Thread Rating:
  • 6 Vote(s) - 1.67 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
వాసు గాడి వీర గాధ {completed}
5


రాత్రి అందరం భోజనాలకి కూర్చున్నాం తింటుండగా అమ్మ అడిగింది "ఏవండీ ఇందాక ఎవరు వాళ్లంతా సూట్ వేసుకుని మన ఇంటికి వచ్చారు మన ఊళ్ళో ఏం పని?"

నాన్న : వదిలేయ్యవే ఏదో దిక్కుమాలిన సంత ఏదో పొలం కొనాలని వచ్చారు తేడాగా ఉన్నారని వెనక్కి పంపించేసాను

వాసు : నాన్నా వాళ్ళని గమనించావా ముఖ్యంగా వాళ్ళతో వచ్చిన అమ్మాయిని.

అమ్మ : ఎవరిని పట్టుకుని ఏం అడుగుతున్నావ్... ఈ పాటికి కళ్ళతో ఎక్సరే తీసి ఉంటాడు అని చిన్నగా మొగుడికి మాత్రమే వినపడేలా గోణిగింది.

వాసు : ఏయ్ నువ్వు పొయ్యి మంచి నీళ్లు తీసుకురాపో...

నాన్న : ఏమైంది రా ?

వాసు : అదే ఆ అమ్మాయి... నాకెందుకో వాళ్ళ మీద డౌట్ గా ఉంది, ఆ చీర కట్టుకి ఆ వ్యావహారానికి అస్సలు సంబంధం లేదు, బొట్టు చూస్తే గరుడవాహణుడి భక్తులలా తలపించారు కానీ మెడలో రుద్రాక్ష... నోరు తెరిచి మాట్లాడట్లేదు ఎంత సేపు రెండు పెదాలు మూసుకునే మాట్లాడుతుంది ఎందుకో తన పళ్ళు కనిపించకుండా మాట్లాడుతుంది ఒక పక్క మాట్లాడుతూనే ఉంది కానీ తన కళ్ళు మన ఇంటిని వెతుకుతున్నాయి, అంత పద్ధతి గలదే అయితే చీర బొడ్డు కిందకి కడుతుందా చివరికి కాలి పట్టి కూడా తిరగేసి పెట్టుకుంది నాకెందుకో అనుమానంగా ఉంది కొంచెం జాగ్రత్తగా ఉండండి అని చెయ్యి కడుక్కుని లేచాను.

జానకి, కనకం, ఇంకా షాక్ లోనే చెయ్యి తుడుచుకోడానికి వెళ్తున్న వాసుని చూస్తున్నారు.

రాజారామ్ : మొన్న నీ కొడుకు గురించి ఏదో చెప్పావు?

జానకి ఇంకా అలానే ఉండటంతొ డొక్కలో పొడిచాడు...

జానకి : ఆ! ఏంటి?

రాజారామ్ : అదే మొన్న నీ కొడుకుని వెనకేసుకొచ్చావుగా, చూసావా వాడ్ని ఇప్పటికైనా నేను చెప్పింది నమ్ముతావా?

జానకి : ఆ... కానీ ఎలా?... ఇంత చిన్న వయసులో... వీడికి ఇన్ని విషయాలు ఎలా తెలుసు ఒక సాధారణ కాలేజ్ కి వెళ్లే పిల్లోడు...నాకే తెలియవు కొన్ని విషయాలు.

అర్జున్ : దాన్నే ఆర్ట్ ఆఫ్ అబ్సర్వేషన్ అంటారు.

అందరూ అర్జున్ వైపు చూసారు,

అర్జున్ : వాసు గాడికి ఇదీ ఇప్పుడు అబ్బిన విద్య కాదు పుట్టుకతోనే వచ్చింది, కొంతమందిలో అవతలి వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు మనసులో ఏం అనుకుంటున్నారు అని తెలుసుకోవాలని ఉంటుంది దాని వల్లే ఇలాంటి ఆలోచనలు చేస్తారు కానీ వాసుకి ఆ ఆలోచన వల్ల కాదు గాని ఎలా ఆలోచించాడో తెలీదు కానీ అందరినీ గమనించడం మొదలు పెట్టాడు...

