14-07-2022, 11:42 AM
(This post was last modified: 14-07-2022, 11:45 AM by Pallaki. Edited 1 time in total. Edited 1 time in total.)
ఆరు చెంచాలు
3
తిరిగి డెన్ కి వచ్చాను నిద్ర పట్టలేదు.. జరిగిన విషయాలు అన్నీ గుర్తుకువచ్చాయి..
నా పేరు విక్కీ, పుట్టింది పెరిగింది అంతా అమెరికా మెక్సికోలోనే మా నాన్న ఇక్కడే సెటిల్ అయ్యి ఏం చేసుకోవాలో తెలియనంత డబ్బు సంపాదించాడు, వాటిని అరగతీసే పనిలో నేను పడ్డాను నాకు కార్ రేసింగ్ లంటే చాలా ఇష్టం కొత్త కొత్త స్పోర్ట్స్ కార్స్ కొనడం నా హాబీ ఇంజన్ వేడెక్కి పేలిపోయే దాకా కార్ ని పరిగెత్తించేవాడిని, అప్పుడప్పుడు అమ్మ తిట్టినా లైట్ తీసుకునేవాడిని.
ఒక రోజు నాన్న ఇక సంపాదించింది చాలు ఇండియా వెళ్ళిపోదాం అన్నాడు, నేను ఒప్పుకోలేదు అమ్మ కూడా ఇక్కడే ఉందాం కానీ అక్కడికి నేను ఒకసారి వెళ్లి వస్తాను అని చెప్పి ఒక నెల రోజులు ఇండియా టూర్ వెళ్ళింది.
వచ్చి రావడంతోనే అమ్మ నన్ను నాన్నని కూర్చోపెట్టింది, ఇండియా మొత్తం పేద వారికి ఫ్రీ ఫుడ్ స్టాల్స్ పెట్టాలనుకుంటుందని చెప్పింది.
ఇండియాలో చాలా మంది పేద వాళ్లు అన్నం దొరక్క అల్లాడడం చూసి అమ్మ తట్టుకోలేకపోయింది అది చూసి తన సున్నిత మనసు నన్ను కదిలించింది , నాన్న సంతోషంగా ఒప్పుకున్నాడు, నేను అమ్మతో ఇక రేసింగ్ ల జోలికి పోకుండా అమ్మకి వీలైనంత హెల్ప్ చేస్తానని మాట ఇచ్చాను, అమ్మ చాలా సంతోష పడింది.
ఇండియాలో పర్మిషన్స్ అని పొలిటిషన్స్ అని చాలా అడ్డంకులు అదిగమించి అమ్మ మొత్తానికి తను అనుకున్నది మొదలు పెట్టింది, అందరం సంతోషించాం మొదటగా తెలుగు రాష్ట్రంలో ఓపెనింగ్ చెయ్యాలని అక్కడ ఉన్న సీఎం గారిని చీఫ్ గెస్ట్ గా ఆహ్వానించి ఓపెనింగ్ చేసాం.
అప్పుడే మొదటి సారి మిత్ర వాళ్ల నాన్నని చూడటం, మిత్రా నాకు కాలేజీలో పరిచయం నా కార్ డ్రైవింగ్ స్కిల్స్ చూసే తను నాతో ప్రేమలో పడింది వాళ్ళ నాన్న సీఎం అని కూడా తెలుసు.
ఆయనని కలిసి కొంచెం సేపు ముచ్చట్లు పెట్టి కాకా పట్టడానికి ట్రై చేసాను, కానీ వాడి అస్సలు రంగు తెలుసుకోలేకపోయాను.
బిజినెస్ అని సేవ అని నాన్నతో ఫ్రెండ్ షిప్ చేసి కోట్లు కోట్లు తీసుకుని ఆ డబ్బుని ఎలక్షన్ ఓట్లు కోసం వాడుకున్నాడు, నాన్న నాకు తను ఎలా మోసపోయింది చెప్పడం వాడిని అడుగుతానని వెళతా అనడంతో..
