19-06-2022, 08:50 PM
10
బస్సు ఊరి పొలిమేరలోకి ఎంటర్ అవ్వగానే అన్నీ గుర్తొచ్చాయి ఇంతకముందు ఒక్క కోపం మాత్రమే ఉండేది ఎప్పుడెప్పుడు అందరిని చంపేద్దామా అని కానీ ఏ ముహుర్తానా నా శృతిని కలిసానో మళ్ళీ నా మెదడు పనిచెయ్యడం మొదలెట్టింది అలా అని సున్నితంగా మారలేదు కానీ నాలోని అల్లరి పిల్లోడు నాకు మళ్ళీ పరిచయం అయ్యాడు, అందరిని ఒక ఆట అడేసుకోవాలని అనిపించింది.
బస్సు ఊర్లో ఆగింది దిగాను... దిగి ఊర్లోకి నడుచుకుంటూ వెళ్తున్నాను చుట్టూ పొలాలు ఉండేవి కానీ ఇప్పుడు వాటి స్థానంలో మట్టి దుమ్ము వాటి మీద లారీ టైర్ల గుర్తులు ఉన్నాయి, ఊర్లోకి వెళ్లాను అస్సలు అది ఊరే కాదు మట్టి దిబ్బ ఎటు చూసినా దుమ్మె... కొంచెం ముందుకు వెళ్ళగా వేప చెట్టు కనిపించింది అదొక్కటి మాత్రం అలానే ఉంది.
ఇల్లు చూద్దామని ఇంటికి వెళ్ళాను, నా ఇల్లు కళకళలాడుతుంది అంతా హడావిడిగా పనులు చేస్తున్నారు ఇంటి చుట్టూ లైటింగ్ వేసి ఉంది...ఇంటి ముందు పెద్ద బ్యానర్ కూడా కట్టించారు కవితా వెడ్స్ కళ్యాణ్ అని డేట్ వేసి ఉంది అంటే రేపే పెళ్లి గట్టిగా నవ్వాను...
రాత్రికి చెట్టు దెగ్గరే పడుకుని ఉన్నాను, ఎవరో మాటలు వినపడితే లేచాను, నలుగురు కుర్రోళ్ళు మాట్లాడుకుంటున్నారు చూడగానే గుర్తుపట్టేసా ఎవరో కాదు నా ఫ్రెండ్స్ సునీల్, మదన్, బాలు, రమేష్.... కానీ నేనే గుర్తు పట్టకుండా ఐపోయా... వాళ్లు సీరియస్ గా మాట్లాడుకుంటుంటే సైలెంట్ గా విన్నాను.
మదన్ : అరే... కవిత వదినని ఎలా రా కాపాడేది?
సునీల్ : అవునురా నాకు భయంగా ఉంది, తను ఏమైనా చేసుకుంటే?
బాలు : చుడండి ముందే చెప్పాను మళ్ళీ చెప్తున్నాను మనం వదినని ఇక్కడనుంచి తప్పించి మన ప్రాణాల మీదకి తెచ్చుకోవద్దు ఒక వేళ మనం తప్పించినా వదిన ఎక్కడికి వెళుతుంది వాసు ఏమైపోయాడో తెలీదు అర్జున్ అన్న అస్సలు బతికున్నాడో లేదో తెలీదు ఒక్కసారి కూడా వాళ్ళు ఇక్కడ అడుగు పెట్టలేదు... వదినని ఇప్పుడు తప్పించినా ఒంటరి ఆడపిల్ల బైటికి వెళ్లి ఎలా బతుకుతుంది.. తనకి అంత వరకే రాసిపెట్టి ఉందని వదిలెయ్యండి కోరి మరీ కష్టాలు తెచ్చుకోవద్దు ఆల్రెడీ మనం పడుతున్న కష్టాలు చాలు.
నేను లేచి చెప్పట్లు కొట్టాను గట్టిగా.... అందరూ నావైపు చూసారు.
