Thread Rating:
  • 5 Vote(s) - 2.4 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
విక్రమ్ ~ లవ్ పార్ట్
6


మానస అమ్మ : ఏంటి మా అమ్మాయికి బట్టలు గిఫ్ట్ గా ఇచ్చావంట ఏంటి సంగతి?

విక్రమ్ : అది..

మానస అమ్మ : ఏంటి ప్రేమిస్తున్నావా? అని కోపంగా చూసింది..

నాకు అర్ధమైంది మానస వాళ్ల అమ్మ నన్ను ఆటపట్టిస్తుంది అని.

విక్రమ్ : లేదండి కాలేజీలో మీ అమ్మాయి వేసుకునే చిన్న చిన్న బట్టలు చూసి మీ దెగ్గర డబ్బులు లేవనుకుని కొనిచ్చాను కానీ ఇక్కడికి వచ్చాకే తెలిసింది అది ఫాషన్ అని.

మానస వాళ్ల అమ్మ నన్ను ఒకసారి తీక్షణంగా చూసి ఫక్కుమని నవ్వింది.

మానస అమ్మ : అది ఈ మధ్యే అలా తాయారయ్యింది..డబ్బు, వాళ్ల నాన్న పవర్ అన్నిటికి మించి సావాసాల వల్ల అలా ఉంది కానీ చాలా మంచిది, అంత రఫ్ గా ఉండే నా కూతురుని ఒక్క చూపులో మార్చేశావంట?

విక్రమ్ : మానస చెప్పిందా?

మానస అమ్మ : హ్మ్ అవును తనే చెప్పింది. కానీ నా కూతురుకి కొంచెం పొగరు ఎక్కువే....

విక్రమ్ : అది మీ అమ్మాయి అందానికి ఒక అలంకరణ లాంటిది లెండి.


మానస అమ్మ : ఏం  జరిగినా నిన్ను వదులుకోదట ఇది కూడా మానసే చెప్పింది..

సంతోషంగా "అవునా?" అన్నాను.

మానస అమ్మ : అంత ఆనందపడకు నువ్వు నా అల్లుడిగా రావడానికి నేనింకా ఒప్పుకోలేదు.

విక్రమ్ : అవన్నీ నాకు తెలీదు, నేను మీకు నచ్చాను అని మాత్రం నాకు తెలుసు, ఇక మానసతొ ఇంతవరకు ఏమి తెల్చుకోలేదు ఒక్కసారి తను నాతో మాట్లాడని.. ఇక మమ్మల్ని విడదీయడానికి దేవుళ్ళు దిగి వచ్చినా వాళ్ళ వల్ల కాదు..

మానస అమ్మ : నీ ధైర్యం చూస్తుంటే నాకు ఆనందంగా ఉంది కానీ నా భర్తని చూస్తుంటే భయంగానూ ఉంది.

విక్రమ్ : అవన్నీ నేను చూసుకుంటాను నన్ను ఆశీర్వాదించండి అమ్మా...

మానస అమ్మ : ఎమన్నావ్?

విక్రమ్ : అమ్మా అన్నాను.. నాకు మిమ్మల్ని అలానే పిలవాలనిపించింది.

....................................................................

అక్కడనుంచి జారుకున్న మానస రమ ఇద్దరు పార్టీ ఏరియాకి వెళ్లారు.. మానస సలీమా వాళ్లు కూర్చున్న దెగ్గరికి వెళ్ళింది.

మానస : హాయ్ రమ్య, సలీమా పూజ... హాయ్ అని చందు భరత్ ని చూసి పలకరించింది.

సలీమా : మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ అఫ్ ద డే మానస..

అందరూ విషెస్ చేశారు చివరికి విక్రమ్ అమ్మ కూడా విష్ చేసింది... కావ్య ఏదో సైగ చెయ్యటం సలీమా దానికి తిరిగి సైగ చేసి మానస వైపు చూసి..

సలీమా : మానస ఈ సారీ నీకు బాగా సూట్ అయ్యింది అని చెప్తుంది.

మానస : థాంక్స్ ఆంటీ.... సలీమా తను..?

సలీమా : తను కావ్య... విక్రమ్ వాళ్ల అమ్మగారు...

ఆ మాట వినగానే మానస ఆశీర్వదించమని కాళ్ళ మీద పడిపోయింది, కావ్య వెంటనే లేపి మానసని కౌగిలించుకుంది.

