Thread Rating:
  • 3 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
ఆదిత్య ~ లవ్ పార్ట్
#1
1


పొద్దు పొద్దున్నే బార్ కి వెళ్లి ఒక ఫుల్ చెప్పాను, వెళ్లి నా కేబిన్ లో కూర్చున్నాను...

ఏంటి బార్ లో సెపరేట్ కేబిన్ కూడా ఇస్తారా అని ఆశ్చర్యపోకండి, గత ఆరు నెలలుగా రోజు పొద్దున నుంచి రాత్రి నాకు నిద్ర వచ్చే వరకు ఇక్కడే ఉంటాను ఈ బార్ కి మనమే ప్రైమ్ కస్టమర్, నెలకి నా కేబిన్ అందులోని టీవీ నా అరెంజ్ మెంట్స్ కోసం ఇరవై వేలు ఇస్తాను మళ్ళీ మందుకు వేరే.

అందుకే నేను ఎంత సేపు ఉన్నా తాగి పడిపోయినా కూడా నాకు ఎవ్వరు అడ్డు చెప్పరు, చాలా రోజులు మందు ఎక్కువై పడిపోయి పొద్దున్న వరకు ఉన్న రోజులు కూడా ఉన్నాయి అందుకే నాకోసం బార్ ఓనర్ బెడ్ కూడా ఏపించాడు.

ఇక్కడికి నేను మొదటి రోజు వచ్చినప్పుడు అంతా నన్ను ఆఫీస్ ఎంప్లొయ్ పార్టీ కోసం వచ్చాడు అనుకున్నారు.

ఆ తరువాత రోజూ వస్తుంటే అడిక్ట్ అవుతున్నాడేమో అనుకున్నారు, కొన్ని రోజులకి తాగుబోతు అనుకున్నారు ఆతరువాత లవ్ ఫెయిల్యూర్ అనుకున్నారు.

ఇప్పుడు అందరికీ నేనంటే జాలి ఆఖరికి బార్ ఓనర్ కూడా నేను మందు మానెయ్యాలి అని కోరుకుంటున్నాడు,  జనాలకి ఎప్పుడు పక్క వాడి మీద జాలి, కరుణ, దయ చూపించడమంటే ఇష్టం, కొంతమందికి టైం పాస్, ఇంకొంతమందికి సరదా.


ఇక నా గురించి చెప్పాలంటే నేను లవ్ లోనే కాదు కెరీర్ లో కూడా ఫెయిల్ అయ్యాను, అవును నేనొక mbbs డ్రాప్ అవుట్ ని, చదవలేక కాదు చదువడం ఇష్టం లేక వదిలేసాను.

నాకు ఇలా జరగటానికి నేను ఇలా అయిపోడానికి అన్నిటికి నేనే కారణం, ఎందువల్లనో తెలుసా హోప్... ఇతరుల మీద ఆశలు పెట్టుకోడం అవతలి వాళ్ళని గుడ్డిగా నమ్మడం.

చిన్న వయసులోనే అనుభవంతొ చెప్తున్నా... పక్కనోడి కోసం నీ జీవితం ఆపేస్తే నీకోసం వాళ్ళు ఆగిపోతారని అనుకోడం నీ భ్రమ, ఎవ్వడి జీవితం వాడిది.... కలిసుంటారు, ప్రేమగా మాట్లాడతారు, అవసరం వస్తే ఆదుకుంటారు కానీ ఇవన్నీ వాళ్ళు ఇబ్బంది పడనంత వరకే వాళ్ళ దాకా వస్తే నిన్నెంటి ఆ దేవుణ్ణి కూడా పట్టించుకోరు.

ఇదంతా వీడు తాగి మాట్లాడుతూ సొల్లు వేస్తున్నాడు అనుకోవద్దు, నేను చెప్పినవన్నీ అందరికీ తెలిసినా కానీ పట్టించుకోని పచ్చి నిజాలు, ఇంకోటి ఇది నా గురించి నేను ఎంత మందు తాగినా మత్తు ఎక్కినా బాడీ,  నా ఆలోచనలు హైపర్ యాక్టీవ్ గా ఉంటాయి, తాగి పడిపోయినా నాకు కావాల్సినప్పుడు లేవగలను, ఎలా అంటే నన్ను అడగకండి నాకు తెలీదు, ఇప్పుడిప్పుడే మీడియం సైజు టీషర్ట్స్ నుంచి లార్జ్ సైజు టిషర్ట్స్ కి మారాను చూడడానికి స్లిమ్ గా ఉన్నా బలం చాలా ఎక్కువ, నా బలం నాకు తెలుసు.

