Thread Rating:
  • 4 Vote(s) - 2.5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy అన్వేషణ - నిధి యాత్ర
#9
అన్వేషణ - నిధి కోసం

దట్టమైన అడవి, చుట్టూ ఎటు చూసినా చెట్లు, కొండలు, జల పాతాల శబ్దాలు, నడవడానికి  కూడా కష్టం గా ఉన్న దారిలో ఒక మనిషిని  కొంతమంది కోయ జాతి వాళ్ళు కత్తులతో, కర్రలతో చంపడానికి తరుముతున్నారు.

[Image: 1.jpg]

ఎటు వైపు నుండి ఎటు వెళ్తే బయట పడతామో తెలీని దారిలో పరిగెడుతూన్న వ్యక్తి అసలు ఎవరు... ఆలా పరిగెడుతూ పరిగెడుతూ ఒక కొండ అంచులలో ఆ వ్యక్తి ఆగాడు.. అలుపు తీర్చుకోడానికి... తన గుండె చప్పుడు తనకే వినపడుతుంది ... హోరు మనే గాలి శబ్దాలు. కొంత సమయం తరువాత అంత నిశబ్దం... మనసు కొంచెం కుదుటపడుతున్న సమయానికి సడన్ గా అతని తలకి పక్క నుండి ఒక కత్తి దూసుకు వెళ్ళింది. అంతే ఒక్కసారిగా గుండె ఆగినట్టు ఐంది.. వెనక్కి తిరిగి చుస్తే ఇందాక వెంబడిస్తూ  అదృశ్యం ఐన ఆ కోయ జాతి వాలు అటు వైపే వస్తున్నారు..పక్కనే ఉన్న ఒక చెట్టు కొమ్మనే తన ఆయుధం గా చేసుకొని యుద్దానికి సిద్ధముగా ఉన్నాడు.. ఆ కోయ జాతి వాళ్లు సమీపించక ముందే వాళ్ల వైపుకి పరిగెత్తుతూ వాళ్ళ మీద ఆ చెట్టు కొమ్మ తో దాడి చేసాడు.

[Image: 2.jpg]

అందిన వాళ్లని అందినట్టు గా ఆ చెట్టు కొమ్మ సాయం తో మట్టు కలిపిస్తున్నాడు ఐన కూడా ఒకరి తరువాత ఒకరు అతని మీద దాడి చేస్తున్నారు. వెనుక నుండి ఒకడు కర్రతో కొట్టడం తో అతను కింద పడిపోయాడు. పడిన ఆ వ్యక్తి మీద కర్రలతో, కత్తులతో పొడవడానికి ప్రయత్నిస్తున్నారు అతను నేల మీద దొర్లుతూ తప్పించుకుంటూ ఆ కొండ చివరికి వెళ్తూ వెళ్తూ సడన్ గా పక్కనే ఉన్న లోయలో పడిపోయాడు.. ఆలా పడుతున్న సమయం లో కళ్ళు మూసేసాడు. తన జీవితం అంత తన కళ్ళ ముందు కదిలాడుతుంది ...

[Image: 3.png]

అది మిట్ట మధ్యాహ్నం సూర్యుడు తల మీద బగ బగ తన ప్రతాపమంతా చూపిస్తున్నాడు. ఆ ఎండలో నడుస్తున్న నాకు చెవులకి దూరంగా ఒక నీటి ప్రవాహం యొక్క శబ్దం స్పష్టంగా వినిపిస్తుంది. నేను నడుస్తున్న కొద్దీ ఆ శబ్దం మరింత స్పష్టంగా వినిపిస్తుంది. నేను ఆఖరికి ఆ నీటి ప్రవాహం దగ్గరకి చేరుకున్నాను. ఇక నేను వచ్చిన పని మొదలెట్టాను, పక్కనే ఉన్న చెట్టు కొమ్మలతో ఒక చిన్న పడవ ని తయారు చేసుకొని ఆ ప్రవాహంలో తెడ్డు వేసి వెళ్తున్నాను. సుమారు ఒక 10 కిలోమీటర్లు ప్రవాహం లో వెళ్ళాక ఆ ప్రవాహం ఒక రెండు పాయలుగా చీలిపోయింది. కొంచెం నెమ్మదించి బాగ్ లో నుంచి నా దగ్గర ఉన్న మ్యాప్ తీసి ఎటు వైపుగా వెళ్తే నా గమ్యాన్ని చేరుకుంటానో ఆ వైపుగా నా ప్రయాణాన్ని కొనసాగించాను. కుడి వైపు గా ఉన్నపాయలోపలికి వెళ్తున్న కొద్దీ ప్రవాహం యొక్క ఉద్రేకత పెరుగుతుంది. అది ఎలా ఉందంటే ప్రశాంతం గా ఉన్న నది లా కాకుండా పౌర్ణమి, అమావాస్య నాడు సముద్రం ఎలా తన ఉద్రేకతను చూపిస్తుందో ఆలా, ఇప్పుడు ఈ ప్రవాహం కొంచెం కొంచెం ఊపందుకుంటుంది. ఆలా ఆ ప్రవాహం లో వెళ్తూ వెళ్తూ ఆమడ దూరం లో ఒక జలపాతం కి చేరువవుతున్నాను. ఆలా సమీపిస్తున్న కొద్దీ నాలో ఉత్కంఠ పెరుగుతుంది నా గమ్యం ని చేరుకోవడానికి నేను ఎంతో చేరువలో లేను అని అర్ధమవుతుంది.

