18-07-2022, 06:14 PM
(14-06-2022, 09:28 PM)Takulsajal Wrote:భయం
ఈ లోకంలో ఎటు చూసినా భయం
చదవాలంటే భయం
పరీక్షలంటే భయం
ర్యాంకు రాకపోతే ఇంట్లోవాళ్ళ భయం
ప్రేమించిన అమ్మాయితొ నిజం చెప్పాలంటే భయం
చదివిన చదువుకు ఉద్యోగం రాదేమో అన్న భయం
పెళ్లి చేసుకుంటే వచ్చే అమ్మాయి మంచిదో కాదో అన్న భయం
అప్పు చెయ్యాలంటే భయం
బిడ్డలు పుడితే భయం
ఇంట్లో పెద్ద వాళ్లు పోతే రేపటినుంచి ఎలా అన్న భయం
ముసలితనం దెగ్గర పడుతుంటే భయం
చివరికి చచ్చిపోతానేమో అన్న భయం
అంతా భయం....
❤️❤️❤️❤️
నాకైతే నీ ఈ కవిత్వమ్ భలే నచ్చేసింది బాసు...
అది కూడా నిజమే కదా. మనల్ని చిన్నప్పటి నుంచీ భయపెట్టే కదా పెంచుతారు
పుస్తకాలకు కాళ్ళు తగిలితే దణ్నమ్ పెట్టుకోవాలి, లేకపోతే కళ్ళు పోతాయనే భయం
రాత్రుల్లో బూచాడి భయం
చెబితే ఏమంటారోనన్న భయం
చెప్పకపోతే ఏమౌతుందోనన్న భయం....
: :ఉదయ్