24-05-2022, 02:20 PM
S3E1
కాల చక్రం ముప్పై ఐదు సంవత్సరాల తిరిగిన తరువాత.
లొకేషన్ బెంగుళూరు, పెద్ద స్థలం చుట్టూ కాంపౌండ్ వాల్ అక్కడక్కడా గోడ పగిలిపోయి ఉంది, ఫెన్సింగ్ కూడా మొత్తం ఓడిపోయింది , రెండు బండ్ల మీద వచ్చిన ఆ ఇద్దరు జంటలు లోపలికి వెళ్లారు, మొత్తం ఎండిపోయిన గడ్డి ఇంతకముందు పూలు పెంచారేమో మట్టి చదునుగా ఉంది.
నలుగురు మధ్యలో శిదిలావస్థలో ఉన్న ఒక ఇల్లు దెగ్గరికి నడుచుకుంటూ వెళ్లారు అక్కడ ఎవరో ముసలావిడ, మాములు బూడిద రంగు కాటన్ చీర కట్టుకుని ఇంత పెద్ద ఎడారి లాంటి స్థలంలో నాలుగు పచ్చటి రోజా మొక్కలకి నీళ్లు పోసి, ఆ మొక్కల నుంచి నాలుగు రోజా పూలు తెంపి ఇంటి వెనక్కి వెళ్తుంది.
ఆమెని పిలిచారు, వెనక్కి తిరిగి వాళ్ళని చూసి ఆశ్చర్యంగా రెండు అడుగులు వెనక్కి వేసింది కాని ఇది తన మనవళ్ల కుట్రేమో అని బయటపడకుండా "ఎవరు కావాలి మీకు? ఒకవేళ మిమ్మల్ని నా మనవళ్ళు పంపించి ఉంటే వెనక్కి వెళ్లిపోండి వాళ్ళు అనుకునేది జరగాలంటే అది నేను చచ్చిపోయాకే అని చెప్పండి" అంది.
ఆ నలుగురిలో మొదటి వాడు "అమ్మా మేము ఇక్కడ సంధ్యగారిని కలవడానికి వచ్చాము మీరు...?" అన్నాడు.
దానికి ఆ ముసలావిడ మాట్లాడిన అబ్బాయి గొంతులో ఉన్న మర్యాదని గుర్తించి "నేనే సంధ్యని బాబు, ఏం కావాలి?" అంది.
"అమ్మా! మీరు ఇలాగ ఇక్కడ ఉన్నారెంటి?" అన్నాడు.
దానికి ఆ ముసలావిడ నవ్వి వెనక్కి తిరిగి వాళ్ళకి కనిపించకుండా ఆశ్చర్యంగా నోటి మీద చెయ్యి వేసుకుని వెళ్ళిపోతుంది పువ్వులు పట్టుకుని..
ఇంతలో ఆ అబ్బాయి పక్కనే ఉన్న అమ్మాయి "అమ్మా మేము మీ అబ్బాయి విక్రమాదిత్య గురించి తెలుసుకోడానికి వచ్చాము మాకు చెప్తారా?" అంది.
దానికి ఆమె ముందుకి వెళ్తూనే ఒక నవ్వు నవ్వి "చెప్తాను లే ముందు నాకు మీరెవరో చెప్పండి, నా కొడుకు గురించి ఎందుకు తెలుసుకోవాలనుకుంటున్నారో కూడా చెప్పండి" అని ఇంటి వెనక్కి వెళ్ళిపోయింది
నలుగురు ఆమెని అనుసరిస్తూ ఇంటి వెనక్కి వెళ్లారు అక్కడ నాలుగు సమాధులు ఉన్నాయి, రోజు జాగ్రత్తగా చూసుకుంటారేమో చాలా నీట్ గా ఉన్నాయ్ ఆ సమాధులు, వాటిని ఆ ముసలావిడ ఆప్యాయంగా నవ్వుతూ చూసి తన చేతులతో స్పృశిస్తూ ఒక్కో సమాధి మీద ఒక్కో పువ్వు పెట్టి అక్కడున్న రెండో సమాధి తల సైడ్ కి వచ్చి సమాధికి ముద్దు ఇచ్చింది.
నలుగురు అటు వైపుకి వెళ్లారు ఒక్కో సమాధి మీద ఉన్న పేర్లు చదువుతు, మొదటి దాని మీద మానస అని, మూడవ దాని మీద అనురాధ అని చివరి సమాధి మీద శశి అని ఇక ముసలావిడ ముద్దు పెట్టిన రెండవ దాని మీద విక్రమాదిత్య అని సువర్ణక్షరాలతో రాసి ఉంది, అది చూసి ఆ నలుగురు ఆశ్చర్యపోయారు...
సంధ్య తన బిడ్డ సమాధికి ఆనుకుని కూర్చొని వాళ్ళని చూస్తూ "ఇంతకీ మీ పేర్లు కూడా చెప్పలేదు నాకు" అంది.
నలుగురు షాక్ లోనే సంధ్య ముందు కూర్చొని ఇందాక మాట్లాడిన అబ్బాయి "అమ్మా! నా పేరు విక్రమ్ తను నా భార్య మానస, ఇక తను నా స్నేహితుడు ఆదిత్య అతని మరదలు అనురాధ" అన్నాడు.
విన్న సంధ్య ఆశ్చర్యపోయి తన కొడుకు సమాధిని చూస్తూ "విధి లిఖితం" అని నవ్వుతూ "మీరిద్దరూ ఫ్రెండ్స్ అన్నారు కానీ ఇద్దరు చూడటానికి కొంచెం ఒకేలా ఉన్నారు" అని తన సందేహం తెలియచేస్తూనే..."చెప్పండి మీకేం కావాలి" అంది.