అటు విక్రమ్ మానస వాళ్ల అమ్మతొ మాట్లాడుతూ మానస గురించి తెలుసుకుంటుంటే ఇటు మానస విక్రమ్ వాళ్ల అమ్మతొ మాట్లాడుతూ విక్రమ్ గురించి తెలుసుకుంటుంది.

ఇంకో వైపు మానస వాళ్ల నాన్న ఫోన్లో...

శివరాం : రాబర్ట్ గారు ఎలా ఉన్నారు?

రాబర్ట్ : పలకరింపులు తరువాత నాకు యాభై మంది అమ్మాయిలు కావాలని ఆర్డర్ ఇచ్చాను ఏమైంది?

శివరాం : ఈ పదిహేనో తారీకు మీ చేతుల్లో ఉంటారు, బెంగుళూరు నుంచి మల్లేష్ ఇరవై మందిని ఇక్కడ నుంచి నేను ముప్పై మందిని పంపిస్తున్నాను కానీ చిన్న మెలిక ఉంది.

రాబర్ట్ : ఏంటది...?

శివరాం : నా దెగ్గర ఇరవై మంది రెడీగా ఉన్నారు... ఇక్కడ కాలేజీ తరపునుంచి పిల్లలు వైజాగ్ వస్తున్నారు వాళ్ళని ఏదైనా చేసి లంబసింగి వైపు వచ్చేలా చేస్తాను మీరు మిగతా కావాల్సిన పదిమందిని తీసుకుపోండి..

రాబర్ట్ : అలాగే.. ఈ పని అయినా కరెక్ట్ గా చెయ్యండి.

....................................................................

నేను మానస వాళ్ల అమ్మతొ మాట్లాడి అందరి దెగ్గరికి వచ్చేసరికి.. మానస, సలీమా ఇంకా అమ్మ మాట్లాడుకుంటున్నారు.. ఎందుకులే వాళ్ళని కదిలివ్వటం అని పూజ వాళ్ల దెగ్గరికి వెళ్లాను

అందరూ ఎల్లుండి గురించి మాట్లాడుకుంటున్నారు..

విక్రమ్ : ఏంటి రమ్య అందరూ ఎల్లుండి ఎల్లుండి అంటున్నారు ఏముంది ఎల్లుండి?

పూజ : ఇందాక కేక్ కట్ చేసేటప్పుడు నువ్వు లేవు కదా, మానస వాళ్ల నాన్న మన క్లాస్ వాళ్లందరిని వైజాగ్ టూర్ తీసుకెళ్తున్నారు అందుకే అందరూ ప్లానింగ్ లో ఉన్నారు..

పూజ ఇంకేదో మాట్లాడుతుంది కాని నాకు ఏం వినిపించడం లేదు.. ఎల్లుండి అంటే 15వ తారీకు ఆరోజే అమ్మాయిలని లంబసింగి తీసుకెళ్తున్నారు వీళ్ళకి చాలా ముఖ్యమైన పని కానీ అదే రోజు ఈ ట్రిప్ ప్లాన్ చేశారు ఏదో జరుగుతుంది అర్ధం కావట్లేదు.. అందరూ తినడానికి వెళ్తున్నారు..

విక్రమ్ : భరత్ ఇలా రా.. (అందరూ వెనక్కి తిరిగారు) మీరు వెళ్ళండి మేము ఇప్పుడే వచ్చేస్తాం..

భరత్ : ఏంట్రా? అవతల ఆకలేస్తుంటే..

విక్రమ్ : తరవాత తినొచ్చు రా బె..

ఇద్దరం కార్లో ఇంటికి వెళ్ళాం.. అక్కడనుంచి భరత్ కి కార్ ఇచ్చి తను కారులో నేను బైక్ మీద తిరిగి పార్టీకి వచ్చేసాం..

భరత్ : ఎందుకు రా ఇదంతా?

విక్రమ్ : నీకు లవర్ ఉంది గా ఆ మాత్రం తెలీదా..

భరత్ : ఓహో... ఓకే.. ఓకే... ఎంజాయ్..

విక్రమ్ : ఏడిసావ్ లే పదా..

భోజనానికి వెళ్లి తినేసి నానీ కోసం చూసాను కుర్చీలో కూర్చొని టాబ్ లో ఆడుకుంటున్నాడు..వెళ్లి పక్కన కూర్చున్నాను.