ఆలా వెళ్తూ వెళ్తూ ఆ ప్రవాహం లోకి దూకడానికి సిద్ధం ఐ, ఆ జలపాతం లోకి పడవ మునిగిపోతుందన్న సమయం లో నేను పడవని వదిలేసి నా బాగ్ తో సహా ఆ ప్రవాహం లోకి దూకి పక్కనే ఉన్న బండరాల గుట్ట మీదకి చేరుకున్నాను. ఒక రాయికి తాడు ని కట్టి నెమ్మదిగా జలపాతం లోకి దిగుతున్నాను. ఆలా ఒక 30 మీటర్లు కిందకి దిగాక జలపాతం వెనుక ఒక సొరంగ మార్గం కనిపించింది. ఆ సొరంగం మొత్తం చిమ్మ చీకటి గా ఉంది. నెమ్మదిగా ఆ లోపలకి ప్రవేశించి ముందే తయారు చేసుకున్న కాగడాని బాగ్ లో నుండి తీసి,  వెలిగించి నా ప్రయాణాన్ని సాగించాను. లోపలకి వెళ్తున్న కొద్దీ నా గుండె చప్పుడు నాకే వినపడుతుంది, ఆ ప్రదేశమంతా నిశబ్దం రాజ్యమేలుతుంది. ఆలా నడుస్తున్నప్పుడు సడన్ గా నా మీద ఒక మనిషి అస్థిపంజరం నా మీద పడింది. ఆ అస్థిపంజరం మేడలో ఒక లాకెట్ వేలాడుతూ ఉంటె దాని తీసుకొని బాగ్ లో వేసుకొని నా ప్రయాణాన్ని కొనసాగించాను. నేను ముందే ఊహించినట్టుగా ఆ మార్గం లో ఒక చెక్కతో చేసిన వంతెన ఒకటి ఉంది. ఆ వంతెన శిధిలావస్థలో ఒకవైపుకి వేలాడుతూ కనిపించింది. ఆ వంతెనకు నా దగ్గర ఉన్న తాడుని జత చేసి ఆ వంతెనని దాటడానికి ప్రారంభించాను. చివరకు ఆ వంతెన దాటి అటు వైపుకి చేరుకున్నాను. ఆలా చేరుకున్న నాకు ఒక పెద్ద తలుపు నీడలా కనపడింది అది కూడా నా వెనక నుండి కనపడేసరికి నాలో కొంచెం భయం మొదలైంది.  కానీ ధైర్యం కూడా తెచ్చుకొని వెనక్కి తిరిగి చుస్తే ఎం లేదు. ఆలా నా ప్రయాణాన్ని కొనసాగిస్తూ ముందుకి వెళ్ళాక అతి భయంకరమైన సర్పాలు, త్రిసూలాలు, ఇంకా కొన్ని శిలా కండలుతో చెక్కబడిన పెద్ద తలుపు ఒకటి కనిపించింది. నా దగ్గర ఉన్న మ్యాప్ ని ఉపయోగించి ఆ ద్వారం కి సంబందించిన గుర్తుల ద్వారా ఆ తలుపు తెరవడానికి ప్రయత్నిస్తున్నాను.....

