Thread Rating:
  • 59 Vote(s) - 2.68 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy పేదరాసి పెద్దమ్మ వరం - ( Completed )
హెడ్ మిస్ట్రెస్ : యాహూ ...... , ఒక్క సమస్య తీరితేనే ఇంత సంతోషంగా ఉంది ఇక కాలేజ్ సమస్యలన్నీ తీరితే ఎంత ఆనందం కలుగుతుందో ...... , మహేష్ ...... నెక్స్ట్ ప్రాబ్లమ్ ఏమిటి త్వరగా త్వరగా చెప్పు అంటూ దైర్యంగా అడిగారు .
లిస్ట్ చూస్తూ కన్నీళ్లు కార్చిన మా హెడ్ మిస్ట్రెస్ మేడమేనా ఈ మేడం అంటూ ఆశ్చర్యపోయాను .
హెడ్ మిస్ట్రెస్ : అంతా నీవలన మరియు పెద్దమ్మ వల్లనే , పెద్దమ్మను తలుచుకోగానే ఎక్కడలేని ధైర్యం వచ్చేసింది మరి , నాలో ఈ మార్పు చాలా ఆనందంగా ఉంది .
నాకైతే ఆనందంగా లేదు మేడం .......
హెడ్ మిస్ట్రెస్ : మహేష్ ఏమైంది ? .
మీ కోరికలు తీరుతున్నాయి మరి నా దెబ్బ సంగతేమిటి ? - గట్టిగా స్వీట్ దెబ్బవేసి ........
హెడ్ మిస్ట్రెస్ : నో నో నో నెవర్ ...... , నాలో ఇంత మార్పుకు కారణమైన బుజ్జిహీరోవి నువ్వు - నిన్ను కొట్టడమా ...... ? , అది జరగని పని - వేరే ఏదైనా కోరుకో .......
నాకు దెబ్బనే కావాలి , ఇంతకుముందూ చెప్పాను ఇప్పుడూ చెబుతున్నాను - మీనుండి దెబ్బతినే ఇంటికివెళతాను - మీ స్టూడెంట్ గా ఇదే నా ప్రతిజ్ఞ .......
హెడ్ మిస్ట్రెస్ : ప్లీజ్ ప్లీజ్ మహేష్ , అదికాకుండా వేరే ఏమైనా ప్రతిజ్ఞ చెయ్యవచ్చుకదా ....... 
ఊహూ ....... , మీతో ఎలాగైనా దెబ్బ తింటాను లేకపోతే రేపు ఉదయానికల్లా మీరు కొమ్ములతో నిద్రలేస్తారు .
మేడం ఫక్కున నవ్వేస్తున్నారు ......
ఆఅహ్హ్ ....... నవ్వితే ఎంత బాగున్నారు మేడం అంటూ హృదయంపై చేతినివేసుకుని ఫీల్ అవుతున్నాను .
హెడ్ మిస్ట్రెస్ : థాంక్యూ మహేష్ ....... 
థాంక్యూ మేడం ...... క్యాన్సిల్ థాంక్యూ క్యాన్సిల్ ...... దెబ్బకొడితేనే థాంక్స్ ......
హెడ్ మిస్ట్రెస్ : నిన్నూ అంటూ కట్టి ఎత్తారు .
Yes yes కమాన్ కమాన్ మేడం .......
హెడ్ మిస్ట్రెస్ : నో నో నో ...... అమ్మో కొట్టేసేదానిని - ఇదా నీ ప్లాన్ నెవర్ ...... , sorry sorry మహేష్ ...... , నిన్ను కొడితే నన్ను నేను క్షమించుకోలేను , ఈ ధైర్యం - సంతోషం నీవల్లనే కదా ........
దెబ్బ తియ్యదనం లేని sorry లు ఎందుకు మేడం ...... ప్చ్ ప్చ్ ......
మేడం నవ్వులు ఆగడం లేదు , మహేష్ నువ్వు ఎప్పుడూ ఇంతేనా ? , చుట్టూ ఉన్నవాళ్లను ఇలానే సంతోషపెడతావా ? .
సంతోషపెట్టాను అంటారు కానీ రుణం తీర్చుకోరు ....... భావ్యమా ? .
హెడ్ మిస్ట్రెస్ : అదితప్ప వేరే ఏదైనా అడుగు మహేష్ ప్లీజ్ ప్లీజ్ ......
మా మేడం నుండి ఎలా తీసుకోవాలో నాకు తెలుసులే మన దగ్గర చాలా కన్నింగ్ ప్లాన్స్ ఉన్నాయి కానీ ముందైతే లిస్ట్ లోని రెండవ సమస్య స్టూడెంట్స్ డిసిప్లిన్ ...... , ఎలానో ఆలోచించే ఉంటారుకదా ......
హెడ్ మిస్ట్రెస్ : అవును మహేష్ అంటూ వివరించారు .
సూపర్ మేడం ...... , కాలేజ్ బెల్ కొట్టించి స్టూడెంట్స్ - టీచర్స్ అందరినీ గ్రౌండ్ లోకి రప్పించెయ్యండి .......
హెడ్ మిస్ట్రెస్ : అటెండర్ గారూ ...... టీచర్స్ కు విషయం తెలియజేసి లాంగ్ బెల్ కొట్టండి .
అటెండర్ : అలాగే మేడం అంటూ పరుగులుతీసాడు .