విక్రమ్ : హాయ్ నానీ..

నానీ : హాయ్ అన్నా..

విక్రమ్ : ఇందాక మానస కోసం అని నన్ను తీసుకెళ్ళావ్ కదా ఒకసారి మానసని అక్కడికి రమ్మని చెప్తావా?... నువ్వెళ్ళి రా ఈలోపు ఇందులో కొత్త గేమ్స్ ఇన్స్టాల్ చేసి ఇస్తాను...

నానీ వచ్చాక రెండు కొత్త గేమ్స్ వేసి తనకి ఇచ్చి ఇందాకటి ప్లేస్ దెగ్గరికి వెళ్లాను ఒక లైట్ ఉంటే ఆపేసాను ... మానస వచ్చింది వెంటనే ఎవ్వరు చూడకముందే తన చెయ్యి పట్టుకుని కర్టెన్ లోపలికి లాగాను... మానస ఆశ్చర్యంగా నన్నే చూస్తుంది..

మానస నడుం పట్టుకుని అటు ఇటు చూస్తున్నాను ఎవరైనా వస్తున్నారేమో అని తల అటు ఇటు తిప్పుతుంటే నా ముక్కు మానస ముక్కు రాసుకుంటున్నాయి.. మానస అలానే చూస్తుంది.

విక్రమ్ : మానస.. మానసా...

మానస : హా...

విక్రమ్ : నీ నెంబర్ ఇవ్వు..

మానస తన చేతిలో ఉన్న ఫోన్ ఇచ్చింది, నా నెంబర్ కి కాల్ చేసుకుని తనకి ఇచ్చేసాను..

విక్రమ్ : రాత్రి పన్నెండు ఇంటికి రెడీగా ఉండు, మాములు జీన్స్ టీ షర్ట్ వేసుకో.. ఇంకోటి అమ్మకి కూడా చెప్పొద్దు..

మానస ఆశ్చర్యంగానే "అలాగే" అంది..

విక్రమ్ : ఇక పదా..

మానస నీరసంగా "హ్మ్మ్ " అంది.... వెళ్తున్న తన చెయ్యి పట్టుకులాగి బుగ్గ మీద ముద్దు పెట్టాను.. "హ్యాపీ బర్త్ డే" చెప్తూ..

మానస నన్ను వాటేసుకుంది అలాగే ఉండిపోయాం.. కొంచెం సేపటికి విడిపోయి మానస వాళ్ల వాళ్లతొను నేను మా వాళ్ళతోనూ కలిసిపోయాం, ఆ తరువాత మానస వాళ్ల అమ్మని తీసుకొచ్చి అమ్మకి పరిచయం చేసింది వాళ్లు ఇద్దరు మాట్లాడుకోడానికి వెళ్లారు వాళ్ళకి మీడియేటర్ గా సలీమా వెళ్ళింది.

పూజ : మానస నీ ఫ్రెండ్స్ ఎక్కడా కనిపించలేదు.

మానస : వాళ్ళకి నాకు చిన్న గొడవ, అందుకే అలిగి రాలేదు.

విక్రమ్ : మంచిది.... (మానస నన్ను చూసింది వెంటనే దగ్గి) రమ్యా మంచినీళ్లు అందుకో....

పూజ : వాడంతేలే మానస.. ఇంతకీ టూర్ కి నువ్వు వస్తున్నావా?

మానస : అదేం ప్రశ్న మా నాన్న అరెంజ్ చేసిన టూర్ కి నేను రాకుండా ఉంటానా?

పూజ : అంటే మాతో వస్తావని ఊహించలేదు.. మీరు ఉన్నోళ్లు కదా..

రమ్య పూజ తల మీద ఒకటి మొట్టి "మానస మాతో కలుస్తానంటే అందరం ఒకే చోట బస్సు ఎక్కుదాం"

మానస : చూద్దాం మానస రేపు కాలేజీ లో చెప్తారుగా దాన్ని బట్టి ప్లాన్ చేద్దాం.