ఆ తలుపుని తెరవడానికి నాకు సుమారుగా 2 గంటల పైనే పట్టింది. ఆ తలుపు ఎంతో భద్రతతో, సామాన్యులు తెరవలేని విదంగా తయారు చేయబడింది. ఆ తలుపుని తెరవాలి అంటే ఎంతో కొంత పురాతనకాల విషయాలు, వేదాల గురించి తెలిసినపుడే ఇది కొంత వరకు సాధ్యం అవుతుంది. ఆలా 2 గంటల శ్రమించిన తరువాత ఆ తలుపు తెరుచుకోగానే నేను ఇక్కడ వరకు చేరుకునేందుకు పడిన కష్టం కొంత వరకు ఊరటనిచ్చింది. నాలో ఉత్సాహం ఉరకలు వేస్తుంది, అందరు కనుగొనలేని ప్రశ్నకు నాకు ఇంకొంత సమయం లో సమాధానం దొరుకుతునందుకు. ఆలా ఆ తలుపు ని తెరుస్తుంటే ఒక 100 LED లు ఒకేసారితే ఆన్ చేస్తే ఎంత వెలుతురూ ఉంటుందో అంత వెలుగు ప్రకాశిస్తున్నట్టు అనిపించింది. ఆ తలుపు తెరుస్తుంటేనే నా కళ్ళు తెరిచి చూడలేకపోతున్న, ఆ కొంత మార్గం గుండా వచ్చిన వెలుగుకే ఆ చీకటి సొరంగ మార్గం అంత వెలుతురుని అలుముకుంది. నా కళ్ళు సొగం మూసేసి చిన్నగా ఆ తలుపుని తెరిచి కళ్ళకి నేను తెచ్చుకున్న అద్దాలని వేసుకొని వీడియో కెమెరా తో షూట్ చేస్తూ అసలు ఈ వెలుగు ఎక్కడనుండి వస్తుందో వెతుకుతున్నాను. ఆలా కొంత దూరం ఆ గదిలాంటి గది లో నడుస్తున్న నాకు ఇంతకముందు రెండు పాయలు గా చీలిన జలపాతం లో ఒకటి ఇక్కడకి చేరుతుంది అని అప్పుడు అర్థమైంది, ఆ జలపాతం యొక్క శబ్దం వినపడుతుంటే. అలాగే ఎంతో ఎత్తు నుండి పడుతున్న ధారలకు భూమి కదలాడడం నా కాళ్లకి తెలుస్తుంది. ఆలా కొంత దూరం లోపలకి వెళ్ళాక పైన ఒక చిన్న రంధ్రం లాంటిది కనపడింది. ఆ జలపాతం కి చేరువవుతున్న మార్గం లో నాకు ఆ వెల్తురు సన్నగిల్లడం తెలుస్తుంది. ఆఖరికి ఆ వెలుతురూ ఎక్కడనుండి వస్తుంది అనేది కనుగొన్నాను. నాకు ఏదైతే ఒక చిన్న రంద్రం లా కనపడిందో అక్కడ నుండి సూర్యరష్మీ ఆ రంద్రం గుండా ప్రవేశించి ఈ జలపాతం వెనక ఉన్న కొండా మీద పడి అది పరివర్తము చెంది ఈ సొరంగమంతా వ్యాపిస్తుంది. అలాగే ఈ కొండా గుహలో ఉన్న రాతి యొక్క ప్రత్యేక  లక్షణాలు వల్ల ఆ పడిన నీరంతా చల్లగా హిమాలయ పర్వత శిఖరాల నుండి జాలువారిన నీరులా చల్లదనాన్ని ఇస్తుంది. ఇంకా ఈ మిస్టరీ అనుకుంటున్నా అసలు రహస్యాన్ని అందరికి తెలియపరచాలి అని గో ప్రో కెమెరా ని తలకి సెట్ చేసుకొని డీప్ సీ డ్రైవర్ సూట్ వేసుకొని ఆ జలపాతం లోకి దూకేసాను. ఆలా ఆ జలపాతం లో ఈదుతూ ఆఖరికి ఇందాక నేను పడబోయిన జలపాతానికి చేరుకున్నాను. ఒక్కసారిగా నేను పైకి లేచేసరికి చుట్టూ ఉన్న జనాలు అందరు ఆశ్చర్యం తో చుస్తునారు..... ఇది దీని వెనుక ఉన్న రహస్యం. ఈ నీరు ఇంత చల్లగా, స్వచ్చంగా ఉండడానికి ఉన్న అసలు రహస్యం, అలాగే చాల మంది తెలుసుకోవడానికి ప్రయత్నించినా మిస్టరీ...

థాంక్యూ... థాంక్యూ వెరీ మచ్....

ఎవరికైనా ఇంకా ఏదైనా సందేహాలు ఉంటె అడగచ్చు నాకు ఎటువంటి అభ్యన్తరం లేదు...... ఆలా లైట్స్ మొత్తం ఆన్ అయ్యాయి. నాకొక సందేహం మీరు ఎం అనుకోనంటే అడగచ్ఛ..

ఇప్పటివరకు మీ ఆర్టికల్స్ ని చాల చదివాను అలాగే ఇప్పుడు ప్రత్యేక్షంగా చూసాను మీరు ఎలా ఈ మిస్టరీ ని సాల్వ్ చేసారు అని. మీరు ఇన్ని విజయాలు సాధించడానికి గల కారణం ఏమైనా ఉందా ???

