10-06-2022, 07:53 PM
(This post was last modified: 10-06-2022, 08:07 PM by Pallaki. Edited 1 time in total. Edited 1 time in total.)
లేఖ
ప్రియమైన శ్రీవారికి అని రాస్తుంటే నవ్వొస్తుంది,
చిన్నోడా... నా చిన్నా...
సంవత్సరానికి ఒక సారి వస్తావు
రెండు నెలలు ఉండి
కనుపాప లా నన్ను కాచుకుని పోతావు
మిగతా పది నెలలు నిన్ను తలుచుకుంటూ
నీ కౌగిలి గుర్తు తెచ్చుకుంటూ
నీ వెచ్చదనం ఊహించుకుంటూ
గడిపేస్తాను
వెళ్ళొస్తానని నువ్వు చెప్పినప్పుడల్లా
నా కళ్ళలో మడుగు అవుతుంది
నువ్వు ముద్దు పెట్టుకుని ఇంటి తలుపులు తీసి బైటికి వెళ్తుంటే
నా మనసు బీడు బారుతుంది
మళ్ళీ నువ్వొచ్చేవరకు నా మనసు నీ ప్రేమ వర్షంలో తడిసి కానీ చల్లారాదు
బిడ్డనైనా చూడలేదు కదా
అచ్చు నీ పోలికే
ఆరోగ్యంగా ఉన్నానంటున్నాడు
నిన్నో మాట అడుగుదామని ఈ లేఖ
నీ లాగే నీ బిడ్డని కూడా ఆర్మీకి పంపుతావేమో
నా లాగ ఇంకో ఆడ బిడ్డ ఇలా విరహ వేదన
చెందకూడదని చెప్తున్నా
అవును నేను స్వార్ధపరురాలినే..
నీ స్పర్శ కోసం
నీ తనువు కోసం
నీ మనసు కోసం
నీ ప్రేమ కోసం
నీ కోసం ఎదురు చూస్తూ వేయి కళ్ళతో...
నీ అమ్ములు ....
❤️❤️❤️
❤️
~ టక్కుల సాజల్