Thread Rating:
  • 2 Vote(s) - 3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
విక్రమ్ ~ లవ్ పార్ట్
#87
(16-05-2022, 08:29 PM)Takulsajal Wrote:
3


ముగ్గురం హడావిడిగా సలీమా ఇంటికి వెళ్ళాం, అప్పటికే ఊరి జనం అంతా పొగయ్యారు ఇంటి లోపలికి వెళ్ళాం, ఫాతిమా అమ్మ ప్రశాంతంగా పడుకున్నట్టే ఉంది, పక్కనే కళ్లెమ్మటి నీళ్లతో కూర్చుని ఏదో ఆలోచిస్తున్న సలీమా నేను కనిపించగానే ఏడుస్తూ పరిగెత్తుకుంటూ వచ్చి కౌగిలించుకుంది.

అమ్మ కూడా కళ్లెమ్మటి నీళ్లతో సలీమా తల నిమిరింది, సలీమా తెరుకొని..

సలీమా : నిన్న కూడా బానే ఉంది అమ్మా చాలా సంతోషంగా ఉంది నిన్నంతా అమ్మ నాతోనే గడిపింది పడుకునేటప్పుడు కూడా తన దెగ్గరే పడుకోమంది బహుశా తనకీ తెలిసిందేమో... అని ఏడ్చింది.

సలీమా అలా ఏడుస్తుంటే చూడలేకపోయాను, ఫాతిమా అమ్మ దెగ్గరికి వెళ్ళాను నవ్వు మొహం తోనే చనిపోయింది కానీ కళ్ళు సగం తెరిచే ఉన్నాయి పాపం సలీమాకి ఇవన్నీ ఏం తెలుస్తాయి కళ్ళు ముయాలని.

ఫాతిమా అమ్మ కళ్ళు మూసి అలానే ఒక ఐదు నిముషాలు పట్టుకున్నాను ఆఖరికి అమ్మ కళ్ళు మూసుకున్నాయ్...

చందు గాడు వెళ్లి కార్యక్రమం నడిపించడానికి మా ఊరి రజాక్ ని ఇంకో ఇద్దరు పెద్ద వాళ్ళని తీసుకొచ్చాడు, ఫాతిమ అమ్మ పక్కన కూర్చుని సలీమా తలని నా గుండెలకి ఆనించుకుని కూర్చున్నాను, సలీమా నా షర్ట్ ని తడుపుతూనే ఉంది.

పక్కనే ఉన్న ఆడవాళ్లు అమ్మ సహాయంతొ ఫాతిమా అమ్మకి సుబ్బరంగా స్నానం చేపించి గంధం పూసి తెల్లటి వస్త్రంతొ చుట్టు కప్పేశారు, అమ్మ తలని కూడా బురఖా లాగ కట్టారు.

సలీమాని పక్కన కూర్చోబెట్టి ఫాతిమా అమ్మని ఎత్తుకుని ఇంటి ముందుకు వచ్చాను, అమ్మ కొత్త సాప పరిచింది దాని మీద పడుకోబెట్టాను ఒక ముసలాయన సాయిబు అత్తరు అడిగాడు, చందు పరిగెత్తుకుంటూ వచ్చి అత్తరు అందించాడు ఆ సాయిబు అత్తరు మొత్తం ఫాతిమా అమ్మ మీద చల్లి ఇంకొక తెల్ల వస్త్రం కప్పి బైటికి వెళ్ళాడు.

ఊర్లో అందరూ ఒక్కొక్కరుగా వచ్చి అమ్మని ఆఖరి చూపు చూసి వెళ్లిపోతున్నారు, లోపలికి వెళ్ళాను రమ్య, పూజ, భరత్ సలీమా పక్కన కూర్చున్నారు.

చందు గాడి మొహం చూసాను వాడు ఏడ్చి మొహం ఉబ్బింది కానీ ఎవరో ఒకరు పనులు చెయ్యాలిగా వాడే మొత్తం చూసుకుంటున్నాడు.

నాన్న, చందు రజాక్ తొ కలిసి మసీద్ కి వెళ్లారు తరువాత కార్యక్రమం చూడటానికి, చందు ప్లేస్ ని భరత్ తీసుకుని పనులు చేస్తున్నాడు..

అమ్మ, ఫాతిమా అమ్మ తల దెగ్గర సాంబ్రాణి కడ్డీలు పెట్టింది, ఒకామె వచ్చి ఫాతిమా అమ్మ మీద గులాబీ రెక్కలు చల్లింది.

