Thread Rating:
  • 5 Vote(s) - 2.4 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
విక్రమ్ ~ లవ్ పార్ట్
5



మానస విక్రమ్ ఇచ్చిన చీరతొ నే ఇంట్లోకి అడుగుపెట్టింది అక్కడ నానీ చూసి "ఏయ్ మానసక్క ఒచ్చిందోచ్"... అని అరవడం చూసి "ష్" అని నానీ పెదాల మీద వేలు పెట్టింది, కిచెన్ లోనుంచి రమ చూసి సూపర్ అని వేళ్ళతో సైగ చేసింది.

మానస నానీ చెయ్యి పట్టుకుని రమని చూసి నవ్వుతూ వాళ్ళ అమ్మ రూమ్ దెగ్గరికి వెళ్ళింది.

మానస : అమ్మా...

మానస అమ్మ : తల్లీ వచ్చేసావా?

మానస : "ఆగు... కళ్ళు మూసుకో... నేను వచ్చేదాకా తెరవకూడదు.." అని అమ్మ ముందుకి వెళ్లాను.

మానస : అమ్మా కళ్ళు తెరువు..

మానస వాళ్ళ అమ్మ కళ్ళు తెరిచి ఆశ్చర్యంగా ఆనందంగా చూస్తూ, నుదిటి మీద ముద్దు ఇచ్చి "తల్లీ ఎంత అందంగా ఉన్నవో అచ్చు దేవతలా ఉన్నావ్".

వెనకే వచ్చిన రమ కూడా "నేను అదే అందమనుకుంటున్నా మీరు అనేసారు అమ్మగారు".

మానస సిగ్గుపడింది.

మానస అమ్మ  మానసని మంచం మీద కూర్చోబెట్టి "తల్లీ ఎవరా అబ్బాయి?". అనేసరికి మానస షాక్ అయ్యింది, తనతో పాటే రమ కూడా...

మానస నానీ గాడి అవస్థ గుర్తించి బ్యాగ్ లో నుంచి నానీ కోసం కొన్న కొత్త ఆపిల్ టాబ్ సీల్ తీసి వైఫై కనెక్ట్ చేసి గేమ్ ఇన్స్టాల్ చేసి వాడికి ఇచ్చింది.

మానస : "నానీ ఇలా రా, ఇదిగో ఇది నీకోసమే కొన్నాను ఎప్పుడు నీ దెగ్గరే ఉంటుంది కానీ నీకు ఇదివ్వాలంటే నాకు ప్రామిస్ చెయ్యాలి", అని చెయ్యి చాపి.. "బాగా చదువుకుంటానని నాకు ప్రామిస్ చెయ్".

నానీ ప్రామిస్ చేసి టాబ్ తీసుకుని ఇల్లంతా ఆనందంగా తిరుగుతున్నాడు, రమ ఇబ్బందిగా చూసింది కానీ ఏమనలేకపోయింది.... ఇప్పుడు రమకి కావాల్సింది అది కాదు మానస ఎవరిని ఇష్టపడుతుందా అని.

మానస : ఇక అమ్మని చూసి "మా నీకెలా తెలుసు?"

మానస అమ్మ : ఒక్క రోజులో ఇన్ని మార్పులు ప్రేమలో పడితే తప్ప సాధ్యం కావులే..

మానస : అది... మా క్లాస్ లో...

రమ : ఆ క్లాస్ లో...

మానస అమ్మ : ఆ...చెప్పు...

మానస : రెండు చేతులతో మొహం దాచుకుని "నన్ను చెప్పనిస్తారా లేదా?"

మానస అమ్మ : సరే చెప్పు చెప్పు.

మానస : మా క్లాస్లో అబ్బాయి.. పేరు విక్రమ్, మొన్న నాన్న కొట్టించారని అరిచా కదా తనే.

రమ : ఎలా ఉంటాడు నీ అంత అందంగా ఉంటాడా, హైట్, మనిషి దిట్టంగా ఉంటాడా?

మానస : సాయంత్రం పార్టీకి రమ్మని పిలిచాను అప్పుడు చూద్దు...వస్తాడో రాడో..

మానస అమ్మ : పిలిచావుగా తప్పకుండా వస్తాడు.

మానస : క్లాస్ అందరితొ పాటు పిలిచాను, అస్సలు ఇప్పటి వరకు తనతో ఒక్కసారి కూడా మాట్లాడలేదు దూరం నుంచి చూడటమె..

రమ : ఇదేం ప్రేమ.. విడ్డురంగా?