మీరు అడిగిన ప్రశ్నకి, అలాగే ఇక్కడ చాల మంది బుర్రలో అడగాలనుకొని అడగలేని వారికీ, ఇంకా అందరికి ఒకటే సమాధానం లో ముగిస్తాను.. నా విజయాలకు గల కారణం ఉత్సహం, ఆత్రుత, పట్టుదల, మనిషి అనుకుంటే దేనికైనా సమాధానం కనుగొనగలడు అనే నమ్మకం, ఏదైనా సాధించాలన్న కృషి. వీటన్నిటిని ప్రతి రోజు, ప్రతి నిమిషం, ప్రతి క్షణం మర్చిపోకుండా చేసే పనిమీద పెడితే ఎవరైనా సాధించవచ్చు అని నా నమ్మకం.....  మీకు కావాల్సిన దానికి సమాధానం దొరికిందని అనుకుంటున్నాను..... థాంక్యూ...

ఆలా ఆడిటోరియం లో కాన్ఫరెన్స్ ముగించుకొని బైటకి రాగానే మీడియా వాళంతా ఒకరి తరువాత ఒకరు ప్రశ్నలు, ప్రశంసలు ఇస్తుంటే వాటిని చాలా ఆనందంగా స్వీకరించి అడిగిన వాళ్లకి ఆటోగ్రాఫ్ లు, ఫోటోగ్రాఫులు ఇచ్చి సెల్లార్ లోకి వెళ్లి కార్ తీసుకొని నా రూమ్ కి బయలుదేరాను... ఆలా వెళ్తుంటే నా ఫోన్ లో రిమైండర్ అలారమ్ మోగింది. ఆలా ఆ మెసేజ్ చూస్తూ డ్రైవ్ చేస్తున్నాను. ఫ్రెండ్స్ అందరికి మిస్టరీ సాల్వ్ ఐనందుకు పార్టీ ఇస్తాను అని చెప్పిన విషయం మర్చిపోయాను. సో ఇంకా రూమ్ కి కాకుండా స్ట్రెయిట్ గా పబ్ కి వెళ్ళాను. అక్కడ నా గ్యాంగ్ మొత్తం నా కోసం వెయిట్ చేస్తుంది. కార్ దిగి వాలెట్ పార్కింగ్ కి కార్ కీస్ ఇచ్చేసి అందరం కలసి లోపలకి వెళ్లి, వాళ్లకి కావాల్సినవి ఆర్డర్ ఇచ్చి పార్టీ ని ఒక champagne బాటిల్ తో స్టార్ట్ చేసి ఫుల్ గా ఎంజాయ్ చేస్తునాం.
ఆలా చుట్టూ చూస్తూ డ్రింక్ చేస్తున్నప్పుడు అక్కడ ఒక అందమైన అమ్మాయి డాన్స్ ఫ్లోర్ మీద డాన్స్ వేస్తూ కనపడింది. తనని చూడగానే చుట్టూ లోకం మర్చిపోయి తననే చూస్తునాను. నా గ్యాంగ్ నుండి దూరం గా వెళ్లి బార్ టెండర్ దగ్గర చైర్ లో కూర్చొని చూస్తునాను తన డాన్స్ ని ఇంకా తన అందచందాలని, ఈ లోపు మా వాళ్లు బాయ్  రా ఉంటాము మేము వెళ్తునం అని చేప్తే వాళ్లకి గుడ్ బాయ్ చెప్పి వచ్చి నేను మాత్రం తననే చూస్తునాను. ఒక 10 నిముషాలు తరువాత తాను వచ్చి నా పక్కనే ఉన్న చైర్ లో కూర్చొని డ్రింక్ ఆర్డర్ చేసి తాగుతుంది. నేను తననే చూస్తూ పలకరించాను. హలో....

(ఇక్కడ నుండి వచ్చే లేడీ పాత్రధారులు అందరు మూవీ హీరోయిన్స్...సో కథ చదివేటప్పుడు వాళ్ళని ఊహించుకోవచ్చు.. mi convenient kosam character starting lo pic pedtunanu)

తను: హలో, మీరు JK కదా??
నేను: ఎస్ యువర్ రైట్, థిస్ ఇస్ జయ కుమార్, JK
నేను: ఇంతకీ మీ పేరు చెప్పలేదు ??
తను: ఐ ఆమ్ నిత్యామీనన్.. యూ కెన్ కాల్ మీ నిత్యా...

[Image: 4.jpg]


TO BE CONTINUED.......
Like Reply


Messages In This Thread
RE: అన్వేషణ - నిధి యాత్ర - by sexykrish69 - 11-07-2022, 03:33 PM



Users browsing this thread: 1 Guest(s)