ఇక ఇప్పుడే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే నేను తాగే ఆఖరి మందు బాటిల్ ఇదే కాబట్టి, ఎందుకు మానేస్తున్నానంటే నాకు విరక్తి పుట్టింది తాగి తాగి మందు అంటే అసహ్యం పెరిగింది ఇక మీదట నేను తాగబోయేది లేదు.

(ఈలోగా ఒకటే సౌండ్) ఎహె ఈ నా కొడుకుల గోల ఎక్కువైంది ఈ మధ్య... బార్ పక్కనే అనాధ ఆశ్రమం ఒకటి ఉంది.. చిన్నదే.. ఇరవై మంది చిన్న పిల్లలు.. పేరు సంధ్యా ఫౌండేషన్స్....వాళ్ళని కాళీ చెయ్యమని రోజు ఒక నలుగురు గొడవ.."ఏంటన్నా మళ్ళీ వాళ్లేనా?" అని ఓనర్ అన్నని చూస్తూ అడిగాను... "అవును తమ్ముడు ఇప్పుడు కూడా రేపటి వరకు కాళీ చెయ్యకపోతే మెడ పట్టి బైటికి గెంటుతామని వార్నింగ్ ఇచ్చి పోయారు, రేపు మల్లేష్ వస్తాడట వాడు వస్తే ఏమవుద్దొ ఏంటో రేపు క్లోజ్ తమ్ముడు" అన్నాడు.. "ఇవ్వాలె లాస్ట్ అన్నా రేపటి నుంచి నీకు కనిపించను"... "ఏంటి తమ్ముడు ఎటైనా వెళ్తున్నావా?"..... "లేదన్నా మందు మానేస్తున్నా ఇవ్వాలె లాస్ట్".... " నిజంగా చాలా సంతోషం తమ్ముడు, అప్పుడప్పుడు వస్తూ ఉండు మొత్తానికే మానేస్తే నాకు కష్టం"  ఇద్దరం నవ్వుకున్నాం, అన్న షటర్ కిందకి లాగి వెళ్ళిపోయాడు నేను పడుకున్నా...

ఇక నా గురించి చెప్పాలంటే ముందుగా మీకు ముఖ్యమైన వాళ్ళని పరిచయం చెయ్యాలి, ఇది ఇద్దరు అన్నా చెల్లెలితొ మొదలయిన కధ.

అవును ఆ అన్న ఎవరో కాదు మా నాన్న గోవింద రాజు తన చెల్లెలు అంటే నా అత్త సరిత.....కాలేజీ వయసులోనే అమ్మా నాన్నని పోగొట్టుకున్నారు ఇద్దరు ఒంటరి వారు అయ్యారు, ఇంతమంది చుట్టాలలో ఎవరైనా చేరదీస్తారని చాలా ఎదురు చూసారు కానీ అది జరగదని తొందరగానే అర్ధం చేసుకున్నారు, నాన్న కష్ట పడి జాబ్ చేస్తూనే చదివాడు అత్త కూడా ఇంటి దెగ్గర ట్యూషన్స్ చెప్తూ చాలా సాయంగా ఉండేది.

డబ్బులు లేకపోతే సొంత వాళ్లే దెగ్గరికి రానివ్వలేదు అన్న విషయం మా నాన్న తలలోకి బాగా ఎక్కేసింది, ఆ పట్టుదల తోనే కసిగా చదివి జాబ్ కొట్టాడు, ఫ్రెండ్స్ సాయంతొ రియల్ ఎస్టేట్ లో కోట్లు సంపాదించాడు.

ఇప్పుడు మాకు చుట్టాలకి కొదవ లేదు అంతా సంతోషమె, అందరూ మా మాట వినేవాళ్ళే.


మా నాన్న గోవింద రాజు : చూడాల్సిన కష్టాలన్ని చూసేసాడు ఎంత పెద్ద ప్రాబ్లెమ్ వచ్చినా సునయసంగా నవ్వుతూ పరిష్కరించగలడు.