నేను ఇండియాకి బైలదేరాను ఫ్లైట్ దిగి క్యాబ్ కోసం బైటికి వెళ్తుంటేనే ఎయిర్పోర్ట్ లోఉన్న టీవీలో న్యూస్ చూసాను అమ్మా నాన్నా కార్ ఆక్సిడెంట్ లో పోయారని..
ఆ అయోమయంలోనే ఇంటికి వెళ్లాను సీఎం అయిన మిత్ర వాళ్ళ నాన్న వచ్చి ఒక పూలదండ మోహన కొట్టి సానుభూతి తెలియ చేస్తున్నా అని మైకులో నాలుగు ముక్కలు మాట్లాడి వెళ్ళిపోయాడు, వాడి మీద అనుమానం రాకుండా వాళ్ళ స్నేహం గురించి రెండు కధలు కూడా చెప్పి ముగించాడు, కానీ పార్టీలో ఉన్న వాళ్లందరికి తెలుసు చంపించింది ఎవరో..
అది నా దాకా రావడానికి ఎంతో సమయం పట్టలేదు అమ్మ మొదలు పెట్టిన అన్నదాన కార్యక్రమం నేను కొనసాగిద్దామని చాలా ప్రయత్నించాను కానీ మొదటి అడుగు కూడా వెయ్యలేకపోయాను దాని వెనుక ఉన్నది కూడా మిత్ర వాళ్ళ నాన్నే..
ఆవేశం ఆపుకోలేకపోయాను ఎలాగైనా పగ తీర్చుకోవాలనుకున్నాను అది తెలుసుకున్నాడో ఏమో నన్ను సెంటర్ చెయ్యడం మొదలు పెట్టాడు, నాకు సంబంధించిన ఆస్తులన్నీ అక్రమంగా సంపాదించినవి అని తన స్నేహం ఉపయోగించుకుని మోసం చేసారని లేని పోనీ రైడ్లు చేపించి నా ఆస్తిని కొల్లగొట్టాడు.. మిత్ర బాధపడటం తప్ప ఏమి చెయ్యలేదు, దాని వల్ల మిత్రని దూరం చేసుకున్నాను.
మిత్ర దూరం అయ్యాక తన గురించి కొంత కాలం పట్టించుకోలేదు నేను అండర్ లోకి వెళ్లిపోయాను నన్ను నేను కాపాడుకోవలసిన పరిస్థితి నా పేరు విశ్వ గా మార్చుకున్నాను...ఆ తరువాత ఏం జరిగిందో నాకు తెలీదు కానీ మిత్ర ips అయిందని మాత్రమే విన్నాను.
ఆ సీఎం ని ఎదిరించి వాడి మీద పగ తీర్చుకోవాలంటే చాలా డబ్బు కావాలి అందరినీ వాడి పద్ధతిలోనే డబ్బుతో కోనెయ్యాలని నిర్ణయించుకున్నాను.
అందుకే నాకు తెలిసిన పద్ధతిలో కార్లని ఉపయోగించుకుని దొంగతనాలు మొదలుపెట్టాను, ఈ ప్రయాణంలోనే నాకు ఒక్కొక్కరు పరిచయం అయ్యారు అందరినీ కలుపుకుపోతూ ఇప్పుడు ఒక కుటుంబంగా కలిసి ఉంటున్నాం, ఎప్పుడు నా గురించి వాళ్లు అడగలేదు నేను చెప్పద్దలుచుకోలేదు.
ఇప్పటి వరకు చాలా డబ్బులు వెనకేసాను అందుకే మిత్ర వాళ్ళ నాన్న వెనక పడటం మొదలుపెట్టాను అది తెలుసుకుని ఇప్పుడు మిత్రా నా వెంట పడుతుంది.. ఇప్పుడు తన కళ్ళలో నా మీద ప్రేమ కూడా నాకు కనిపించలేదు ఇక నేను ఆగదలుచుకోలేదు.
రేపే ఏదో ఒకటి తెల్చుకుని తీరతాను.