Thread Rating:
  • 2 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
సరైన నిర్ణయం by Sai Arpita
#9
మది మెచ్చిన సఖుడు by మృదుల

అది ఒక అందమైన చిన్న ఇల్లు చుట్టూ పచ్చని చిన్న చిన్న మొక్కలు...
 
అప్పుడే ఉదయిస్తున్నసూర్యుని లేలేతకిరణలు.... ఆ ఇంటిలోని ఒక గదిలోకి చొరబడి అక్కడ ఉన్న మంచం పై ముద్దుగా పడుకున్న ఒక అమ్మాయి నగుమోము మీద పడి ..... తన నిద్రకు భంగం కలిగిస్తుంటే... కాస్త కదిలి మళ్ళీ దుప్పటి ముఖం మీదకు లాక్కుని పడుకుంటుంది....
 
అలా పడుకున్న తన మీదకి రెండు చిన్న చిన్న పీచుకలు వచ్చి ముక్కుతో చిన్నగా పొడుస్తుంటాయి నిద్రలేపడనికి అనడానికి సంకేతంగా.... ఆ అమ్మాయి మెల్లిగా కళ్ళు తెరిచి పైకి లేస్తుంది నవ్వుతూ.....
నాన్న అంటుంది...
 
లేచావ చిట్టి తల్లి అంటారు వాళ్ళ నాన్న తన నుదిటిపై ముద్దు పెట్టుకుంటు...
 
హా లేచాను డార్లింగ్ అంటుంది....
 
ఇంతలో వాళ్ల అమ్మమొదలెట్టారు తండ్రి కూతుర్లు కబుర్లు ఇలా మాట్లాడుకుంటూ ఉంటే మీరు ఆఫీసుకి అది కాలేజ్కి వెళ్ళడానికి లేట్ అవుతుంది.. అంటుంది...
 
 
నీకు కుళ్ళు అమ్మ మమ్మల్ని ఇలా చూసి...అంటుంది ఉడికిస్తూ.....
 
ఆ మీ ఇద్దరినీ చూసేకుళ్లు కోవాలి నేను అంటూ మూతి తిప్పుకుంటు వెళ్ళిపోతుంది ......
 
ఆమె వెళ్ళిపోయాకవీళ్లిద్దరూ ఆవిడ చెప్పిన విధానానికి ఒకర్ని ఒకరు చూసుకుని నవ్వుకుంటారు...
 
 
 
సరే బంగారు... లేచి త్వరగా రెడి అవ్వు రా కాలేజ్కి టైం అవుతుంది... ...కదా అంటారు...
 
హఅవును డార్లింగ్ అంటుంది...
 
తర్వాత ఆయన వెళ్ళిపోతారు...
 
తను వాష్ రూంలోకి వెళ్లి ఫేస్ ఒక్కసారి అద్దంలో చూసుకుని ఫేస్ వాష్ చేసుకుంటుంది....
 
తర్వాత రెడి అయ్యి బైటకి వస్తుంది....
 
అక్కడ ఒక వైట్ చుడిదార్ వేసుకుని... రెడి అవుతుంది...
 
కిందకి వచ్చిన తనని చూసిన ఆనంద్ గారు తన దగ్గరకొచ్చిఆమె నుదిటి మీద ముద్దుపెట్టుకుని నా బంగారు తల్లి ఈరోజు బాపు బొమ్మలఉంది అంటారు...
 
మీ అమ్మాయి మీకు రోజు బాపు బొమ్మలనే ఉంటుంది.....అంటారు రేఖ... టిఫిన్ టేబుల్లో మీద సర్దుతూ....
ఇద్దరు నవ్వుకుని అక్కడికి వెళ్లి ఏంటి డార్లింగ్ నాకిక్కడ ఎదో కాలుతున్నట్టు స్మెల్ వస్తోంది ఎవరో బాగా జలస్ ఫీల్ అవుతున్నట్టు అంటుంది... ఏటో... చూస్తూ...
 
రేఖ గారు ఆ అమ్మాయి తలా మీద ఒకటి వేసి వీటికెమీ తక్కువలేదు... తిను అంటూ పూరి ముక్క చేసి నోట్లో పెడుతుంటారు...
 
అలా నవ్వుతూ టిఫిన్ పూర్తి చేసుకుని.... కూర్చుంటారు...
 
అప్పుడే బైటనుంచి ఒక అమ్మాయి నిత్యా ... నిత్యా అంటూ పిలుస్తుంది...
 