మీరు చాలా సార్లు చూసే ఉంటారు వాడు బైట అమ్మాయిల వంక చూడటం వాళ్ళకి దెగ్గరగా ఉండటం ఊర్లో అందరిని కావాలని గెలకడం ఇవన్నీ అందులోనుంచి వచ్చినవే. చేసే పని వేరు మాట్లాడే తీరు వేరు కానీ మైండ్ లో ఇంకోటి రన్ అవుతుంది అందరితో వెటకారంగా మాట్లాడి వాళ్ళకి కోపం తెప్పించి వాళ్ళని నోరు జారేలా చేసి వాడికి రావాల్సిన సమాధానాలు రాబట్టుకుంటాడు అబ్బో ఇంకా చాలా ఉన్నాయి వాడి గురించి చెప్పాలంటే అని అర్జున్ కూడా చెయ్యి కడుకున్నాడు.

రాజారామ్, జానకి, కనకం ముగ్గురు ఆశ్చర్యంగా చూస్తున్నారు, ఎప్పుడూ నింపాదిగా ఉండే పెద్దకొడుకు ఇలా తెలివిగా మాట్లాడేసరికి.

జానకి : ఇవన్నీ నీకెలా తెలుసు?

అర్జున్ : ఒక రోజు వాడు మంచం మీద పడుకొని ఉన్నాడు, నేను చూసుకోకుండా గడప మీద ఉన్న చెంబుని తన్నాను... చీమ చిటుక్కుమంటేనే లేచే వాసుగాడు లేవకపోయేసరికి చిన్నగా వాడి ముందుకి వెళ్లి చూసాను... వాడు లేచే ఉన్నాడు కానీ రూమ్ లో ఇంకా ఏం ఏం సౌండ్స్ వస్తున్నాయో అన్నీ చిటికిన వేలితో లెక్కపెట్టుకుంటున్నాడు.... కళ్ళు తెరవకుండానే నా పౌడర్ వాసన చూసి "ఇంకెంత సేపు చూస్తావురా అన్నయ్యా అంత అందంగా ఉన్నానా?" అన్నాడు.... అప్పటి నుంచి అందరిని వాడు గమనిస్తుంటే నేను వాడిని గమనించడం మొదలుపెట్టాను ఆ తరువాత వాడు ఇక అంతేలే అని వదిలేసాను... అంతే.. అని సింపుల్ గా చెప్పి బైటికి వెళ్ళిపోయాడు.

దోమతెరలో పడుకుని ఉన్న వాసు దెగ్గరికి వెళ్లి తన పక్కనే పడుకుంది జానకి.

వాసు : ఏంటే అమ్మా గాలి ఇటు మళ్ళింది?

జానకి : నిన్ను చూస్తుంటే భయంగా ఉందిరా...

వాసు : దేనికి అన్నయ్య నా గురించి చెప్పిన నాలుగు పిచ్చి మాటలకా?

జానకి : వాడు మాట్లాడినప్పుడు నువ్వు లేవుగా నీకెలా తెలుసు?

వాసు : అన్నయ్య చెప్పిందాంట్లో నేను గమనించడం తప్ప మిగతాయి అన్నీ ఉట్టి మాటలే... చిటికిన వేలుతో సౌండ్లు లెక్కేయ్యటాలు, కుక్కలాగా వాసన చూడటాలు ఇలాంటివి నేను చెయ్యను.
మనిషినే భయపడకు.

జానకి : సరే ముందు వాడు మాట్లాడిన మాటలు ఎలా విన్నావో అది చెప్పు.

వాసు : అమ్మో.... షేర్లక్ హోమ్స్ టెక్నీక్స్ ఎప్పుడు బైటికి చెప్పడు.

జానకి : ఏడిసావ్ లే... అని లేవబోయింది.

వాసు : అమ్మా ఇవ్వాళ నా దెగ్గర పడుకోవా?