మానస అమ్మ : ఎప్పటినుంచి ప్రేమిస్తున్నావ్ తల్లీ?

మానస తన అమ్మని వాటేసుకుని ఈ వారం రోజుల నుంచే...

మానస అమ్మ : మా పొగరుబోతు మానసని ఒక్క వారంలో చూపులతో మార్చేశాడా?

మానస : మా.... ఇది గోరం.. పోండి నేను చెప్పను..

రమ : నువ్వు చెప్పు మానస.... అమ్మగారు మీరుండండి..

మానస : ఒక్క రోజులో... కాదు కాదు ఒక్క చూపులో మార్చేసాడు.. అమ్మా ఎట్టి పరిస్తుతుల్లో విక్రమ్ ని వదిలిపెట్టకూడదు... నాకు విక్రమ్ కావాలి  ఏం చెయ్యాలో చెప్పండి.

రమ : వెళ్లి ముద్దు పెట్టెయ్ ఇక నీ చుట్టే తిరుగుతాడు..

మానస : పో అక్కా..

మానస అమ్మ : నువ్వుండేవే రమ..తల్లీ మంచివాడా తనగురించి నీకేం తెలుసు?

మానస విక్రమ్ గురించి తనకి తెలిసింది చెప్పింది.

మానస అమ్మ : ఒక '' అమ్మాయిని చెల్లెలా చూసుకుంటున్నాడు అంటే మంచివాడే అందులోనూ నీకు నచ్చాడుగా చూద్దాం వస్తాడుగా పార్టీకి, ఇక పదండి రెడీ అవ్వండి.

రమ : రేయ్ నానీ నువ్వు ఆడుకుంటూ కూర్చో మేము వెళ్లి కేక్ తినేస్తాం..

నానీ : అమ్మో.... నాకు కేక్ కావాలి... అని లేచి వాళ్ళ అమ్మ వెనకాల పరిగెత్తాడు.


≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈


ఇంటికి వెళ్లి అమ్మతో చెప్పాను, అమ్మ కూడా వస్తానంది, అందరూ రెడీ అయ్యి మా ఇంటికి వచ్చేసారు, అందరం కలిసి గ్రీన్ లోటస్ హోటల్ కి బైలదేరాము.

హోటల్ లోపలికి వెళ్లి పార్కింగ్ చేసి ఒక్కసారి ముందు నుంచి ఆ హోటల్ చూసి అందరం ఆశ్చర్యపోయాం, అంత పెద్ద హోటల్ ముందు మానసకి విషెస్ చెప్తూ పెద్ద కట్ అవుట్, పక్కనే మిగతా రాజకీయ నాయకుల ఫోటోలు.

పూజ : అబ్బా ఎంత పెద్ద హోటల్, మనం కనీసం ఇందులో టిఫిన్ చెయ్యాలంటే ఇంట్లో ఒక నెల సరుకుల డబ్బులు కావాలి.

విక్రమ్ : మనం కూడా మానస వాళ్ళ నాన్నలాగ అక్రమాలు చేద్దాం అప్పుడు టిఫిన్ ఏం ఖర్మ ఇందులోనే ఉండొచ్చు.

అమ్మ నన్ను డోక్కలో పొడిచి ష్..అని సైగ చేసింది, లోపలికి వెళ్ళాము అస్సలు ఇంద్ర లోకం లోపలే ఉంది ఆ లైటింగ్స్, డెకొరేషన్ చాలా నీట్ గా ఉంది, ఇంకా మానస రాలేదు, వాళ్ళ నాన్న వచ్చే రాజకీయ నాయకులని ఆహ్వానిస్తున్నాడు..
 

కేక్ కటింగ్కి టైం ఇంకో పది నిముషాలు ఉందనగా మానస లోపలికి వచ్చింది అందరు తనని విష్ చేస్తున్నారు, థాంక్స్ చెపుతూ బొకేలు అందుకుని పక్కనే ఉన్న ఆవిడకి ఇస్తుంది తనేమో తన పక్కనే ఉన్న ఒక చిన్న పిల్లాడికి ఇస్తుంది.. మానస ఇంకో పక్క వాళ్ల అమ్మ అనుకుంట పోలికలు కనిపిస్తున్నాయి, చూస్తుంటేనే తెలుస్తుంది తను చాలా మంచిదని తన అందమే మానసకి వచ్చిందనుకుంటా...

