Thread Rating:
  • 6 Vote(s) - 1.67 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
వాసు గాడి వీర గాధ {completed}
(15-07-2022, 07:19 AM)Takulsajal Wrote:
25


ఆదిత్య విక్రమ్ ఇద్దరూ వాసు దెగ్గరికి పరిగెడుతున్నారు..

ఆదిత్య : ఎవడు వీడు ఇంత వైలెంట్ గా ఉన్నాడు, అక్కడ చూసావా అన్నీ తలలే, కాళ్ళు చేతులు మాములుగా ఎవ్వరినీ చంపలేదు మొత్తం భీభత్సం చేసాడు.

విక్రమ్ : వాడి చెయ్యి చూడు, గొడ్డలి పట్టుకున్న చేతిని అంత గట్టిగా పట్టుకున్నా, వేళ్ళతో గొడ్డలి తిప్పుతున్నాడు, ఆ గొడ్డలినే వాడి చేయిగా చేసుకున్నాడు, ముందు ఆ గొడ్డలిని వాడి నుంచి దూరం చెయ్యాలి.

ఇద్దరు సైగ చేసుకుని ఇంకా వేగంగా పరిగెత్తారు.


రాంబాబు, గొడ్డలి పట్టుకున్న వాసు చేతిని అర్జున్ వాసు ఇంకో చేతిని పట్టుకుని.. తనని కదలకుండా పట్టుకున్నారు కానీ వాళ్ళ వల్ల అవ్వటం లేదు.

వాసు బాలానికి ఇద్దరు వెనక్కి వంగి పడిపోతున్న సమయంలో ఒక పక్క ఆదిత్య ఇంకో పక్క విక్రమ్ ఇద్దరూ స్పీడ్ గా వాసుని అలానే వెనక్కి లాక్కెళ్లి వెనక చెక్క ఇంట్లోకి గట్టిగా తోశారు. చెక్కలు మొత్తం చెల్లా చెదురు అయ్యి పడి ఉన్నాయి.

అర్జున్ రాంబాబు అనురాధ వైపు చూసారు, ఇంతలో అనురాధ ఆదిత్య ఫోన్ నుంచి 108కి ఫోన్ చెయ్యడం వల్ల అంబులెన్సు వచ్చింది అర్జున్ పద్మని అంబులెన్సు ఎక్కించాడు.. వాసు వాళ్ళ అమ్మ, అనురాధ, మానస పద్మని తీసుకుని హాస్పిటల్ కి వెళ్లారు.

వాసు కింద పడ్డాడు కానీ తన చేతిలో ఇంకా గొడ్డలి ఉంది, లేచి అడివి దద్దరిల్లెలా అరిచాడు, విక్రమ్ ఆదిత్య లేచి నిల్చుని రెడీగా ఉన్నారు.

వాసుకి వాళ్ళు ఎవరో అస్సలు కనిపిస్తున్నారో లేదో అస్సలు స్పృహలో ఉన్నాడో లేదో కూడా ఎవ్వరికీ తెలియడంలేదు కానీ అక్కడున్న వాళ్లలో ఆదిత్య విక్రమ్ తప్ప మిగతా అందరికీ రాంబాబుతో సహా ప్యాంటు తడిసిపోయింది వాసు కోపం చూసి.

ముగ్గురు త్రిభుజాకారంలో నిలబడి ఉన్నారు, వాసు నిల్చొగానే మొదలు పెట్టాడు గొడ్డలి ఊపడం..

వాసు...విక్రమ్ వైపు గొడ్డలి విసరగానే, ఆదిత్య వెంటనే వాసు గొడ్డలి పట్టుకున్న చెయ్యి మీద గట్టిగా గుద్దాడు, దానితో వాసు చేతిలో ఉన్న గొడ్డలి కింద పడిపోగానే ఆదిత్య దాన్ని కాలితో పక్కకి తన్నాడు.

ఇంతలో రమ్య తెరుకుని వాసు వైపు వెళ్లి "నీళ్లు నీళ్లు మీద పోస్తే వాసు మాములు అయిపోతాడు" అని అరిచింది.

వాసు చెరొక్కరి కాలర్ దొరకబుచ్చుకుని ఇద్దరిని రెండు రౌండ్లు తిప్పి విసిరేసాడు.

విక్రమ్ వేగంగా వెళ్లి వాసు మోకాలు మీద గట్టిగా తంతే అదే టైంలో ఆదిత్య గట్టిగా మెడ మీద కొట్టాడు, దెబ్బకి వాసు కింద పడగానే ఆదిత్య వాసు మీదేక్కి కూర్చున్నాడు.. రాంబాబు పక్కనే ఉన్న నీళ్ల డ్రమ్ నేడుతుంటే.. వాసు ఒక్కసరిగా లేచాడు దాంతో ఆదిత్య పక్కకి పడిపోయాడు.