పార్టీ అయిపోయాక అందరం ఇంటికి బైలదేరాం, ఇంటికి వెళ్ళాక సలీమాకి పొట్ట నిండిపోయి ఇక నేను లేవలేను అని పడుకుండిపోయింది. అమ్మ తన రూమ్ లోకి వెళ్తూ కాలిని మూడు సార్లు తన్ని వెళ్లింది, పట్టీల శబ్దానికి అమ్మ పిలుస్తుందని లోపలికి వెళ్లాను అమ్మ పడుకుని ఉంది.

విక్రమ్ : ఏంటి మా?

కావ్య : స్పీడ్ స్పీడ్ గా సైగలు చేసింది దానికి గాజుల మోత తొడయ్యింది (మానస వాళ్ల అమ్మతొ మాట్లాడాను నాకు భయంగా ఉంది నీ గురించి).

విక్రమ్ : ఏం కాదు, నేనున్నాగా..

కావ్య : మళ్ళీ గాజుల మోత (ఒక్కగానోక్క కొడుకువి నువ్వు బాధ పడితే చూడలేము).

విక్రమ్ : తన నుదిటి మీద ముద్దు ఇచ్చి "ముందు ఈ గాజులు తీసేయ్" అని తన చేతికున్న గాజులు తీసి పక్కన పెట్టాను.. "ఏం కాదు కొన్ని కష్టాలు వస్తాయి అవి మీకు కొత్తేం కాదుగా?"

కావ్య : ఏమో.. ఇవ్వాళ నాన్నతొ దీని గురించి మాట్లాడతాను ముగ్గురం కూర్చుని ఒక నిర్ణయానికి వచ్చాకే ఏదైనా.

విక్రమ్ : మీరేం నిర్ణయం తీసుకుంటారో నాకు తెలీదు మానస నాకు కావాలి అంతే, ఒక వేళ నాన్న ఒప్పుకోకపోతే ఒప్పించు.

అని బైటికి వచ్చి నాన్నకి చెప్పి బైక్ తీసుకుని మానస వాళ్ల ఇంటి వీధి చివరికి వచ్చాను, మానస ఆల్రెడీ మొహానికి స్కార్ఫ్ కట్టుకుని నిల్చుని ఉంది.

మానస బండి ఎక్కి "పదా ముందు ఇక్కడనుంచి పోనీ"....

విక్రమ్ : బండి నడుపుతూ..."ఇంట్లో ఏమని చెప్పావ్?"

మానస : అమ్మ పడుకుంది, రమక్కకి చెప్పా మేనేజ్ చెయ్యమని.

విక్రమ్ : ఈ రమ ఎవరు మీ అక్కా? కానీ అలా లేదే..

మానస : అవును కానీ కాదు తను మా ఇంట్లో వంట పని చేస్తుంది..

విక్రమ్ : హో మీ ఇంట్లో పని వాళ్ళని కూడా సొంత మనుషుల్లా చూస్తారానమాట.

మానస : వీపు మీద కొట్టి "అయినా నేను నీతో మాట్లాడాను పో"

విక్రమ్ : ఎందుకు, నేనేం చేసాను?

మానస : మాట్లాడక మాట్లాడక మాట్లాడావ్, ఇన్ని రోజులుగా నువ్వు నాతో ఒక్క మాట కూడా మాట్లాడలేదు మొదటగా ఏం మాట్లాడతావా అని ఎన్ని కలలు కన్నానో కానీ వచ్చి నా నెంబర్ అడిగావు నీకు అస్సలు రొమాంటిక్ యాంగిల్ లేనే లేదు.

విక్రమ్ : అప్పుడున్న పని అలాంటిది లే...ఇప్పుడు వెళ్ళేది ఆ పని మీదే.. ఇంతకీ మీ నాన్న అడగలేదా?

మానస : లేదు అయన ఏటో వెళ్ళాడు ఎల్లుండి ఏదో ముఖ్యమైన పని ఉందని పని వాళ్లు మాట్లాడుకోగా విన్నాను..

ఇంతలో గ్రీన్ లోటస్ హోటల్ వచ్చింది...

మానస : ఏంటి ఇక్కడికి తీసుకొచ్చావ్ ఆపు ఆపు మా నాన్న ఇక్కడే ఉన్నాడు చుసాడంటే అంతే..

బండి పక్కన ఆపి మానస చెయ్యి పట్టుకుని చెట్టు వెనకాల నిలబడి తొంగి చూస్తున్నాం వాళ్ల నాన్న అక్కడున్న వాళ్ళతో మాట్లాడుతున్నాడు.

