24-06-2022, 05:15 PM
(20-06-2022, 09:04 PM)బర్రె Wrote: ప్రశ్న : శకుని మీద ఎవరికీ దయ కలగదు... చిన్నావయసు లో తన తండ్రి పగ తో తన కొడుకు అయినా శకుని కి నూరు పోసి... ఎక్కడ మర్చిపోతాడో అని కాలు విరగొట్టి చనిపోతాడు.. ఆ మాంసం ని శకుని తింటాడు... చివరికి చనిపోతాడు.......
ప్రశ్న : పాపం చేసినవాడికి తాగుళ్తుందా లేక పాపం చేయమని చేపినవాడికి తాగుళ్తుందా?.. శకుని తండ్రిక లేక తనకేనా?
కృష్ణుడు అల్లాహ్ ని సృష్టించడ? మనల్ని ఇద్దోళ్లని చేయడానికి
మనకి లభించిన చరిత్ర అంతా గెలిచిన వారు వ్రాసినదే కదా. యుద్ధములో ఓడిపోయి మట్టిగొట్టుకుపోయిన వారు వ్రాయలేరు కనుక యుద్ధం లో గెలిచిన వారే తాము ధర్మాత్ములమని ఓడినవారే అధర్మపరులని అందుకే వాళ్ళు ఓడిపోయారని వ్రాయిస్తారు కవుల చేత. పైగా గెలిచిన రాజు చాలా పరాక్రమ వంతుడని, శృంగార పురుషుడని వ్రాస్తారు ఆ రాజు పోషించే కవులు. ఆ వ్రాతలే కొన్నాళ్ళకి ఆధారాలు పురాణాలు అవటముతో భావి తరాల వారు అదే నిజమనుకోగలరు. శకుని పక్షం రెండు సార్లు ఓడిపోయెను కనుక మహాభారతం ప్రకారం అతడే పరమ దుష్టుడు అయ్యాడు. నిజానికి అప్పుడు అక్కడ ఏమి జరిగిందో ఎవ్వరికి తెలియదు.
పాపం చేయించిన వాడికి మరియు చేసిన వాడికి ఇద్దరు పాపులే ఒక కథనం ప్రకారం. పగ తీర్చుకోమని తండ్రి కొడుకుకి చెప్పెను అది శకుని తనకి తోచినట్టు తీసుకున్నాడు. ఏ కురువంశం తమ రాజ్యం పైన దండెత్తి వచ్చి తన అక్కని బలవంతముగా గుడ్డి వాడికిచ్చి వివాహం జరిపించిందో ఆ కురువంశం యొక్క నాశనం జరిపించాడు అని అందరు భావిస్తారు. ఐతే నాశనమైనది తన సొంత మేనళ్ళుల్లే, లాభపడినది ఎక్కడ ఏ రకం గా సంబంధం లేని దేవతల పిల్లలే. అనుకున్నదొక్కటి ఐనది ఒక్కటి అన్నదానికి శకుని జీవితం ఒక ఉదాహరణ.
ఎవరు ఎవరిని సృష్టించారో చెప్పలేము మిత్రమ.