విక్రమ్ కి కోపం వచ్చింది, వాసు గుండె మీద ఒక్క తన్ను తన్ని ఎత్తి నీళ్ల డ్రమ్ లో విసిరేసాడు, వాసు లేస్తుండగానే ఆదిత్య విక్రమ్ ఇద్దరు లేవకుండా ఇంకో రెండు గుద్దులు గుద్దారు, వాసు చిన్నగా స్పృహ కోల్పోయాడు.

ఆదిత్య : ఇదేదో ముందే చెయ్యొచ్చుగా... అమ్మా... నడ్డి ఇరిగిపోయింది.

విక్రమ్ నవ్వాడు చిన్నగా...

అనురాధ హాస్పిటల్ నుంచి ఫోన్ చేసింది..

విక్రమ్ : అనురాధ చెప్పు..

అనురాధ : విక్రమ్.. ఒకసారి ఆదిత్యకివ్వు.. ఇక్కడ ఈ అమ్మాయి కండిషన్ సీరియస్ గా ఉంది.

విక్రమ్ స్పీకర్ లో పెట్టాడు.

ఆదిత్య : అను చెప్పవే.

అనురాధ : అమ్మాయికి బుల్లెట్ గుండె పక్కనే ఆనుకుని ఉంది, నాకు తెలిసి గుండె సైడ్ కొంచెం డామేజ్ అయ్యి ఉండొచ్చు... ఇక్కడ డాక్టర్స్ మేము చెయ్యం అని చేతులెత్తేసారు.

ఆదిత్య : వాళ్ళకి రాకపోతే నువ్వు చెయ్యి.

అనురాధ : చాలా డెలికేట్ సర్జరీ.. నాకంత ఎక్సపీరియన్స్ ఉంటే నీకెందుకు కాల్ చేస్తాను..

ఆదిత్య : వస్తున్నా.. లొకేషన్ పంపించు.

ఆదిత్య విక్రమ్ అర్జున్ వాళ్ళని చెరొక బండి మీద ఎక్కించుకుని హాస్పిటల్ కి వెళ్లారు.. ఆపరేషన్ ఆదిత్యని చెయ్యనివ్వం అంటే రాంబాబు గన్ చూపించాడు అంతే అందరూ సైడ్ అయిపోయారు.

ఆదిత్య ఆపరేషన్ థియేటర్ లోపలికి వెళ్ళాడు... అక్కడున్న అనేస్తీషియాని ఫస్ట్ అసిస్టెంట్ ని తీసుకుని. వెనకాలే అంబులెన్సు లో ప్రణీత వాళ్ళు వాసు ని తీసుకొచ్చారు..

అనురాధ వాసుని తీసుకొని ఇంకో ఆపరేషన్ థియేటర్ లోపలికి వెళ్ళింది, వాసు భుజం కింద  దిగిన బుల్లెట్, గొడ్డలి గాట్లని నయం చెయ్యడానికి.

రాంబాబు బైటికి వెళ్ళగా అర్జున్ అక్కడే అమ్మ పక్కన కూర్చున్నాడు, తన పక్కనే కవిత కూర్చుని ఉంది..




కొంత సేపటికి పద్మ రక్తంతో కింద పడిపోయిన సంగతి గుర్తొచ్చి లేచి కూర్చున్నాను, పక్కనే సెలైన్ ఎక్కించారు, ఇంకో చేతి రక్తం ఎక్కిస్తున్నారు అన్నీ పీకేసి బైటికి వచ్చి చూసాను.

నన్ను చూడగానే అందరూ లేచి నిలబడ్డారు, శృతిని చూస్తూ అమ్మ దెగ్గరికి వెళ్లి నిలబడ్డాను...

వాసు : పద్మా?

కవిత : ఆపరేషన్ జరుగుతుంది.

చిన్నగా కింద కూర్చుని అమ్మ తొడల మీద తల పెట్టుకున్నాను... కన్నీళ్లు కారుతూనే ఉన్నాయి.. సౌండ్ రాకుండా ఏడుస్తున్నాను..

అమ్మ అది చూసి... "వాసు.. పద్మకి ఏం కాదు.. నువ్వే అలా ఉంటే ఎలా చెప్పు"..

అందరూ వాసు చుట్టూ కూర్చుని ఓదార్చే ప్రయత్నం చేస్తున్నారు...ఇంతలో అనురాధ అక్కడికి వచ్చి అందరినీ చూసి తన కంట్లోకి కూడా నీరు చేరింది.. వాసు దెగ్గరికి వెళ్ళింది..