జానకి వాసుని ఒక సారి చూసి వెనక్కి వాలింది, అది గమనించిన వాసు.

వాసు : సరే వద్దులే పో మీ ఆయన వెయిట్ చేస్తుంటాడు..

జానకి : ఆయనకి ఓ మాట చెప్పి వద్ధామని లేచా... ఎదవా...

మెల్లగా అమ్మ పెదాలు పిండుతూ తనఙ్ కరుచుకుని మాట్లాడుతున్నా, ఇంతలో అమ్మ...

జానకి : వాసు శృతి గురించి చెప్పు తనకి నీకు ఏంటి అంత చనువు?

వాసు : చాలా మంచిది మా... నాకంటే పెద్దది అయిపోయింది కానీ లేకపోతే శృతినా పద్మనా అని బుర్రబద్దలు కొట్టుకోవాల్సి వచ్చేది...

జానకి : అంత ఇష్టమా?

వాసు : చాలా... తనతో ఉంటే నువ్వు కూడా గుర్తురావు అప్పుడప్పుడు అమ్మలాగ చూసుకుంటుంది... అమ్మా... తన పెళ్ళికి అయ్యే ఖర్చులు మనం పెట్టుకుందామే... నాన్నతొ మాట్లాడవు ఈ ఒక్కటి చేయి నువ్వు ఏం చెప్పినా కాదనకుండా చేస్తా ప్లీసే....

జానకి : దీనికోసమేనా నన్ను పిలిచింది.

నేను నవ్వాను...

జానకి : సరే... నాన్నకి నేను చెప్తాలే కానీ ఒక ముద్దు ఇస్తేనే..

వాసు : మా బంగారం... అని బుగ్గ మీద ముద్దు ఇచ్చి అమ్మని వాటేసుకుని పడుకున్నా...

(∞)(∞)(∞)(∞)(∞)(∞)(∞)(∞)(∞)(∞)(∞)(∞)

"రేయ్ లెగు... రేయ్ నిన్నేరా లెగు.." అని ఎవరో అరికాళ్ళ మీద లాఠితొ కొడుతుంటే లేచా...

"రారా... నీ యబ్బ " అని జుట్టు పట్టుకుని పక్కనే ఉన్న బెంచ్ ఎక్కించి కట్టేసారు...

Si : ఎన్నో రౌండు...

కాన్స్టేబుల్ : ఇప్పుడు ఇది మూడో రౌండ్ సర్.

జుట్టు పట్టుకుని తల అటు ఇటు తిప్పి ఇంకో రెండు రౌండ్లు వెయ్యొచ్చు, అయిపోయాక మీరు వెళ్లిపోండి.

కాన్స్టేబుల్ : సార్ నిండా పద్దేనిమిది ఏళ్ళు కూడా నిండలేదు చచ్చిపోతాడు సార్.

Si : చిన్న పిల్లోడా... నాలుగు హత్యలు చేసాడు వాడు...నీకు చిన్న పిల్లోడి లాగ కనిపిస్తున్నాడా?

అస్సలు కనికరం చూపించొద్దు... రాజేష్ నువ్వు పర్సనల్ గా తీసుకో వీడు చంపింది నా అన్నని అస్సలు వద్దలోద్దు వీణ్ణి అంటూ పళ్ళు కొరికి వెంటనే నవ్వాడు పక్కనే ఉన్న కారం నా వీపు మీద పోస్తూ...

మంటకి కేకలు పెట్టాను...

Si : "నేను చెప్పేంత వరకు వీడికి అన్నం కూడా పెట్టొద్దుఅని నా కళ్ళలోకి చూస్తూ "బాయ్ వాసు" అని వెక్కిరిస్తూ వెళ్ళాడు.
Like Reply


