరిటీ ట్రక్ ని కాలుస్తుంటే.. సుమన్ వెంటనే స్మోక్ గ్రనేడ్స్ తీసి ఇష్టమొచ్చినట్టు విసిరేసాడు.. అంతా తెల్లటి పొగ కార్లు లైట్స్ ఆఫ్ చేశారు.. సౌండ్ రాకుండా ఇంజిన్ ఆఫ్ చేశారు... సరిగ్గా మూడు నిమిషాల వరకు ఎటువంటి సౌండు లేదు.. సెక్యూరిటీ వాళ్ళకి ఏం కనిపించనందు వల్ల ఏం చెయ్యాలో తెలీక నానావస్తలూ పడుతున్నారు..

సడన్ గా రెండు కార్లు ట్రక్ ఒకేసారి స్టార్ట్ అయ్యాయి..బంధారూ సౌండ్ విని ట్రక్ వైపు కాల్చడం మొదలు పెట్టారు.. ట్రక్ కి ఇరువైపులా  లైట్స్ వెలిగాయి, సెక్యూరిటీ అవి కార్లు అని తెరుకుని కాల్చేలోపే రెండు కార్లు వెళ్లిపోయాయి..

చూస్తే సీఎం లేడు వచ్చిన వాళ్లు లేరు ట్రక్ లో వాళ్లు లేరు.. విశ్వ నడుపుతున్న కారులో వెనుక రియా సీఎం తలకి గన్ పెట్టి కూర్చుని ఆపిల్ తింటుంది.. వెనక కిరణ్ నడుపుతున్న కారులో మదన్ సుమన్ కూర్చుని ఉన్నారు..


వెనక సెక్యూరిటీ ఆఫీసర్లు తరుముతుంటే.. మిత్ర కూడా తన కార్ తీసి ఆక్సిలరేటర్ ని గట్టిగా తొక్కింది.. వెనకాల కిరణ్ కార్ లో ఉన్న సుమన్.. ఒక్కొక్క గ్రనెడ్ విసిరేస్తూ వస్తున్నాడు.. సెక్యూరిటీ ఆఫీసర్ల వెహికల్స్ గాల్లో ఎగుర్తున్నాయి.. కానీ ఒక్క కార్ మాత్రం తప్పించుకుంటూ ఫాలో అవుతుంది.. దాంట్లో ఉంది మిత్ర..

విశ్వ : కిరణ్ నువ్వు ముందుకు రా.. ఎదురుగా మూడు దార్లు కరెక్ట్ గా హండ్రెడ్ మీటర్స్ ముందు స్మోక్ గ్రనెడ్స్ పిన్నులన్నీ పీకేసి కింద వెయ్యండి..

క్రాస్ కి ఇంకా రెండోందల మీటర్లు ఉందనగా.. కిరణ్ కారు ముందుకు వచ్చింది, విశ్వ గన్ తో మిత్ర కారు టైర్ ని షూట్ చేసాడు.. మిత్ర కారు వేగం తగ్గింది కానీ ఆగలేదు.. సుమన్ గ్రనేడ్స్  పిన్నులు పీకేసి బ్యాగ్ కింద పడేసాడు.. మొత్తం పోగ మిత్ర కారు స్లో అవుతుంటే.. విశ్వ కిరణ్ ల కార్లు దూసుకుపోయాయి.. ఎటు వెళ్లాలో తెలీక ఆగిపోయింది..


విశ్వ : ఫోన్ కలిపాడు.. కావేరి... మిత్ర నుంచి ఎక్కువ దూరం తప్పించుకోలేము.. ప్లేన్ స్టార్ట్ చెయ్యమని చెప్పు గెట్ రెడీ.. వచ్చేస్తున్నాం..

మిత్రకి ఆలోచించగా.. ఫస్ట్ రోడ్ కి వెళ్తే పాత రనవే ఉందని గుర్తొచ్చి తన వెనకాలే వచ్చి ఆగి ఉన్న ఇంకో కార్ తీసుకుని వేగంగా రన్ వే దెగ్గరికి వెళ్తుండగానే.. ఫ్లైట్ గాల్లోకి ఎగురుతుంది.. గన్ తీసి కాల్చింది కానీ ఉపయోగంలేదు..

కిరణ్ సీఎం మెడ మీద కొట్టగానే.. స్పృహ తప్పి పడిపోయాడు..

విశ్వ  వెళ్లి కావేరి పక్కన కూర్చుని రెడీనా.. అని అడిగాడు

కావేరి : ఇదిగో అయిపోయింది.. ఎంటర్ నీ చేత్తో కొట్టేయి నీ పగ పూర్తిగా చల్లారినట్టే..

విశ్వ లాప్టాప్ లో ఎంటర్ బటన్ మీద వేలు పెట్టి.. తన అమ్మా నాన్నని తలుచుకుని నొక్కేసాడు..

«««««∞»»»»»
«««««∞»»»»»
«««««∞»»»»»

ఫ్లైట్ ఆమెజాన్ అడవుల మీదగా వెళ్తుండగా.. రేయ్ లేవరా.. నీ స్టాప్ వచ్చింది.. లేరా అని కిరణ్ సీఎం చెంప మీద కొట్టాడు..