హెడ్ మిస్ట్రెస్ : మహేష్ లెట్స్ గో ......
మేడం ...... మొత్తం స్టూడెంట్స్ & టీచర్స్ కాబట్టి ఈ బెత్తం కూడా అవసరమౌతుందేమో .......
హెడ్ మిస్ట్రెస్ : Yes yes థాంక్యూ మహేష్ ......
అల్వేస్ వెల్కమ్ మేడం ...... , మేడం మరొకమాట ..... SI సర్ చెప్పినట్లు నేను కేవలం బ్యాక్ స్టేజ్ బుజ్జిహీరోని కాబట్టి క్రెడిట్ నాకు ఇవ్వాలని ప్రయత్నించకండి , ఇది మీ లిస్ట్ మీరే పూర్తిచేయాలి - మొత్తం సంతోషం మీరొక్కరే ఆస్వాదించాలి ......
హెడ్ మిస్ట్రెస్ : ఇంత చిన్నవయసులోనే ఇన్ని మాటలు - ఇంత తెలివు - ఇంత అనుభవం ఎలా మహేష్ ...... నాకే అసూయపుడుతోంది .
అంటీలు కూడా ఇలానే అడిగారని గుర్తుకువచ్చి ఆనందించాను .
హెడ్ మిస్ట్రెస్ : నాకూ చెబితే నేనూ ఆనందిస్తాను కదా ......
ఏమీలేదు మేడం , ఇలానే నాకిష్టమైన అంటీలు కూడా అడగడం గుర్తువచ్చి సంతోషం కలిగింది ....... , అదిగో టీచర్స్ - స్టూడెంట్స్ అందరూ గ్రౌండ్ లోకి వచ్చేసారు .

హెడ్ మిస్ట్రెస్ : ఇక నేనేంటో చూయిస్తాను - రా మహేష్ నా ప్రక్కనే ఉండు అంటూ పెద్దమ్మను ప్రార్థించారు .
అదిగో మళ్లీ ..... ఇప్పుడే చెప్పాను - ఇది మీ యుద్ధం - గెలిచేది మీరే - All the best మేడం ...... మీటింగ్ తరువాత కలుద్దాము అనిచెప్పి , నా హృదయమంతా నిండిన నెంబర్ 2 కోసం అన్వేషణ మొదలెట్టాను గోలగోలచేస్తున్న గుంపులో ....... , ఎక్కడ ఎక్కడ కనిపించడం లేదే అంతలోనే నా హృదయస్పందన నాకే వినిపించింది అంటే అతిదగ్గరలోనే తను ఉంది అనుకుని చూస్తే ముందువరుసలో ఉంది , తన చిరునవ్వు చూడకపోతే ఆగలేను అన్నట్లు తెగ అల్లరిచేస్తోంది హృదయం ....... , కాస్త ముందుకువెళ్లి అటువైపు నుండి తనకు ఎదురుగా నడిచాను - ఆఅహ్హ్ ...... స్వచ్ఛమైన చిరునవ్వులను చూసి హృదయంపైకి ఆటోమేటిక్ గా చెయ్యి వెళ్ళిపోయింది .
Hi ....... అంటూ నావైపు చేతిని కదిలించి నవ్వుతోంది .
అటూ ఇటూ వెనుకకు చూసి నాకేనా ...... నాకే నాకే అంటూ చిరునవ్వుతో hi చెప్పి వెనుకకుచేరి ఆఅహ్హ్ ...... yes yes అంటూ తెగ ఆనందిస్తున్నాను . 
అంతలో నాకోసం అన్నట్లు తిరిగిచూసి , వెనుకే నిలబడి ఉండటం చూసి వెంటనే ముందుకు తిరిగి ముసిముసినవ్వులు నవ్వుకుంటోంది .
క్లౌడ్ నైన్ లోకి వెళ్ళిపోయాను .

