14-05-2022, 01:56 PM
(11-05-2022, 06:20 AM)stories1968 Wrote:
కైలాసమున ఒకసారి కార్తికేయుడు బ్రహ్మను, సనక-సనందులను హేళన గా మాట్లాడగా శివపార్వతులచే వారించబడగా - పశ్చాత్తాపమున తపస్సు చేయుటకు సర్పరూపము దాల్చాడని.ప్రస్తుతి.
నేల మరుగు న పాము పుట్టలో తపస్సు చేసినందువల్ల కార్తికేయునికి 'మరుగ - మురుగ' నామధేయము వచ్చిందని చెప్తారు (మురుగు అంటే పాముపుట్ట). అగస్త్యుల వారు తన దక్షిణ దేశ యాత్రలో కృష్ణా జిల్లా నాగాయలంక దగ్గర ఉన్న 'మోపిదేవిక్షేత్రానికి వచ్చి పాముపుట్ట మీదనే సుబ్రహ్మణ్యేశ్వర శివలింగమును స్థాపించాడని, కార్తకేయుని 'మురుగ నామధేయము' ను తన దక్షిణదేశ యాత్రలో సార్థకము చేశాడని ప్రశస్తి.
కార్తికేయుడు సర్పరూపము దాల్చి తన లోని బ్రహ్మత్వాన్ని తపమొనర్చుట ద్వారా జాగృతం చేసుకున్నాడు కావునే సుబ్రహ్మణ్యుని 'కుండలినీ' శక్తి గాను, సర్పరూపమున కొలిచే ఆచారములు వచ్చాయని చెబుతారు. దక్షిణ భారతమున ముఖ్యముగా ఆంధ్ర - కర్ణాటక లలో సుబ్రహ్మణ్యుని సర్పరూపమున కొలిచే సాంప్రదాయమును విశేషముగా గమనించవచ్చు.
మోపిదేవి కాక, అనంతపురం రాప్తాడు వద్ధనున్న 'పంపనూరు' అలాగే కర్ణాటక లోని 'కుక్కే - ఘాటి సుబ్రహ్మణ్య' క్షేత్రాలు ఇందుకు ప్రతీతి.
అద్భుతముగా చెప్పారు మిత్రమ బొమ్మల బ్రహ్మ. ఎన్నో కొత్త విషయాలు తెలుసుకున్నాను మిత్రమ. మీ బొమ్మల కోసం అనంతకోటి కళ్ళతో ఎదురుచూస్తున్నాను మిత్రమ.