Thread Rating:
  • 5 Vote(s) - 2.6 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
కధా స్రవంతి ❤️
#40
చినుకు అంత ప్రేమ


నా జీవితంలో చాలా మందిని ప్రేమిస్తున్నాననుకుని వాళ్ళ వెంట పడి తిట్లు, గొడవలు ఆఖరికి చెప్పు దెబ్బలు కూడా తిన్నాను.

IIT టాప్ ర్యాంక్ లో పాస్ అయిన నేను, కాలేజీని పూర్తి చేసుకుని మంచి జీతం గల ఉద్యోగం సంపాదించిన నాకు ఒక అమ్మాయిని ప్రేమించడం రాలేదా అనుకున్నాను.

ఎంత మంది అమ్మాయిలకి ప్రొపోజ్ చేసి ఒప్పించినా పది రోజుల కంటే ఎక్కువగా నాతో ఎవరూ ఉండలేకపోయారు.

తప్పు నా వైపు ఉందొ వాళ్ళ వైపు ఉందొ నాకు ఇంకా అర్ధం కావట్లేదు.

నేను ఆకర్శించే ప్రేమ కోసం అబద్ధాలు ఆడలేను
తన కోసం అనవసరమైన మాటలు, పొగడ్తలు పొగడలేను
గంటలు గంటలు ఫోన్ లో మాట్లాడలేను
రోజంతా నా పనులు వదిలేసుకుని ఊరంతా తిప్పలేను
ఎక్కడ పడితే అక్కడ నలుగురిలో ముద్దులు పెట్టలేను
అమ్మా నాన్నలకి చెప్పకుండా ఇలా దొంగచాటు వ్యవహారాలు నడపలేను

ఇలాంటివి చెప్పుకుంటూ పోతే నాలో బోలెడన్ని లోపాలు....

కానీ ఒకటి మాత్రం నిర్ణయించుకున్నాను, ఇక ఎవ్వరి వెంట పడను, అందరి వెంటాపడి ఓడిపోడం కన్నా నాకోసం వెతుక్కుంటూ వచ్చే ఒకరి కోసం ఎదురుచూసి గెలవాలనుకున్నాను అప్పటివరకు ఒంటరిగానే ఉంటాను.

నేను వెతుక్కుంటూ పోయే నల్లటి మబ్బు కన్నా నన్ను కరుణించే ఒక్క వాన చినుకు చాలు కదా....

❤️❤️❤️
❤️
Like Reply


Messages In This Thread
RE: కధా స్రవంతి ❤️ - by Takulsajal - 14-06-2022, 09:15 PM



Users browsing this thread: 11 Guest(s)