06-07-2022, 06:33 PM
(This post was last modified: 19-10-2022, 09:39 PM by Pallaki. Edited 4 times in total. Edited 4 times in total.)
4
పేరుకే క్లాస్ జరుగుతుంది కానీ ఎవ్వరికీ అర్ధంకావట్లేదని క్లాస్ మొదలైన ఐదు నిమిషాలకే నాకు అర్ధమైపోయింది. సార్ చాలా ఫాస్ట్ గా చెపుతున్నారు ఆయన చెప్పే విధానం బట్టే తెలుస్తుంది సబ్జెక్టులో ఆరితేరిన వాడని. ఎక్కడో ఉండాల్సిన వాడు ఇక్కడ గవర్నమెంట్ ఉద్యోగం ఎందుకు చేస్తున్నాడో అర్ధం కాలేదు.
అరగంటలో క్లాస్ చెప్పేసి ఎవరైనా డౌట్స్ అడుగుతారేమో అని ఒక రెండు నిముషాలు చూసి బైటికి వెళ్ళిపోయాడు. సార్ బైటికి వెళ్ళగానే ఒక్కొక్కరు ఊపిరి పీల్చుకోడం మొదలెట్టారు. పక్కనే కూర్చున్న సందీప్ ని చూసాను సుబ్బరంగా నిద్ర పోతున్నాడు కదిలిస్తే లేచాడు.
సందీప్ : క్లాస్ అయిపోయిందా?
శివ : ఏంటి సందీప్ అలా పడుకున్నావ్?
సందీప్ : మరింకేం చేయమంటావ్ ఒక్క ముక్క అర్ధమైతే ఒట్టు.
చిన్నగా నవ్వాను ఇంతలో బెల్ మోగింది, క్లాస్ లోకి వేరే మేడం వచ్చి ఇంగ్లీష్ క్లాస్ మొదలు పెట్టింది. సందీప్ మళ్ళీ పడుకున్నాడు అంతగా మమ్మల్ని పట్టించుకోట్లేదు, కాలేజీ మూడింటి వరకు అయిపోయింది.
సందీప్ తొ కలిసి హాస్టల్ కి వెళ్లి ఫ్రెష్ అయ్యి ఒక గంట నడుము వాల్చి, నాలుగు అవుతుండేసరికి లేచి హోటల్ కి వెళ్లాను.
నాలుగింటి నుంచి ఆరింటి వరకు కాళిగానే ఉంటుందట, అయినా మీల్స్ వడ్డించడానికి మనుషులు ఉన్నారు. ఆరింటికి మళ్ళీ టీ మొదలు, ఒక గంట తరువాత హడావిడి తగ్గిపోయింది. ఎనిమిదింటి నుంచి మీల్స్ బిర్యానీ తెగ నడిచాయి సరిగ్గా మూసే సమయానికి ఎవరో సామానుతొ ఆటోలో వచ్చాడు.
ఖాసీం చాచా అతన్ని తన బావ కొడుకు, అల్లుడు అని పరిచయం చేసాడు పేరు లతీఫ్. ఇద్దరం కలిసి సామాను కిచెన్ లో సర్ది నేను హాస్టల్ కి వెళ్లిపోయాను.
ఒక రోజు గడిచింది.
పొద్దున్నే లేవడం హోటల్, తరువాత కాలేజీ మళ్ళీ హోటల్ తిరిగి హాస్టల్ కి రావడం శనివారం రాత్రి వరకు ఇదే జరిగింది.
ఆదివారం పొద్దున్నే లేచి స్నానం చేసి ఆశ్రమానికి బైలదేరాను, బస్సు ఎక్కి కూర్చున్నాను చేతిలో చిల్లి గవ్వ లేదు ఒక్క వంద రూపాయల నోటు తప్పితే ఉన్నవాటితోనే టికెట్ తీసుకుని బస్సు కిటికీ లోనుంచి పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ చూస్తూ ఉన్నాను అంతలోనే పక్క నుంచి ఒకటే హారన్ కొట్టడంతో పక్కకి చూసాను ఒక ఎర్ర కారు వేగంగా వస్తూ బస్సుకి సైడ్ ఇవ్వమని హారన్ కొడుతున్నాడు ఆపకుండా. బస్సులో కూర్చున్న మా అందరి చెవులు చిల్లులు పడుతున్నాయి.
