Thread Rating:
  • 5 Vote(s) - 2.6 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
కధా స్రవంతి ❤️
#49
ఆరు చెంచాలు
1



సిటీకి అవతల....సాయంత్రం ఆరు గంటలకి.... అప్పుడే స్ట్రీట్ లైట్స్ వేశారు....రోడ్ పక్కన డీజే మొగుతుంది లాలా భీంలా అంటూ.....

ఇంతలో రోడ్ మీదకి మైక్ పట్టుకుని వచ్చింది ఒక అమ్మాయి... పైన సగం కత్తిరించిన టీ షర్ట్, కింద మినీ స్కిర్ట్ తొ మైక్ లో..... వావ్ వావ్ వావ్ చల్లటి సాయంత్రంలో చల్లని బీర్ ఎంత సుఖమో.... ఈ నల్లటి రోడ్ల మీద మన కార్లు పరిగెత్తే సౌండ్ కూడా అంతే సుఖం............అందరికీ హాయ్ నా పేరు హారిక... ఇవ్వాల్టి రేస్ కి అందరూ రెడీ గా ఉన్నారా? ......"వూ......వ్".... ఇవ్వాల్టి రేసులో మొదటి బహుమతి రెండు లక్షలు... రేస్ లో జాయిన్ అవ్వాలంటే యాభై వేలు కట్టి స్లాట్ బుక్ చేసుకోండి.... రేసర్లు వచ్చేయండి ఇక మొద్దలేడదాం .... బెట్టింగ్ సెషన్ పక్కనే ఉన్న షాప్ లో జరుగుతుంది కాబట్టి వెంటనే వెళ్ళి బెట్టింగ్స్ వేసుకోండి...

ఇవ్వాళ మన రేస్ లో పాల్గొనే వాళ్లు ఎవరంటే....

అమన్ from ముంబై
క్రాంతి from తమిళ్ నాడు
జయంత్ సింగ్ from పంజాబ్
కిరణ్ from అడ్రస్ లేదు..
విశ్వ from.... మైక్ ఆఫ్ చేసి "విశ్వా... ఏయ్ రవి ఇలా రా రేస్ లో విశ్వా ఉన్నాడా నిజమేనా? మళ్ళీ ఒక సారి లిస్ట్ చెక్ చెయ్"...

మైక్ ఆగిపోగానే పక్కన ఉన్న గుంపు నుంచి, ఒకరి ఇద్దరినుంచి కాదు ప్రతీ నోటా విశ్వ... విశ్వా అని గుస గుసలాడుకోడం వినిపించింది.... ఈ లోగా రోడ్ మీదకి మూడు కార్లు రేస్ కి రెడీ అన్నట్టు రోడ్ మీదకి డ్రైఫ్ట్ చేసుకుంటూ వచ్చి ఆగాయి...

ఎవరి మీద బెట్టింగ్ వెయ్యాలో తెలీక ఇద్దరు అన్నా దమ్ములు నిల్చొని చూస్తున్నారు... ఇంతలోనే ఒక ఎరుపు రంగు స్పోర్ట్స్ కారు చిన్నగా సౌండ్ లేకుండా ఎంటర్ అయ్యింది కానీ వస్తున్న శబ్దానికి అందరూ అటు తిరిగారు... మైక్ లో మాట్లాడుతున్న హారిక కూడా ఒక్క క్షణం మాటలు ఆపేసి కారులో వస్తున్న వాడిని చూస్తుంది... పక్కనే ఉన్న అన్నదమ్ములలో అన్నయ్య తమ్ముడి భుజం తట్టి అటు చూడు అని సైగ చేసాడు.... అతన్ని చూసి బెట్ వెయ్యడానికి పరిగెత్తాడు తమ్ముడు తన వెనకే అక్కడున్న సగం మంది జనం కూడా....

ఎర్ర కారు వచ్చి రేస్ దెగ్గర ఉన్న మిగతా కార్ల పక్కన ఆగింది... హారిక నడుచుకుంటూ కార్ దెగ్గరికి వెళ్లి  తన రెండు సళ్ళు బైటికి తన్నుకొచ్చేలా వంగింది.

హారిక : హాయ్ విశ్వా ఎలా ఉన్నావ్ చూసి చాలా రోజులైంది... అని విశ్వ చేతిలో ఉన్న రేస్ టికెట్ తీసుకుంది.

