21-06-2022, 06:12 AM
(20-06-2022, 07:34 PM)Takulsajal Wrote:11
నా ఇంటి ముందుకి వెళ్లాను, పక్కనే ఉన్న ఫ్రెండ్స్ ని చూసాను...తరువాత చుట్టూ చూసాను ఒకపక్క లారీలో మిరపకాయ బస్తాలు దించుతున్నారు... ఇంకో పక్క వంట సామాను లోపలికి తీసుకెళ్తున్నారు....పెళ్లి కదా ఇంటి ముందు ఐస్ క్రీం అమ్మేవాడు కూడా ఉన్నాడు.
వాసు : రేయ్ చిన్నప్పుడు జాతరలో బజ్జీలు, చెరుకు గడలు నేనే కొనిచ్చా, ఇప్పుడు నాకు కుల్ఫీ కావాలి ఎవరు కొనిస్తున్నారు?
సునీల్ : మనం పొయ్యే పనేంటి వీడు అడిగేదేంటి ఇక్కడ ఉచ్చ పడుతుందిరా నాకు, అస్సలే ఆ సుబ్బరాజు గాడు ఉన్నాడేమో అని భయపడి చస్తుంటే...
వాసు : సరే నీకొక పని చెప్తాను చేస్తావా?
సునీల్ : చెప్పారా బాబు, ఏదో ఊపు మీద వస్తా అన్నాను కానీ ఇల్లు చూస్తుంటేనే ఉచ్చ పడుతుంది.
వాసు : రోడ్ మీదకి పొయ్యి, బస్సులో నా ఫ్రెండ్ ఒకడు వస్తున్నాడు పేరు రాంబాబు రెండు బ్యాగుల నిండా పెన్నులు తీసుకొస్తున్నాడు వాడిని ఇక్కడికి తీసుకురాపో...
సునీల్ : అన్ని పెన్నులు దేనికి రా?
వాసు : స్కెచ్ గీయడానికిరా కుల్ఫీ ... నువ్వు పోయిరా.... వాడితో ప్రభాస్ అంటావేమో పెన్ను నీ గొంతులో దించుతాడు వాసు ఫ్రెండ్ అని చెప్పి పరిచయం చేసుకునిరా.
సునీల్ : అలాగే..
వాసు : మరీ కుల్ఫీ ఎవడు కొనిస్తాడు రా...
నలుగురం కుల్ఫీ తింటూ లోపలికి అడుగుపెట్టాం, మదన్ రమేష్ కొంచెం భయంగానే ఉన్నారు, బాలు మాత్రం ధైర్యంగానే ఉన్నాడు ఏదైతే అది అయిందన్నట్టు... లోపలికి వెళ్ళాం.
గేట్ దెగ్గర ఇద్దరు ఉన్నారు అందరిని చూసి "రేయ్ కాయిన్ ఉందా?"..
మదన్ : ఇదిగో...
వాసు : బొమ్మా బోలుసా?
రమేష్ : ఇప్పుడు దేనికిరా...?
వాసు : ఎహె చెప్పండ్రా...
బాలు : బొమ్మ...
గాల్లోకి ఎగరేసాను... బొమ్మ పడింది... "అబ్బా ఛా.." అన్నాను.
బాలు : ఏమైంది రా?
వాసు : కొట్టుకుంటూ వెళదాం అనుకున్నా, దేవుడు మీ వైపే ఉన్నాడు పదండి ఆ మిరపకాయల బస్తాలు అందుకోండి లోపలికి పోదాం....అని అటువైపు కదిలాను... అందరం తలా బస్తా అందుకుని పని వాళ్ళ ఎమ్మటే వెళ్తున్నాం.
వాసు : ఏం మిరపకాయలురా ఇవి ఇంత ఘాటుగా ఉన్నాయి?
మదన్ : తేజా మిరపకాయలు, ఇవి కొంచెం మంట ఎక్కువే...
బస్తాలన్ని స్టోర్ రూమ్ లో సర్దిస్తున్నారు... లోపలికి వెళ్లి బస్తాలు అక్కడ పడేసి వెనక్కి తిరిగాను...మదన్ గాడికి కాళ్ళు చేతులు వణుకుతున్నాయి... రమేష్ గాడైతే గోడకి బల్లిలా పిల్లర్ని కరుచుకున్నాడు.
