04-06-2022, 03:31 PM
(04-06-2022, 12:25 PM)బర్రె Wrote: ప్రశ్న : తిరుమల లో గర్భగుడి లో సామాన్యుడు రావొద్దు అంటారు ఎందుకు... High vubrational freuqunecy ఉంటుంది అని తెలుసు కానీ ఎందుకు రానవ్వరు
తిరుమల లోనే కాదు మిత్రమ బర్రె. దాదాపు అన్ని ఆలయాలలో ముఖ్యముగా దక్షిణ భారత ఆలయాలలో సామాన్యులని గర్భగుడిలోకి రానివ్వరు. బహుశా ఎవరు ఎంత శుచిగా ఉన్నారో తెలుసుకోవడం కష్టం కదా. శరీరం మనసు శుభ్రముగా ఉండాలి కదా స్వామి వారి గర్భగుడిలోకి ప్రవేశించడానికి. ఉత్తర భారతములో ఎటువంటి నిబంధనలు ఉండవు దాదాపు అన్ని దేవాలయాలలో. ఐతే అలా అందరిని రానివ్వడం వలనే 95% దేవాలయాలు ధ్వంసం అయ్యాయి మ్లేచ్ఛుల వలన అని కొందరు అభిప్రాయపడతారు. దేవాలయ ప్రవేశం అందరికి ఉండాలి అన్నది న్యాయం కాని గర్భగుడిలోకి ప్రతి వారిని రానివ్వకూడదు అని కూడా విశ్వసిస్తాను. అంతెందుకు పురావస్తు ప్రదర్శన శాల కాని పుష్ప వనం ఉదాహరణలే తీసుకుందాము. అందరు ప్రవేశించచ్చు కాని ఆ వస్తువులకి/పువ్వులకి దూరముగా ఉండే చూడాలి తప్ప తాకకూడదు కదా. ఆ సంరక్షకులు మాత్రమే అనుమతించబడతారు. అలాగే అన్ని దేవాలయాలలో ఉంటే శ్రేయస్కరం అని నా అభిప్రాయం మిత్రమ.