వాసు : మీ నలుగురిలో బుర్ర ఎవడికైనా ఉంది అంటే అది తనకే అని బాలుని చూపించాను.
రమేష్ : ఎవరు నువ్వు? అస్సలు నీకేం తెలుసని మాట్లాడుతున్నావ్?
వాసు : హాయ్ నా పేరు ప్రభాస్, ఈ ఊరికి పనికోసం వచ్చాను.
సునీల్ : బాహుబలి ప్రభాస్ ఆ??
వాసు : కాదు బుజ్జిగాడు ప్రభాస్..
దానికి మదన్ బాలు నవ్వారు... చుట్టూ చూసాను ఎవ్వరు లేరు మేము మాత్రమే ఉన్నాము, నా గురించి చెప్పినా ఏం కాదులే కానీ ఆగాను చూద్దాం అని.
వాసు : ఇంతకీ ఏంటి మ్యాటర్ చెప్పండి ఏమైనా సహాయం కావాలంటే చేస్తాను అమ్మాయిని లేపుకుపోవాలా చెప్పండి సహాయం చేస్తాను.
బాలు కోపంగా "ఏం అవసరం లేదు నువ్వు వెళ్లి వచ్చిన పని చుస్కో... మా గురించి ఎవ్వరి దెగ్గరా వాగకపోతే అదే చాలు" అన్నాడు.
వాసు : నన్నే దబాయిస్తావా? అయితే మీ గురించి పెళ్లి దెగ్గరికి వెళ్లి చెప్తాను.
రమేష్ , మదన్ నిన్ను అంటూ ముందుకి దూకారు బాలు మాత్రం కోపంగా చూస్తున్నాడు తప్పితే ముందుకు రాలేదు వెనకే ఉన్న సునీల్ మాత్రం "రేయ్ వాడి కండలు చూడండ్రా ముగ్గురిని ఎగరేసి మరీ తన్నెలా ఉన్నాడు అవసరమా?" అన్నాడు.
వాసు : ఏంట్రా కొట్లాట అంటే ముందుకి దూకే బాలు గాడు వెనక ఉన్నాడు, పారిపోయే మీరేమో ముందుకు వస్తున్నారు బాగా మారిపోయారు ఒక్క సునీల్ గాడు తప్ప కామెడీ పీస్ అని నవ్వాను.
అందరూ ఆశ్చర్యపోయి... ఒక్కసారే "ఎవరు నువ్వు?" అన్నారు.
రెండు చేతులు నడుము మీద పెట్టుకుని ఇంకా గుర్తుపట్టలేదా అన్నట్టు చూసాను, ఇంకో రెండు నిమిషాలు చూసి "నేనేరా వాసు ని" అన్నాను.
అందరూ స్టన్ అయ్యారు నా మాటలకి,
సునీల్ గాడు ముందుకి వచ్చి "వాసు... నువ్వు మా వాసువా?"
వాసు : లేదు రా పక్కూరి వాసుని.
సునీల్ : అదే టైమింగ్ వాసు... అంటూ ముందుకి వచ్చాడు వారితో పాటే బాలు మధన రమేష్..అందరం కౌగిలించుకున్నాం..
వాసు : ఇంతకీ కమల్ గాడు ఎక్కడ రా?
కమల్ పేరు ఎత్తగానే అందరూ డల్ అయ్యారు...
బాలు : వాడు ఇంట్లోనేరా పదా చూపిస్తా...
వాసు : ఇంకోటి మీ మనసులో చాలా ప్రశ్నలు ఉన్నాయని తెలుసు ఏవి అడగకండి జస్ట్ జరిగేది చూస్తూ ఉండండి చాలు... సరేనా...
అందరూ సరే అన్నారు.
వాసు : సునీల్ ని చూసి "రేయ్ నా పేరేంటి?"
సునీల్ : వాసు... అనగానే డిప్ప మీద కొట్టాను.