బాలు : వాసు... SI సుబ్బరాజు రా...
వాడిని చూసాను సోఫాలో కూర్చుని ఉన్నాడు...ఒకప్పుడు నన్ను పిచ్చి కొట్టుడు కొట్టాడు, కొట్టించాడు వాడినెలా మర్చిపోతాను, ఇంతలో ఒక అమ్మాయి లంగా ఓణి వేసుకుని చెంబులో మజ్జిగ పట్టుకుని వచ్చింది, చెవులకి కమ్మలు లేవు, బోసి మెడ అయితేనేం కంటికింపుగా ఉంది... దాని కళ్ళలోకి చూసాను ఎవరో కాదు పద్మ... నా పద్మ.
బాలు : రేయ్ పద్మ... వాసు మన పద్మ...
సుబ్బరాజుకి మజ్జిగ చెంబు అందించింది, వాడు పద్మ చెయ్యి పట్టుకుని వాడి ఒళ్ళోకి లాక్కుని, పద్మ భుజం మీద చెయ్యి వేసాడు పద్మ కళ్ళలో నీళ్లు తిరుగుతున్నాయి కంట్లో నుంచి చుక్క కారకముందే వెళ్లి వాడి ఎదురుగా నిల్చున్నాను.
సుబ్బరాజు నా కళ్ళలోకి చూస్తూ "ఏంట్రా... కావాలా?" అన్నాడు... పద్మ చెయ్యి పట్టుకుని గట్టిగా లాగాను, నాకు హత్తుకుపోయింది.. సుబ్బరాజు లేచాడు పద్మని వాటేసుకుని కళ్ళు మూసుకునే సుబ్బరాజు గాడి డొక్కలో ఒక్కటి గుద్దాను, వాడు కిందపడ్డాడు...
రూమ్ లో ఉన్న బాలు వెంటనే డోర్ గొళ్ళెం పెట్టేసాడు ఎవ్వరు రాకుండా... పద్మని అలానే పట్టుకొని సోఫాలో కూర్చుని కుడి కాలితో సుబ్బరాజు గుండె మీద కాలితో తన్ని అనగపట్టాను.. వాడు గింజకుంటున్నాడు నాకు అన్నీ తెలుస్తున్నాయి కానీ కళ్ళు తెరవలేదు, తెరిస్తే నా కంట్లో కూడా నీళ్లు వస్తాయని భయం ఎందుకంటే నేను ఇప్పటివరకు ఏడవలేదు కాబట్టి.
రాంబాబు అప్పుడప్పుడు ఏం ఆలోచిస్తున్నావ్ అని కదిలించినా..... నేను ముభవంగా బాధగా కూర్చున్నా అది మా అమ్మ కోసమో అన్న కోసమో శృతి కోసమో కాదు నా పద్మ కోసం ఈ పిచ్చి పిల్ల ఇంత మంది రాక్షసుల దెగ్గర ఎలా ఉంటుందో అన్న భయం.
ఇంతవరకు పద్మ నన్ను వదలలేదు, తన కన్నీరు నాకు తెలుస్తుంది నా మెడ మీద నుంచి చొక్కాలోకి కారుతున్నాయి...
వెంటనే వాడి మనుషులు తేరుకొని కొట్టడానికి ముందుకు వచ్చారు ఒక చేత్తో పద్మ నడుము పట్టుకుని నాలోపలికి వత్తేసుకుంటూనే ఇంకో చేతిలోకి గన్ తీసుకుని నాకోసం వస్తున్న ఇద్దరినీ కాల్చాను...
నా ఫ్రెండ్స్ అంతా ఇదంతా జరుగుతుందా అస్సలు నిజమేనా అన్నట్టు చూస్తున్నారు, బాలు గాడు మాత్రం ఆనందం మరియు సుబ్బరాజుని కోపంగా చూస్తున్నాడు, తన అన్నయ్య కాలు తీసినవాడి మీద ఆ మాత్రం కోపం సహజమే...
పద్మని చూసాను ఇంకా నన్ను హత్తుకునే ఉంది, నా మెడ మీద వాసన చూస్తుంది..
