10-06-2022, 05:34 PM
స్వేచ్ఛ
(దొరికితే బాగుండు)
రాత్రి పన్నెండు గంటల ఇరవై రెండు నిమిషాలు, చీకట్లో రోడ్లన్నీ కార్లు బండ్ల లైట్లతొ వెలిగిపోతుంది, ట్రాఫిక్ లో హారన్ మోతలా ఉండే జీవితాలు, ఎంత పనిచేసినా సరిపోని జీతాలు ఈ లోకమే ఒక రేస్ ఏమో అనుకున్నాను కానీ నాకే ఆ రేస్ లో పాల్గొనే అవకాశం కూడా కలగలేదు, చుట్టూ చూస్తూ తూలుతూ వెళ్తున్నాను చినిగిన బ్లౌజ్..సగం చింపేసిన చీర నోట్లో నుంచి రక్తం అటు ఇటుగా కారుతుంది తల మీద ఎవడో రాడ్ తొ కొట్టాడు తల నొప్పిగా లేదు కానీ మత్తుగా ఉంది చెవి నుంచి రక్తం కారడం మాత్రం తెలుస్తుంది ఎందుకంటే చెవిలో రక్తం ఆగడం వల్ల చెక్కిలిగింతలు పెడుతున్నాయి అందరూ నన్ను చూసి అసహయ్యించుకుంటూ దూరం దూరంగా వెళ్తున్నారు ....అలా బ్రిడ్జి మీద నడుచుకుంటూ వెళ్తున్నాను, నడుస్తూ ఉండగా ఒక దెగ్గర ఆగిపోయాను ఇదే మంచి స్పాట్ అని... ఒకసారి కిందకి వంగి చూసాను ఎటు చూసినా నీళ్ళే కాకపోతే చాలా ఎత్తు ఉంది దూకడానికి కళ్ళు మూసుకున్నాను.....
నా జీవితమే ఒక శోకసంద్రం, అలుపెరుగని పోరాటాలతో నిండిన నా జీవితంలో నేను నవ్విన రోజులని వేళ్ళతో లెక్కపెట్టుకోవచ్చు అది కూడా ఏ కామెడీ సీన్ చూసో లేక ఇంకోటో తప్ప నాకంటూ నా మనసులో ఒక్కసారి కూడా సంతృప్తిగా, మనస్ఫూర్తిగా నవ్వుకున్న ఒక్క క్షణం కూడా లేదు.
పుట్టగానే మా అమ్మ చనిపోయిందని మా నాన్న చెప్పాడు మరి తనని నేను చంపేసానో లేక తాగడానికి డబ్బులు లేక మా నాన్న చంపేసాడో ఆయనకి తప్ప ఎవరికీ తెలియదు, నన్ను పదేళ్ళు పెంచడానికి (పెంచడానికి అనే బదులు తాగడానికి అంటే బాగుంటుందేమో) ఆయన అప్పులు చేస్తే ఆ అప్పులు తీర్చడానికి నన్ను పదేళ్ళకే పనుల్లోకి నెట్టేసాడు... ఆ తరువాత పదిహేనేళ్ళకి నన్ను అమ్మేసాడు అక్కడ నరకం చూసాను ఎవరు వస్తున్నారో ఎవరు పోతున్నారో, ఎవరు నా మీదకి ఎక్కుతున్నారో ఎవరు దిగుతున్నారో ... అస్సలు నా శరీరమే నాది కాదేమో అనిపించింది..కొరడా దెబ్బలు, వేడి వేడి కొవ్వొత్తి మైనపు చుక్కలు, గొలుసులు తాళ్లు, సహకరించకపోతే మత్తు మందు కూడా ఇచ్చేవారు... నాకు జ్వరం ఉందా ఒంట్లో బాగుందా లేదా అనేది కూడా ఎవరికీ అవసరం లేదు ఇక నా మనసు చూసేదేవరు.
నా ఇరవైయ్యో ఏట నన్ను ఒక రాజకీయ నాయకుడు కొనుక్కున్నాడు, ఆ డబ్బులు ఎవరి దెగ్గరికి వెళ్లాయో కూడా నాకు తెలీదు మూడేళ్లు నన్ను కుక్కలా వాడుకుని ఇంకొకరికి అమ్మేసాడు అప్పటికే ఒక బానిసనయ్యాను, వాళ్లు చెప్పినవి చేయడం కోసమే నేను పుట్టానేమో అనిపించింది.
అక్కడ నుంచి ఇంకొకడి దెగ్గరికి అక్కడనుంచి ఇంకొకడి దెగ్గరికి, ఇంకొకడి దెగ్గరికి... చివరి వాడికి నా మీద జాలి వేసిందో లేక నేను పనికిరాను అనుకున్నాడో లేక నన్ను కొనుక్కోడానికి ఎవరు రాలేదో తెలీదు నన్ను అర్ధరాత్రిలో నడి రోడ్డు మీద స్పీడ్ గా వెళ్తున్న కార్ నుంచి తొసెసాడు .
అక్కడ నుంచి నడుచుకుంటూ వస్తున్న నాకు ఏం చెయ్యాలో కూడా తెలీదు చదువు లేదు, పని రాదు ఒక్క బొమ్మలా మంచం మీద పడుకోడం తప్ప.
