05-07-2022, 01:29 PM
(This post was last modified: 19-10-2022, 09:38 PM by Pallaki. Edited 5 times in total. Edited 5 times in total.)
3
సాయంత్రనికి మెలుకువ వచ్చింది కొంసేపు అలా బైటకి వెళ్లి పబ్లిక్ గార్డెన్ లో గడ్డి మీద కూర్చుని వాకింగ్ చేస్తున్న వాళ్ళని చూస్తూ ఉన్నాను, మానసంతా ఒంటరిగా ఉండి ఉండి అలవాటు అయ్యిందేమో చిన్న పిల్లలని చేతపట్టుక్కుని వెళ్తున్న వాళ్ళ అమ్మా నాన్నా తాతయ్యాలని చూస్తూ ఉండాలనిపించి అలానే చీకటి పడే వరకు ఉన్నాను.
వాచ్మాన్ విజిల్ విని లేచి బైటికి నడిచి కొన్ని షాపులు చూసుకుంటూ రేపటికి కాలేజీకి వెళ్ళడానికి రెండు పుస్తకాలు కొని హాస్టల్ లోపలికి వెళ్లిపోయాను.
పేరుకే తిని పడుకున్నాను కానీ నిద్ర పట్టట్లేదు, ఇప్పుడు నాకన్ని బాధలేం లేవు కానీ ఎందుకో నా మనసింకేదో కోరుకుంటుంది దానికి సమాధానం చెప్పే జవాబు నా దెగ్గర లేదు బలవంతంగా కళ్ళు మూసుకున్నాను.
పొద్దు పొద్దున్నే లేచి ఫ్రెష్ అయ్యి బైటికి నడిచాను చలికాలం వల్ల మంచు పేరుకుపోయింది, చలి ఇరగేస్తుంది అలానే రెండు చేతులు కట్టుకుని కుక్కల అరుపులు వింటూ నడుచుకుంటూ హోటల్ కి వెళ్లాను.
ఖాసీం చాచా టీ పెట్టడానికి స్టవ్ ఎలిగిస్తున్నాడు వెళ్లి పలకరించి చీపిరి తీసుకుని అంతా ఊడ్చాను, చిన్నగా అందరూ రావడం మొదలు పెట్టారు పొద్దున్నే ఐదు గంటల నమాజ్ చేసే ముస్లిమ్స్ ఎక్కువగా వచ్చారు వారితో పాటే లారీల మీద పనికి వెళ్లే ఆడ మగ పనివాళ్లు కూడా అందరూ టీ తాగేసి లారీ ఎక్కి వెళ్లిపోతున్నారు.
ఆరున్నర వరకు నేను చాచా ఇద్దరం టీ సెక్షన్ చూసుకున్నాం ఆ తరువాత నుంచి నన్ను టీ దెగ్గర నిలబెట్టి మిగతా పని వాళ్లు వస్తే వాళ్ళతో టిఫిన్ చేయించడానికి వెళ్ళిపోయాడు.
ఒక అరగంట కాళి దొరికింది ఆ తరువాత మొదలయింది యుద్ధం, హోటల్ కి ఒక వంద మీటర్ల దూరంలోనే అడ్డా ఉందట అంతా కూలి పనులకి వెళ్లే వాళ్లు, మేస్త్రి పనివాళ్ళు, అమాలి వాళ్లు, పొద్దున్నే ఆఫీసుకి వెళ్లే ఉద్యోగులు ఒకటేమిటి ప్రతీ ఒక్కరు హోటల్ లో టిఫిన్ చేసి టీ తాగానిదే ఒక్కరు కూడా కదలట్లేదు అడ్డా నుంచి, అప్పుడే అర్ధమైంది ఖాసీం చాచా హోటల్ అంటే ఎంత ఫేమస్సో.
తొమ్మిదింటికి చాచా వచ్చి టీ దెగ్గర నిలబడి నన్ను టిఫిన్ చేసి వెళ్ళిపోమన్నాడు, ఇడ్లి తినేసి చక చకా హాస్టల్ కి నడిచాను.
గంటల తరబడి నిలబడటం అలవాటు లేనందువల్ల కాళ్ళు కొంచెం నొప్పిగా అనిపించాయి రూమ్ లోకి వెళ్ళాను అప్పటికే సందీప్ వాళ్లు రెడీగా ఉన్నారు వాళ్ళకి రెండు నిముషాలు అని చెప్పి స్నానం చేసి రాత్రి కొన్న రెండు పుస్తకాలతొ బైలుదేరాను కాలేజీకి.
గేట్ లోపల అడుగుపెట్టి నేరుగా ప్రిన్సిపాల్ ఆఫీస్ కి వెళ్లి వారిని కలిసి మళ్ళీ క్లర్క్ ఆఫీస్ కి వెళ్లి TC సబ్మిట్ చేసి మా క్లాసులు కనుక్కుని వెళ్లి కూర్చున్నాం.
మొదటి రోజు అంతగా ఏం చెప్పలేదు కానీ అటెండెన్స్ డెబ్భై శాతం లేకపోతే హాల్ టికెట్ ఇవ్వము అని మాత్రం చాలా గట్టిగానే చెప్పారు ఎందుకంటే చాలా మంది మధ్యాహ్నం వరకు ఉండరట గవర్నమెంట్ కాలేజీ అవ్వటం వల్ల ఎవ్వరు పట్టించుకోరు అందువల్ల అందరూ మధ్యాహ్నమే ఎగ్గొడతారని సందీప్ చెప్పాడు అందుకే సార్లందరూ ఇంత కోపంగా ఉన్నారు స్టూడెంట్స్ మీద.
మధ్యాహ్నం బ్రేక్ లో హాస్టల్ కి వెళ్లి తినేసి మళ్ళీ కాలేజీకెళ్ళి కూర్చున్నాం, పీరియడ్ మొదలయింది మొదటగా సార్ వచ్చి ముందుగా తన గురించి ఇంట్రడక్షన్ ఇచ్చాడు.
"అందరికీ నమస్కారం నా పేరు గగన్ అండి మీకు మాథ్స్ చెప్పడానికి వచ్చాను, ఫ్రమ్ చెన్నై IIT, మాథమాటిక్స్ గోల్డ్ మెడల్ విన్నర్ ని అండి మీకు బాగానే చెప్తాను, కొంచెం ఫాస్ట్ గా చెప్తాను అండి మీరు ఆ స్పీడ్ అందుకోవాల్సిందె తప్పదు 1+1=2 అని చెప్తూ సాగ దీయను డైరెక్ట్ గా రెండనే రాసేస్తాను, ఎవరైనా స్లో గా ఉంటే లైబ్రరీలో గైడ్ ఉంటుంది చూసుకోండి, పీరియడ్ లాస్ట్ లో పది నిమిషాల ముందు క్లాస్ ఆపేస్తాను అప్పుడు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, ఇక ప్రతీ పదినిమిషాలకి ఒకసారి వాటర్ టాయిలెట్ అని లేవద్దండి నన్ను అడగకుండానే వాటర్ తాగొచ్చు, లేచి బైటికి వెళ్లొచ్చు నేను పట్టించుకోను అందరికీ ఓకే అంటే క్లాస్ మొద్దలేడదాం" అని ఆపేసాడు.
అప్పటి వరకు ఈగల్లా ముసురుతుండే క్లాస్ సైలెంట్ అయిపోయింది. మాథ్స్ క్లాస్ మొదలయింది.