మానసని నా ఎదురు గా చెట్టుకి అనించి తన స్కార్ఫ్ తీసాను మానస ఇంకా ఏం అర్ధంకానట్టు ఫేస్ పెట్టింది తన బుగ్గ మీద ముద్దు పెట్టాను..

మానస : విక్రమ్ ఏంటి ఇది?

విక్రమ్ : "నువ్వేగా రొమాంటిక్ యాంగిల్ కావాలన్నావ్" అని టీ షర్ట్ లోకి చెయ్యి దూర్చి నడుముని పట్టుకున్నాను.

మానస : అబ్బా ఇప్పుడా..

విక్రమ్ : నడుము గిల్లి "మీ నాన్న చేసే ఘనకార్యం చూపిద్దామనే తీసుకొచ్చా" అని అటు తిప్పి తన మెడ మీదగా చూస్తూ వెచ్చగా ఉన్న మానస నడుము పట్టుకున్నాను.

కొంచెం సేపటికి వాళ్ల నాన్న వెళ్ళిపోయాడు అక్కడ ఉన్న వాళ్లు కూడా వెళ్లిపోయారు..

"పదా" అని మానస చెయ్యి పట్టుకుని తీసుకెళ్లి హోటల్ వెనకకి వెళ్ళాము అక్కడ నేను అనుకున్నట్టు గానే ఎవ్వరూ కాపలా లేరు... అక్కడ ఉన్న మెట్లు ఎక్కి లోపలికి వెళ్లి చివరి రూమ్ లోకి వచ్చాము... పక్క రూమ్ కి ఈ రూమ్ కి మధ్యలో గోడ ఉంది....అక్కడ నుంచి కిటికీ లోనుంచి బైటికి వచ్చి గోడకి ఉన్న పైప్ మీద నిలబడ్డాను... మానస నన్నే చూస్తుంది.

విక్రమ్ : చూస్తావేంటి రా..

మానస : ఆమ్మో నాకు భయం కింద పడితే?

విక్రమ్ : నేను లేనా నువ్వు పడితే నీతో పాటు నేను దూకేస్తాలే రా...

మానస చెయ్యి అందించింది, తన చెయ్యి పట్టుకుని చిన్నగా పైప్ మీద నిల్చోపెట్టి పక్క రూమ్ కిటికీ దెగ్గరికి చిన్నగా వెళ్ళాము గోడని పట్టుకుని...

కిటికీ గ్లాస్ కొంచెం తెరిచే ఉంది చిన్నగా స్లయిడర్ ని పక్కకి జరిపి మానసకి చూపించాను, మానస అది చూసి నన్ను అనుమానంగా చూసింది తన మొహానికి చెమటలు పట్టాయి.

అక్కడనుంచి మానసని తీసుకుని బైటికి వచ్చి ఆ ఏరియా నుంచి వచ్చేసాము..

మానస : బండి ఆపు.

బండి పక్కకి ఆపాను... మానస బండి దిగి....

మానస : ఏంటి నేను చూసింది? ఎవరు వాళ్లంతా?  ఎందుకు అలా ఉన్నారు?

విక్రమ్ : మీ నాన్న అమ్మాయిల స్మగిలింగ్ చేస్తున్నాడు అందుకే వాళ్ళని కట్టేసి ఉంచారు.

మానస : నువ్వు చెప్పేది నిజమా?

విక్రమ్ : మీ నాన్న గురించి నీకు తెలీదా?

మానస : తెలుసు కానీ మరీ ఇంత దూర్మార్గుడని తెలీదు..

విక్రమ్ : ఎల్లుండి ఆ అమ్మాయిలందరిని లంబసింగిలో రాత్రి పన్నెండిటికి అప్పగిస్తున్నారని తెలిసింది ..అడ్రస్ కూడా తెలుసు

మానస : ఇవన్నీ నీకెలా తెలుసు?

విక్రమ్ : మీ నాన్న మనుషులు మాట్లాడుకోగా విన్నాను అందుకే నీ కేక్ కటింగ్ చూడలేకపోయాను.

మానస : ఇప్పుడు ఏం చేద్దామని..

విక్రమ్ : ఈ ఊర్లో మీ నాన్నని ఎదిరించి వాళ్ళని కాపాడడం కష్టం, ట్రక్ మార్చేటప్పుడు అంత ఎక్కువ మంది ఉంటారని నేను అనుకోడంలేదు అక్కడే వీళ్ళని కాపాడాలి.