నడుచుకుంటూ వెళ్తున్న నన్ను బిచ్చగాళ్ళ గుంపు వెంబడించారు ఒకడు నన్ను పట్టుకుని పక్కకి లాగేసాడు నేనే నా గౌను ఎత్తాను ఆ గుంపులో ఉన్న ఎనిమిది మంది నన్ను అనుభవించారు కాదు కాదు వాళ్ళ సుఖం తీర్చుకున్నారు, కొన్ని రోజులు బిచ్చమెత్తిచ్చారు ఆ తరువాత ఏం జరిగిందో తెలీదు కానీ పోలీసోళ్ళు పట్టుకున్నారు స్టేషన్ లోనే మళ్ళీ అందరూ మీద పడిపోయారు వాళ్ళని మృగాలు అనాలని నాకు అనిపించలేదు నేనే ఒక రాయిలా మారిపోయాననుకోవచ్చు.
అక్కడనుంచి నన్ను నక్సలెట్ అన్నారు నా ఫోటోలు తీసుకున్నారు, సంవత్సరం పాటు జైల్లో జైలర్లు రౌడీలు సెక్యూరిటీ ఆఫీసర్లు, పై అధికారులు వాడుకున్న తరువాత నక్సలెట్స్ వచ్చి మమ్మల్ని కాపాడారు (అందులోనుంచి నన్ను ఆలోచించకుండా తీసేయొచ్చు)... రెండు సంవత్సరాలు వాళ్ళ చేతిలో నలిగాను ఆ తరువాత సెక్యూరిటీ ఆఫీసర్ల కాల్పుల్లో అందరూ పోయారు అడవి నుంచి బైటికి వచ్చి అక్కడ పరిచయం అయిన అమ్మాయి దెగ్గర మిషన్ కుట్టడం నేర్చుకుని చిన్న పూరి గుడిసెలో ఒకడి దెగ్గర పడుకుని మిషన్ సంపాదించి చిన్నగా పని చేసుకోడం మొదలు పెట్టాను రెండు నెలలు ప్రశాంతంగా బతికాను అంతే ఒక ఆటో వాడు వచ్చి నన్ను ప్రేమిస్తున్నానన్నాడు నా ఇష్టంతొ సంబంధం లేకుండా అనుభవించాడు పెళ్లి చేసుకున్నాడు తాగుబోతు అయ్యాడు వాడిని చూసాక నాకు నన్ను కన్నవాడు గుర్తొచ్చాడు అక్కడ నుంచి పారిపోయాను.
ఆటో వాడు వాడి స్నేహితులతో నన్ను వెతికి పట్టుకున్నాడు అందరూ కలిసి నన్ను వారం రోజులు అనుభవించారు అనేకంటే చిత్రహింసలు పెట్టారు నేను ఇంతకముందు చుసినవాటంత కావు కానీ నరకంలో చిన్న నరకం అనుకోవాలి... ఆ తరువాత నన్ను అమ్మేద్దాం అనుకున్నారు... రెండు నెలలు ప్రశాంతంగా బతికిన నా మనసు మళ్ళీ ఆ లోకంలోకి వెళ్ళడానికి ఒప్పుకోలేదు మొదటి సారి ఎదురు తిరిగాను అప్పటికే నన్ను అమ్మేసి బేరం మాట్లాడేసుకున్నారు... కొత్తగా నలుగురు వచ్చారు తీస్కెళ్లేముందు ఒక సారి రుచి చూద్దాం అని మాట్లాడుకోడం విన్నాను, నా జాకెట్ చించేసారు నా చీరని కత్తితొ కోశారు... ఎదురు తిరిగాను గింజకున్నాను నా చెంప మీద గట్టిగా ఒక పిడి గుద్దు కింద పడ్డాను కడుపులో కాళ్ళతో తన్నారు పక్కనే ఉన్న సీసా పెంకు అందుకున్నాను ఎవడో నా దెగ్గరికి వచ్చాడు వాడికి కోసుకుందేమో చేతిలో ఉన్న రాడ్ తొ గట్టిగా తల మీద కొట్టాడు... పక్కనే ఉన్న చెత్త కుప్పలో పడ్డాను... సెక్యూరిటీ అధికారి సైరాన్ వచ్చేసరికి అందరూ పారిపోయారు ఇదే అదును అని లేవలేక పోయినా ఓపిక తెచ్చుకుని లేచాను నా చింపిరి జుట్టు అంచుల నుంచి ఎర్రగా రక్తం కారడం చూస్తూనే ఉన్నాను.. తల పట్టేసింది.. చిన్నగా రోడ్ ఎక్కాను ఎదురుగా బ్రిడ్జి కనిపించింది నేను ఎవరి చేతికి చిక్కినా ఆ తరువాత ఏం జరుగుతుందో నాకు తెలుసు అందుకే నా ఈ మనసుకి స్వేచ్ఛని ప్రసాదించాలనుకున్నాను... తులుతూనే నడుస్తున్నాను...
మళ్ళీ కళ్ళు తెరిచే లోపే నా జీవితం అంతా రెండు సెకండ్లలో గిర్రున తిరిగింది, తలలోంచి కళ్ళలోకి రక్తం కారి నా కన్నీళ్లతో కలిసిపోయి బుగ్గంచున కారుతున్నాయి... నీళ్ళని చూసాను...
ఈ ముసళ్ల కొలనులో నలిగిన తామరనై పోతినే అనుకున్నాను తామర పువ్వు అయినా కదలకుండా ఉంటుంది నాకు ఆ అవకాశం కూడా ఇవ్వరు, ఈ నరకలోకంలో ఉన్న నా మనసుకి స్వేచ్చనివ్వాలాని వెనుక ఎవరో పిలుస్తున్నా కూడా పట్టించుకోకుండా కిందకి దూకేసాను...
సమాప్తం
❤️❤️❤️
❤️
~టక్కుల సాజల్❤️