విశ్వ : బాగున్నాను...నువ్వింకా బాగున్నావ్ చూస్తేనే తెలుస్తుంది చాలా అందంగా ఉన్నావ్.

హారిక : థాంక్స్.... నీకోటి తెలుసా ఎవ్వరికీ తెలీకుండా నేనూ నీ మీద బెట్ వేసాను.

విశ్వ : హ్మ్....నీ కోసమైనా గెలుస్తాలే...

ఇంతలో విశ్వ కారు పక్కనే ఇంకో పచ్చ స్పోర్ట్స్ కార్ వచ్చి ఆగింది... హారిక, విశ్వ ఇద్దరు అటు వైపు చూసారు... హారిక రేస్ టికెట్ తీసుకోడానికి వెళ్ళింది.

విశ్వ : నువ్వెందుకొచ్చావ్ రా ఇక్కడికి.

కిరణ్ : నువ్వెందుకొచ్చావో నేను అందుకే ఖర్చులకి డబ్బులు సరిపోవట్లేదు అందుకే పార్ట్ టైం చేస్తున్నా.

విశ్వ "చెయ్ చెయ్ బాగ చెయ్". అని ఎక్సలెరేషన్ గట్టిగా తొక్కాడు దాని తొ  మిగిలిన కార్లు కూడా మేమేం తక్కువ కాదు అన్నట్టు గట్టిగా సౌండ్ చేసారు..

అందరూ రెడీ గా ఉన్నారు విశ్వా నవ్వుతూ చూస్తుంటే కిరణ్ కాన్ఫిడెంట్ గా ఉన్నాడు మిగిలిన ముగ్గురిలో ఒకడు భయంగా ఇంకొకడు కోపంగా ఇంకొకడు ఏమవుద్దొ అన్న మీమంసలో ఉన్నాడు.

హారిక  1 అని అటు ఇటు చూసి..2... అని క్రౌడ్ తొ పాటు అరిచి...3 బదులుగా పిస్తోల్ తొ కాల్చింది.

ఐదు కార్లు స్పీడ్ గా జుమ్మని వెళ్లిపోయాయి ముందుగా పంజాబి కారు వేగంగా వెళ్తుంది దాని వెనకాలే కిరణ్ దాని వెనకాల మిగతా కార్లు ఆ వెనుక నిదానంగా విశ్వా కారు....

పంజాబి కారు వాడు ఎవ్వరిని రానివ్వకుండా అటు ఇటు తిప్పుతూ వెనక్కి చూస్తూ నడపడం వల్ల తెరిచి ఉన్న మాన్ హోల్ లో ముందు చక్రం పడి బానేట్ కింద గుద్దుకుని నాలుగు అడుగులు గాల్లోకి లేచి పల్టీ కొట్టుకుంటూ మెట్రో పిల్లర్ కి గుద్దుకుని ఆగిపోయింది.

మిగిలిన నాలుగు కార్లు స్పీడ్ గా పల్టీ కొట్టిన కార్ని చూస్తూ వెళ్లాయి... నాలుగు కార్ల లైట్స్ వెలిగాయి రేస్ అయిపోడానికి ఇంకా రెండు కిలోమీటర్లు ఉందనగా చివరిగా ఉన్న విశ్వ కారు వేగం అమాంతంగా పెరిగి ముందు ఉన్న కిరణ్ కారు పక్కకి వచ్చింది కిరణ్ వెంటనే nos ఆన్ చేసాడు కిరణ్ కారు దూసుకెళ్తుంది..

విశ్వా : తొందర పడ్డావ్ రా సుందర వదన....1...2... అని నేను nos బటన్ నొక్కాను కిరణ్ కారు వెనకే నాది స్పీడ్ అందుకుంది.

కరెక్ట్ గా లైన్ ఇంకో వంద మీటర్లు ఉందనగా కిరణ్ కారు మాములు స్పీడ్ కి వచ్చేసింది, కిరణ్ కారు పక్కనుంచే nos తొ ఓవర్ టేక్ చేస్తూ బాయ్ అని చెయ్యి ఊపాను...

కిరణ్ స్టీరింగ్ ని గట్టిగా కొడుతూ సెకండ్ వచ్చాడు ఆ తరువాత మిగిలిన రెండు కార్లు రేస్ ఫినిష్ చేసేసారు.

