06-06-2022, 04:54 PM
(06-06-2022, 11:21 AM)బర్రె Wrote: ప్రశ్న : మనకు కలి పురుషుడు ఉన్నట్టు... మ్లెచులకి.. డజ్జలdajjal,క్రీసవులకో సతన్ (satan) ఉన్నారు.... అన్ని ఒకటేనా... లేక కాపీ చేసారా?
మంచి ప్రశ్న మిత్రమ బర్రె. కలిపురుషుడు అసురుడు కాదు. కాలధర్మం ప్రకారం నాలుగు యుగములలో ఒకటైన కలి యుగం కి అధిపతి అంతే. ప్రాణం పోసేది బ్రహ్మదేవుడైతే తీసేది యమదేవుడు సనాతన ధర్మం ప్రకారం. వాయుదేవుడు వరుణ దేవుడు మొదలైన వారికి ఒక్కొక్క ఆధిపత్యం ఉన్నట్టు కలిపురుషుడికి కలియుగం ఆధిపత్యం ఉంటుంది. ఈ యుగాల చక్రం ఎన్నో సార్లు తిరిగింది తిరుగుతూనే ఉంటుంది. కొన్నాళ్ళకి కలి యుగం ఐపోతుంది. ఎన్నికల తరవాత ప్రధాని మారినట్టు యుగం ఐపోయాక కలిపురుషుడి ఆధిపత్యం పోయి కృతయుగం మొదలౌతుంది.
మ్లేచ్ఛుల వివరణ లో అంతా తికమకే ప్రశ్నకి ఆస్కారం లేదు. పుస్తకం లో ఏమి వ్రాయబడి ఉన్నదో అదే గుడ్డిగా పాటించవలెను. ఒకప్పుడు ఈ సైతాను అనే దైనదూత (angel) దేవుడి ప్రియ అనుచరుడు. ఐతే ఒకనాడు ఎప్పుడు ఒక్కడే దేవుడి గద్దె మీద ఉండాలా, వంతుల వారీగా స్వర్గములో ఉన్న వారందరు దేవుడి పదవిలో ఉండచ్చు కదా అన్న ఆలోచన కలిగింది అతడికి. ఆ ఆలోచన తన తోటి angels (దేవదూతలు) తో చెప్పాడు. మొత్తానికి ఇది దేవుడి వరకు వెళ్ళింది. రాచరికం లా సాగుతున్న స్వర్గం లో ప్రజాస్వామ్యం అన్న ధిక్కారపు ఆలోచన ప్రవేశపెట్టినందుకు ఆగ్రహించిన దేవుడు ఆ angel ఐన సైతాన్ ని నరకానికి తన్నాడు. ఆ సైతాను చెప్పిన ఆలోచన నచ్చిన వారు దేవుడి ఈ చర్యని ఖండించిన వారిని కూడా స్వర్గం నుండి బయటకి తన్నేసెను దేవుడు. వారంతా నరకములో పడ్డారు. మరి ముందే నరకము సృష్టించి ఉంచబడిందా అన్నది ఎక్కడా చెప్పలేదు.
రాజధిక్కారానికి చంపెయ్యకుండా దేవుడు సైతాను మరియు ఇతరులని ఇలా రాజ్యబహిష్కరణ ఎందుకు చేసినట్టో మరి తెలియదు. ఆ తరవాత కొన్నాళ్ళకి భూమిని సృష్టించిన దేవుడు తన లాంటి మనిషిని సృష్టించెను. అంతట ఆ సైతాను పగ తీర్చుకోవడానికి మనిషిని దేవుడికి విరుద్ధముగా ఉసిగొల్పుతూనే ఉన్నాడు. ఇది స్థూలముగా మ్లేచ్చ మతముల వివరణ దేవుడు మరియు సైతాను గురించి. ఇందులో ఎక్కడా ఆడవాళ్ళకి చోటులేదు. దేవుడు మరియు సైతాను ఇద్దరు మగవారే. తండ్రి కొడుకు పవిత్ర భూతం అనే ముగ్గురిలో కూడా ఆడవారు లేరు.
ఇలా ఎందుకు అలా ఎందుకు కాదు అన్న ప్రశ్నకి తావు లేదు. చర్చకి అస్సలు తావులేదు చర్చిలో. ఇలా ప్రశ్నలడిగినందుకే సైతాను నరకములోకి తన్నివేయబడెను కావున ఇంకెప్పుడు ఎవ్వరు అలా అడక్కూడదు అని చెప్పకనే చెప్పినట్టు. సనాతన ధర్మం లో ధర్మమే ముఖ్యము. ధర్మముని మించిన వారు ఎవ్వరు లేరు. అధర్మము ఎవ్వరు చేసినా శిక్ష తప్పదు. ఏ గ్రంథం చూసినా ప్రశ్నోత్తరములే. ఋషులని మునులు అడగటమో లేక శివుడిని వారు అడగటమో లేక పార్వతి దేవి శివుడిని అడగటమో లేక ఆది శక్తి అమ్మవారిని దేవతలు అడగటమో ఇలా ఏ అనుమానం వచ్చినా అది తీరేవరకు అడుగుతూనే ఉండాలని చెప్తున్నాయి పురాణాలు. ప్రశ్నోత్తరాల గురు శిష్య పరంపర మరి మ్లేచ్ఛులలో లేదు. అధ్యాపకుడు చెప్పినదే ప్రమాణికం ప్రశ్నించిన విద్యార్థి వీపుకి విమానం మోత తప్పదు.