చందు వాళ్ళు అమ్మని తీసుకెళ్లాడానికి మసీద్ నుంచి అల్యూమినియం లాంటి పల్లకిని తీసుకొచ్చారు దాన్ని మొయ్యడానికి నాలుగు పొడుగు రాడ్లు ఉన్నాయి.

ఇంతలో ఒక సాయిబు వచ్చి స్మశానంలో మొదట గొయ్యి తీసేటప్పుడు వారసులు ఒక చెయ్యి వెయ్యాలి ఎవరైనా ఉంటే రండి అన్నాడు.

నేనే వెళ్ళాను అది ఒక ఆరు సెంట్లు అంటే మూడు వందల గజాలు ఉంటుందంతే.

మాములుగా ఇలాంటి వాటికీ మా దాంట్లో అయితే పక్క కులం వాళ్లయినా పక్క మతం వాళ్ళైనా ఇలా బాధ్యతలు తీసుకుంటే గోల గోల చేస్తారు ఇక్కడ కూడా అలా జరుగుతేందేమో అన్న భయంతోనే వెళ్లాను కానీ అలా జరగలేదు, అక్కడున్న ఊరి సాయిబులంతా నన్ను ఆహ్వానించారు.

మొదటగా నేను గడ్డపార అందుకుని చిన్న గుంత తవ్వాను ఆ తరువాత పని వాళ్ళు తవ్వడం మొదలు పెట్టారు.

ఇంటికి వచ్చాను అప్పటికే ఫాతిమా అమ్మని చాపలో చుట్టి ఆ పల్లకిలో పెట్టి రెడీగా ఉంచారు, నాన్న ఇక వెళదాం అని సైగ చేసాడు.

లోపలికి వెళ్లి సలీమాని బైటికి తీసుకొచ్చి అమ్మని చూపించాను, నుదిటి మీద ముద్దు పెట్టుకుని తన మీద పడిపోయింది, వంగి తన భుజాలు పట్టుకుని లేపాను, ఒక్కసారిగా నా కాళ్ళని పట్టుకుని గట్టిగా ఏడ్చేసింది.


తననే పట్టుకుని ఇద్దరం గట్టిగా ఏడ్చుకున్నాం అందరూ మమ్మల్ని చూసి కళ్ళ నీళ్లు పెట్టుకున్నారు. నేను గట్టిగా ఏడవడం చూసి సలీమా తేరుకుని లోపలికి వెళ్లి ఒక లెటర్ తెచ్చి నాకిచ్చింది.

సలీమా : అమ్మ నీకు ఇది ఇవ్వమంది అని లెటర్ నా చేతికిచ్చింది.

తీసుకుని జోబులో పెట్టుకున్నాను.

నేను చందు భరత్ రజాక్ మాతొ పాటు ఇంకో నలుగురు అందరం కలిసి పల్లకిని ఎత్తి స్మశానానికి బైలుదేరాం ప్రతి పది సెకండ్లకి  ఒకసారి భుజాలు మారుతున్నాయి కానీ నేను దిగలేదు అలా ట్రాన్స్ లో నా వైపు ముందు ఒక్కన్నే మోస్తున్నాను నా వెనకాల మాత్రం చేతులు మారుతూనే ఉన్నాయి.

స్మశానం చేరుకొని అమ్మని బైటికి తీసి గోతిలో పడుకోబెట్టామ్ అందరూ ముందు నన్నే మట్టిని వేయమన్నారు, మెత్తటి మట్టిని తీసుకుని చిన్నగా తన కాళ్ళ దెగ్గర పోసాను..

పారతో పూడ్చటం మొదలు పెట్టారు నేను అది చూడలేక పోయాను వెనక్కి వచ్చేసాను రోడ్ మీద సలీమా ఏడుస్తూ వచ్చింది పూజ రమ్య ఇద్దరు సలీమాని పట్టుకున్నారు, పూడ్చటం అయిన తరువాత, నాన్న సమాధి చుట్టు నీళ్లు పోసి చక్కగా అలికి అగర్భత్తి వెలిగించి తల దెగ్గర గుచ్చాడు.

నాకు ఎటు కదలబుద్ధి కాలేదు కానీ సలీమా కోసం లేచాను, సలీమాని నాకు ఆనించుకుని తన చుట్టు చేతులు వేసి ఎండలో ఇంటికి నడవటం మొదలు పెట్టాను.

దారిలో అన్ని ఫాతిమా అమ్మ జ్ఞాపకాలే నాకు సలీమాకి అన్నం తినిపించడం, ముగ్గురం ఆడుకోడం, మా ఇద్దరికీ ముద్దులు పెట్టడం అన్ని గుర్తొచ్చాయి.