విక్రమ్ : అది మాకు తెలీదు తనకీ నాకు ఈ మధ్యే స్నేహం కుదిరింది కానీ అది ఎంత మంచి స్నేహం అంటే ఒకరి కోసం ఒకరం చచ్చిపోయే అంత....ఇక మేము ఒచ్చిన పని విక్రమాదిత్య గారి గురించి తెలుసుకోవాలి, తను ఎలా చనిపోయాడు, ఈ దేశానికి ఇంత మంచి చేసిన అతని గురించి ఎందుకు మాట్లాడుకోవట్లేదు, కనీసం తన ఫోటో కూడా నెట్ లో దొరకలేదు మాకు...తను చేసిన మంచి అంతా నాశనం అవుతుంటే మీరు ఎలా చూస్తూ ఊరుకున్నారు, మాకు తన కథ చెప్పరా?" అని అడిగాడు...
సంధ్య వాళ్ళని చూస్తూ విక్రమాదిత్య కధ చెప్పడం ఆరంభించింది, నలుగురు శ్రద్ధగా వింటున్నారు, ఇంకొకపక్క....
ఫోన్లో... "రేయ్ చందు ఆ ముసలిదాన్ని వేసేయ్యమని సుపారీ వచ్చింది, చంపడానికి మనోళ్ళని తీసుకెళ్ళోద్దు పది మంది పిల్లల్ని తీసుకెళ్ళు, ఎలా ఉండాలంటే సంధ్య ఫౌండేషన్ బాధితులు కోపం తట్టుకోలేక ఆ ముసలిదాన్ని చంపేశారని రేపు న్యూస్ లో రావాలి".... "అలాగే అన్న సాయంత్రానికి గుడ్ న్యూస్ వింటావ్" అని కాల్ కట్ చేశాడు.
సుమారు రెండు గంటల వరకు కథ విన్న తరువాత సంధ్యని చూసి ఆ నలుగురు...
విక్రమ్ : మానస అంత మోసం చేసిందా?
మానస : కాదు ప్రేమించింది, కానీ మానస ఆ తరువాత బతికే ఉందా చనిపోయిందా?
విక్రమ్ : మానస చిన్నప్పటి నుంచి అనాధ ఆశ్రమంలో ఎందుకు ఉంది.
ఆదిత్య : అమ్మా! మీరు ముందే చనిపోయారు కదా ఎలా బతికారు...
అను : అనురాధ గారికి ఏమైంది, ఆ అడవికి వెళ్ళాక? విక్రమాదిత్య గారు మిమ్మల్ని కలుసుకున్నారా?
మళ్ళీ ఏదో అడగబోతుండగా సంధ్య వాళ్లందరిని ఆపి....
సంధ్య : ఆగండి ఆగండి, మీకు చాలా సందేహాలు అనుమానాలు ఉన్నాయని తెలుసు, మీరు అడిగిన వాటి కంటే నా కొడుకు నన్ను ఎక్కువే అడిగాడు, వాడికి చెప్పిన సమాధానాలే మీకు చెప్తాను...
ఇంతలో ఇంటి ముందు గోల గోలగా సౌండ్ వస్తుంటే అందరూ ముందుకి వెళ్లారు....ఒక పదిహేను మంది అందులో పది మంది ఇంకా మీసాలు రాని పిల్లలు... చేతిలో కత్తులతో వస్తున్నారు, అది చూసి విక్రమ్ మరియు ఆదిత్య అలెర్ట్ గా సంధ్య ముందు నిలబడ్డారు.
సంధ్య : వాళ్ళని ఆపొద్దు ఈ కధలో చివరిగా మిగిలింది నేనే, దీని కోసమే నేను ఎదురుచూస్తున్నాను నన్ను పోనివ్వండి నా కొడుకు దెగ్గరికి వెళ్ళిపోతాను...
ఆదిత్య : అమ్మా మీరు ఈ కోరిక మాకు కథ చెప్పకముందు కోరి ఉంటే కనీసం ఆలోచించే వాళ్ళం.
విక్రమ్ : ఇన్ని ట్విస్టులు పెట్టి నేను పోతానంటే ఎలా ఒక రెండు నిముషాలు టైం ఇవ్వండి ఆ పిచ్చి కుక్కలని తరిమి వచ్చేస్తాం..ఆ తరువాత మిమ్మల్ని చాలా అడగాలి మానస అను ఇద్దరు సంధ్య గారిని లోపలికి తీసుకెళ్లండి...
వచ్చిన అందరిని విక్రమ్, ఆదిత్య ఇద్దరు కలిసి కుమ్మేశారు, ఇంటి లోపల నుంచి మానస అనురాధ కేకలు విని లోపలికి పరిగెత్తారు...
లోపల మానస అనురాధ భయంగా కింద కూర్చుని తల ఎత్తి చూస్తున్నారు, ఇద్దరు వెళ్లి వాళ్ళని పట్టుకుని.
విక్రమ్ : మానస ఏమైంది?
ఆదిత్య : అను...?
అను, మానస ఇద్దరు చేతులు ఎత్తి పైన చీకట్లో దీపాల మధ్యన గోడకి తగిలించి ఉన్న ఫోటోలని చూపించారు...
విక్రమ్ మరియు ఆదిత్య ఇద్దరు తలలు ఎత్తి ఆ ఫోటోలని చూసారు... ఆదిత్య ఆశ్చర్యపోయి రెండు అడుగులు వెనక్కి వేసి పడబోతుంటే విక్రమ్ ఆదిత్య భుజం మీద చెయ్యి వేసాడు.
అను మానస కూడా నిలబడ్డారు... నలుగురు ఆశ్చర్యంగా సంధ్యని చూసారు............... ❤️❤️❤️