Thread Rating:
  • 3 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance స్మిత
#12
స్మితా, స్మితా! ఏంటా నిద్ర? రెండ్రోజుల్లో శాన్వి పెళ్ళి, మనం ఈవేళే వెళ్ళిపోవాలి లేచి లగేజ్ సర్దుకో! అమ్మ సుప్రభాతంతో లేచా.

ఆ కమీజ్ లు కాకుండా మంచి బట్టలు పెట్టికో, లంగాఓణీ లెహెంగా లాంటివి. అక్కడ ఎవరైనా నచ్చుతారేమో అమ్మాయి గారికి. నాన్న పరిహాసం.(తథాస్తు దేవతలు విన్నారేమో) 

శాన్వి మా పెద్దనాన్న కూతురు, నాకన్నా 3 సంవత్సరాలు పెద్దది. నాకు రాధకి చాలా క్లోజ్.నేనే తోడిపెళ్ళికూతురిని. అన్నీ సర్దుకుని పక్కింటి లత ఆంటీ వాళ్ళకి ఇల్లు అప్పజెప్పి చిత్తూర్ బయల్దేరాము. రాధకి ఫైనల్ సెమిస్టర్ పరీక్షల వల్ల తను రావడం లేదు. పెళ్ళీ కబుర్లన్నీ చెప్పాలని ఒట్టేయించుకుంది పిచ్చిది.ఎలాగూ అన్ని విషయాలూ చెబుతాగా

మూడు రోజులు ఎలాగడిచిపోయాయో తెలీలేదు. పెళ్ళి ఆఖరి ఘట్టానికి వచ్చింది. అప్పగింతలయ్యాక భోజనానికి కూర్చున్నప్పుడు జరిగింది నా జీవితాన్ని మార్చేసిన సంఘన. అందరూ తినేప్పుడు అబ్బాయి తరపున వాళ్ళెవరో గొడవ పెట్టుకున్నారు. మా పెద్దనాన్న నాన్న కంగారు పడుతూ వెళ్ళారు, వెనకాలే మనం ఫాలో చేసాం. 

పెళ్ళికొడుకు మేనమామ  అంట, సాంబార్ అడిగితే ఆలస్యం చేసారు అని గొడవ పడుతున్నాడు. పెద్దనాన్న శాన్వి అక్క పాపం టెన్షన్ పడుతూ అతనికి సర్దిచెబుతూంటే ఇంకా రెచ్చిపోతున్నాడు. అప్పుడు వినబడింది వాడి గొంతు. 
'ఏంటి మామయ్యా  మరీ చిన్నపిల్లాడిలా? ఇప్పుడు వాళ్ళు మన బంధువులు, మన కుటుంబం పెరిగింది. అక్కడ నిల్చుని కన్నీళ్ళు పెట్టుకున్న వదిన నీకు కూతురి వరస. ఇప్పుడు చెప్పు నీ కూతురి పెళ్ళిలో నువ్ ఏం చేస్తున్నావ్?'  అని.  
ఒక్కదెబ్బకి అయ్యో అలా ఏం లేదురా ఆకలితో ఉన్నా అని సైలెంట్ అయిపోయాడు. పెద్దనాన్న అక్క మొఖాల్లో రిలీఫ్ కనబడింది. అప్పుడు చూసా అబ్బాయి  తరపువాడు అయ్యుండీ అమ్మాయి వాళ్ళకి సపోర్ట్ ఇచింది ఎవరా అని.. 
నీలిరంగు షెర్వాణీ లో మంచి హైట్ తో పెద్దనాన్నతో మాట్లాడుతున్న కిశోర్ ని చూడగానే గుండె ఝల్లుమంది. ఎంత బాగున్నడు పిలగాడు అనుకున్నాను. పక్కన వాళ్ళు బాధపడితే తట్టుకోలేని తన మనస్తత్వం నాకు చాలా నచ్చింది. తననే చూస్తూ ఉండిపోయా. 
'ఏంటమ్మా సత్యభామా సంబంధం మాట్లాడమంటావా' నాన్న మాటలతో ఈలోకంలోకి వచ్చాను. 
' తను మన మూర్తి మామయ్య క్లోజ్ ఫ్రెండ్ కృష్ణ గారి అబ్బ్బాయి తోడిపెళ్ళికొడుకు తనే ' అన్నారు  నాన్న. మూర్తి మామయ్య అంటే రాధ వాళ్ళ నాన్న.మా నాన్నకి బావ.
' అబ్బాయి బావున్నాడు రెండు చేతులా సంపాదిస్తున్నాడు, మంచి ఫామిలీ. నీదే ఆలస్యం '  అనడంతో ఫో నాన్నా అంటూ వచ్చేసా.  

