12-07-2022, 05:21 PM
(This post was last modified: 19-10-2022, 09:42 PM by Pallaki. Edited 2 times in total. Edited 2 times in total.)
8
హోటల్ నుంచి హాస్టల్ కి వెళ్లి పడుకున్నాననే గాని ఇంకా కాలేజీలో కనిపించిన తన మొహమే కనిపిస్తుంది, సార్ చెప్పాడు తన పేరు మీనాక్షి అని ఎంత బాగుంది పేరు కూడా తన లాగే.
తను వెళ్లిన కార్ చూస్తుంటే చాలా ఉన్నోళ్ల లాగ ఉంది, మరి ఈ కాలజీలో తనకేం పని కొంపదీసి సర్ వాళ్ల బంధువులు అయితే కాదు కదా. అలా తన ఊహలతో వారం గడిచింది కానీ తనని మర్చిపోలేదు తన జాడ కూడా లేదు తన గురించి సర్ ని అడిగేంత ధైర్యము నాకు లేదు.
పొద్దున్నే లేచి హోటల్ కి వెళ్ళాను చాచా కలిసాడు కానీ లతీఫ్ గురించి ఏం మాట్లాడలేదు నేను మౌనంగానే ఉన్నాను, నాకు దాని గురించి మాట్లాడాలని లేదు.
కాలేజీకి వెళ్లాను ఇవ్వాళ క్లాస్ కి గగన్ సర్ రాలేదు కానీ కాలేజీకి వచ్చాడని విన్నాను. గత మూడు రోజులుగా సర్ దిగులుగా ఉండటం గమనించాను ఏమైందో వెళ్లి కనుక్కుందామని వెళ్ళాను కానీ రూమ్ దాకా వెళ్లేసరికి ఇలా తన ప్రాబ్లెమ్స్ గురించి అడిగితే సార్ అవమానంగా ఫీల్ అవుతారేమో అనిపించి ఇంకేం మాట్లాడకుండా వెనక్కి తిరిగి వచ్చేసాను.
సాయంత్రం హోటల్ కి వెళ్లి కౌంటర్ లో కూర్చున్నాను ఇంతలో లక్ష్మి గారు వచ్చారు.
లక్ష్మి : వచ్చావా శివ, నేను వెళ్తున్నాను.
ఇంతలో షఫీర్ వచ్చాడు.
శివ : ఏంటి షఫీర్ చాలా హుషారుగా ఉన్నావ్ ఏంటి సంగతి?
షఫీర్ : నా నీఖా పక్కా అయ్యింది భయ్యా, వచ్చే నెలే షాది.
శివ : అందుకేనా మొహం వెలిగిపోతుంది, కంగ్రాట్స్. అవును పక్కన ఏంటి చాలా మంది ఉన్నారు?
షఫీర్ : పక్క వాళ్లు స్థలం అమ్ముతున్నారు భయ్యా అందుకే కొలతలకి వచ్చారు.
శివ : అవునా నువ్వు చూసుకో, ఇప్పుడే వస్తాను.
బైటికి వెళ్లి చూసాను హోటల్ పక్కనే ఆనుకున్న స్థలం అది, వాళ్ల దెగ్గరికి వెళితే వేలం వేస్తున్నారని తెలిసింది అక్కడ ఏడుస్తూ కూర్చున్నాడు ఒక ముసలాయన. వెంటనే ఖాసీం చాచాని రమ్మన్నాను.
పావుగంటలో చాచా వచ్చి, ఆ ముసలాయన తన ఫ్రెండ్ వాళ్ల నాన్న అని తన ఫ్రెండ్ ఆక్సిడెంట్ లో చనిపోయాక ఇప్పుడు కూతురు దెగ్గర ఉంటున్నాడని చెప్పి తనని పలకరించడానికి వెళ్ళాడు. నాకో ఆలోచన వచ్చింది వెంటనే చాచా దెగ్గరికి వెళ్లాను. ఆ ముసలాయనని ఓదారుస్తున్నాడు, చాచాకి సైగ చేస్తూ పిలిచాను, నన్ను గమనించి లేచి నా దెగ్గరికి వచ్చాడు.
ఖాసీం : ఏంటి శివ?
శివ : చాచా మీ దెగ్గర డబ్బులుంటే ఆ స్థలం మీరే తీసుకోండి చాచా మీ ఫ్రెండ్ కి హెల్ప్ చేసినట్టు ఉంటుంది మనకి కూడా అవసరం పడుతుంది.
ఖాసీం : కానీ
శివ : నన్ను నమ్మండి చాచా, పెద్ద హోటల్ కడితే చాలు క్యూ కడతారు మన హోటల్ ముందు.
ఖాసీం : డబ్బులు ఉన్నాయి కానీ అవి నా కూతురు పెళ్లి కోసం దాచినవి, ఇప్పుడు అలోచించి చెప్పు నువ్వు ఊ అంటే ముందుకు వెళదాం.
శివ : పెట్టండి చాచా, చెల్లి పెళ్లి మీరు అనుకున్నదానికంటే అంగరంగ వైభవంగా చేద్దాం.
చాచా ఇంకేం మాట్లాడలేదు, అప్పటికప్పుడు ఎవరికో ఫోన్ చేస్తే డబ్బు తెచ్చిచ్చారు అక్కడ సాయంత్రం వరకు బ్యాంకు వాళ్ళకి సెటిల్ చేసి ఇప్పుడు ఈ ఏరియా ల్యాండ్ రేట్ ఎంత పలుకుతుందో అంతా ఇచ్చాడు.
తిరిగి హోటల్ కి వచ్చి ఒక్క మాట కూడా మాట్లాడకుండా నన్ను చూసి నవ్వుతూ లోపలికి వెళ్ళిపోయాడు ఆ నమ్మకానికి నేను ఇంకా కష్టపడి పని చెయ్యాలని నిర్ణయించుకున్నాను.