డార్లింగ్ శ్వేతా వచ్చినట్టు ఉంది నేను వెళ్తున్న బై... అంటూ బుగ్గ మీద ముద్దిచి బైటకి వచ్చి శ్వేతా బండి ఎక్కుతుంది...
 
శ్వేతతో వెళ్తూ అలా ఒకచోట ట్రాఫిక్ సిగ్నల్ పడడం వల్ల స్కూటీ ఆపుతుంది...
 
నిత్యా చుట్టూ చూస్తుంది....
 
ఒసేయ్ ఏంటే నువ్వు మనం బీ.టెక్ ఫస్ట్ ఇయర్లో ఉన్నపుడు ఇక్కడ కనిపించిన అబ్బాయికోసం 4 ఇయర్స్గావెతుకుతున్నావు... ఇప్పుడు మనం బీ.టెక్ ఫైనల్ ఇయర్ తనని మళ్ళీ మళ్ళీ చూడాలని ఆరాటపడుతున్నావు.... తన మీద కవితలు రాస్తున్నావు ... ప్రేమిస్తున్నవా అని అడిగితే ఏమో కాదు తను జస్ట్ కేవలం నాకు క్రష్ మాత్రమే అంటున్నావు అసలు నీ మనసులో అతనిపై ఉన్న ఫీలింగ్ ఎంతో అర్ధం కావట్లేదు అంటుంది శ్వేతా నిత్యని స్కూటీ మిర్రర్లో నుంచి చూస్తు....
 
నిత్యా 4ఇయర్స్ బాక్ కరెక్ట్గా ఈ టైంలో ఎం జరిగిందో గుర్తుతెచ్చుకుంటుంది...
 
అప్పుడే బీ.టెక్ ఫస్ట్ ఇయర్ కావడంతో కాస్త బయంగానే... కాలేజ్ దగ్గరకి వెళ్తుంటారు..... సరిగ్గా అప్పుడే బైక్ హ్యాండ్లింగ్ తప్పి ఒక బైక్ వాళ్ళకి డాష్ ఇస్తారు...
 
ఇద్దరు కిందపడిపోతారు... వీళ్ళు లేచి వాళ్లెం అంటారా అని భయపడి నిత్యా వాళ్ళదగ్గరకి వెళ్లి ... వాళ్ళకి ఏమైనా దెబ్బలు తగిలాయేమో అని చూసి... నన్ను క్షమించండి ఎదో కంగారులో డాష్ఇచ్చాను సారి అంటుంది...
 
ఆ బైక్ అతను హెల్మెట్ పెట్టుకుని ఉండడం వల్ల తనని చూడదు.....
నిత్యా చిన్నపిల్లల ఐస్ క్రీమ్ తింటూ అమ్మకి దొరికిపోతే ఎలా ఎక్స్ప్రెషన్ పెడతారో అలా ఉంటుంది..ఆ వ్యక్తి నిత్యాని అలా చూస్తూ ఉంటాడు..అందమైన కన్నులు ఆ కన్నులకి ఇంకా అందాన్ని పెంచడానికి అన్నట్టు కాటుకతో అలంకరించి ఉన్నాయి.. కొటేరులాంటి ముక్కు .. వాలు జాడ.. పాలుకారే బుగ్గలు... మాట్లాడేటప్పుడు తన మాటకి లయబద్దంగా ఉగే తన చెవికి ఉన్న జుంకాలు... రోజు వెన్న రాస్తుందేమో ఆనడానికి సూచికగా లేలేత గులాబీ రంగులో ఉన్న పెదాలు.. చూడటానికి చాలా అందంగా చిన్నపిల్లల కనిపించే తన హావభవాలు.... తనని అలా చూసి ఆ వ్యక్తి.. పర్లేదు అండిదెబ్బలెం తగలేదు ... మీరూ కాలేజ్కి వెళ్తున్నట్టు ఉన్నారు టైం అవుతుంది వెళ్ళండి.. అంటాడు... అప్పుడు నిత్య రియల్లీ సారి అంటూ అక్కడ ఆ అబ్బాయికి చిన్నగా గీరుకుంటే తన కార్చిఫ్ తీసి తనకి చుట్టి దెబ్బ తగిలితే లేదన్నారెంటండి నిజంగా చూసుకోలేదు సారి అంటుంది ....
 
పర్లేదు మీరు వెళ్ళండి అంటాడు... సరే అని నిత్య కంగారుగా అక్కడనుంచి కాలేజ్కి వెళ్ళిపోతుంది....
 