మదన్ గాడు తెరుకొని "ప్రభాస్" అన్నాడు...
వాసు : హ్మ్మ్... అదే మైంటైన్ చెయ్యండి.
అందరం కమల్ గాడి ఇంటికి వెళ్ళాం, లోపల మమ్మల్ని చూడగానే మంచం మీద నుంచి లేచి వాకింగ్ స్టిక్ తొ నడుస్తూ ఎదురు వచ్చాడు.
వెంటనే వెళ్లి వాడిని పట్టుకుని "రేయ్ కమల్ ఏమైంది రా?" అన్నాను అందరిని చూస్తూ.. వాడు అయోమయంగా మిగతా వాళ్ళని చూసాడు... సునీల్ "మన వాసు రా అన్నాడు" కమల్ "అవునా రే వాసు ఎంతలా మారిపోయావు అని గట్టిగా కౌగిలించుకున్నాడు.
అందరం కూర్చున్నాం... సునీల్ జరిగింది చెప్పాడు కలుసుకున్న దెగ్గరనుంచి నా పేరు వరకు.
కమల్ : అయితే ఇప్పుడు తమరు ప్రభాస్ అన్న మాట.
వాసు : ఇంతకీ ఎలా జరిగిందిరా అని కాలుని చూసాను.
బాలు : మామ ఆ సర్పంచ్ వరదరాజులు పనిరా ఇది, మా పొలాలు అన్నీ లాక్కున్నారు కమల్ ఎదురు తిరిగాడని వాడి కాలు తీసేసార్రా.
వాడిని ఏం చెయ్యాలా అని కోపంగా ఆలోచిస్తున్నా ఇంతలోపే బాలు నా మొహంలో కోపం చూసి "వాసు అంతా ఓకే గా?"
వాసు : హా అంతా ఓకే.... ఇక నేను వెళ్తాను కొంచెం పని ఉంది అని లేచాను.
కమల్ : ఎక్కడికిరా?
వాసు : ఇంకెక్కడికి వదినని అన్నయ్య దెగ్గరికి తీసుకెళ్లద్దు?
బాలు : మేము వస్తాము రా నువ్వుండగా మాకు భయమెంటి, ఏం జరిగినా అందరం కలిసే ఉందాం.. అప్పుడు చిన్నపిల్లలం అయ్యి భయపడి నీకోసం రాలేకపోయాంరా... కానీ ఇప్పుడు అలా కాదు చావైనా బతుకైనా నీతోనే... ఏరా అని అందరిని చూసాడు.
సునీల్, మదన్, రమేష్ ముగ్గురు "అవును రా " అన్నారు.
కమల్ : వాడికి నేను నా తరపున సాయం చెయ్యలేకపోతున్నా అని బాధగా ఉంది రా...
వాసు : ఎవ్వరు అవసరం లేదు మామ నేను చూసుకుంటా..
మదన్ : మేము వస్తాం రా బావా...
వాసు : నేను చూసుకుంటా రా... నాకొదిలేయ్.
సునీల్ : ఏంట్రా కండలు చూసుకునా ఇంత ధైర్యం, మేం వస్తా అన్నాంగా మూసుకుని పదా...
వాసు : అలాగే అయితే భయపడకూడదు మరీ..
సునీల్ : అబ్బో వచ్చాడండి ధీరుడు... బిల్డప్ ఇచ్చుకుంది చాలు పదా...
వాసు : మీ ఇష్టం, పదండి.... మళ్ళీ కలుస్తానురా కమల్....
లేచి బైటకి వచ్చి.... నా ఇంటికి బైలుదేరాను... వెనక నా ఫ్రెండ్స్ కాలర్ ఎగరేస్తూ.... షర్టు హాండ్స్ మణికట్టు మీదకి మడుస్తూ సీరియస్ గా వస్తున్నారు... నవ్వుకుంటూ వాళ్ళని చూస్తూ ఉన్నాను...