రేస్ విన్ అయిన డబ్బులు తీసుకుని కిరణ్ గాడి కోసం చూసాను వాడు కనిపించలేదు సెక్యూరిటీ ఆఫీసర్లు రాక ముందుకే అక్కడ నుంచి వచ్చేసి సిటీ దాటి రెండు పల్లెటూర్లు దాటితే ఘాట్ రోడ్ వస్తుంది అక్కడ నుంచి చిన్న అడివి అందులోకి పోనించి లోపల ఒక పాడు బడ్డ బిల్డింగ్ కార్ పార్క్ చేసి లిఫ్ట్ బటన్ కిందకి నొక్కాను....

ఫ్రిడ్జ్ లో నుంచి బీర్ తీసి మూత తీసి సోఫా లో టీవీ చూస్తూ కూర్చున్న కిరణ్ గాడి పక్కన కూర్చున్నాను, కావేరి ఆమ్లెట్ వేసుకొచ్చి నాకిచ్చింది...

తనే కావేరి చూడటానికి అందంగా అమాయకంగా ఉన్నా తనే వరల్డ్స్ బెస్ట్ హాకర్...
సోఫా లోనుంచి వెనక్కి తిరిగి చూసాను... ముగ్గురు పేకాట ఆడుతూ కూర్చున్నారు...

విశ్వా : ఎంత సేపు అయ్యింది మొదలెట్టి?

కావేరి : రెండు గంటల నుంచి ఆడుతూనే ఉన్నారు.

విశ్వా : సుమన్ గాడు ఒక్క అటైనా గెలిచాడా?

కావేరి : వాడు ఈ జన్మలోనే కాదు వచ్చే జన్మలో కూడా గెలవడు వాడికి తెలుసు అయినా ఆడతాడు.

సుమన్ : ఆ ఆ ఆపు ఆపు వెళ్లి పని చుస్కో ఆమ్లెట్ మాడిపోతుంది.

కావేరి : పోరా..

వాడే సుమన్ చూడటానికి కామెడీగా ఉన్నా లాకర్లు ఓపెన్ చెయ్యడంలో, మనుషులని ఏమార్చడంలో వాడి తరవాతే ఎవరైనా... కామెడీ చేస్తా అనుకుంటాడు కానీ అది టార్చర్.. పిచ్చి పిచ్చి జోకులు వేసి మనం నవ్వకపోతే మనకే కామెడీ సెన్స్ లేదనుకునే పిచోడు.

తన పక్కనే షార్ట్స్ అండ్ బన్నీన్ వేసుకుని ఆడేది రియా అందమైనది, తెలివైనది...ఎంత పెద్ద కరోడా అయినా సరే తన కంటి చూపులో పడ్డారంటే అంతే ఫినిష్... తనే మా గ్యాంగ్ కి front face... అన్నిటికంటే ముఖ్యమైంది తనకి ఫైటింగ్ రాదనుకుంటే వాడికంటే పెద్ద పొరపాటు చేసే వాడు ఉండడు, ముప్పై మందిని ఉట్టి చేతులతో కొట్టి చంపేసింది అంత డేంజరస్.

ఇక అవతల వైపు కూర్చుని ఆడుతున్న బాడీ బిల్డర్... పేరు మదన్ గోడనైనా గుద్ది పగలకొట్టగలడు అంత బలవంతుడు, బ్రెయిన్ వాడడు దానికంటే మమ్మల్నే ఎక్కువగా నమ్ముతాడు ఏం చెప్తే అదే చేస్తాడు కొంచెం క్లారిటీగా చెప్పాలి అంతే.

ఇక నా పక్కన కూర్చుని టీవీ చూస్తున్న వాడే కిరణ్ మీకు ఆల్రెడీ పరిచయం చేసాను... ఫైటర్, కార్ డ్రైవర్, ప్లాన్ B ఎగ్జిక్యూటర్, నేను వేసే ప్లాన్స్ లో తప్పులు ఉంటే గుర్తుపట్టేది వీడే ... అన్నిటికంటే బైక్ బాగా నడుపుతాడు, నేను లేనప్పుడు గ్యాంగ్ లో ఎవ్వరు సెక్యూరిటీ ఆఫీసర్లుకి దొరకకుండా కాపాడే బాధ్యత వీడిదే...