అనురాధ : అన్నయ్యా... ఇటు చూడు.. నీ పద్మకి ఆపరేషన్ చేసేదేవరో తెలుసా నా బావ.. ఇండియాలో ఉన్న నెంబర్ వన్ సర్జన్స్ కూడా బావాతో పోటీ పడలేరు.

పద్మ చాలా అంటే చాలా సేఫ్ గా ఉంది, ప్రమాదమనే మాటే లేదు, చచ్చినోళ్లనే లేపుతాడు నా బావ, పద్మ స్పృహ కోల్పోయింది అంతే.. అని అక్కడున్న అందరికి ధైర్యం చెప్పేసరికి కొంత ఊపిరి పీల్చుకున్నారు అంతా.. వాసు ఇంకా అలానే ఆలోచిస్తూ కూర్చున్నాడు.

రెండున్నర గంటల తరువాత ఆదిత్య బైటికి వచ్చేసరికి అందరూ లేచి ఆదిత్య చుట్టూ చేరారు.. ఆదిత్య వెనకాల ఉన్న వాసుని చూసి నవ్వుతూ... అంతా ఓకే అని సైగ చేసాడు.

వాసు ఏడ్చుకుంటూ వెళ్లి ఆదిత్యని కౌగిలించుకున్నాడు, ఇంతలోనే రాంబాబు కోసం అటు ఇటు చూసాడు ఆదిత్య.

విక్రమ్ మానస ఆదిత్య దెగ్గరికి వచ్చారు..

ఆదిత్య : ముప్పై ఆరు గంటల్లో స్పృహ వస్తుంది, ఒక్క నెల బెడ్ రెస్ట్ తీసుకుంటే చాలు, మాములు మనిషి అయిపోతుంది.. హెవీగా పనులు మాత్రం చేయించకండి.. జాగ్రత్తగా చూసుకోండి.. బావ బావ అని నిన్నే కలవరించింది మత్తు ఇచ్చాక కూడా..

విక్రమ్ : ఆదిత్య.. మనం ఇక్కడ ఎక్కువ సేపు ఉండటం మంచిది కాదు వెళదాం..

ఆదిత్య : రాంబాబుని చూస్తూ... ఒక్క నిమిషం వెళ్ళిపోదాం అని రాంబాబు దెగ్గరికి వెళ్ళాడు.."తెచ్చావా?" అంటూ..

రాంబాబు మందు బాటిల్ తీసి ఆదిత్య చేతిలో పెట్టాడు..

విక్రమ్ : రేయ్.. ఎన్ని సార్లు చెప్పినా వినవా?

ఆదిత్య మాట్లాడేలోపే ముగ్గురూ ఒకేసారి తల కొట్టుకున్నారు.. వాసు ఆశ్చర్యంగా చూస్తుంటే.. అనురాధ వాసు పక్కకి వెళ్ళింది.

అనురాధ : అన్నయ్యా.. ఇప్పుడు ఒక డైలాగ్ కొడతాడు చూడు.. వినలేక చస్తున్నాం ప్రతీసారి...

ఆదిత్య : ఇవ్వాల్టితో మందు మానేస్తున్నా...

అనురాధ, మానస, విక్రమ్ : ఇదే నా ఆఖరి..

ఆదిత్య : ఏయ్ సూపర్ మంచిది సింక్ లో ఉన్నారు ముగ్గురు.. ఇదే ఆఖరి.. అని గట గటా తాగేసాడు..

విక్రమ్ వాసుని చూసి నవ్వాడు..

వాసు : థాంక్స్ అండ్ సారీ..

విక్రమ్ : పరవాలేదు నేను అర్ధం చేసుకోగలను.. మేమే నీకు చెప్పాలి, మా ప్రాణాలని కాపాడావు నువ్వు అని మానసని చూసాడు.

నలుగురు హాస్పిటల్ బైటికి నడుస్తుంటే వాసు.. రాంబాబు వాళ్ళ వెంట నడిచారు..

వాసు అనురాధ చెయ్యి పట్టుకున్నాడు : ఏ అవసరం వచ్చినా ఒక్క కాల్ చెయ్యండి చాలు.

అనురాధ : అలాగే.. అని వాసుని చూసి నవ్వమని సైగ చేసి వెళ్లి ఆదిత్య బండి ఎక్కింది, అందరూ బాయ్ చెప్తుంటే రెండు బండ్లు అక్కడ నుంచి వెళ్లిపోయాయి.

వాసు హాస్పిటల్ లోపలికి వెళ్ళాడు.. ICUలొ జానకి పద్మని చూస్తూ కూర్చుంది, వెళ్లి తన పక్కనే కూర్చున్నాడు..