నేనెవరో తెలుసుకదా ...... మీ హెడ్ మిస్ట్రెస్ .
మేడం గంభీరమైన స్వరానికి మరియు ఇంతకుముందు కాలేజ్ బయట జరిగినది గుర్తుకువచ్చినట్లు , అప్పటివరకూ గోలచేస్తున్న స్టూడెంట్స్ అందరూ సైలెంట్ అయిపోయి మేడం వైపుకు తిరిగారు .
హెడ్ మిస్ట్రెస్ : ముందు వరుసలలో క్రమశిక్షణతో నిలబడటం నేర్చుకోండి - టీచర్స్ మీరుకూడా ....... , PET గారూ ...... ఇదేనా రోజూ మీరు నేర్పుతున్నది .
PET : Yes no మేడం అంటూ షాక్ లో ఉండిపోయారు .
హెడ్ మిస్ట్రెస్ : ఎక్కువ సమయం లేదు తొందరగా ......
PET సర్ ఆశ్చర్యపోతూనే వచ్చి , స్టూడెంట్స్ లైనప్ లైనప్ ...... అంటూ వరుసలుగా నిలబెట్టారు .
PET గారూ ...... 15 నిమిషాలు తీసుకున్నారు , రోజూ స్టూడెంట్స్ కు ఏమి నేర్పిస్తున్నట్లు ...... , ఇదే ఫస్ట్ & లాస్ట్ వార్నింగ్ ...... రేపు ప్రేయర్లో ఒక్కరు తప్పుగా నిలబడినా మీపై అక్షన్ తీసుకుంటాను .
షాక్ లోనే yes మేడం అనిచెప్పి తలదించుకున్నారు .

హెడ్ మిస్ట్రెస్ : స్టూడెంట్స్ ...... చూసారా ఇప్పుడు చూడటానికి ఎంత బాగుందో , మొదటి తప్పు మాదే - ఇకనుండీ అలా జరగదు , రేపటి నుండి 9AM లోపు స్టూడెంట్స్ - టీచర్స్ అందరూ కాలేజ్ ప్రేయర్లో ఉండాలి , 9:05AM కు కాలేజ్ గేట్ మూసివేయడం జరుగుతుంది , ఏ ఒక్క స్టూడెంట్ గోడలు దూకి రాకూడదు వెళ్లకూడదు క్రమశిక్షణతో మై గేట్ ద్వారానే రావాలి వెళ్ళాలి , ప్రతీ ఒక్క స్టూడెంట్ అందరమూ ఒకటే అని చాటి చెప్పడానికి ఖచ్చితంగా యూనిఫార్మ్ వేసుకునిరావాలి . ఇక టీచర్స్ ....... క్లాస్ బెల్ మ్రోగగానే వారి వారి క్లాసులలో లేకపోతే నోటీస్ పంపించబడును , అటెండర్ గారూ ...... మూడు నోటీసులు దాటితే సస్పెండ్ చేస్తున్నట్లు నోటీస్ బోర్డ్ లో అతికించండి - అటువంటి టీచర్స్ పై సెక్యూరిటీ అధికారి కంప్లైంట్ కూడా ఫైల్ చెయ్యబడును ఎందుకంటే స్టూడెంట్స్ భవిష్యత్తే నాకు ముఖ్యం ......
సూపర్ మేడం గారూ అంటూ గట్టిగా విజిల్ వేసాను .
హెడ్ మిస్ట్రెస్ : థాంక్యూ మహేష్ .......
మహేష్ అనే స్టూడెంట్ ఇక్కడెక్కడా లేడు హెడ్ మిస్ట్రెస్ ........
మేడం నవ్వుకున్నారు .
నా ముందున్న నా హృదయస్పందన వెనక్కు తిరిగిచూసి wow సూపర్ అంటూ చేతితో సైగచేసింది .
నో నో నో నాకేమీ సంబంధం లేదు అంటూనే సిగ్గుపడ్డాను .
" Ok ok మహేష్ ....... , నీ పేరు తెలిసిపోయింది " 
నీ పేరుకూడా చెప్పొచ్చుకదా ...... అని వినీవినిపించనట్లు అడిగాను .
వినపడినట్లు నవ్వుతోంది .
ఆఅహ్హ్ .........

