Thread Rating:
  • 5 Vote(s) - 2.6 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
కధా స్రవంతి ❤️
#87
ఫణి & మణి
(J1)


మణి : రేయ్ ఫణి.. అన్నయ్యా....కొంచెం చూపించరా.

ఫణి : ఆగరా నన్ను ముందు రాయని.. ఓ.. దొబ్బుతున్నావ్ ఇందాకటి నుంచి.

మణి : రాసింది చాలు చూపించు బె.

ఫణి : నాలుగో ప్రశ్నకి ఆన్సర్ ఎంత వచ్చింది?

మణి : నాకు లెక్కలు రావని తెలుసు కద రా.

ఫణి : సరే ఇదిగో నాలుగోది ఇప్పుడే అయిపోయింది రాసుకో... (ఈ పాప ఎవ్వరో తెగ రస్తుంది)... ష్.. ఏయ్.. నిన్నే.... పాపా... ఓయి పచ్చ డ్రెస్సు.. నిన్నే.

అమ్మాయి : ఏంటి?

ఫణి : నాలుగోది ఆన్సర్ ఎంత వచ్చింది?

అమ్మాయి : నాకు ఆ ప్రశ్న అర్ధం కాలేదు.. వదిలేసా.

ఫణి : అలాగే లే.. రాసుకో... ఛీ.. ఇందాకటి నుంచి తెగ రస్తుంటే మనకంటే ఇంటెలిజెంట్ అనుకున్నా.. కాదు.. రేయ్ అయిపోయిందా.

మణి : ఆ.. ఇంతకీ ఆన్సర్ కరెక్ట్ యేనా?

ఫణి : అదే అర్ధం కాట్లేదు.. ఇక్కడ నా కంటే తెలివైన వాళ్ళు ఎవ్వరు కనిపించడంలేదు.

ఇంతలో లెక్కల మాస్టారు క్లాస్ లోపలికి వచ్చాడు.

అమ్మాయి : సర్.. నాలుగోది.. నాకు అర్ధం కాలేదు.

మాస్టారు : అందరూ వినండి.. నాలుగో ప్రశ్న.. అవుట్ ఆఫ్ సిలబస్.. వదిలెయ్యండి.

ఫణి : అమ్మ నీయమ్మ.. అందుకేనా మూడు సార్లు చేస్తే మూడు ఆన్సర్లు వచ్చాయి.

ఫణి చిన్నగా పళ్ళికిలించి నవ్వుతూ వెనక్కి తిరిగి మణి ని చూసాడు.. మణి కోపంగా ఫణినే చూస్తున్నాడు.

ఫణి : సారీ యే...

మణి : సారీ ఏంట్రా నీ యబ్బ.

ఇన్విజిలేటర్ : ఎవడ్రా అక్కడా......
Like Reply


Messages In This Thread
RE: కధా స్రవంతి - by Pallaki - 12-06-2022, 07:37 PM
RE: కధా స్రవంతి ❤️ - by Pallaki - 22-07-2022, 12:04 AM



Users browsing this thread: 39 Guest(s)