వాసు : ఏవండీ లేవండి... బల్లిలా అతుక్కుపోయారు ఇలా అయితే నేను బలవంతం చేసేస్తా మరీ...
పద్మ : నా మెడ కొరికి... "చెయ్యి రా చెయ్యి... ఇన్ని రోజులు ఎటు పొయ్యవ్ నన్ను ఇక్కడ ఈ రాక్షసుల మధ్య వదిలేసి... పో బావా నీతొ అస్సలు మాట్లాడను" అని ఎక్కిళ్ళు వస్తున్నా ఆగకుండా ఏడుస్తుంది..
అందరినీ ఏడిపించే నన్ను ఇది ఏడిపిస్తుంది ఇక దాని దెగ్గర దాయలేను.
వాసు : తన తల నిమురుతూ "పద్మా నేనే అని ఎలా తెలిసిందే?"
పద్మ : నువ్వు పెద్ద షేర్లోక్ హోమ్స్ మరీ... నీ స్పర్శ నాకు తెలీదా చూడు నీ చేతుల మీద వెంట్రుకలు ఎలా నిక్కబోడుచుకున్నాయో...
వాసు : పైనే కాదు కింద కూడా నిక్కబోడుచుకుందే నిన్ను చూసి...
పద్మ : ఛీ... నోరు తెరిస్తే బూతే.. నువ్వేం మారలేదు బావా...
వాసు : నువ్వు కూడా అవే పాత డైలాగులు, మరి నేను పాత వాసుని కాదు... ఈ రాక్షసుల దెగ్గర నుంచి రావణుడి దెగ్గరికి వస్తున్నావ్ జాగ్రత్త మరి.
పద్మ : హహ.. నా బావ గురించి నాకు తెలీదా?
వాసు : సర్లే మనం తరువాత మాట్లాడుకుందాం...పో పొయ్యి మీ కవితక్కని తోలుకురాపో... నేను అంతలోపు వీడి సంగతి చూస్తా... అని సుబ్బరాజుని చూసాను.. నా చేతిలో గన్ చూసి వాడి నోరు గుద్దా ఎప్పుడో మూసుకుపోయాయి.
పద్మ : ఆమ్మో నాకు భయం, ఇంటి చుట్టూ మనుషులే...
వాసు : నీ మొగుడొచ్చాక కూడా ఇంకా ఏం భయమే... ఇది నీ ఇల్లు మర్చిపోయావా?... నాన్న నీకు ఈ ఇంటి చిన్నకోడలిగా ఎప్పుడో తాళాలు ఇచ్చేసాడు..
పద్మ నా కాళ్ళ కిందున్న సుబ్బరాజుని చూసి లేచి వెళ్ళబోయింది.
వాసు : పెళ్ళామా... ఇటు రా ఒకసారి..
పద్మ నా మాటలకి సిగ్గుపడుతూ... వాడిని చూస్తూ భయంగా నా దెగ్గరికి వచ్చింది...
వాసు : వదినకి నేను వచ్చానని చెప్పకుండా ఎవరో ప్రభాస్ వచ్చాడని చెప్పు.
పద్మ : మొదలెట్టేసావా నీ ఆటలు?
వాసు : చెప్పవే కొంచెం సేపు ఆడుకుందాం..
పద్మ : అలాగే లే.. అని వెళ్ళిపోతుండగా
వాసు : వీడ్ని ఏమైనా కొట్టాలని ఉందా...?
పద్మ : లేదు కానీ నువ్వు కొడితే చూడాలని ఉంది.
వాసు : వద్దులే నువ్వెళ్ళి కవితకి తోడుగా ఉండుపో వస్తున్నా...
పద్మ వెళ్ళిపోయిన వెంటనే బాలు మళ్ళీ తలుపు పెట్టేసాడు, సుబ్బరాజు మీద నుండి కాలు తీసాను వాడు లేచి నన్ను చూస్తూ "ఎవడ్రా నువ్వు?" అన్నాడు.
వాసు : ఏంటి మర్చిపోయావా నన్ను, నేను గుర్తు చేస్తాలే.... రేయ్ ఆ తాళ్లు అందుకోండి.