హెడ్ మిస్ట్రెస్ : ఫైనల్ గా స్టూడెంట్స్ - టీచర్స్ including me ...... should ఫాలో డిసిప్లిన్ ....... , " this is not a first warning - this is last and final warning " , Now go to your respective classes .......
Its already 1PM హెడ్ మిస్ట్రెస్ - లంచ్  టైం లోకూడా క్లాస్సెస్ కు వెళ్ళాలా ? .
హెడ్ మిస్ట్రెస్ : Sorry sorry మహేష్ - స్టూడెంట్స్ ....... అంటూ నవ్వుకుంటున్నారు .
ఎన్నిసార్లు చెప్పాలి హెడ్ మిస్ట్రెస్ ...... ఇక్కడ మహేష్ అనే స్టూడెంట్స్ ఎవ్వరూ లేరని .......
నా నెంబర్ 2 నవ్వు ఆగడం లేదు ......
హెడ్ మిస్ట్రెస్ : Ok ok ....... , ఫైనల్ గా మరొకటి - మధ్యాహ్న భోజనంపై రోజూ కంప్లైంట్స్ వస్తున్నాయి స్టూడెంట్స్ నుండి , ఈరోజుకు మినహాయింపు ఇస్తున్నాను , రేపటి నుండి ఒక్క కంప్లైంట్ వచ్చినా ఊరికే వదలను , డబ్బుకు తగ్గ క్వాలిటీ ఫుడ్ పెట్టాల్సిందే ....... , మీకే చెబుతున్నాను ఒక్క కంప్లైంట్ ఒకేఒక్క కంప్లైంట్ ......
రాదు మేడం అంటూ బదులిచ్చారు .
థాంక్యూ థాంక్యూ థాంక్యూ మేడం అంటూ చప్పట్లు - కేకలు - విజిల్స్ తో గ్రౌండ్ మొత్తం సంతోషాలు వెల్లువిరిసాయి .

హెడ్ మిస్ట్రెస్ : Wait wait స్టూడెంట్స్ ఫైనల్ గా మరొక్కటి .......
ఫైనల్ ఫైనల్ అంటూ ఎన్ని చెబుతారు హెడ్ మిస్ట్రెస్ .......
హెడ్ మిస్ట్రెస్ : Sorry sorry మహేష్ - స్టూడెంట్స్ ...... , Ok ok మహేష్ అనే స్టూడెంట్ లేడు అంతేనా హ్యాపీనా ....... , ఇది చాలా ముఖ్యమైనది అందుకే వన్ మినిట్ ఓన్లీ వన్ మినిట్ ....... , అదిగో అదిగో అందరూ అటువైపుకు చూడండి ఇప్పుడే కాలేజ్ కు వస్తున్న మీ govt కాదు కాదు govt కం ప్రయివేట్ టీచర్స్ ను చూడండి , వాళ్ళ కష్టానికి మనమంతా సెల్యూట్ చేయాల్సిందే ....... , ***** - ***** ఇద్దరు టీచర్స్ ఏమో govt సాలరీ తీసుకుంటూనే ప్రైవేట్ కాలేజ్ కు వెళ్లి టీచ్ చేస్తున్న గొప్పవారు సెల్యూట్ సెల్యూట్ ......
సెల్యూట్ సెల్యూట్ సెల్యూట్ సర్ .......
హెడ్ మిస్టర్ : ****** - ***** టీచర్స్ ఏమో రోజూ ఉదయం వచ్చి రిజిస్టర్లో సంతకం చేసేసి వారి వారి పర్సనల్ పనులకు వెళ్ళిపోయి దర్జాగా ఈ సమయానికి వస్తారు సెల్యూట్ సెల్యూట్ ...... ఇటువంటివారిని మనం తప్పకుండా గౌరవించుకోవాలి .
సెల్యూట్ సెల్యూట్ సెల్యూట్ టీచర్స్ .......
హెడ్ మిస్ట్రెస్ : వీరికి నోటీసులు లేవు డైరెక్ట్ గా సస్పెండ్ మరియు ఇప్పుడే సెక్యూరిటీ అధికారి కంప్లైంట్ ఫైల్ చెయ్యబోతున్నాను .
డబల్ సూపర్ హెడ్ మిస్ట్రెస్ అంటూ గట్టిగా విజిల్ వేసాను .
హెడ్ మిస్ట్రెస్ : ఇప్పుడుకాదు మహేష్ - స్టూడెంట్స్ ...... , ఇంతటి గొప్ప టీచర్స్ కు ఘనసత్కారం చేశాక విజిల్స్ వెయ్యండి , ఇప్పుడే 100 కు కాల్ చేస్తాను .
SI గారి పర్సనల్ నెంబర్ ఇచ్చారుకదా మేడం ......
హెడ్ మిస్ట్రెస్ : Yes yes మరిచేపోయాను - చూశావా నువ్వు లేకుండా ఏమీ చేయలేను నువ్వేమో అలా అంటావు , స్టూడెంట్స్ ...... మనలో ఈ మార్పుకు ముఖ్య కారణం ఈరోజే మన కాలేజ్లో జాయిన్ అయిన మహేష్ ...... , మీ అందరి ముందూ మీ అందరి తరుపున బిగ్ బిగ్ బిగ్ థాంక్స్ చెబుతున్నాను .
లేదు లేదు లేదు ...... అంతా హెడ్ మిస్ట్రెస్ గారి వల్లనే .....
కంగ్రాట్స్ మహేష్ అంటూ ఫస్ట్ విష్ చేసింది నా హృదయస్పందన ...... , ఇక దాక్కుని లాభం లేదు మహేష్ .......
మహేష్ మహేష్ ...... మనప్రక్కనే ఉన్నాడు అంటూ అభినందిస్తున్నారు .