పక్కకి వచానన్న మాటేగానీ గుండె వేగం తగ్గలేదు, వెంటనే రాధ కి కాల్ చేసాను. స్విచ్ ఆఫ్ వచ్చింది,చదువుల రాక్షసి అని తిట్టుకుంటూ పనిలో పడిపోయా              
అప్పటి నుండి అదేంటో ఎక్కడికి వెళ్ళినా తను కనబడుతున్నాడు, ఫాలో అవుతున్నడా లేక నేను ఫాలో అవుతున్నా అనుకుంటున్నాడా కొంపతీసి అని భయపడ్డా. మొతానికి సంబరంగా పెళ్ళి జరిగిపోయింది. ఎక్కడి వాళ్ళక్కడికి బయల్దేరారు. నాన్నతో ఫోన్లో మాట్లాడుతూ లగేజ్ తీసుకుని కార్ దగ్గరికి వెళ్తూ అనుకోకుండా ఎవరికో డాష్ ఇచ్చాను, తలెత్తి చూసేసరికి గుండె ఆగినంత పనయ్యింది. ఎదురుగా కిశోర్ ఉన్నాడు. నా నోరు ఎండిపోయింది అరచేతుల్లో చెమట పట్టింది. ఏమవుతుందో నాకు అర్థం కాలేదు. ' అయ్యో పడిపోయారా అంటున్న కిశోర్ ని చూస్తూ బొమ్మలా నిల్చున్నా. ఇదేంటి అమ్మయిలకి కూడా ఇలా జరుగుతుందా? సినిమాల్లో చూసి నవ్వుకున్నానే అని అనుకున్నా కాని నా నోట్లోంచి ఒక్క ముక్కా రాలేదు. కాసేపటికి తేరుకుని సారీ అండి అన్నాను. 'పర్వాలేదండీ ఇక్కడ నీళ్ళున్నాయ్ కదా' అన్నాడు. ఫస్ట్ ఇంటెరాక్షన్ ఇలా ప్లాన్ చేసిన దేవుడి మీద పీకల్దాకా కోపం వచ్చింది.
[+] 6 users Like Sunny_T's post
Like Reply


Messages In This Thread
స్మిత - by Sunny_T - 17-05-2022, 01:50 PM
RE: స్మిత - by Sunny_T - 17-05-2022, 01:57 PM
RE: స్మిత - by rajuvenkat - 17-05-2022, 03:39 PM
RE: స్మిత - by Eswar P - 17-05-2022, 04:22 PM
RE: స్మిత - by ramd420 - 17-05-2022, 09:36 PM
RE: స్మిత - by narendhra89 - 18-05-2022, 04:26 AM
RE: స్మిత - by Ravanaa - 18-05-2022, 04:39 AM
RE: స్మిత - by Sunny_T - 19-05-2022, 09:49 AM
RE: స్మిత - by Eswar P - 19-05-2022, 12:23 PM
RE: స్మిత - by ramd420 - 19-05-2022, 02:37 PM
RE: స్మిత - by Venrao - 19-05-2022, 03:08 PM
RE: స్మిత - by Sunny_T - 20-05-2022, 10:18 PM
RE: స్మిత - by ramd420 - 21-05-2022, 04:20 AM
RE: స్మిత - by Ravanaa - 21-05-2022, 05:23 AM
RE: స్మిత - by utkrusta - 21-05-2022, 02:27 PM
RE: స్మిత - by raja9090 - 21-05-2022, 11:08 PM
RE: స్మిత - by Sunny_T - 22-05-2022, 11:15 PM
RE: స్మిత - by raja9090 - 23-05-2022, 01:52 AM
RE: స్మిత - by ramd420 - 23-05-2022, 05:02 AM
RE: స్మిత - by phanic - 23-05-2022, 05:25 AM



Users browsing this thread: 1 Guest(s)