12-05-2022, 05:56 PM
(10-05-2022, 09:58 PM)బర్రె Wrote: ప్రశ్న : ఆంటే మీదృష్టి లో హింస చేయడం తప్ప? ఒకడు ఇంకోకండి చంపాదనక్కి వస్తే ఏమి చేయకుండా నవ్వుతు ఉండాలంటారా?
అలాగెతే
రాముడు ఎన్నో జంతువులని చంపాడు తిండి కోసం జీవహింస చేసాడు
కృష్ణుడు తన అల్లులని చంపినవాడ్ని చంపాడు స్వస్థలతో...
ధర్మం కోసం కాకుండా ఏంటో మంది రాజులూ జీవహింస చేసారు.. మరి స్వర్గీనికేగిసారు.... దాని అర్థం ఏంటీ
మంచి ప్రశ్న మిత్రమ బర్రె. పగ సాధించడానికి ఆత్మ రక్షణకి చాలా వ్యత్యాసం ఉంది మిత్రమ. రెండింటిలోనూ హింస/శస్త్రములు వాడబడతాయి. ఆత్మరక్షణ తప్పు కాదు. ప్రతి జీవి తన ఆత్మరక్షణ కొరకు చేతనైనంత యుద్ధం చేస్తుంది. అది చిన్న ఎలుకైనా సరే పెద్ద ఏనుగైనా సరే. మాంసాహార జంతువులు కూడా తమ ఆత్మ రక్షణ కోసమే హింస చేస్తాయి. ఆకలేసినప్పుడు మాత్రమే వేటాడతాయి కడుపు నిండాక వేటాడవు. ఆకలి తీర్చుకోవడం కూడా ఒకరకముగా ఆత్మరక్షణ. వాటికి మరి శాఖాహారము అరగదు. వాటి శరీరము అందుకు అనువుగా చేయబడలేదు. అందుకే తప్పని సరి ఐనప్పుడే వేటాడతాయి. ఆ వేట జీవ సమతుల్యం కాపాడి ప్రకృతిని రక్షిస్తుంది. అవి కనుక వేటాడకపోతే శాఖాహార జీవులు ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోయి భూమిపై ఆకులు గడ్డి లేకుండా మేసేస్తాయి. మాంసాహార జీవులు ఒకరకముగా పచ్చదనాన్ని కాపాడుతాయి.
ఇవ్విధముగానే పాలకులు సాధుజీవులని కాపాడటానికి దుష్టులని సంహరించి శిష్టులని కాపాడి లోకములోని సమతుల్యముని కాపాడుతుంటారు. సంహరించడం వలన పాపం కలుగుతుందా అంటే కలుగుతుంది. ఐతే మరి వారు దానికి ప్రాయశ్చిత్తముగా యఙ్ఞములు, దానములు మరియు ఇతర మంచి పనులు చేయవలెను. విష్ణుమూర్తి అవతారములలో దుష్టసంహారం గావించెను. అందుకు ప్రాయశ్చిత్తముగా నిత్యము ధ్యానము/తపము కూడా చేస్తూనే ఉండును కదా విష్ణువు. అలాగే శివుడు కూడా. రావణుడిని చంపినందుకు రామేశ్వరములో ప్రాయశ్చిత్తము గావించెను రాముడు. దొంగచాటుగా వాలిని చంపినందుకు గాను మరు జన్మలో ఆ వాలి ఒక బోయవాడిలా జన్మించగా అతడి బాణముకి కృష్ణుడు మరణించెను. అంతటి వారికే ఈ కర్మ చక్రము తప్పలేదు.
ఈ దుష్టశిక్షణ గావించుటకు మరియు శారీరక శ్రమ కలిగిన పనులు చేయుటకు కావలసిన కండ బలం కోసం మాంసాహారము ఆ వృత్తులు చేపట్టిన వారు మాత్రమే తినవచ్చునని ఒకప్పుడు భావించెడివారు. ఐతే మాంసాహారము బుద్ధి వికాసానికి అవరోధము కలిగిస్తుంది కనుక బుద్దితో పని చెయ్యవలసిన వారు శాఖాహారులవ్వాలని నిర్దేశించారు పెద్దలు. విద్య బోధించు వారు వ్యాపారస్తులు బుద్ధితో పని చెయ్యవలెను కనుక వారు శాఖాహారము తినవలెను అన్నారు.
అధర్మముగా జీవహింస చేసిన వారు నరకానికి కూడా వెళ్ళారు. వారు చేసిన ఇతర పుణ్యాలకి వారుకి కాసేపు స్వర్గవాసము లభించినది. ధర్మరాజు ఒక క్షణ కాలము పాటు నరకములో ఉండెను తాను గురువుకి చెప్పిన అబద్ధము కారణముగా. ఆ తరవాత అతడు స్వర్గానికి చేరెను. ఐతే అక్కడ అప్పటికే దుర్యోధనాది కౌరవులు ఉండేసరికి ఆశ్చర్యపోయాడు ధర్మరాజు. అంతట అతడి తండ్రి ఐన యముడు "పాప పుణ్యములలో ఏది తక్కువైతే దాని ఫలితం మొదట అనుభవిస్తారు జీవులు ఆ తరవాత ఎక్కువ దాని ఫలితం అనుభవిస్తారు" అని చెప్పెను. మహాభారత యుద్ధములో చనిపోయిన వారంతా మొదట వీర స్వర్గానికి చేరెను. వారి పుణ్య కర్మల తాలూకు కాలం ఐపోగానే నరకానికి పోయారని ఒక కథనం.