18-06-2022, 04:56 PM
(16-06-2022, 07:10 AM)బర్రె Wrote: ప్రశ్న : ఒక కుటుంబం లో మనవడు ఆత్మహత్య చేసుకుంటే... పితృదేవతలు ఆ వంశం ని షాపిస్తారా???..... పితృశాపం
ఆత్మహత్య మహాపాపం అని విన్నాను మిత్రమ బర్రె. కాని ఆ వంశం వారు ఏ తప్పు చెయ్యనప్పుడు పితృదేవతలు శపించరు మిత్రమ నాకు తెలిసినంతవరకు. ఆత్మహత్య లాంటి పాప కర్మలు చేసిన వారు పాపులున్న వంశం లో పుట్టచ్చు. ఉదాహరణకి ఒక factionist కుటుంబం ఉందనుకుందాము. ఆ కుటుంబం లో చాలా మంది ఎన్నో హత్యలు చేసి జనముని పీడిస్తున్నారనుకుందాము. వారికి శతృవులు కూడా చాలా మంది ఉంటారు. ఆ శతృవులు అవకాశం లభించగానే వీళ్ళ కుటుంబాన్ని మొత్తం లేపెయ్యాలని పథకములు పన్ని కాచుకుని ఉంటారు. అలాంటప్పుడు ఆ కుటుంబములో ఒక శిశువుగా జన్మించడం పెరిగి పెద్దవ్వడం ఒక శాపం. ఎప్పుడు ఎవరు ఎక్కడనుండి ఎలా దాడి చేస్తారో అని నిత్యం భయం తో పెరుగుతారు వారి పిల్లలు. పెద్ద అవ్వచ్చు లేక ముందే చంపబడచ్చు. ఇది ఒక రకమైన పితృశాపము. మా చుట్టాలలో ఒకాయనకి పితృశాప సుతక్షయ యోగం ఉంది. ఆయనకి పిల్లలే పుట్టలేదు. ఇంకొకరికి మాతృశాప సుతక్షయ యోగం ఉంది ఆమెకి కూడా పిల్లలు కలగలేదు. కనుక ఈ శాపాలు పని చేస్తాయని అనిపిస్తున్నది కాని అవి ఎలా ఎందుకు వస్తాయో తెలియదు మిత్రమ. ఏ తలిదండ్రులు తమ పిల్లలని శపించరు కదా మనస్పూర్తిగా.