వచ్చిన ఫ్రెండ్స్ ఊరి వాళ్ళు అందరు ఒక్కొక్కరుగా వెళ్లిపోయారు.. ఇంట్లో నేను అమ్మా నాన్న చందు రమ్య పూజ భరత్ సలీమా మాత్రమే మిగిలాము.

చీకటవడం తొ అమ్మ లైట్ వేసింది, ఆ రాత్రంతా అందరం అక్కడే ఉండిపోయాం, ఎవ్వరం మాట్లాడుకోలేదు ఏమి తినలేదు నేను బైటికి వచ్చి స్ట్రీట్ లైట్ దెగ్గర గచ్చు మీద కూర్చున్నాను.

లెటర్ గుర్తొచ్చి తీసి చదివాను.

ఫాతిమా అమ్మ : "విక్రమ్ నిన్ను నువ్వు చెయ్యలేని కష్టమైన సాయం అడుగుతానని అన్నాను ఇప్పుడు అడుగుతున్నాను, నేను ఎక్కువ రోజులు బతకనని నాకు తెలుసు అందుకే నువ్వు అంత గట్టిగా చెప్పినా నేను హాస్పిటల్ లో చూపించుకోడానికి ఒప్పుకోలేదు సలీమా కోసం కొన్ని డబ్బులు తన పేరు మీద బ్యాంకులో వేస్తూ వస్తున్నాను అవి తనకీ సరిపోవని నాకు తెలుసు.

అందుకే తన బాధ్యత నీకు అప్పగిస్తున్నాను, నీకే ఎందుకు అప్పగిస్తున్నానంటే నాకు సలీమా తరువాత నువ్వు తప్ప ఇంకెవ్వరు లేరు..

తన బాధ్యత తీస్కుంటావా?"

లెటర్ మొహానికి పెట్టుకున్నాను ఏడుపు తన్నుకొచ్చింది "నువ్వు చెప్పాలా అమ్మ నాకు, నేను కాక ఇంకెవరు బాధ్యత తీసుకుంటారు తన గురించి" అలా చాలా సేపు ఏడుస్తూ కూర్చున్నాను.

తరువాత ఇంట్లోకి వెళ్ళాను అమ్మా ఒళ్ళో సలీమా పడుకుని ఉంది ఇంకో పక్క రమ్య పూజ కూడా అలిసిపోయి పడుకున్నారు, చందు భరత్ ఏదో మాట్లాడుకుంటున్నారు, అమ్మ ఒళ్ళో సలీమాని చూస్తూ తనని ఇంటికి తీసుకెళదామని అమ్మకి చెపుదామని అనుకుంటున్నాను, కొంచెం సేపటికి ఎప్పుడు కళ్ళు మూతలు పడ్డాయో తెలీదు లేచేసరికి అమ్మ వస్తువులు అన్ని బ్యాగ్లో సర్దుతుంది.

ఆ అలికిడికి అందరికీ మెలుకువ వచ్చింది మూడు బాగులు సర్దేసి సలీమాని చూస్తూ పదా వెళదాం అన్నాను, అమ్మకి ఏం చెప్పకుండానే ఇలాంటి నిర్ణయం తీసుకున్నందుకు అమ్మని చూడగానే ఏడుపు వచ్చి ఇటు నుంచి నేను అటు నుంచి సలీమా ఇద్దరం కౌగిలించుకున్నాం అది చూసి రమ్య భరత్ చందు పూజ కూడా ఏడుస్తూ అమ్మని కౌగిలించుకున్నారు.

సలీమాని తీసుకుని అందరం మా ఇంటికి వెళ్ళాం, పూజ, రమ్య చందు భరత్ ఇంటికి వెళ్లారు స్నానం చేసి వస్తామని, కానీ నేనే రావద్దన్నాను.

ఒక రోజంతా సలీమాని ఒంటరిగా వదిలేసాను ఆ తరువాత రెండు రోజులు తనని అస్సలు విడిచిపెట్టలేదు, అమ్మ నాన్న నేను సలీమా అందరం కలిసి అన్నవరం వెళ్లి వచ్చాం.

పది రోజులకి సలీమానే నా దెగ్గరికి వచ్చి "విక్రమ్ కాలేజీ కి వెళదాం" అంది.

సంతోషించాను ఇద్దరం రెడీ అయ్యి మిగతా వాళ్ళకి కూడా ఇన్ఫోర్మ్ చేసాం... వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యారు.

