Thread Rating:
  • 59 Vote(s) - 2.68 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy పేదరాసి పెద్దమ్మ వరం - ( Completed )
 " పేదరాసిపెద్దమ్మ థర్డ్ MISSION "

అది స్వర్గానికి మరియు త్రిశంకు స్వర్గానికి మధ్యన ఉన్న సౌందర్యమైన ప్రదేశం - ఆ ప్రదేశం పిల్లల స్వర్గం - పిల్లలకోసం మాత్రమే దేవతలు నిర్మించిన అద్భుతమైన లోకం - పిల్లలు ఇష్టపడే సకల సదుపాయాలు గల అందమైన లోకం .
గ్రంథాలలో వివరించినట్లు భువిపై శ్వాస విడిచిన వారందరూ మళ్లీ తమ జీవితాన్ని పిల్లలుగా ఆ అందమైన లోకంలో జీవించాలని ఆశపడటం - అందుకు ముఖ్యమైన కారణం లేకపోలేదు .......
పిల్లలందరూ ఎంతగానో ఇష్టపడే పేదరాసిపెద్దమ్మ ...... ఆ అందమైన లోకానికి దేవతగా ఉండటం - అక్కడకు చేరిన పిల్లాడి గురించి పూర్తిగా తెలుసుకుని ఆ పిల్లాడికి ఇక బాధ అన్నది తెలియకుండా జీవించేలా చూడటం .
ఇక అందరికీ తెలిసిన విషయం ..... పిల్లలందరినీ చుట్టూ కూర్చోబెట్టుకుని తినడానికి కోరుకున్నది అందిస్తూ పేదరాసిపెద్దమ్మ రోజంతా బోలెడన్ని కథలు చెబుతూ హాయిగా నిద్రపుచ్చడం .........

మధురాతి మధురమైన అనుభూతిని మిగిల్చిన సెకండ్ మిషన్ పూర్తిచేసుకుని తెల్లవారుఘామున పిల్లల లోకానికి మాలోకానికి చేరుకున్నాను - wow ...... మరింత అద్భుతంగా మారిపోయిందే - పెద్దమ్మ ...... పిల్లల సంతోషాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు మాలోకాన్ని అప్డేట్ చేస్తూనే ఉంటారు .
ఇంతకీ నా అందమైన పెద్దమ్మ ఎక్కడబ్బా ...... ఎప్పుడో ఫస్ట్ మిషన్ లో శృంగారానుభూతిని రగిలించి మాయమైపోయారు అంటూ మాలోకం మొత్తం వెతుకుతూ ముందుకుసాగాను . 
రేయ్ మహేష్ రేయ్ మహేష్ ....... ఎంతకాలం అయ్యిందిరా నిన్నుచూసి - నువ్వులేకపోయేసరికి తెగ బోర్ కొట్టేస్తోంది అంటూ నా స్నేహితులంతా చుట్టూ చేరి పలకరిస్తున్నారు . 
ఇందాకనే వచ్చానురా ....... ఇంతకూ పెద్దమ్మ ఎక్కడరా ? - పెద్దమ్మను చాలా చాలా మిస్ అయ్యాను - వెంటనే చూడాలి నావల్ల కావడం లేదు - మనం తరువాత తీరికగా మాట్లాడుకుందాము .
స్నేహితులు : పెద్దమ్మను చూడకుండా పెద్దమ్మతో మాట్లాడకుండా నువ్వు ఒక్కక్షణం కూడా ఉండలేవని మాకు తెలియదా చెప్పు ...... , నువ్వు వెళ్లిన క్షణం నుండీ పెద్దమ్మ కూడా నీగురించే తలుచుకుంటూ ఆలోచిస్తూ నువ్వు వదిలివెళ్లిన జ్ఞాపకాలతో గడుపుతున్నారు , రేయ్ మహేష్ ...... మాకు తెలిసి నీకంటే ఎక్కువగా మిస్ అవుతున్నారురా .......
పెద్దమ్మ గురించి నాకు తెలియదా ...... , లవ్ యు పెద్దమ్మా ...... అంటూ బుజ్జి హృదయంపై చేతినివేసుకుని ఫీల్ అవుతున్నాను , రేయ్ రేయ్ ...... ఇంతకూ పెద్దమ్మ ఎక్కడో చెప్పనేలేదు ? .
స్నేహితులు : నువ్వు వెళ్ళిపోయాక నుండీ ఎక్కడ ఉంటారో నీకు తెలియదా ...... , నీకిష్టమైన నువ్వు పెంచిన చెట్లు - పూలవనంలో పిల్లలను ఆడిస్తున్నారు .

