04-07-2022, 11:58 AM
(This post was last modified: 19-10-2022, 09:36 PM by Takulsajal. Edited 2 times in total. Edited 2 times in total.)
2
ఆశ్రమం నుంచి హాస్టల్ పది కిలోమీటర్ల దూరం, బస్సు ఎక్కి హాస్టల్ కి వెళ్లి ఓనర్ ని కలిసి రూం లోపలికి వెళ్లాను. మొన్న చూడలేదు లోపల ఇద్దరు నా వయసు వారే. చదువుకుంటున్నారు, నన్ను చూసి పలకరించారు ఇద్దరినీ పరిచయం చేసుకున్నాను ఒకరి పేరు సందీప్ ఇంకొకరి పేరు రాజు, కొంచెం సేపు కూర్చుని బట్టలు కొనడానికి బైటికి వెళ్ళాను కాలేజీ కోసం, పెద్దమ్మ ఇచ్చిన వాటిలో ఇంకా రెండు వేలు మిగిలి ఉన్నాయి.
ఒక షాప్ లో వెయ్యికి మూడు జీన్స్ అంటే వెళ్లి తీసుకున్నాను, పక్కనే ఇంకో హోల్సేల్ షాప్ లో వంద రూపాయల టీ షర్ట్లు ఒక ఐదు తీసుకుని, మిగిలిన ఐదు వందల్లో బ్రష్షు పేస్ట్ ఒక ప్లాస్టిక్ బకెట్ ముగ్గు ఒక ఒంటి సబ్బు ఒక బట్టల సబ్బు ఒక స్టీల్ ప్లేట్ ఒక స్టీల్ గ్లాస్ కొని తిరిగి రూమ్ కి వచ్చాను.
మధ్యాహ్నం వరకు ఏవేవో ఆలోచనలు ఆతరువాత సందీప్ రాజు ఇద్దరు భోజనానికి వెళదాం రమ్మంటే ప్లేటు గ్లాసు తీసుకుని లేచి రూమ్ నుంచి బైట హాల్లోకి వెళ్లి లైన్లో నిలుచుని కొంచెం అన్నం బెండకాయ కూర పప్పుచారు వేసుకున్నాను.
పక్కనే మామిడికాయ పచ్చడి ఉంటే కొంచెం వేసుకుని రూమ్ లోకి వచ్చి నాకు ఇచ్చిన మంచం మీద కూర్చుని తినేసి సింకులో ప్లేటు కడిగేసి నిద్రకి ఉపక్రమించాను.
ఒక రెండు గంటలు పడుకుని లేచి సందీప్ తొ మాట్లాడగా వారు కూడా నేను చదివే కాలేజీలోనే మొదటి సంవత్సరం అని తెలిసింది సందీప్ నేను తీసుకున్న గ్రూప్ mpc తీసుకున్నాడు, రాజు మాత్రం cec తీసుకున్నాడు అని చెప్పాడు.
సాయంత్రనికి హోటల్ దెగ్గరికి వెళ్లి ఖాసీం గారిని కలిసాను.
ఖాసీం : హా బేటా ఆవో.
శివ : ఖాసీం గారు రేపటి నుంచి పనిలోకి వస్తాను.
ఖాసీం : అరే బేటా..ఉతనా రెస్పెక్ట్ కైకు.. ఇక్కడ అందరూ నన్ను ఖాసీం చాచా అని పిలుస్తారు నువ్వు కూడా అలానే పిలువు.
ఇక నీ పని పొద్దున్నే ఐదు గంటలకిరా ఎనిమిదింటి వరకు టీ సెక్షన్ నడుస్తుంది అది చూసుకుని కాలేజీకి వెళ్ళిపో మళ్ళీ సాయంత్రం నాలుగింటికి వచ్చి పది గంటలకు హోటల్ మూసే వరకు ఉండాలి దీనికి నీకు పది వేలు ఇస్తాను ఇష్టమైతే రేపటి నుంచి వచ్చేసేయి.
శివ : అలాగే చాచా కానీ నా వల్ల మీకు ఇబ్బంది రాదుగా, ఎందుకంటే మీ దెగ్గర పని చేసేవాళ్లంతా '' వాళ్లే... అని ఇంకేదో చెప్పబోతుండగా
ఖాసీం : అరే బేటా.. కైకు సోచ్రే వయిసా.. దేవుడు అందరికీ ఒకటే బేటా నాకు అల్లాహ్ అయితే నీకు శివుడు, కష్టం వస్తే ముందుగా తలుచుకునేది దేవుడినే కదా.. లక్ష్మీ.. లక్ష్మీ
లోపలనుంచి ఒకావిడ బైటికి వచ్చింది. తనని చూపించి చూడు బేటా తనే నా బేగం నామ్ హై లక్ష్మీ, నీకు అంతగా ఇబ్బంది అనిపిస్తే మీ వాళ్లు కూడా ఇక్కడున్నారు ధైర్యంగా పనిచేసుకోవచ్చు.
శివ : అలా కాదు చా
లక్ష్మీ : మీరు ఊరుకోండి చూడు బాబు నీ పేరు
శివ : శివ
లక్ష్మీ : ఆ చూడు శివ మాకు ఆ పట్టింపులేవి ఉండవని నీకు ఈ పాటికే అర్ధం అయ్యి ఉండాలి, బుద్ధిగా పని చేసుకో అలాగే మంచిగా చదువుకో లేకపోతే ఈయన లాగే టీ కొట్టు పెట్టుకోవాల్సి వస్తుంది.. అని నవ్వింది.
ఖాసీం : ఏంటి... టీ కొట్టా??... ఖాసీం చాచా కా అడ్డా హై యే... ఖాసీం హోటల్
లక్ష్మీ : హా సరేలే అంటూ నవ్వుకుంటూ లోపలికి వెళ్ళిపోయింది.
ఖాసీం : అదిగో బేటా నీ ఇష్ట ప్రకారమే అక్కడ సాయిబాబా పఠం ఉంది దణ్ణం పెట్టుకుని రేపటి నుంచి పనిలోకి వచ్చేయి..
ఖాసీం చాచా దెగ్గర సెలవు తీసుకుని హాస్టల్ వైపు నడుస్తుండగా నాకు గొప్ప జ్ఞానోదయం కలిగింది, అప్పటి వరకు ఒక రకంగా ఆలోచిస్తున్న నాకు ఖాసీం చాచా కనువిప్పు కలిగించాడు, బైట ప్రపంచం నాకు జీవితం అంటే ఏంటో నేర్పించడం మొదలుపెట్టింది అది మంచిగానే నన్ను తీర్చిదిద్దాలి అని పరమశివుడికి మొక్కుకుంటూ హాస్టల్ లోపలికి నడిచాను.


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)