బైటికి రాగానే అమ్మ నాకు కీస్ చూపించి నవ్వుతుంది, ముందు అర్ధం కాలా కానీ తరువాత కీ చైన్ చూసాక నాకు సంతోషం ఆగలేదు ఎందుకంటే అది నా డ్రీం బైక్ bmw... 4.5 lakh అది.. ఈ సిటీ లోనే ఎవ్వడి దెగ్గరా లేదు, ఎంత దూరమైనా ఆగకుండా వెళ్లిపోవచ్చు...

సలీమా నా ఆనందాన్ని చూసి తను కూడా నవ్వింది సలీమా నవ్వగానే వెంటనే వెళ్లి హాగ్ చేసుకుని అమ్మ చేతిలో బైక్ కీస్ తీసుకుని బైక్ దెగ్గరికి వెళ్లాను నాన్న బైక్ ని క్లాత్ పెట్టి అక్కడక్కడా తుడుస్తున్నాడు..

ముందు అమ్మని ఎక్కించుకుని స్టార్ట్ చేసాను సౌండ్ వినగానే ఆనందం రెట్టింపు అయ్యింది నాన్న దేవుడికి దణ్ణం పెట్టి రెండు చక్రాలా కింద నిమ్మకాయలు పెట్టాడు, ఒక రౌండ్ వేసి ఆ తరువాత నాన్న ఒకసారి డ్రైవ్ చేసాడు.

సలీమాని ఎక్కించుకుని నేరుగా కాలేజీకి వెళ్ళాను, పూజ చందు భరత్ రమ్య మమ్మల్ని చూసి వావ్ అన్నారు..

పూజ ని ఒక రౌండ్, రమ్య ని ఒక రౌండ్ తిప్పాను మొత్తం కాలేజీ అంతా నా బైక్ నే చూస్తున్నారు నాకు తెలుస్తుంది ఆ ఫీలింగ్ వేరే లెవెల్.

ఆ తరువాత చందు ఒక రౌండ్ వేసి వచ్చాడు, భరత్ కూడా ఒక రౌండ్ వేసి వచ్చి కీస్ నాకు అందిస్తూ..

భరత్ : నా జీవితం లో ఇంత కాస్టలీ బండి నడుపుతానని అనుకోలేదురా.. సూపర్.

చందు : అవును రా విక్రమ్ బలే ఉంది బండి.

భరత్ : ఎప్పుడైనా సంధ్యని తీసుకుని బైటికి వెళ్తాను నేను ముందే చెప్తున్నా నాకు ఇవ్వాల్సిందే బండి.

విక్రమ్ : సర్లేరా బాబు ఇక పదండి క్లాస్ కి.

≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈

సోనియా : అటు చూడవే ఆ సలీమా బైక్ ఎక్కి ఎలా కులుకుతూ వస్తుందో, ఆ బండి నడుపుతున్న వాడేనే విక్రమ్. వీళ్లంతా బిల్డ్ అప్ ఇచ్చేది వాడికే.

మానస తల తిప్పి చూసింది, అదే మొదటి సారి మానస విక్రమ్ ని చూడటం, మెట్ల మీద కూర్చున్న తను విక్రమ్ ని చూడగానే లేచి నిల్చుంది.

సోనియా పల్లవి కూడా లేచి నిల్చున్నారు.

పల్లవి : ఏమైందే?

మానస నుండి ఎటువంటి రెస్పాన్స్ లేదు విక్రమ్ ని అలా చూస్తూనే ఉండిపోయింది, తన కళ్ళలో అప్పటివరకు ఉన్న టెక్కు తనం పొగరు బలుపు అన్ని విక్రమ్ ని చూసిన మొదటి క్షణం లోనే గాల్లో కలిసిపోయాయి.

సోనియా మానసని కదిపింది, మానస తెరుకొని.

మానస : పదండి క్లాస్ కి వెళదాం.

సోనియా : పదా..

వెళ్తూ వెళ్తూ మరొక్కసారి విక్రమ్ ని చూసి వెళ్ళిపోయింది.

అందరిని లోపలికి వెళ్ళమని చెప్పి నేను బైక్ పార్క్ చేసి వద్దామని వెళ్లి క్లాస్ కి వెళ్తుండగా ఒక చప్పుడు వినిపించింది అది చెంప మీద గట్టిగా చాచి పెట్టి కొడితే వచ్చే సౌండ్.

తల తిప్పి చూసాను ఎవరో రూప మేడంకి ప్రొపోజ్ చేసాడు జూనియర్ లెక్చరర్ అనుకుంటా అయినా కూడా మర్యాద లేకుండా పీకింది.

