10-05-2022, 04:53 PM
(09-05-2022, 04:48 AM)బర్రె Wrote: ప్రశ్న : ఎవరైనా మనకి అన్యాయం చేస్తే మన వాళ్లకి అపకారం చేసేదా? లేక వాడి పాపాన వాడే పోతాడు అనేదా?
పోతాడు అనుకోవడం వలన కర్మ బంధం నుండి విముక్తి పొందుతాము మిత్రమ. అన్యాయం అని అనిపించచ్చు కాని అది మనం ఇదివరకు జన్మలో వాడికి చేసిన అన్యాయానికి బదులు. మరలా మనం అపకారం చేసి బదులిస్తే మరలా ఇంకొకసారి వాడు మనకి అపకారం చేస్తాడు. ఇది జన్మజన్మలకి సాగుతూనే ఉంటుంది. ఈ గొలుసులని ముగించిన వారు మహాత్ములయ్యి మోక్షముని పొందారు మిగిలిన వారు ఈ లోకములో కొట్టుమిట్టాడుతున్నారు నూతిలోకి కప్పల్లాగా/పీతల్లాగా