అమ్మా కొడుకులిద్దరు పద్మ ఎప్పుడు లేస్తుందా అని వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు.

•సమాప్తం•
❤️❤️❤️
❤️

Excellent ..mee update eppudostada ani eduruchusenta e story ki Ala chudaledu..mee nundi Mariani stories ravali bro
[+] 5 users Like crown's post
Like Reply


Messages In This Thread
RE: సీతా.....! రామ్ - by Rajeraju - 05-05-2022, 05:10 PM
RE: సీతా.....! రామ్ - by Rajeraju - 05-05-2022, 05:11 PM
RE: సీతా.....! రామ్ - by Thorlove - 05-05-2022, 05:35 PM
RE: సీతా.....! రామ్ - by Alpha@84 - 05-05-2022, 05:49 PM
RE: సీతా.....! రామ్ - by svsramu - 05-05-2022, 06:08 PM
RE: సీతా.....! రామ్ - by sailuhot - 05-05-2022, 07:00 PM
RE: సీతా.....! రామ్ - by Dhamodar - 05-05-2022, 07:27 PM
RE: సీతా.....! రామ్ - by naga8121 - 05-05-2022, 07:50 PM
RE: సీతా.....! రామ్ - by Lraju - 05-05-2022, 08:32 PM
RE: సీతా.....! రామ్ - by Uday - 05-05-2022, 09:20 PM
RE: సీతా.....! రామ్ - by Pallaki - 05-05-2022, 10:18 PM
RE: సీతా.....! రామ్ - by Dhamodar - 05-05-2022, 09:23 PM
RE: సీతా.....! రామ్ - by Pallaki - 05-05-2022, 10:20 PM
RE: సీతా.....! రామ్ - by Pallaki - 05-05-2022, 10:21 PM
RE: సీతా.....! రామ్ - by vg786 - 05-05-2022, 10:03 PM
RE: సీతా.....! రామ్ - by kummun - 05-05-2022, 10:08 PM
RE: సీతా.....! రామ్ - by Pallaki - 05-05-2022, 10:22 PM
RE: సీతా.....! రామ్ - by Pallaki - 05-05-2022, 10:26 PM
RE: సీతా.....! రామ్ - by Pallaki - 05-05-2022, 10:29 PM
RE: సీతా.....! రామ్ - by Pallaki - 05-05-2022, 10:29 PM
RE: సీతా.....! రామ్ - by Zen69 - 05-05-2022, 10:47 PM
RE: సీతా.....! రామ్ - by BR0304 - 05-05-2022, 10:54 PM
RE: సీతా.....! రామ్ - by Thorlove - 05-05-2022, 11:27 PM
RE: రాణి.....! రామ్ - by Pallaki - 06-05-2022, 03:52 AM
RE: రాణి.....! రామ్ - by kummun - 06-05-2022, 06:42 AM
RE: రాణి.....! రామ్ - by kummun - 06-05-2022, 06:34 AM
RE: రాణి.....! రామ్ - by Akmar - 06-05-2022, 06:43 AM
RE: రాణి.....! రామ్ - by Thorlove - 06-05-2022, 07:34 AM
RE: రాణి.....! రామ్ - by Pallaki - 06-05-2022, 09:02 AM
RE: రాణి.....! రామ్ - by Pallaki - 06-05-2022, 09:21 AM
RE: రాణి.....! రామ్ - by Pallaki - 06-05-2022, 09:28 AM
RE: రాణి.....! రామ్ - by kummun - 06-05-2022, 09:37 AM
RE: రాణి.....! రామ్ - by Pallaki - 06-05-2022, 09:46 AM
RE: రాణి.....! రామ్ - by Pallaki - 07-05-2022, 03:23 AM
RE: రాణి.....! రామ్ - by Pallaki - 06-05-2022, 09:44 AM
RE: రాణి.....! రామ్ - by sarit11 - 06-05-2022, 09:59 AM
RE: రాణి.....! రామ్ - by solomon - 06-05-2022, 10:39 AM
RE: రాణి.....! రామ్ - by utkrusta - 06-05-2022, 04:53 PM
RE: రాణి.....! రామ్ - by Dhamodar - 06-05-2022, 07:10 PM
RE: రాణి.....! రామ్ - by mahi - 07-05-2022, 03:07 AM
RE: రాణి.....! రామ్ - by Pallaki - 07-05-2022, 03:15 AM
RE: రాణి.....! రామ్ - by sarit11 - 10-05-2022, 11:44 AM
RE: రాణి.....! రామ్ - by Pallaki - 10-05-2022, 01:14 PM
RE: వాసు గాడి వీర గాధ - by crown - 17-07-2022, 10:22 AM



Users browsing this thread: 108 Guest(s)