అమ్మ మంజుల : ఏమి తెలియదు మమ్మల్ని ప్రేమించడం తప్ప, కానీ నాన్న నేను తను చెప్పింది వినకపోతే మాత్రం భద్రకాళి అవతారం ఎత్తుతుంది.

ఇక అత్త సరిత : మంచిది కానీ తన మాటే నెగ్గాలంటుంది అయినా తను చూపించే ప్రేమలో అవేవి మనకి కనిపించవు, తనకి ఫారెన్ వెళ్లి చదువుకోవాలని అక్కడే సెటిల్ అవ్వాలని కోరిక కానీ అది తీరలేదు ఇప్పుడు డబ్బులున్నా వెళ్లే అవకాశం ఉన్నా అన్నని వదలలేక అలా ఉండిపోయింది

మావయ్య రవి చంద్ర : అత్త చెప్పినవాటికి తల ఊపుతూ ఉంటాడు. (అంతేగా అంతేగా టైపు)

అమ్మా నాన్నది పెద్దలు కుదిర్చిన వివాహమే, అమ్మకి ఏమి తెలియదని అమాయకురాలని మంచిదని నాన్నకి, అత్తకి త్వరగానే తెలిసింది. అందుకే నాన్నకి అత్తకి అమ్మ అంటే ప్రాణం, ఆ తరువాత అత్తయ్య రవి మావయ్యని ప్రేమించి పెళ్లి చేసుకుంది.

కానీ పెళ్ళికి ముందు నాన్న షరతు పెట్టాడు అది ఏంటంటే తనతో పాటే అత్తని మావయ్యని తనతోనే కలిసి ఉండాలని....దానికి అత్తయ్య మావయ్య సంతోషంగా ఒప్పుకున్నారు.

సంవత్సరానికి నేను పుట్టాను అమ్మ వాళ్ళ సంతోషాలకి అవధులు లేవు పుట్టడం పుట్టడమే మగ పిల్లాడిని పుట్టడంతొ ఇక చాలు అనుకున్నారు.

నేను పుట్టిన సంవత్సరానికి అదీ పుట్టింది, అత్త కూడా ఇక తన కూతురికి మొగుడ్ని నేనే అని కంఫర్మ్ చేసేసి మేము ఇద్దరం చాలనుకుని అమ్మా అత్త ఇద్దరు గర్భసంచి ఆపరేషన్ కూడా చేపించేసుకున్నారు.

నా పేరు ఆదిత్య
నా మరదలి పేరు అనురాధ.

పేరుకే అమ్మకి పుట్టాను కానీ పెరిగింది మొత్తం అత్త ఓళ్ళోనే , అత్తకి కూడా అను కంటే నేనంటేనే ఇష్టం.

అమ్మ పాల కంటే అత్తయ్య పాలే ఎక్కువ తాగి పెరిగాను, పాపం మా అమ్మ ఇక చేసేది లేక అనూతో సర్దుకునేది.

నాన్న మావయ్య ఇద్దరు కలిసి బిజినెస్ ని ఇంకా పెంచారు దానితో ఊర్లో మంచి పనులు చేసి పేరు కూడా సంపాదించారు.

నా పుట్టుక మొత్తం అను తోనే సరిపోయింది ఒకే సంవత్సరం తేడా అవ్వడం తొ నన్ను ఒక సంవత్సరం ఆపి మరి ఇద్దరినీ ఒకేసారి కాలేజ్ లో జాయిన్ చేశారు.

కాకపోతే ఒక చిన్న సమస్య ఏది కొన్నా ఇద్దరం కలిసే ఆడుకోవాలని ఇద్దరికీ కలిపి ఒక్కటే కొనేవారు.

అక్కడే నాకు దానికి గొడవ జరిగేది ఇద్దరం ఒక్కదానితో సర్దుకోడం కష్టామయ్యేది నేను ఊరుకున్నా అను అస్సలు ఊరుకునేది కాదు , వాళ్ళకి అది సరదాగ ఉండేది కానీ మాకు ఇద్దరి మధ్యలో రోజు రోజుకి దూరం పెరుగుతూ వస్తుంది....అందరి ముందు నటించినా, మేమిద్దరం బానే మాట్లాడుకున్నా ఎక్కడో గ్యాప్ ఉంది మా ఇద్దరి మధ్యలో...


