25-05-2022, 08:11 PM
(20-05-2022, 06:00 AM)stories1968 Wrote: అంబిక కాశీరాజు కుమార్తె. అంబ, అంబాలిక ఈమెకు అక్కా, చెల్లీను. వీరి వివాహం కోసం కాశీరాజు స్వయంవరం ప్రకటించగా అనేకమంది రాజులు పోటీపడ్డారు, వారందరినీ భీష్ముడు ఓడించి, యువరాణులు ముగ్గురినీ ఎత్తుకు వెళ్ళాడు. అంబ సాళ్వరాజును ప్రేమించానని చెప్పడంతో భీష్ముడు ఆమెను అతడి వద్దకు పంపించేసాడు. అంబిక, అంబాలికలను తన తమ్ముడైన విచిత్రవీర్యునికిచ్చి వివాహం చేసాడు.
విచిత్ర వీర్యుడు క్షయరోగంతో నిస్సంతుగా మరణించాడు. వంశవృద్ధి కోసమని అతడి తల్లి సత్యవతి తన తొలిపుత్రుడైన వ్యాసుని కోరింది. అంబిక, అంబాలికలకు సంతానాన్ని ప్రసాదించేందుకు అతడు అంగీకరించాడు.
అంబిక వ్యాసుని వ్యాసుని వికారాకారం చూడలేక కళ్ళు మూసుకుంది. ఆ కారణాన వ్యాసుడు ఆమెకు, పుట్టుగుడ్డియైన ధృతరాష్ట్రుని ప్రసాదించాడు.
అంబాలిక వ్యాసుని చూడడంతోనే భయంతో తెల్లబారింది. ఆ కారణాన ఆమెకు, పాండురోగం కారణాన తెల్లబారిపోయిన చర్మంతో పాండురాజు పుట్టాడు.
అనంతకోటి ధన్యవాదములు మిత్రమ బొమ్మల బ్రహ్మ.