11-06-2022, 03:31 PM
(10-06-2022, 11:20 AM)బర్రె Wrote: ప్రశ్న : శియా vs సున్ని... యుద్ధం ఎలా మొదలైయింది... ముందు యుద్ధం రాబోతుందా.... Orthodox vs catholic vs protestants... Shivaism vs vishunism... లాగా ఇది కూడా నా.....
మంచి ప్రశ్న మిత్రమ బర్రె. మతం ఐనా రాజకీయం ఐనా వర్గాధిపత్య పోరు తప్పదు కదా సంస్థాపకుడు పోయాక. అలాగే జరిగింది మహమ్మద్ ప్రవక్త పోయిన వెంటనే. ఆ స్థానం నాకు అంటే నాకు అని ఆయన అల్లుడు మరియు మామయ్య కొట్టుకున్నారని ఒక కథనం. మొత్తానికి రెండు వర్గాలుగా విడిపోయారు ఆ మతస్థులు. మూడు యుద్ధాలు కూడా అయ్యాయి. చివరికి ఒక వర్గం బాగా దెబ్బతింది కర్బలా (ప్రస్తుతం ఇరాక్) యుద్దములో. అందులో ఆ వర్గం నాయకుడు మరియు అతడి కుటుంబ సభ్యులంతా మృతిచెందారు. మిగిలిన వాళ్ళు పారిపోయారు. ఆ వర్గమే ఇప్పటి షియా. వీరు మొత్తం ముసల్మానులలో సుమారు 10-15% ఉంటారని ఒక అంచనా. ఖచ్చితముగా చెప్పడం అసాధ్యం ఎందుకంటే '' దేశాలు దాదాపు అన్నీ నిరంకుశ పాలనలో ఉన్నవే మరి అలాంటి పరిస్థితులలో నా మతం లేక నమ్మకం ఇది అని బాహాటముగా చెప్తే చంపేయబడే ప్రమాదం ఉంది కనుక బయటకి ప్రభువుల మతమే మాది అంటారు ప్రజలు కాని ఇంట్లో తమ ఇష్టదైవాన్ని లేక ఇష్టమైన మతాన్ని పాటిస్తారు. ఈ మతం మొదలైనది అరేబియా ఎడారిలో. పక్కనే ఉన్న ఇరాన్ ఇరాక్ దేశాలు సుసంపన్నవైనవి నదుల వలన. వారు ఈ ఎడారి ఆరబ్ లని జంతువుల లాగా భావించేవారు. అందుకే ఆ తక్కువ వాళ్ళ మతం మనం పాటించడమేమిటి అని షియా పద్ధతిని పాటిస్తున్నారు. అరేబియా దేశాలు ఎక్కువగా సున్ని. వీళ్ళే బాహుబలి లో కాలకేయుడి సైన్యం లాగా దూర ప్రాంతాలకి దోపిడి కి వెళ్ళి మతాన్ని వ్యాపింపజేసారు. అందుకే ఎక్కువ మంది సున్ని పద్ధతిని పాటిస్తారు. ఆ కర్బలా యుద్ధము లో వారి నాయకుడు చనిపోయిన రోజుని సంతాప దినము (మొహర్రం) గా పాటిస్తారు షియాలు. మగవారు నల్ల దుస్తులు ధరించి తమని తాము రక్తం వచ్చేలా కొట్టుకుంటారు. ఎవరి పిచ్చి వారికి ఆనందం అంటారు కదా అలాగే.
ప్రతి మతం మంచి ఉద్దేశం తో మొదలెడతారు కాని కాలం గడచిన కొద్ది రాజకీయం అందులోకి ప్రవేశిస్తుంది అప్పుడది వర్గ పోరు కి దారి తీస్తుంది.
ప్రతి మతం మంచి ఉద్దేశం తో మొదలెడతారు కాని కాలం గడచిన కొద్ది రాజకీయం అందులోకి ప్రవేశిస్తుంది అప్పుడది వర్గ పోరు కి దారి తీస్తుంది.