మదన్ తాడు తీసుకొస్తుంటే సుబ్బరాజు నన్ను కొట్టడానికి ముందుకి వచ్చాడు ఇప్పుడు వీడ్ని కొట్టే మూడ్ లో లేను అందుకే గన్ తీసి వాడి తొడ మీద కాల్చాను, కింద పడ్డాడు.. "రమేష్ ఆ బల్ల ఇటు వెయ్" అన్నాను... నేను సుబ్బరాజుని కాల్చగానే ముగ్గురికి నోట మాట రాలేదు... "రేయ్ రమేష్ నిన్నే ఆ బల్ల ఇటు వెయ్ తరువాత షాక్ అవుదు కానీ"...
రమేష్ : ఆ!... అలాగే...
సుబ్బరాజు తొడ పట్టుకుని వాళ్ళ మనుషులని పిలవడానికి అరుస్తున్నాడు, గన్ సౌండ్ విన్న వాడి మనుషులు కూడా బైట తలుపులు బాదుతున్నారు అందరికి గన్ సౌండ్ వినపడి ఉంటుంది , వాడు తొడ గట్టిగా ఆదిమి పట్టుకుని గాలి ఊదుతు నన్నే కోపంగా చూస్తున్నాడు వెళ్లి వాడి పక్కనే కూర్చుని... "పద్మని ఏ తొడ మీద కూర్చోబెట్టుకున్నావు మామ... బావ.. ఛీ... రేయ్ వదినకి వీడు మామ అయితే నాకేం అవుతాడు హా... బాబాయ్... చెప్పు బాబాయ్ ఏ తొడ" అని గన్ ఇంకో తొడ మీద పెట్టాను.
సుబ్బరాజు : ఇదే ఇదే... అని కాల్చిన కాలు చూపించాడు...
ఇంకో రెండు బుల్లెట్లు దించాను... గట్టిగా అరిచాడు ఒక్క తన్ను తన్నాను ఎగిరి బల్ల మీద పడ్డాడు రమేష్ గాడి చేతిలో ఉన్న తాళ్ళు తీసుకుని కట్టేసాను.
డోర్లు ఇంకా బాదుతూనే ఉన్నారు, చిరాకు పుట్టి డోర్ ఓపెన్ చేసాను... ఎదురుగా ఇరవై మంది మనుషులు వాళ్ళ వెనుకే వరదరాజులు వాడి పక్కనే నా దొంగ అత్త రవళి నిల్చుని చూస్తున్నారు.
వాసు : నవ్వుతూ...ఏయ్ అందరూ వచ్చేసారు రండి రండి లోపలికి రండి.... అందరూ లోపలికి వచ్చి సుబ్బరాజుని చూసి..
వరదరాజులు : రేయ్ సుబ్బు... ఎవర్రా నిన్ను ఇలా కట్టేసింది...
వాసు : నేనే మావయ్య...
వరదరాజులు : ఎవడ్రా నువ్వు..
వాసు : అది గుర్తు చెయ్యడానికే వచ్చా... పదే పది నిమిషాలు చెప్తా... కొంచెం ఓపిక పట్టండి.... అదిగో వచ్చేసారు... రూమ్ లోకి వస్తున్న రాంబాబుని చూసి ఏరా సునీల్ ఇంత సేపా.. అన్నాను.
సునీల్ : ఈ బ్యాగ్ ఏంట్రా బాబు ఇంత బరువుంది....
వాసు : నువ్వు రీఫిల్స్ తెచ్చినట్టున్నావ్... పెన్నులు ఆ బ్యాగ్ లో ఉన్నాయా? రేయ్ రాంబాబు.. నాకిష్టమైన పెన్ను తెచ్చావా?
రాంబాబు : ఇదిగో... అని బ్యాగ్ జిప్ తీసి లోపలనుంచి షాట్ గన్ తీసాడు.
సునీల్ గాడికి అక్కడున్న అందరికి అస్సలు ఏం జరుగుతుందొ కూడా అర్ధం కావట్లేదు, అందరూ నిర్ఘాంతపోయి చూస్తున్నారు.
సునీల్ : పెన్నులంటే గన్నులా ??...మరీ ఈ బ్యాగ్ లో రీఫిల్స్ అంటే....?
వాసు : తీసి చూడు..
సునీల్ బ్యాగ్ ఓపెన్ చేసాడు...
సునీల్ : వామ్మో... ఇన్ని బుల్లెట్లా........