12-06-2022, 07:37 PM
(This post was last modified: 15-06-2022, 06:26 AM by Pallaki. Edited 3 times in total. Edited 3 times in total.)
నవ్వుల సవ్వడి
పెళ్లి చూపులకి రమ్మని బెదిరింపులు, అవసరమైతే రౌడీలని పెట్టించి కొట్టించి మరీ పెళ్లి చేస్తానన్నాడు మా నాన్న.
సక్సెస్ లేని నా జీవితానికి పెళ్లి ఎందుకన్నాను, పెళ్లి చేసుకుంటే సక్సెస్ అదే వస్తుందని మా అమ్మ నమ్మకం దాని వల్ల చాలా గట్టిగానే అందరూ కలిసి నా మీద ఒత్తిడి తెచ్చి నన్ను పెళ్లి చూపులకి బైలుదేరెలా చేశారు.
నా ఆశలన్నీ ఆవిరైపోయి.... చేసిన అన్నీ ప్రయత్నాలలో ఓడిపోయి అలిసిపోయి పడుకుండి పోయిన నా చెవులకి...
అటు పక్క పల్లీలు అమ్మేవాడు
ఇటు పక్క చాయ్ అమ్మేవాడు
ఇంకోపక్క సమోసాలు అమ్మేవాడు
ఇంకో పక్క ట్రైన్ బయలుదేరుతుందన్న అనౌన్స్మెంట్
ప్రయాణికులు బుక్ చేసుకున్న బెర్తుల కోసం పడే హడావిడి
అన్ని శబ్దాలు ఒకే సారి నా మీద కక్ష కట్టినట్టున్నాయి
నా నిద్ర చెడింది
కళ్ళు మూసుకునే అన్నీ వింటూ ట్రైన్ ఎప్పుడు కాదులుతుందా అని అసహనంగా ఎదురు చూస్తున్నాను.
ఇంతలో నా చెవులకి గజ్జల సవ్వడి వినిపించింది, ఆ సవ్వడి వెనకాలే ఒక నవ్వు వినిపించింది.
నా చెవులు మిగతా శబ్దాలన్నిటిని పెడ చెవిన పెట్టి ఆ నవ్వులు మాత్రమే వింటున్నాయి.
నా బెర్త్ ముందే అనుకుంటా నలుగురి స్వరాలు వినిపిస్తున్నాయి, ఆ నలుగురిలో ఒక్కరి నవ్వులు మాత్రమే నా మనసు పదే పదే కోరుకుంటుంది.
మనసులో ఎలా ఉందంటే "నవ్వు... నవ్వు... ఇంకా గట్టిగా నవ్వు...."అని అరుస్తుంది.
కొంత సేపటికి ఆ తీయటి తేనె వంటి స్వరం నుంచి కొన్ని ముత్యాల్లాంటి మాటలు వింటున్న నాకు నిద్ర వచ్చేస్తుంది...ప్రశాంతమైన ఆ స్వరం వెనుక ఎంతో నిజాయితీ కల్లా కపటం తెలియని తనం నాకు తెలుస్తూనే ఉన్నాయి.
కళ్ళు తెరిచి చూసి తను బాగున్నా బాగాలేకపోయినా పరవాలేదు కానీ ఎక్కడ తనని ప్రేమిస్తానేమో అని భయపడి అలానే కళ్ళు మూసుకున్నాను.
సక్సెస్ లేని నాకు ప్రేమించే హక్కు లేదని నా నమ్మకం కానీ ఇప్పుడు అది ఏ కోశానా అర్ధవంతంగా కనిపించటం లేదు, ఇన్ని రోజులు నేను నమ్మిన నమ్మకం పిచ్చిదిగా తోచింది.
ట్రైన్ స్టేషన్ లో ఆగింది లేచి వాళ్ళని చూడకుండానే తల వంచుకుని... పెళ్లి చూపులు చూడటానికి వెళ్లాను.
ఇంట్లోకి వెళ్లి కూర్చున్నాను అమ్మాయిని చూడనైనా చూడలేదు... నా మనసులో ఇంకా ఆ నవ్వుల సవ్వడి చిన్నపిల్లాడు పట్టుకున్న గాలిపటంలా ఇంకా పరిగెడుతూనే ఉంది...
ఇంతలో అందరూ నవ్వడంతొ తల ఎత్తాను ఆశ్చర్యంగా ఎందుకంటే ఇన్ని నవ్వులలో నాకు నచ్చిన ఆ నవ్వు వినిపిస్తుంది, ఎవరిదా అని చుట్టూ చూసాను నా చూపులు అన్నీ వెతికి చివరికి పెళ్లి చూపులకి చూడటానికి వచ్చిన అమ్మాయి దెగ్గర ఆగిపోయాయి.
ఇద్దరి కళ్ళు కలుసుకున్నాయి, అంతే మరొకసారి ఓడిపోయాను సిగ్గు ఎగ్గూ వదిలేసి ఏ పెళ్లి ఐతే వద్దని గొడవ గొడవ చేసానో....చివరికి మా ఇంట్లో వాళ్ల అందరి కాళ్ళు పట్టుకుని మరీ పెళ్లి చేసుకున్నాను.
ఇప్పుడు ప్రశాంతంగా శోభనం గదిలో కళ్ళు మూసుకుని పడుకున్న నాకు.. మళ్ళీ తను గదిలోకి వస్తూ ఆ నవ్వులని తెచ్చింది.
లేచి కూర్చున్నాను మనసులోని నా నవ్వులని తనతో పంచుకోడానికి.....
❤️❤️❤️
❤️