ఇక నేను నా పేరు విశ్వా ఈ గ్యాంగ్ ని కాపాడుకోడమే నా ప్రధాన బాధ్యత... ప్లాన్ వెయ్యడం , బెడిసికొడితే అందరిని అప్రమత్తం చెయ్యడం...ఇంకోటి కార్ నడపడానికి ఒకడు కావాలిగా అది నేనే మీరు చూస్తున్న the best driver... ఈ భూమ్మీద అని చెప్పను కానీ ముందు ముందు మీరే చూస్తారు...

ఇదే మా గ్యాంగ్... అమెరికా ఆస్ట్రేలియాలో చెయ్యాల్సిన దొంగతనాలు అన్నీ చేసేసి వేకెషన్ మీద ఇండియాకి తీసుకొచ్చాను గత రెండేళ్లుగా ఇక్కడే ఉండి చివరికి ఇక్కడే ఉన్న బ్యాంకులని కోల్లగొడుతున్నాం మమ్మల్ని పట్టుకునే అంత టెక్నాలజీ ఈ దేశంలో లేదు అందుకే ఇక్కడే ఉండి దర్జాగా బతుకుతున్నాం... బైట నుంచి ఆఫర్స్ వస్తే తప్ప ఈ దేశం వదిలిపొవట్లేదు.

ఇదే మా fast & furious టీం.... గ్యాంగ్ పేరు six spoons విచిత్రంగా ఉందా అది కూడా ఆ మదన్ గాడే పెట్టాడు...




ఇంతలో కిరణ్ ఛానల్ మార్చాడు టీవీ లో సిటీకి కొత్తగా వచ్చిన ips ఆఫీసర్ ప్రెస్ మీట్ వస్తుంది.

రిపోర్టర్ : ముందుగా మీకు స్వాగతం మిత్ర గారు...మేడం సిటీకి మీరు వచ్చింది ఆ six spoons గ్యాంగ్ ని పట్టుకోడానికే అని సమాచారం వచ్చింది ఎంతో కాలంగా వాళ్లు తప్పించుకుని తిరుగుతున్నారు దాని వల్ల CM అయిన మీ నాన్న గారికి ఒప్పొసిషన్ నుంచి ప్రెషర్ ఎక్కువగా ఉందని అందుకే రంగంలోకి మిమ్మల్ని దించారని అనుకుంటున్నారు దీనికి మీ సమాధానం.

మిత్ర : అలా ఏం లేదండి నేను రెగ్యులర్ ట్రాన్స్ఫర్ మీదే వచ్చాను, ఇంక ఆ గ్యాంగ్ six spoons అయితే ఏంటి  four forks  అయితే ఏంటి? ఎక్కడున్నా నా డ్యూటీ నేను చెయ్యాల్సిందే కదా ఇక దీని వల్ల మా నాన్నగారికి మంచి జరుగుతుందంటే నేను హ్యాపీగా ఫీల్ అవుతాను.

రిపోర్టర్ : వాళ్ళని ఎన్ని రోజుల్లో పట్టుకుంటారు?

మిత్ర : దొరికితే గంటలో పట్టుకుంటాను, కానీ నక్కలు అంత త్వరగా దొరకవు కదా ఎర వేసి పట్టాలి, త్వరలో చెప్తాను.

రిపోర్టర్ : మేడం మీ మెడలో V అనే లాకెట్ ఉంది, V అంటే ఏంటో చెప్తారా?

మిత్ర : నో పర్సనల్ క్వశ్చన్స్ ప్లీజ్.

రిపోర్టర్ : మీరు ఆ గ్యాంగ్ కి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా?

మిత్ర : మీరే చెప్పండి వీలైతే పారిపొమ్మని...

కిరణ్ ఛానెల్ మార్చేసాడు....

మదన్ : అబ్బా అబ్బచా, చెంచాగాళ్ళనుకుంటుంది మనల్ని.

కిరణ్ : మన గ్యాంగ్ పేరు అదే కదరా, అది కూడా నువ్వు పెట్టిందే...

అందరూ నవ్వారు...

విశ్వ : కిరణ్ ఒకసారి మనం అంటే ఏంటో కూడా చూపించి రండి.
Like Reply


Messages In This Thread
RE: కధా స్రవంతి - by Pallaki - 12-06-2022, 07:37 PM
RE: కధా స్రవంతి ❤️ - by Pallaki - 25-06-2022, 08:51 AM



Users browsing this thread: 35 Guest(s)