అన్నిటికంటే నాకు నచ్చిన అంశం ఏమిటంటే మానస నేను కొనిచ్చిన చీరే కట్టుకు రావటం, దూరం నుంచే నన్ను చూసి నవ్వింది థాంక్స్ అన్నట్టుగా..మానస కార్పెట్ మీద నడుచుకుంటూ వస్తుంటే గాల్లో పూలు చల్లుతూ హడావిడి చేస్తున్నారు నిజంగా దేవత లాగే ఉంది...మానస వాళ్ల అమ్మకి ఇంకా తన పక్కన ఉన్న ఆమెకి నన్ను చూపించినట్టు అనిపించింది నాకు, వాళ్లు నడుచుకుంటూ దెగ్గరికి వస్తుంటే మేమందరం అలా చూస్తూ ఉండిపోయాం...అమ్మ నాకు రోజా పువ్వు అందించింది నన్ను దాటుకుని వెళ్తుండగా తన పక్కనే ఉన్న పిల్లాడిని పిలిచాను ఆ అబ్బాయి నా దెగ్గరికి వచ్చాడు, తనతో పాటే వాళ్ల అమ్మ అనుకుంటా తను కూడా ఆగింది...

"నీ పేరేంటి...?"

"నానీ"

"నానీ ఈ పువ్వు మీ అక్కకి ఇస్తావా?"

నానీ ఆలోచిస్తుండగా వాళ్ల అమ్మ తీస్కో అని సైగ చేసింది, నానీ ఆ పువ్వు తీసుకుని పరిగెత్తుకుంటూ మానస దెగ్గరికి వెళ్లి పువ్వు ఇచ్చి నన్ను చూపించాడు... మానస నన్ను చూసి సిగ్గుగా పువ్వు తీసుకుని తన చెవి దెగ్గర పెట్టుకుంది...

ఇంతలో నాకంట్లో ఎవరో చాటుగా గుస గుసగా  మాట్లాడుకుంటూ మెట్లు ఎక్కడం గమనించాను... ఏదో అనుమానంగా ఉండి వాళ్ల వెనకే చిన్నగా పైకి వెళ్లాను...

లోపలకి వెళ్లి కర్టెన్ చాటున దాక్కున్నాను, అక్కడ ఇరవై మంది ఆడపిల్లల్ని కాళ్ళు చేతులు నోరు కట్టేసి ఉంచారు.. ఇంతలో

P1 : రేయ్ పదిహేనో తారీకు గుర్తు పెట్టుకో ఈ ఇరవై మందిని లంబసింగి చేర్చాలి.

P2 : లంబసింగిలో ఎక్కడ అన్నా?

P1 : భద్రాచలం కొత్తగూడెం నుంచి అరకు వెళ్లే రూట్లో.. మధ్యలో లంబసింగి వెళ్ళడానికి ఒక రోడ్ ఉంది ఆ రోడ్ లో మొదట కాలువ తగులుతుంది చిన్న బ్రిడ్జి అంతే.. దాని కిందే అక్కడ పెద్ద ట్రక్ ఉంటుంది అక్కడ నువ్వు నీ ట్రక్ ని డెలివరీ ఇస్తే చాలు... మిగతాది అన్న చూసుకుంటాడు...

P2 : అలాగే... అన్నా కొంచెం డబ్బులు అవసరం పడ్డాయి...

P1 : ఇప్పిస్తా లే అని అక్కడ నుంచి మాట్లాడుకుంటూ వెళ్లిపోయారు..

నేను కిందకి వచ్చేసాను, అమ్మ వాళ్ళ దెగ్గరికి వచ్చేసరికి మా కాలేజీ ప్రిన్సిపాల్ మాట్లాడుతున్నాడు.. దానికి అందరు క్లాప్స్ కొడుతూ ఎంజాయ్ చేస్తున్నారు.

అమ్మ : ఎటు వెళ్ళావ్ అని సైగ చేసింది.

నా చిటికిన వేలు చూపించాను.. అమ్మ మానస వైపు చూపించి వెక్కిరించింది.. ప్లీజ్ ఒద్దు అందరూ ఉన్నారని సైగ చేసాను..అమ్మ నవ్వింది.

సలీమా : మానస డ్రెస్ బాగుంది కదా?

విక్రమ్ : హ్మ్మ్ సూపర్ సెలక్షన్.

సలీమా : అబ్బా ఛా నిన్ను నువ్వే పొగుడుకుంటున్నావ్.. ఇచ్చింది నువ్వేగా?

వెంటనే తన నోటిని మూసేసాను... "నీకెలా తెలుసు?"