దానికి తోడు మేము నడుస్తూ తూలి కింద పడే వయసులో నా ఖర్మ కాలి దానికి లిప్ కిస్ పెట్టా దాన్ని ఎలా ఫోటో తీసారో లేక వీళ్ళే అలా నాతో ముద్దు పెట్టించి తీయించారో తెలీదు కానీ, ఆ ఫోటోని పెద్ద ఫ్రేమ్ కట్టించి పెట్టారు.

ఎప్పుడైనా మేము గొడవ చేస్తే అది చూపించి ఏడిపించేవారు సగం మా మధ్య దూరం పెరగటానికి ఆ ఫోటో కూడా ఒక కారణమే.

కానీ ఎక్కడో అది నన్ను ఎంత ఏడిపించినా, ఎంత అల్లరి చేసినా దాన్ని కోప్పడే ముందు నాకు చెవుల్లో "అది నీ పెళ్ళాం, అది నీ పెళ్ళాం" అని రీసౌండ్ వినిపించేది అలా ఎందుకు వినిపిస్తుంది అంటే మా అమ్మా అత్త ఇద్దరు కలిసి నాకు చెప్పడం వల్ల...ABCD నేర్పించాల్సిన వయసులో కూడా అనూ నీ పెళ్ళాం అని నేర్పించేవాళ్ళు, అందుకే దాన్ని ఏమైనా అందామంటే మనసు రాదు, నేనేమనట్లేదని అది ఇంకా రెచ్చిపోయ్యేది అయినా సహనంగానే ఉండేవాడిని అందుకే నేనంటే దానికి చులకన.

ఇక చిన్నప్పటి నుంచి మాకు పడదుగా అందుకే కాలేజ్ లో కూడా మాకు పరిచయం లేనట్టే ఉండేవాళ్ళం, అమ్మ అత్తా నాన్న వాళ్ల ముందే మేము బావ మరదళ్ళం, ఇంట్లో ఎవ్వరు లేనప్పుడు పరిచయస్తులం ఇక బైటికి వెళ్తే అదెవరో, నేనెవరో..

నా మీద ఇంక్ పొయ్యడం, ఐస్ క్యూబ్స్ నా షర్ట్ లో వెయ్యడం ఎన్ని చెయ్యాలో అన్నీ చేసేది అమ్మగారు, ఒక రోజు నేను డ్రాయింగ్ చేస్తుండగా కదిలించింది, వారం రోజులుగా ఒకటే పెయింటింగ్ ఇష్టంగా వేస్తున్నా, కోపంలో కొట్టబోయాను అది భయపడి కళ్ళు మూసుకుంది కానీ కొట్టలేకపోయాను, దాని మొహం అలాంటిది ప్రేమించడం తప్ప ద్వేషంచలేము.

మళ్ళీ SCC ఎగ్జామ్స్ అప్పుడు అనుకుంటా మొదటి సారి అను మీద కోపగించుకున్నాను, ఇద్దరికీ ఒకే సెంటర్ పడింది, ఎగ్జామ్ రాసి బైటికి వచ్చి అను కోసం, నాన్న వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నాను, ఎవరో అబ్బాయితొ మాట్లాడుతూ బైటికి వచ్చింది, నా కళ్ళలో కోపం చూసిందో ఏమో కావాలనే నవ్వుతూ తగులుకుంటూ మాట్లాడుతూ నన్ను చూస్తూ నడుస్తుంది, వెళ్ళేటప్పుడు షేక్ హ్యాండ్ ఇచ్చి మరి వచ్చింది.

ఆదిత్య : ఎవడు వాడు?

అను : వాడు వీడెంటి సరిగ్గా మాట్లాడు, ఓహో అయ్యగారికి జెలసీ వచ్చిందా అయినా ఎవరైతే నీకెందుకు, నా ఇష్టం... కొంపదీసి అత్త వాళ్ళు అనేదానికి మనసులో నన్ను పెళ్లి చేసుకోవాలని ఆశలు అయితే పెట్టుకోలేదు కదా..

ఆదిత్య : ఛీ... నీతోనా దానికంటే చావడం మేలు, అయినా ఎప్పుడు నన్ను ఏడిపిస్తావ్గా ఇంటికి పదా నీ సంగతి చెప్తా ఇవ్వాళ.