Messages In This Thread
RE: సీతా.....! రామ్ - by Rajeraju - 05-05-2022, 05:10 PM
RE: సీతా.....! రామ్ - by Rajeraju - 05-05-2022, 05:11 PM
RE: సీతా.....! రామ్ - by Thorlove - 05-05-2022, 05:35 PM
RE: సీతా.....! రామ్ - by Alpha@84 - 05-05-2022, 05:49 PM
RE: సీతా.....! రామ్ - by svsramu - 05-05-2022, 06:08 PM
RE: సీతా.....! రామ్ - by sailuhot - 05-05-2022, 07:00 PM
RE: సీతా.....! రామ్ - by Dhamodar - 05-05-2022, 07:27 PM
RE: సీతా.....! రామ్ - by naga8121 - 05-05-2022, 07:50 PM
RE: సీతా.....! రామ్ - by Lraju - 05-05-2022, 08:32 PM
RE: సీతా.....! రామ్ - by Uday - 05-05-2022, 09:20 PM
RE: సీతా.....! రామ్ - by Pallaki - 05-05-2022, 10:18 PM
RE: సీతా.....! రామ్ - by Dhamodar - 05-05-2022, 09:23 PM
RE: సీతా.....! రామ్ - by Pallaki - 05-05-2022, 10:20 PM
RE: సీతా.....! రామ్ - by Pallaki - 05-05-2022, 10:21 PM
RE: సీతా.....! రామ్ - by vg786 - 05-05-2022, 10:03 PM
RE: సీతా.....! రామ్ - by kummun - 05-05-2022, 10:08 PM
RE: సీతా.....! రామ్ - by Pallaki - 05-05-2022, 10:22 PM
RE: సీతా.....! రామ్ - by Pallaki - 05-05-2022, 10:26 PM
RE: సీతా.....! రామ్ - by Pallaki - 05-05-2022, 10:29 PM
RE: సీతా.....! రామ్ - by Pallaki - 05-05-2022, 10:29 PM
RE: సీతా.....! రామ్ - by Zen69 - 05-05-2022, 10:47 PM
RE: సీతా.....! రామ్ - by BR0304 - 05-05-2022, 10:54 PM
RE: సీతా.....! రామ్ - by Thorlove - 05-05-2022, 11:27 PM
RE: రాణి.....! రామ్ - by Pallaki - 06-05-2022, 03:52 AM
RE: రాణి.....! రామ్ - by kummun - 06-05-2022, 06:42 AM
RE: రాణి.....! రామ్ - by kummun - 06-05-2022, 06:34 AM
RE: రాణి.....! రామ్ - by Akmar - 06-05-2022, 06:43 AM
RE: రాణి.....! రామ్ - by Thorlove - 06-05-2022, 07:34 AM
RE: రాణి.....! రామ్ - by Pallaki - 06-05-2022, 09:02 AM
RE: రాణి.....! రామ్ - by Pallaki - 06-05-2022, 09:21 AM
RE: రాణి.....! రామ్ - by Pallaki - 06-05-2022, 09:28 AM
RE: రాణి.....! రామ్ - by kummun - 06-05-2022, 09:37 AM
RE: రాణి.....! రామ్ - by Pallaki - 06-05-2022, 09:46 AM
RE: రాణి.....! రామ్ - by Pallaki - 07-05-2022, 03:23 AM
RE: రాణి.....! రామ్ - by Pallaki - 06-05-2022, 09:44 AM
RE: రాణి.....! రామ్ - by sarit11 - 06-05-2022, 09:59 AM
RE: రాణి.....! రామ్ - by solomon - 06-05-2022, 10:39 AM
RE: రాణి.....! రామ్ - by utkrusta - 06-05-2022, 04:53 PM
RE: రాణి.....! రామ్ - by Dhamodar - 06-05-2022, 07:10 PM
RE: రాణి.....! రామ్ - by mahi - 07-05-2022, 03:07 AM
RE: రాణి.....! రామ్ - by Pallaki - 07-05-2022, 03:15 AM
RE: రాణి.....! రామ్ - by sarit11 - 10-05-2022, 11:44 AM
RE: రాణి.....! రామ్ - by Pallaki - 10-05-2022, 01:14 PM
RE: వాసు గాడి వీర గాధ - by Pallaki - 16-06-2022, 02:03 PM



Users browsing this thread: 119 Guest(s)