థాంక్స్ రా మళ్లీ కలుద్దాము అనిచెప్పి పూలవనం పరుగుపెట్టాను . బయటనుండి పెద్దమ్మను చూడగానే అంతులేని ఆనందం , అక్కడినుండే పెద్దమ్మా పెద్దమ్మా ...... అంటూ గట్టిగా కేకలు వెయ్యాలనిపించింది , పెద్దమ్మకు లవ్లీ సర్ప్రైజ్ ఇవ్వాలని పొదలచాటునుండి చూస్తున్నాను , నేనంటే ఇష్టమైన బుజ్జాయిలందరూ కూడా ఇక్కడే ఉన్నారు - బుజ్జిబుజ్జిగా ఉండేవారు అప్పుడే పరుగులుతీస్తున్నారు అంటూ 
పిల్లలతో ఆడుకుంటున్నారే కానీ పెద్దమ్మ మనసు మాత్రం ఎక్కడో ఉన్నట్లు చూస్తేనే అర్థమైపోతోంది .
బుజ్జాయిలు : పెద్దమ్మా పెద్దమ్మా ...... ఔట్ ఔట్ ఔట్ ...... 
పెద్దమ్మ : అయ్యో .......
పెద్దమ్మ మాటలు విని ఎంత కాలం అయ్యింది ఉమ్మా ఉమ్మా 
.......
బుజ్జాయిలు : పెద్దమ్మా పెద్దమ్మా ..... మనిషి మాత్రమే ఇక్కడ ఉన్నారు - మీ మనసు మాత్రం ఎక్కడో ఉంది , అన్నయ్య గురించే ఆలోచిస్తున్నారుకదూ అంటూ బుజ్జిబుజ్జిగా మాట్లాడుతున్నారు .
పెద్దమ్మ : అవును క్యూటీస్ ....... అంటూ తియ్యదనంతో నవ్వుతున్నారు .
బుజ్జాయిలు : అన్నయ్యను గుర్తుచేస్తేచాలు తెగ పరవశించిపోతారు అంటూ చుట్టూచేరి గిలిగింతలుపెడుతున్నారు .
పెద్దమ్మ : పిల్లలూ పిల్లలూ ....... గిలిగింతలు అంటూ చిరునవ్వులుచిందిస్తూ పూలమొక్కల మధ్యన చిన్నగా పరుగులుతీస్తున్నారు - అసలు మీ అన్నయ్యను మరిచిపోతేనేకదా పిల్లలూ ....... , అందుకేకదా రోజూ మనం ఇక్కడే కథలు చెప్పుకునేది అంటూ తెగ మురిసిపోతున్నారు .
ఆఅహ్హ్ ...... పెద్దమ్మా మీ మాటలకే మనసు పులకించిపోతోంది - నేను వెళ్ళాక మరింత ఇష్టం పెరిగిందన్నమాట ఉమ్మా ఉమ్మా యాహూ యాహూ ...... అంటూ నాలోనేనే ఎంజాయ్ చేస్తున్నాను .
బుజ్జాయిలు : పెద్దమ్మా ....... రోజూ ఆడిగేదే , అన్నయ్య ఎప్పుడు వస్తారు ? .
పెద్దమ్మ : ఆమాట అడగకండి - ఒక్కసారిగా కన్నీళ్లు వచ్చేస్తాయి - ఎప్పుడు వస్తాడో ఆ స్వర్గంలోని దేవతలకే తెలుసు - భువిపై నా బిడ్డల బాధలను తీర్చడానికి నేను ఆడిగినవెంటనే వెళ్ళిపోతాడు - నామాట అంటే అంత గౌరవం - నాలానే నాగురించే ఆలోచిస్తూ ఉంటాడు .......
గౌరవంతోపాటు భక్తి - ప్రేమ - ప్రాణం కూడా పెద్దమ్మా అంటూ ఆనందిస్తున్నాను , మీరు ఆజ్ఞ వేస్తే నిప్పులలోకి కూడా సంతోషంగా దూకేస్తాను ....... అంతలోనే ఇవేమాటలను పిల్లలు కూడా చెబుతున్నారు .

అవునా అవునా అంటూ తెగ ఆనందిస్తూ బుజ్జాయిలకు గిలిగింతలుపెడుతున్నారు - పెద్దమ్మకు వెక్కిళ్ళు పట్టాయి .
బుజ్జాయిలు : మా దేవతలాంటి పెద్దమ్మను ఎవరో తలుచుకుంటున్నట్లున్నారు - ఇంకెవరు అన్నయ్యనే అయిఉంటాడు - రోజూ ఇదేవరుస కదూ ....... పెద్దమ్మా ఉండండి అమృతం తీసుకొస్తాము అంటూ బుజ్జాయిలందరూ పరుగులుతీశారు .
[+] 10 users Like Mahesh.thehero's post
Like Reply


Messages In This Thread
RE: పేదరాసి పెద్దమ్మ వరం - by Mahesh.thehero - 29-09-2023, 09:36 AM



Users browsing this thread: 33 Guest(s)