సలీమా : ఆరోజు నిన్ను పిలుద్దామని క్లాస్ కి వచ్చాను నువ్వు మానస వైపు కవర్ విసిరేయ్యడం ఆ తరువాత తన డ్రెస్స్ మారిపోవడం అన్నీ గమనిస్తూనే ఉన్నాలే... మీ ఇద్దరి సైగలు అబ్బో బలే సింక్ లో ఉంటారు ఇద్దరు.. ఇప్పుడు పువ్వు సంగతి కూడా...

విక్రమ్ : ఇంకా ఎవరెవరికి తెలుసు.. అనగానే అందరు ఇటు తిరిగి "మా అందరికి తెలుసు బంగారం" అన్నారు.

పూజ : మాకు తెలీదు అనుకున్నావా? నేను రమ్యతొ బెట్ కట్టాను కూడా, నువ్వు మొదటి సారి మానసని చూసినప్పుడే అనుకున్నా నేను ఏమన్నాడు ఏమన్నాడు "ఇది మానస పని కాదు" హ హా హా...

అందరు నవ్వారు.

విక్రమ్ : అరవ్వే అరూ.. అందరికీ వినపడి మనల్ని ఇక్కడే పాతేస్తే సరిపోద్ది.

ఇంతలో నానీ మాదెగ్గరికి వచ్చాడు..

నానీ :  అన్నా ఒక సారి ఇలా రా..

చందు : ఎల్లెల్లు చుట్టాలు పిలుస్తున్నారు..

చందు గాడిని చూసాను...

భరత్ : చూసింది చాలు వెళ్ళు.. (భరత్ గాడి వైపు చూడగానే) అటు తిరిగి ఎవరినో చూస్తూ .. చూసింది చాలు వెళ్ళు బాబు... అన్నాడు.. దానికి చందు వాళ్లంతా నవ్వుకున్నారు అమ్మ కూడా.. ఏం చేస్తాం అడ్డంగా దొరికిపోయాను అందుకే చిన్నగా నవ్వుతూ అక్కడనుంచి జారుకున్నాను...

.................................................................

రమ : మానస ఇలా రా..

మానస : ఏంటక్కా?

రమ : విక్రమ్ ఇటే వస్తున్నాడు నేను చూడకుండా నెడతాను తన మీద పడిపో..

మానస : ఆమ్మో వద్దక్కా.. నాకు భయం.

రమ : భయం లేదు ఏం లేదు నువ్విలానే ఉంటే ఇక మీరు మాట్లాడుకోడానికి ఏడాది పడుద్ది.. రా చెప్తా అని మానస చెయ్యి పట్టుకు లాగింది.

రమ : నానీ ఓకే నా వెళ్ళు.. మేము రెడీ..

................................................................

నానీ స్పీడ్ గా పరిగెత్తే సరికి తన వెనకే వెళ్ళాను, అక్కడ ఎవ్వరు లేరు నడుచుకుంటూ ముందుకు వెళ్తుంటే సడన్ గా మానస నా మీద పడింది, నా రెండు చేతులు తన నడుము మీద వేసి గట్టిగా పట్టుకున్నాను, తన ఒళ్ళు మెత్తగా ఉంది గుండ్రటి మొహం నా ఎదురుగా అందులోనూ ఎర్రటి పెదాలు ఏదైతే అది అయ్యింది అందుకుందాం అనిపించింది....మానస నన్నే చూస్తుంది.. ఇంతలో ఎవరో చూస్తున్నారనిపించి తల ఎత్తి చూసాను.. మానస వాళ్ల అమ్మ.

నేను మానసని నిల్చోబెట్టి తనకి అటు చూడమని సైగ చేసాను.. మానస వాళ్ల అమ్మని చూసి చీర సరి చేసుకుని పక్కకి చూసింది నేను అటువైపు చూసాను.. అక్కడ నానీ వాళ్ల అమ్మ నిల్చొని ఉన్నారు అక్కడ నుంచి నెమ్మదిగా జారుకున్నారు... నాకు మాటర్ అర్ధమైపోయింది..

మానస అమ్మ : ఏయ్ బాబు ఇలా రా...

మానసని ఒకసారి చూసి వాళ్ల అమ్మ దెగ్గరికి వెళ్తున్నాను....
Like Reply


Messages In This Thread
RE: విక్రమ్ ~ లవ్ పార్ట్ - by Pallaki - 31-05-2022, 10:43 PM



Users browsing this thread: 10 Guest(s)