రూప మేడం మా కాలేజీ లోనే స్ట్రిక్ట్ తనని చూస్తే డీన్ కూడా సైలెంట్ అయిపోతాడు అట్లాంటిది తన గురించి తెలిసినా కూడా ప్రొపోజ్ చేశాడంటే అయన గట్స్ కి ఒప్పుకోవాల్సిందే..

క్లాస్ వైపు నడిచాను.

సలీమా పూజ వాళ్ళు లోపలికి వస్తుండగా..

సోనియా : ఏంటి సలీమా తెగ కులుకుతున్నావ్ బండి మీద మొన్నే మీ అమ్మ చనిపోయిందని విన్నాను ఆ బాధ నీలో ఏ మూల కనిపించడం లేదే.

మానస : సోనియా ఊరుకో, సలీమా నువ్వెళ్లు..

ఇదంతా చూసిన పూజ ఇక సహించలేక బైటికి వెళ్లి విక్రమ్ కి జరిగింది చెప్పి మొన్న ఇంక్ మేటర్ కూడా చెప్పేసింది.

విక్రమ్ కోపంగా క్లాస్ లోపలికి వస్తూ మానసని కోపంగా చూసాడు...

అవును కోపంగా చూసాను కానీ నేను చూసింది ఇంతకముందు మానసని కాదు, ఆ బాడీ లాంగ్వేజ్, ఆ కళ్ళు అన్ని వేరే అయినా తన ముందుకి వెళ్ళాను.

పూజ నన్ను చూసి "అదిగో ఆ సోనియానే" అంది, గొంతు పట్టుకుని గాల్లోకి లేపాను, మానస ని చూసాను అయినా తన కళ్ళలో ఇంకేదో కనిపిస్తుంది ఒక పక్క రమ్య వదిలేయ్యమని బతిమిలాడుతుంది ఇంకో పక్క ఇది నా చేతిలో గిల గిల కొట్టుకుంటుంది.

మానస నా కళ్ళలోకే చూస్తుంది ఆ చూపు లో ఏ కమ్యూనికేషన్ లేదు నిషితంగా నన్నే చూస్తుంది.

ఎందుకో సోనియాని వదిలేసాను, గొంతు పట్టుకుని గట్టిగా ఊపిరి పీల్చుకుంది.

అంతలోనే రూప మేడం క్లాస్ లోకి వచ్చింది అందరం వెళ్లి మా ప్లేస్ లో కూర్చున్నాం.

సోనియా : వీడి సంగతి ఎలా చెప్పాలో నాకు తెలుసు, రేపు చెప్తా అని బైటికి వెళ్ళిపోయింది తన వెనకాలే పల్లవి కూడా వెళ్తూ మానసని చూసింది.

మానస : ఇవ్వాళ నాన్న వస్తా అన్నాడు మీరు వెళ్ళండి నేను జాయిన్ అవుతాను.

క్లాసులు వింటున్నాం క్లాస్ క్లాస్ కి మానస బైటికి వెళ్లి లోపలికి వచ్చేటప్పుడు నన్ను చూడటం గమనిస్తూనే ఉన్నాను ఒక సారి నేను చూసినప్పుడు తను తల తిప్పడం తను చూసినప్పుడు నేను తల తిప్పడం జరుగుతూనే ఉన్నాయి.

కాలేజీ అయిపోయాక నేను సలీమా ఇంటికి వచ్చేసాం అలానే మా గ్రూప్ కి పెద్ద వార్నింగ్ ఇచ్చి వచ్చాను ఏం జరిగినా నా దెగ్గర దాచిపెట్టొద్దని ముఖ్యంగా రమ్యకి.

అక్కడ నుంచి ఇంటికి వస్తుండగా ఎందుకో మానస గుర్తొచ్చింది, ఇప్పటి వరకు అసహ్యంగా కనిపించిన ఆ ఫేస్ ఇప్పుడు నాకు నచ్చుతుంది ముఖ్యంగా ఆ కళ్ళు నన్ను అస్సలు కదలనివ్వట్లేదు.

ఇలా నేను ఒక అమ్మాయి విషయంలో డిస్టర్బ్ అవ్వటం ఇదే తొలిసారి....

Suoerooooooo... Superuuuuuuuuu
[+] 2 users Like Dalesteyn's post
Like Reply


Messages In This Thread
RE: విక్రమ్ ~ లవ్ పార్ట్ - by Dalesteyn - 16-05-2022, 09:08 PM



Users browsing this thread: 3 Guest(s)