08-06-2022, 09:35 PM
(This post was last modified: 08-06-2022, 09:38 PM by Pallaki. Edited 1 time in total. Edited 1 time in total.)
7
ఇంట్లోకి వెళ్లి సరాసరి నేరుగా సలీమా దెగ్గరికి వెళ్లాను, కాలీగా కూర్చుని ఉంది.
విక్రమ్ : ఇంకా పడుకోలేదా?
సలీమా : లేదు, ఎటు వెళ్లి వస్తున్నావ్ ఇంత అర్ధ రాత్రి ఏదో జరుగుతుంది ఏంటది నాకు తెలియాలి.
విక్రమ్ : సలీమా....
సలీమా : ఆ... చెప్పు, ఇన్ని రోజులకి నేను గుర్తొచ్చానా అయిపోయాయా నీ ప్రేమ తిరుగుళ్ళు. మొత్తానికి ఏదో పని పెట్టుకునే వచ్చావ్.
విక్రమ్ : రేపు మానసకి మన ఊరు చూపిస్తా అన్నా..
సలీమా : చూపించు దాంట్లో ఏముంది?
విక్రమ్ : నీ చేతుల్తో బిర్యాని చేస్తే....
సలీమా : అదా సంగతి, మనం వంట చేసుకున్న రోజులు తనకీ పంచుతున్నావా?
విక్రమ్ : వద్దా?
సలీమా : సరేలే... బిర్యానీ చాలా ఖీర్ కూడా కావాలా?
సలీమా ని కౌగిలించుకుని "థాంక్స్ యే ఎక్కడ కోప్పడతావేమో అని భయపడ్డాను".
సలీమా : ఇంతకీ ఎక్కడ వేస్తున్నారు మకాం.
విక్రమ్ : ఎవ్వరికీ చెప్పకూడదు మరీ...
సలీమా : హా చెప్పను, ఎక్కడా?
విక్రమ్ : మన పొలంలోనే మధ్యలో చిన్న గుంట ఉందిగా అందులోనే... సలీమా ఎవ్వరికీ చెప్పొద్దు ముందే చెప్తున్నా..
సలీమా : చెప్పాను లేరా పో...
విక్రమ్ బైటికి వెళ్లిన వెంటనే మంచం వెనకాల దాక్కున్న కావ్య లేచింది...
సలీమా : చూసావా అమ్మ పొలంలో అంట, అని సైగ చేసి నవ్వింది.
కావ్య : సలీమా భుజం మీద కొట్టి...నా కొడుకు బంగారం నవ్వుతూ అని సైగ చేసింది.
సలీమా : చూద్దామా రేపు విక్రమ్ మానసకి ముద్దు పెడతాడు.
కావ్య : నాకు తెలిసి వాడికి సిగ్గు ఎక్కువ పెట్టడు.
సలీమా : బెట్.
కావ్య : ఆలోచిస్తూ ఓడిపోతానని తెలిసినా సరే బెట్ అంది.
సలీమా రూమ్ లో నుంచి గాజుల చప్పుడు తెగ వినిపిస్తుంటే అనుకున్నాను ఏంటి వీళ్ళు ఇద్దరు తెగ మాట్లాడేసుకుంటున్నారు అని లోపలికి వెళ్లాను నన్ను చూసి మాములుగా కూర్చున్నారు.
విక్రమ్ : ఈ మధ్య బాగా గుస గుసలాడుకుంటున్నారు నాకు తెలీకుండా రహస్యాలు మెంటైన్ చేస్తున్నారా?
కావ్య : నువ్వు మాతో ఉంటే తెలుస్తాయి, నీకు చాలా పనులున్నాయి కదా..
విక్రమ్ : ఇవ్వాళ ఒక్క రోజే లేట్ అయ్యింది కద మా అలా మాట్లాడకు నాకు బాధగా ఉంటుంది నాకు ఎవరైనా నీ తరువాతే..
అమ్మ లేచి వచ్చి నన్ను హత్తుకుని, నా వీపు నిమిరింది... "నువ్వు కూడా రా అలా చూడకు" అన్నాను. సలీమా కూడా మా ఇద్దరినీ కరుచుకుంది... "మరి నేను" అని వెనక నుంచి నాన్న మాటలు వినిపించాయి, ఆయన కూడా వచ్చి మాలో కలిసిపోయాడు.
విక్రమ్ : ఈ గుంపులో మానసకి కూడా చోటు ఉందిగా? అని నాన్న వంక చూసా...
ఆయన కొంత అయోమయంగా చూసాడు ఇంతలో అమ్మ నేను చెప్పానుగా ఇందాక అని సైగ చేసింది.
నాన్న : హా..హా...కత్చితంగా మధ్యలో గ్యాప్ ఉందిగా అది తనకే... ఇప్పుడు ఓకే నా...?
వెంటనే నాన్నని కౌగిలించుకున్నాను "థాంక్స్ నాన్న" అంటూ...
కావ్య : ఇక పదండి ఇప్పటికే చాలా లేట్ అయ్యింది పడుకుందాం....
.......................................................................