అను : ఏం చేస్తావ్?

ఆదిత్య : నువ్వు పదా నీకుంది ఇవ్వాళ..

ఇంతలో మావయ్య కార్ తీసుకుని వచ్చాడు, ఎక్కి ఇంటికి వెళ్ళాం, ఇంటికి వెళ్ళగానే అత్తయ్య దెగ్గరికి వెళ్లి నేను చూసింది మొత్తం పూస గుచ్చినట్టు చెప్పాను.....ఆ తరువాతే తెలిసింది నేను ఎంత పెద్ద తప్పు చేసానో, బెల్ట్ తీసుకుని అను ఒంటి మీద వాతలు పడేలా కొట్టింది నాకు బాధేసింది, అను నన్ను కోపంగా చూస్తూ ఏడ్చుకుంటూ అమ్మ దెగ్గరికి వెళ్ళిపోయింది....నేను అత్త ముందుకి వెళ్లాను, అత్త ఇంకా కోపంగానే ఉంది.

ఆదిత్య : సారీ అత్త, నా వల్లే ఇదంతా...

సరిత : నువ్వే తప్పు చెయ్యలేదు ఆదిత్య , ఇంకెప్పుడైనా అది ఇలాగ పిచ్చి పనులు చేసినా నాకు చెప్పాలి, అప్పుడే కదా అను తప్పు చెయ్యకుండా చెయ్యగలం.

నేను ఇంకేం మాట్లాడలేదు ఆ రాత్రి అను అన్నం తినలేదు, అత్తకి కోపం వచ్చి "ఇప్పుడు అది తినకపోతే కొంపలేం మునిగిపోవు" అంది.

నాకు రాత్రి నిద్ర పట్టలేదు, అర్ధ రాత్రికి ప్లేట్ లో అన్నం కూర వేసుకుని మా రూమ్ లో ఉన్న అను బెడ్ దెగ్గరికి వెళ్లి తనని లేపాను, నిద్రలో లేచి నన్ను చూసి కోపంగా "ఎందుకోచ్చావ్?" అంది, అన్నం ప్లేట్ తన పక్కన పెట్టాను.. "నాకేం అవసరం లేదు అని విసిరేసింది, ప్లేట్ గాల్లో ఎగిరి కింద పడి గుండ్రంగా తిరుగుతూ పెద్ద సౌండ్ చేసింది, అంతే అందరూ లేచారు, మా రూమ్ లో లైట్లు వెలిగాయి.

అమ్మ వాళ్ళు నలుగురు మా రూమ్ కి వచ్చారు అంతే నాకు భయమేసి పక్కనే ఉన్న నా బెడ్ మీదకి దూకి రగ్గు కప్పుకుని పడుకున్నాను, చిన్నగా రగ్గు కొంచెం తెరిచి చూసాను అత్త అనూని కోపంగా చూసింది.. అంతే నేను కళ్ళు మూసుకున్నాను గట్టిగా... అమ్మ కింద పడిన ప్లేట్ అన్నం తీసుకుని బైటికి వెళ్ళిపోయింది అత్త కూడా లైట్ ఆఫ్ చేసింది అందరు వెళ్లిపోయారు, నేను ఇక లేవలేదు పడుకుండిపోయాను.

సరిత : చూసావా అన్నయ్య వాడికి అను అంటే ఎంత ప్రాణమో, అర్ధ రాత్రి లేచి మరి అన్నం పెట్టుకుని వెళ్ళాడు ఈ పిచ్చిదానికి అర్ధం కావట్లేదు..

వీళ్ళు కలిసిపోతే ఇద్దరినీ ఫారెన్ పంపించి చదివిద్దాం అక్కడే సెటిల్ అవుతారు, ఇద్దరి పెళ్లి కూడా అక్కడే చేద్దాం.

రాజు : అమ్మో నా చెల్లెలు పెద్ద ప్లాన్ వేసిందే...వాళ్లే తెలుసుకుంటారు లేరా పదా... అని తన చెల్లి నుదిటి మీద ముద్దు ఇచ్చి తన రూమ్ లోకి వెళ్ళిపోయాడు.
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.


Messages In This Thread
ఆదిత్య ~ లవ్ పార్ట్ - by Pallaki - 28-05-2022, 01:50 PM



Users browsing this thread: 1 Guest(s)