మానస : అందుకే మా  నాన్న నేను టూర్ కి వస్తానంటే ఒప్పుకోడం లేదు.

విక్రమ్ : నాకు ఇంకో డౌట్ ఉంది అక్కడ వాళ్ల స్మగిలింగ్ కి మనల్ని టూర్ కి పంపించడానికి ఏదో లింక్ ఉందని నాకు అనిపిస్తుంది నువ్వు ఏదైనా చేసి ఎల్లుండి టూర్ లో బస్సు ఎక్కు..ఇక నువ్వు చెయ్యాల్సింది మీ నాన్నకి డౌట్ రాకుండా దీని గురించి ఏమైనా తెలుసుకోగలవేమో ప్రయత్నించు...ఈ లోగా నేను ఏదో ఇకటి ఆలోచిస్తాను.... ఇక పదా నిన్ను ఇంటి దెగ్గర డ్రాప్ చేస్తాను.

మానస నన్ను కౌగిలించుకుని నా పెదాల మీద ముద్దు పెట్టేసింది ఇన్ని ఏళ్లలో చిన్నప్పుడు అమ్మ పెట్టిన ముద్దు తరువాత నేను అనుభవిస్తున్న తొలి ముద్దు.

ఒక నిమిషానికి మా పెదాలు విడిపోయ్యాయి నా దీనమైన మొహం చూసి మళ్ళీ ముద్దు పెట్టింది.

మానస : చాలా?

విక్రమ్ : ఉహు సరిపోలా..

ఉమ్ ఉమ్మ్ ఉమ్మా... "ఇంకా చాలా ఇస్తా నువ్వు వాళ్ళని కాపాడితే, వాళ్ళని కాపాడడమే నువ్వు నాకు ఇచ్చే నా తొలి బర్తడే గిఫ్ట్" అని హత్తుకుంది.

ఇద్దరం చేతిలో చెయ్యేసుకుని బండి దెగ్గరికి నడుస్తున్నాం రోడ్ అంతా కాళీ చల్లటి గాలి అక్కడక్కడా స్ట్రీట్ లైట్స్, గాలికి చెట్లకున్న ఒక్కొక్క ఆకులు రాలుతున్నాయి..

మానస : విక్రమ్ ఎ అమ్మాయికైనా తన బాయ్ ఫ్రెండ్ కనీసం తనకైనా హీరోలా ఉండాలి అనుకుంటుంది కానీ నువ్వు నిజంగా హీరోవే... ఇంత మంచివాడివి ధైర్యం కలవాడివి నిజంగా నువ్వు నా లైఫ్ లోకి రావడం నా అదృష్టం.

విక్రమ్ :..............

మానస : ఏం మాట్లాడవే నా గురించి ఏదైనా చెప్పు , నిన్ను పొగిడిన వాళ్ళని తిరిగి పొగడడం సంస్కారం.

విక్రమ్ : దాన్ని సంస్కారం అనరు ఇచ్చి పుచ్చుకోడం అంటారు, నువ్వు పొగిడితే నేను పొగడాలా? అయినా ఏముంది నీ దెగ్గర అందంగా ఉంటావన్న పొగరు తప్ప.

మానస : నిన్నూ... అని నా వెనక పరిగెత్తింది..

నేను తప్పించుకుని ముందుకి వెళ్లి రెండు చేతులు చాపాను.. పరిగెత్తుకుంటూ వచ్చి నా కౌగిలిలో చేరిపోయింది, తన గడ్డం లేపి "మంచిదానివి, దయ గల దానివి అంతకు మించి నా మనసుకి నచ్చినదానివి ఐ లవ్ యూ" అని తన పెదాలు అందుకున్నాను.

కొన్ని నిమిషాలకి విడిపడి తన భుజం మీద చేయి వేసి నడిపించుకుంటూ బండి మీద ఎక్కించుకుని తనని వాళ్ల ఇంటి దెగ్గర డ్రాప్ చేసి ఇంటికి వెళ్ళాను...
Like Reply


Messages In This Thread
RE: విక్రమ్ ~ లవ్ పార్ట్ - by Pallaki - 02-06-2022, 09:46 PM



Users browsing this thread: 11 Guest(s)