తెల్లారి కాలేజీకి వెళ్ళాము అందరికీ టూర్ గురించి చెప్పారు ముందు భద్రాచలం చూసుకుని అక్కడ నుంచి లంబసింగిలొ ఒక రాత్రి స్టే చేసి అక్కడ నుంచి అరకు, బుర్రా కేవ్స్ మిగిలినవి చూసుకుని చివరికి వైజాగ్ వెళ్లాలని నిర్ణయించారు ఇదంతా విన్న నేను మానస ఒకరి వైపు ఒకరం చూసుకున్నాం.
కాలేజీలో ఇవ్వాళ మా గ్యాంగ్ మొత్తం విచిత్రంగా ప్రవర్తించడం గమనిస్తూనే ఉన్నాను నాకు తెలీకుండా ఏదో జరుగుతుంది..
సలీమాకి సైగ చేసాను అంతా ఓకేనా అని, ఇంటికెళ్లన తరువాత ఒక గంటన్నర టైంలో మొత్తం వండేస్తా అంది.. అలాగే అన్నాను
కాలేజీ అయిపోయిన తరువాత చందు గాడికి బైక్ ఇచ్చేసి నేను మానస తన కారులో సిటీకి దూరంగా ఉన్న పొలాల దెగ్గరికి వెళ్ళాం.
మానస : "అబ్బా ఎంత బాగుంది చల్లటి గాలి" అని పొలాల్లోకి పరిగెత్తింది.
తన వెనకే వెళ్లి కొంచెం సేపు ఆడుకుంది ఆ వాతావరణం మానసని చిన్న పిల్లలా మార్చేసింది.
మానస : విక్రమ్ బలే ఉంది నాకు పల్లెటూరు లోనే ఉండాలని ఉంది ఇలాగే....
విక్రమ్ : మా ఊరికి వెళదాం వస్తావా ఇంతకంటే బాగుంటుంది.
మానస : పదా వెళదాం.
విక్రమ్ : ఇప్పుడేనా వెళదాంలే ఇంకా చెప్పు.
మానస : మన పెళ్లి అయ్యాక మనం కూడా వ్యవసాయం చేద్దాం.
విక్రమ్ : నువ్వా....
మానస : ఏ నేను చెయ్యలేనా... మనమిద్దరమే కలిసి ఒక ఎకరంలో పంట వేసి పండిద్దాము.
విక్రమ్ : అలాగేలే....తధాస్తూ..
మానస నా ఒళ్ళో కూర్చుని...
మానస : ఇంతకీ ఏం ప్లాన్ చేసావ్... పెట్టుకోడం పెట్టుకోడమే మా నాన్నతొ గొడవ పెట్టేసుకుంటున్నావ్.. ఏమవుతదో ఏమో...
తన బుగ్గ మీద ముద్దు పెట్టుకుని "ఏం జరిగినా నిన్ను వదలనులే..." అన్నాను.
మానస : నాకు తెలుసు.
విక్రమ్ : పదా వెళదాం... అని కార్ ఎక్కించి మా ఊరికి బైలదేరాము.
(∞)=(∞)=(∞)=(∞)=(∞)=(∞)
విక్రమ్ స్నేహితులాంతా కలిసి బస్సు స్టాండ్ లో నిలబడ్డారు.
చందు : ఏంటే పొద్దున్న నుంచి ఒకటే గుస గుసలు ఇక ఇకలు పక పకలు, ఏం జరుగుతుంది?
పూజ : ఇవ్వాళ విక్రమ్ గాడు మానసని మన ఊరు తీసుకొస్తున్నాడట, సలీమాని వంట చెయ్యమన్నాడట అందుకే భరత్ తొ తొందరగా వెళ్ళిపోయింది.
చందు : అయితే అందులో ఏముంది?
పూజ : చెప్పేది విను... సలీమా కావ్యమ్మ ఇద్దరు విక్రమ్ మానసకి ముద్దు పెడతాడ పెట్టాడా అని బెట్ వేసుకున్నారు..
నేను సలీమా భరత్ గాడు ఒక వైపు ముద్దు పెడతాడని.... రమ్య, కావ్యమ్మ ఒక వైపు ముద్దు పెట్టడని... నువ్వు ఎవరి వైపు?
చందు : ఇప్పటి వరకు విక్రమ్ గాడి విషయంలో కావ్యమ్మ చెప్పింది ఎప్పుడైనా తప్పు అయ్యిందా నేను కావ్యమ్మ వైపే...
పూజ : చూద్దాం... వాడు ఇంతక ముందు విక్రమ్ కాదురోయ్ మారిపోయాడు...
రమ్య : చూద్దాం అందరూ రెడీ అయ్యి గట్టు దెగ్గరికి వచ్చేయండి... అక్కడ తెల్చుకుందాం.
(∞)=(∞)=(∞)=(∞)=(∞)=(∞)
నేను మానస మా ఊరు దాటి పొలాల వైపు వెళ్ళాము అందరూ ఇంత కాస్టలీ కారు మా ఊరు రావడంతొ అందరూ కారునే చూస్తున్నారు.