విశ్వ : ఏంట్రా చూస్తున్నావ్ నన్ను గుర్తుపట్టలేదా.. నేనేరా విక్కీని గుర్తు పట్టావా.. నీకు తెలియని ఒక విషయం చెప్పనా.. నాకు పెళ్లయింది... నా భార్య పేరు.. మిత్ర.. అలా ఆశ్చర్యంగా చూడకు నీ కూతురే..

సీఎం : నన్ను వదిలేయ్.. నీ కాళ్ళు పట్టుకుంటాను.. తప్పులన్నీ ఒప్పుకుని ప్రెస్ మీట్ పెట్టి చెపుతాను..

విశ్వ : అవసరం లేదు.. కావేరి...


కావేరి లాప్టాప్ లో న్యూస్ ఛానల్ పెట్టింది.. తన రంకు బాగోతాలు.. స్కాంలు.. స్కీమ్ లు ఎంత ఎంత నొక్కింది అన్నీ వివరాలు.. విశ్వ వాళ్ళ అమ్మ నాన్నని ఎలా మోసం చేసింది ఆడియో ఫైల్స్.. వీడియో ఫైల్స్ ప్రతీ ఒక్క ప్రూఫ్ అన్నీ సోషల్ మీడియా సైట్స్ లో అప్లోడ్ చేసింది కావేరి..

విశ్వ : నీకింకో బాడ్ న్యూస్ చెప్పనా... నువ్వు పార్టీకి పిలిచావే నీ కుక్కలు .. నీ దెగ్గర కొట్టేసిన డబ్బుని వాళ్ళకే పంచాను.. పిచ్చి నా కొడుకులు కాదు కుక్కలు.. మొత్తం కక్కేసారు.. సేమ్ ట్రీట్మెంట్ నువ్వు నన్ను నీ డబ్బుతో ఎలా నాశనం చేసావో.. నేను అలానే చేసాను కానీ ఇక్కడ డబ్బు కూడా నీదే..

కోప్పడకు ఇప్పుడు ఆ కుక్కలు బతికి లేవులే.. మా రియా.. అందులో విషం కలిపింది.. అక్కడున్న నీ యాభై కుక్కలు ఈ పాటికి చచ్చి ఉంటాయి.. ఇంకా న్యూస్ లో రాలేదు అంతే..


కిరణ్ ప్లేన్ డోర్ తెరిచాడు.. విక్కీ ఒక్క తన్ను తన్నాడు.. గాల్లో ఎగిరి కింద పడుతుండగానే విక్కీ సీఎం చెయ్యి పట్టుకుని.. వదిలేయ్యమన్నావ్ గా వదిలేస్తున్నాను అస్సలే రాత్రి పులులు సింహాలు చీతాలు దట్టంగా తిరిగే ప్లేస్ ఇదే జాగ్రత్త మరి..

సీఎం : నన్ను వదలద్దు.. వదలద్దు.. ప్లీస్

విక్కీ : ఇప్పుడే కదా వదిలేయ్యమన్నావ్ అప్పుడే మాట మారుస్తావే.. అస్సలైన రాజకీయ నాయకుడివి అనిపించావ్..

మా అమ్మా నాన్న గుర్తున్నారా.. వాళ్ళని లారీతో గుద్దిచ్చే ముందు.. వాళ్ళ ఫోన్ కి ఒక మెసేజ్ వచ్చింది.. అదేంటో తెలుసా.. హ్యాపీ జర్నీ.. అని చెయ్యి వదిలేసాడు..

కిరణ్ డోర్ క్లోజ్ చేసాడు... విశ్వ కింద కూర్చుని.. కళ్ళు మూసుకున్నాడు.. కావేరి పక్కనే కూర్చుంది..

కావేరి : నెక్స్ట్ ఎక్కడికి..

విశ్వ : నేనేం ప్లాన్ చెయ్యలేదు.. ఇక నుంచి నేను ఈ టీమ్ కి మెంబెర్ ని మాత్రమే.. లీడర్ షిప్ కిరణ్ చూసుకుంటాడు.. తననే అడగండి..

కిరణ్ ఆనందంగా మొహం వెలిగిపోవడం చూసి అందరూ నవ్వుకున్నారు..

రియా నడుచుకుంటూ వచ్చి..: నెక్స్ట్ ఎక్కడికి కెప్టెన్ ... అంది..

కిరణ్ నవ్వుతూ అందరినీ చూసి : పారిస్..

సమాప్తం
❤️❤️❤️
❤️

గాఢంగా ప్రేమించుకున్న విక్కీ మిత్రా కలుసుకుంటారో లేదో ఇక అది దేవుడి విధి లిఖితం.

కథ నచ్చితే LIKE RATE COMMENT చెయ్యండి 

Super update bro but flight nundi kindha padithe paiki potharu kada. Any way ending kabati no problem. Mitra kuda kallisithe bagundedhi.
[+] 2 users Like Iron man 0206's post
Like Reply


Messages In This Thread
RE: కధా స్రవంతి - by Pallaki - 12-06-2022, 07:37 PM
RE: కధా స్రవంతి ❤️ - by Iron man 0206 - 22-07-2022, 03:35 AM



Users browsing this thread: 37 Guest(s)