31-05-2022, 04:51 PM
(31-05-2022, 02:03 PM)బర్రె Wrote: అవును ఇది మర్చిపోయా.. మీరు చెపింది కరెక్ట్
కానీ పిల్లలు లేకపోతె పిండం పెట్టేవాడు లేరు పితృదేవతలు శాపం కలుగుతుంది అని భయం చూపెడతారు జనాలు...
మరి నిజంగా అలాంటి శాపం ఉంటుంది అంటారా?
ధన్యవాదములు మిత్రమ బర్రె. యంత్రాలు రాకముందు జనం అవసరం అన్ని పనులకి అందుకే పిల్లలని కని పెంచడానికి ఏదో భయం ప్రలోభం చూపించి జనం చేత సంతానోత్పత్తి చేయించేవారు. పొలం పనుల నుండి సైన్యం వరకు అన్నింటికి జనం అవసరం. అప్పట్లో పెట్టిన భయాలు. పురాణాలలో చూస్తే ఎందరో ఋషులు పిల్లలు లేని వారు ఉన్నారు. మహానుభావులు సైతం పిల్లలు లేని వారే. ఆది శంకరాచార్యులు, రామానుజాచార్యులు, శిర్డి సాయి బాబా, ఇలా ఎందరెందరో. మరి వీరికి దివ్య ఙ్ఞానం ఉంది కనుకనే ఈ పిల్లల గురించి చెప్పినవన్నీ బూటకములు అని తెలిసే పిల్లలని కనలేదు. వారికి మోక్షం లభించింది అని అందరు భావిస్తారు. ఙ్ఞానులలో ఎక్కువ మంది యోగ్యత ఉన్నా పిల్లలు పుట్టించని వారే.