టీచర్స్ కు విషయం అర్థమైపోయినట్లు , మేడం మేడం ...... sorry sorry ఇంకెప్పుడూ ఇలా చెయ్యము - ఒక్క చాన్స్ ఒకేఒక్క ఛాన్స్ ఇవ్వండి మేడం అంటూ ప్రాధేయపడుతున్నారు .
హెడ్ మిస్ట్రెస్ : నో నో నో ...... మీలాంటి టీచర్స్ ను క్షమిస్తే మళ్లీ మళ్లీ అలానే చేస్తారు .
లేదు లేదు మేడం ...... , మాకు బుద్ధి వచ్చింది - ఇకనుండీ ఈ స్టూడెంట్స్ కోసమే మా శక్తినంతా దారపోస్తాము , ఒక్క చాన్స్ ఇవ్వండి మేడం ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ......
హెడ్ మిస్ట్రెస్ : మీ భవిష్యత్తు స్టూడెంట్స్ చేతులలో ఉంది - వాళ్ళు నమ్మితే నేను నమ్మతున్నాను .
టీచర్స్ : స్టూడెంట్స్ ...... ఇకనుండీ అనుక్షణం మీకు అందుబాటులోనే ఉంటాము - ఒక్క చాన్స్ ఇచ్చి చూడండి ......
థాంక్యూ థాంక్యూ థాంక్యూ టీచర్స్ ......
హెడ్ మిస్ట్రెస్ : ఫైనల్ వార్నింగ్ ...... , స్టూడెంట్స్ ...... ఆకలివేస్తోందా ? Sorry sorry ......
నో నో నో మేడం ...... , మా భవిష్యత్తు కోసం ఆలోచిస్తున్న మీకోసం ఎంతసేపైనా వేచిచూస్తాము - నిజమైన సెల్యూట్ మీకే మేడం అంటూ ఒకేసారి ఒకే రిథం తో స్టూడెంట్స్ అందరూ సెల్యూట్ చేసాము .
హెడ్ మిస్ట్రెస్ ఆనందాలకు అవధులులేనట్లు మురిసిపోయి , భావితరాల భవిష్యత్తు మీచేతుల్లోనే ఉంది అంటూ మాకు సెల్యూట్ చేసి , sorry sorry .......
మరొక విషయం అన్నమాట కంటిన్యూ కంటిన్యూ మేడం .......
హెడ్ మిస్ట్రెస్ : నవ్వుకున్నారు , సో sorry మహేష్ - స్టూడెంట్స్ ..... , స్టూడెంట్స్ ...... ఇది రిక్వెస్ట్ కాదు ఆర్డర్ - రేపు ఉదయం కాలేజ్ కు మీమీ పేరెంట్స్ తో రావాలి both మమ్మీ & డాడీ , పిలుచుకుని వస్తారుకదూ ......
స్టూడెంట్స్ : Yes మేడం .......
హెడ్ మిస్ట్రెస్ : గుడ్ , ఇక డిస్పర్స్ అన్నారు నవ్వుకుంటూ ......
స్టూడెంట్స్ అందరూ కేకలువేస్తూ ఇంటినుండి క్యారెజ్ తెచ్చుకున్నవాళ్ళు లంచ్ బ్యాగ్స్ - మిగతా స్టూడెంట్స్ మధ్యహ్న భోజనం కోసంబ్యాగుల్లోని ప్లేట్స్ తీసుకొచ్చి క్యూ లో నిలబడ్డారు .
Like Reply


Messages In This Thread
RE: పేదరాసి పెద్దమ్మ వరం - by Mahesh.thehero - 18-10-2023, 03:24 PM



Users browsing this thread: 39 Guest(s)