కార్ లో చూసాను ఎవరో ఒకమ్మాయి టీ షర్ట్ జీన్స్ వేసుకుని ఉంది పక్కన ఉన్నవాడు కారు వేగంగా నడుపుకుంటూ బస్సుకే జెర్కులిస్తుంటే ఆ అమ్మాయి వద్దు అని వారిస్తూ భయంగా చూస్తుంది.
ఆ సౌండ్ వల్ల ఎవరైనా ఇబ్బంది పడతారేమో అని అటు ఇటు చూస్తూ ఒక్క సారి తల పైకి ఎత్తింది ఒక్క క్షణం నా కళ్ళలోకి చూసి మళ్ళీ పక్కకి చూసి మళ్ళీ నా కళ్ళలోకి చూసి చూడనట్టు ఒక చూపు విసిరి కారు నడుపుతున్నవాడిని మెల్లగా వెళ్ళమని బతిమిలాడుతుంది. రెండు సెకండ్లలో రెండు సార్లు తన కళ్ళలోకి కళ్ళు పెట్టి చూసాను.
బస్సు డ్రైవర్ కి చికాకు వచ్చి బూతులు తిట్టుకుంటూ సైడ్ ఇచ్చాడు, ఇంతలో నా స్టాప్ వచ్చేసరికి దిగి ఆశ్రమం లోపలికి నడుచుకుంటూ వెళ్లాను. పెద్దమ్మ ఎవరితోనో మాట్లాడుతూ నన్ను చూసి ఎదురు వచ్చి కౌగిలించుకుంది.
పెద్దమ్మ : ఎలా ఉన్నావురా?
శివ : ఇదిగో ఇలా ఉన్నాను.
పెద్దమ్మతొ మాట్లాడి తన ఆరోగ్యం గురించి తెలుసుకుని మధ్యాహ్నం అక్కడే పిల్లలతొ కలిసి భోజనం చేసాను.
పిల్లలు మాకు ఏం తెలేదా అని అడిగేసరికి కొంచెం బాధ వేసినా ఎప్పుడో అప్పుడు ఆ రోజు కూడా వస్తుందని వాళ్ళకి నాకు సర్ది చెప్పుకున్నాను.
సాయంత్రం వరకు పెద్దమ్మతొ గడిపి చిన్న చిన్న పనులు ఉంటే చేసేసి తిరిగి హాస్టల్ కి బైలుదేరాను. వద్దన్నా కూడా వినిపించుకోకుండా పెద్దమ్మ నా చేతిలో ఐదు వందలు పెట్టింది, తీసుకుని మళ్ళీ బస్సు ఎక్కాను.
హాస్టల్ దారిలో ఇందాక చూసిన ఎర్ర కారు స్పాట్ ఆ రోడ్ వచ్చింది, ఎందుకో ఆ అమ్మాయి మొహం ఒకసారి గుర్తొచ్చింది. నేను మొట్ట మొదటసారి ఒక అమ్మాయిని ఒక క్షణమైనా కళ్ళలో కళ్ళు పెట్టి చూసాననేమో ఇంకా ఆ అమ్మాయి మొహం గుర్తుండిపోయింది.
అందమైన నుదురు దానికి తగ్గట్టే ఉన్న ముక్కు, భయంతొ చిన్నగా వణుకుతున్న పెదాలు, కారు వేగానికి తను కళ్ళు మూసుకోడం ఆ ఎదురోచ్చే గాలికి విరాబూసిన జుట్టు ఎగిరిపడటం, అంత పెద్ద జుట్టు ఏమి కాదు కానీ తక్కువా కాదు ఎంత ఉండాలో అంత ఉంది.
ఒక్కసారి నా చెంప మీద నేనే కొట్టుకున్నాను ఏంటి ఇలా ఆలోచిస్తున్నాను అని. నా పక్కన కూర్చున్న ఒక అంకుల్ అది చూసి నన్ను ఒకసారి ఎగాదిగా చూసి వేరే సీట్ లో కూర్చున్నాడు, చిన్నగా నవ్వుకున్నాను.
హాస్టల్ కి వెళ్లి కొంత సేపు కూర్చున్నా, ఆ అమ్మాయి మొహం ఒకసారి అలా నా మైండ్ లో కనపడింది, మళ్ళీ పొద్దున్నే హాస్టల్ కి వెళ్లాలని గుర్తొచ్చి పెందలాడే తినేసి పడుకున్నాను.