నేరుగా పొలాల వైపు తీసుకెళ్లాను మా పొలం దెగ్గర కారు ఆపి మానస చెయ్యి పట్టుకుని పొలం మధ్యలోకి తీసుకెళ్లాను, ఆల్రెడీ సలీమా గుంటలో పట్టలు వేసి శుభ్రంగా ఉంచి బిర్యానీ, ఖీర్, చల్లటి మంచినీళ్లు అన్నీ సెట్ చేసింది... చుట్టూ చూసాను ఎవ్వరు లేరు ఇద్దరం కింద కూర్చున్నాం.
అప్పటికే సాయంత్రం అయ్యింది కాలువలో నీళ్లు వదిలినట్టున్నారు మట్టి వాసన బాగా తెలుస్తుంది మానస ఇంకా చుట్టూ ఉన్న పచ్చదనంలో మైమరచిపోయింది...బిర్యానీ గిన్నె మూత తీసాను చల్లటి సాయంత్రపు గాలి బిర్యానీని ముద్దు పెట్టుకుని మా ముక్కులకి తగిలేసరికి ఆ మత్తుకి ఇద్దరి తలలు వంగి ఒకేసారి ఇద్దరం వాసన చూసి ఆ తరువాత ఒకరికొకరం చూసుకుని నవ్వుకున్నాం.
గిన్నెలో బిర్యాని మీద ఉన్న జీడిపప్పు తీసి మానసకి తినిపించాను, పేపర్ ప్లేట్స్ తీసుకుని ఒక ప్లేట్ లో వడ్డీంచి ఇంకో ప్లేట్ అందుకోగానే మానస ఆ ప్లేట్ ని గాల్లోకి విసిరేసింది. ఏదో వినిపించి చుట్టూ చూసాను.. కానీ ఎవ్వరు కనిపించలేదు..
కావ్యమ్మ తొ సహా అందరూ దాక్కుని విక్రమ్ మానసలని చూస్తున్న వారిని రమ్య "సైలెంట్ గా ఉండండి వాడు కనిపెట్టేస్తాడు" అని సన్నని గొంతుతో అంది.
బిర్యాని కలుపుతూ ముక్క అన్నంలో కలిపి ముద్ద మానస నోటికి అందించాను, లాప్పేడంత నోరు తెరిచింది.
విక్రమ్ : ముద్ద మాత్రమే పెడుతున్నాను ప్లేట్ కాదు అంత పెద్దగా తెరవనవసరం లేదు నీ నోరు.
మానస : నిన్నూ... పో నాకేం వద్దు నాది నేను తింటాను.
విక్రమ్ : సరే సరే రా... అని తనకి తినిపించాను..
వెంటనే మానస ఒక ముద్ద నాకు తినిపించింది, తన కళ్ళలోకి చూస్తూ తింటున్నాను.
మానస : ఎంత టేస్టీగా ఉందొ..
విక్రమ్ : మరీ చేసిందేవరనుకుంటున్నావ్ సలీమా..
ఇది వినగానే గుంపులో ఉన్న సలీమా చూసారా అని కాలర్ ఎగరేసింది తన చున్నీ పట్టుకుని..కావ్య సలీమా తల నిమిరింది.
భరత్ : నా సంధ్య కూడా నాకు అలా తినిపిస్తే ఎంత బాగుంటుందో... పొట్టి దానికి మెక్కడం తప్ప ఏమి తెలీదు... అందరూ నవ్వారు చిన్నగా...
బిర్యానీ తినేసిన తరువాత కొంచెం సేపు మానస నా ఒళ్ళో కూర్చుంది కొద్ది సేపు ముచ్చట్లాడుకుని ఖీర్ తాగాము, నేను అలానే మానస వంక గుడ్లు అప్పగించుకుని చూస్తుండడం చూసి..నా ఎదురుగా కూర్చున్న మానస ఏంటి అన్నట్టు నవ్వుతూ తల ఎత్తింది.
మానస పెదాలకి అంటుకున్న ఖీర్ నన్ను ఊరిస్తుంది తన నడుము పట్టుకుని దెగ్గరికి లాగి పెదాల మీద ఉన్న ఖీర్ నాకేసి తన రెండు పెదాలు అందుకున్నాను....
ఇంతలో.... పూజ గొంతు వినిపించింది...
పూజ : పెట్టేసాడే... పెట్టేసాడు నేను చెప్పానా? అని అరిచింది గట్టిగా...
మానస నేను ఇద్దరం ఉలిక్కి పడి లేచి చూసాము అమ్మ నడుం మీద రెండు చేతులు పెట్టుకుని చూస్తుంది... రమ్య నవ్వుతూ చూస్తుంది సలీమా సారీ అంటూ గట్టిగా నవ్వుతూ చెవులు పట్టుకుంది.. భరత్ చందు ఇద్దరు డీజే డాన్స్ వేస్తున్నారు పూజ వాళ్ళతో కలిసి డాన్స్ చెయ్యడం మొదలు పెట్టింది..
వెంటనే కిందకి వంగి మానసని కిందకి లాగాను ఇద్దరికీ సిగ్గుగా ఉంది, ఇద్దరం అలానే ఉండిపోయాం.....