అక్కడ నిత్యా బుక్స్ ఉండడం చూసి అది ఇచ్చేయాలి ... అని లేచి అక్కడికి దగ్గర్లోనే నిత్యా వెళ్లిన కాలేజ్ ఉండడంతో వెళ్తాడు... అతనికి ఎలా తెల్సు అనుకోకండి అక్కడ దగ్గర్లో ఉన్న కాలేజ్ అదొక్కటే ... నిత్య స్కూటీ పార్క్ చేసి వచ్చేసరికి అతను అక్కడే ఉంటాడు.... మీ బుక్ నిత్య అని ఇచ్చి చిన్న స్మైల్ ఇచ్చి వెళ్ళిపోతాడు... నిత్యా వెళ్లిన అతనివైపే చూస్తూ ఉంటుంది...
 
ఇంతలో శ్వేత వచ్చి ఏంటే ఇంత లేట్ అని అడుగుతుంది... నిత్యా జరిగింది అంత చెప్తుంది... చాలా మంచి వాడు లాగా ఉన్నాడు అంది .... సరే అని వాళ్లిద్దరూ క్లాస్కి వెళ్ళిపోతారు...
 
 
కానీ నిత్యకి క్లాస్ లో కూడా అతని నీలి కళ్ళు గుర్తొస్తాయి .... క్లాస్ అయిపోయాక కూర్చుని ఎదో రాస్తున్న నిత్యా దగ్గరకి వచ్చి ఎం రాస్తున్నావె అంత సేపు క్లాస్ అయిపోయాక అంటుంది...
 
 
ఎం లేదు అంటూ లోపలికి పెట్టబోతున్న నిత్యా చేతిలోని పేపర్ తీసుకుని...ఇలా చదువుతుంది...
 
 నీ నీలి కలువల్లాంటి
నా మదిలో అనుక్షణం మెదుళ్తున్నాయి
 నన్ను ఎంత మాయ చేసాయి అంటే చెప్పలేనంత 
 నిన్ను కలిసిన క్షణం నుంచి నా మనసు నిన్ను చూడటానికి పరితపించేలా ....
నీ ఆ పెద్ద పెద్ద కళ్ళు చూస్తూ ఎన్ని రోజులైనా బతికేయచ్చేమో... 
నా మది నీ ఆలోచనలను వీడను అంటూ మొండి పట్టు పడితే... మెదడు అవి వీడమని మొరపెడుతోంది...
చూసింది ఒక్క క్షణమే అయిననీ రూపు నా మదిలో నిలిచిపోయింది... అది చదివిన శ్వేతా ఎవరికోసం రాసావే అంటుంది అనుమానంగా...
 
ఎవరికోసం కాదే ఎదో అలా రాయాలి అనిపించింది రాసేసాను...
 
హో అవునానాకెందుకు ఆ అబ్బాయి గురించి రాసావు అనిపిస్తుంది... అంటుంది.... నిజాం చెప్పవే అంటుంది...
 
హా ఆ అబ్బాయి గురించే రాసానుఅంటుంది...
 
హ్మ్మ్ లవ్ ఆ అంటే....
 
కాదుజస్ట్ క్రష్ అంటుంది ..
 
అలా వాళ్ళుకాలేజ్కి వెళ్లడం నిత్య ఆ వ్యక్తి గురించి ఆలోచించడంలో రోజులన్నీ గడిపేస్తుంటారు...
 
నిత్య ఆలోచనలన్నీ చేరిపేస్తూ... కాలేజ్ వచ్చింది...
 
నిత్య కాలేజిలో చివరి రోజు అవ్వడంతో...అందరితో బాగా ఎంజాయ్ చేస్తుంది మధ్యలో ఒక చోట కూర్చుని ఎదో రాసి అది బాగ్లో పెట్టేసుకుంది...
 
తర్వాత శ్వేతా వచ్చి ఒసేయ్ నీ క్రష్ గోల పక్కన పెట్టవే లాస్ట్డేడా ఎంజాయ్ చేద్దాం అంటుంది...
 
నిత్య కూడా వాళ్ళతో కలిసి ఫుల్ అల్లరి చేస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది...

 
ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 1 user Likes k3vv3's post
Like Reply


Messages In This Thread
RE: సరైన నిర్ణయం by Sai Arpita - by k3vv3 - 24-05-2022, 06:58 PM



Users browsing this thread: 1 Guest(s)