20-07-2022, 01:19 PM
(20-07-2022, 06:41 AM)kummun Wrote: ఇది మీ మొదటి ప్రయత్నం అంటే నమ్మశక్యంగా లేదు. కంగారు, తొందరపాటు లేకుండా నరేషన్ చాలా నీట్ గా ప్రేసెంట్ చేస్తున్నారు. కాకపోతే పది భాగాలు పూర్తయినా ఇంకా ప్రీన్స్(హీరో అనే అనుకుంటున్నాను) ఎంట్రీ ఇవ్వలేదు. బ్యాక్ స్టొరీ పెద్దగానే ఉంది. హీరో ఇంట్రోడక్షన్ కోసం ఎదురుచూస్తూ....
నేను కూడా కథ మొదలు పెట్టినప్పుడు సుమతి కథను ఇంత విపులంగా వ్రాయాలనుకోలేదు 3-4 ఎపిసోడ్ లలోనే పూర్తి చేయాలనుకున్నాను, కానీ సుమతి లాంటి చదువులేని, జీవితంలో ఎన్నో ఎదురు దెబ్బలు తిన్న వ్యక్తికి, ప్రిన్స్ లాంటి చదువు, సంస్కారం, జీవితంలో పీక్ సక్సెస్ ను చూసిన వ్యక్తికి జరిగే సంభాషణల్లో సుమతిని గెలిపించాలన్నా... ఉమాదేవిలా సమాజం, వ్యక్తిత్వం నిజాయితీ వంటి పెద్ద పెద్ద గోడలు కట్టుకుని జీవిస్తున్న వ్యక్తులలో మార్పు తేవాలన్నా సుమతిలో ఆ మెచ్యూరిటీ ఎలా వచ్చిందో చెప్పకపోతే సుమతి అనే క్యారెక్టర్ కు అన్యాయం చేస్తున్నాననిపించింది, చాలా ఆలోచనల తరువాత తనకు ఎలాంటి సంఘటనల వల్ల అలాంటి మెచ్చూరిటీ వచ్చిందో చెబితే న్యాయం జరుగుతుందనిపించింది... కేవలం సుమతి అనే వ్యక్తి జీవితంలో నేర్చుకున్న పాఠాలు, తన సగం తెలిసీ తెలినీ లాజిక్కులు మున్ముందు పాఠకులను ఎంటర్ టైన్ చేస్తాయని భావిస్తున్నాను....
నేను నిజంగానే కొత్త రచయితను.... నేను నేర్చుకుంటున్న పాఠాలెన్నో ఉన్నాయి నా ఈ ప్రయాణంలో.... మీ వంటి వారి కామెంట్లు, ప్రోత్సాహంతోనే నా ఈ సాహసయాత్ర దిగ్విజయంగా సాగుతోందని నేను మన:పూర్వకంగా నమ్ముతున్నాను...
పాఠకమహాశయులకు నా ధన్యవాదములు
మీ రచయిత.