08-05-2022, 02:53 PM
ఎపిసోడ్ ~ 11
గాల్లోకి ఎగిరి పైకి వెళ్తుండగా "రుద్రా" అని వినిపించింది చుట్టు చూసాను.... "ఇలా రా" అని మళ్ళీ వినిపించింది..... ఆ స్వరం ఏదో పురాతన గుడి లో నుంచి వస్తుంది.... గుడి దెగ్గరికి వెళ్ళాను, అది శివుడి గుడి......
గుడి ముందు ప్రాంగణం అంతా అభివృద్ధి చేసారు, కానీ గుడి వెనకాల ఎవ్వరు పట్టించుకోవట్లేదు.... బండలు కూడా వేయలేదు, అంతా మట్టి నేల.... ఎదురుగా పెద్ద శివలింగం, ఆ ప్రాంగణం వరకు పురాతన రాతి బండలు వేసి ఉన్నాయి.... పక్కనే చిన్న గుడి లాగా నాలుగు స్థంబాలు దానికి పై చిన్న పైకప్పు.
అందులో ఒక స్వామీజీ, స్వామీజీ కాదు మహర్షి అనొచ్చు కళ్ళు మూసుకుని రుద్రాక్ష తో "ఓం నమః శివాయ" మంత్రం జపం చేస్తున్నాడు.... బక్కగా ఉన్నాడు కానీ కొంచెం కామెడీగా కూడా ఉన్నాడు
ఆయననే చూసాను కళ్ళు మూసుకునే సడన్ గా "వచ్చావా" అన్నాడు...
రుద్ర : ఎవరు మీరు, నా పేరు మీకెలా తెలుసు..
మహర్షి : కళ్ళు తెరిచి నన్ను చూస్తూ "నా గురించి నీకనవసరం కానీ నేను ఆ రుద్రున్ని తలుచుకున్నాను రుద్రా అంటే శివుడని అర్ధం ఎంత నీ పేరు రుద్ర అయితే మాత్రం నువ్వే శివుడవనుకుంటున్నావా?"
నేను అయోమయం లో పడ్డాను..... నా మొహం చూసి నవ్వుతూ...
మహర్షి : నిన్నే పిలిచాను లే.... అలా అయోమయంగా చూడకు.. అని గట్టిగా నవ్వాడు...
నాకు మండింది.....
మహర్షి : వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను కనీసం నాకు నమస్కారం కూడా పెట్టలేదు.... ఉన్న మూడు శాపాలు సరిపోవా ఇంకోటి ఇవ్వనా? అని కోపంగా చూసాడు...
నాకు చెమటలు పట్టాయ్ ఉన్న మూడిటికే అల్లకల్లోలం అయ్యింది నా జీవితం , వెంటనే అయన ముందు బొక్క బొల్లా పడి అష్టాంగ నమస్కారం చేశాను "శరణు శరణు" అంటూ....
మనస్ఫూర్తిగా "చిరంజీవ" అని ఆశీర్వదించి మళ్ళీ గట్టిగా నవ్వుతూ జోక్ చేశాను లే లే..... అన్నాడు
ఆమ్మో ఈయన తో చాలా జాగ్రత్తగా ఉండాలి అనుకున్నాను...
రుద్ర : స్వామి నా శాపాల గురించి మీకు ఎలా తెలుసు, ఇంకా.... అని అడగబోతుండగా...
మహర్షి : ముందు వచ్చిన పని చూడు.....ఏంటి ఏదో వెతుకుతున్నట్టున్నావ్ దొరకట్లేదా? అన్నాడు.
రుద్ర : అవును స్వామి అని ఇప్పటి వరకు జరిగినదంతా అయనతో చెప్పాను....
మహర్షి : ఇలా రా నా ముందు కూర్చో...
వెళ్లి అయన ముందు బాస్పటలు వేసుకుని కూర్చున్నాను.... నన్ను ఒక రెండు సెకండ్లు ఎగా దిగా చూసి కోపంగా "కళ్ళు మూసుకో.. అన్ని చెప్పాలా" అని అరిచాడు....
వెంటనే కళ్ళు మూసుకున్నాను....
మహర్షి తన కుడి చేతి బొటన వేలు చూపుడు వేలు చిటికిన వేలు రుద్ర నుదిటి మీద పెట్టి ఎడమ చేత్తో అవే వేళ్ళని తన నుదిటి మీద పెట్టుకున్నాడు ఇద్దరి చుట్టు మొత్తం చీకటి అలుముకుంది, మహర్షి నుదిటి మీద నుంచి చిన్నగా ఒక కాంతి పెద్దగా అవుతూ చేతుల ద్వారా రుద్ర నుదిటి మీదగా తన లోపలికి వెళ్లి ఆగిపోయింది ఇదంతా జరగడానికి రెండు నిముషాలు పట్టింది.... ఆ తరువాత మళ్ళీ మాములు స్థితికి వచ్చారు ఇద్దరు.
చిన్నగా కళ్ళు తెరిచాను..... మహర్షి తన కళ్ళు తెరిచి నన్ను చూస్తూ.... "రుద్రా ఇప్పుడు నీకు భోధించిన మంత్రం ఐక్య మంత్రం.... నువ్వు ఒక్కడివే ఆ రాక్షసులను ఒంటరిగా ఎదురుకోలేవు అందుకే ఈ మంత్రం భోదించాను, కానీ ఇందులో ఒక తీరకాసు ఉంది నువ్వు ఈ మంత్రం ఉపయోగించాలంటే నీతో పాటు నువ్వు ఐక్యం చేసుకునే వారికీ ఇద్దరికీ సరి సమానమైన బలం ఉండాలి" అన్నాడు.
రుద్ర : నాతో సమాన బలం కలది నాకు తెలిసిన ఏకైకది లిఖిత మాత్రమే, తనకంటే నాకు శక్తులు ఎక్కువ కానీ బలం సమానం.
మహర్షి నవ్వుతూ ఇక్కడ ఇంకొక మెలిక కూడా ఉంది, దేవతా లోకం వారు రాక్షస లోకం వారు ఇద్దరు ఐక్య మంత్రం ఉపయోగించడం సృష్టి విరుద్దం.. దాని పర్యావసానాలు అనుభవించక తప్పదు అన్నాడు.
మహర్షి కన్నుకొట్టాడు దానికి నేను నవ్వాను.....
తిరిగి స్థావరానికి వచ్చాను లిఖితకి ఇంకా స్పృహ రాలేదు, తన నుదిటి మీద కుడి చేతి బొటన వేలు చూపుడు వేలు చిటికిన వేలు పెట్టి కళ్ళు మూసుకుని ఐక్య మంత్రం చదివాను.... అంతే పెద్ద వెలుగు వచ్చి లిఖిత నా బాడీ లో కలిసిపోయింది....
నన్ను నేను చూసుకున్నాను, నా చేతులు ఎర్రగా ఉన్నాయి నరాలు తేలుతున్నాయి, నరాల్లో రక్తం వెయ్యి రెట్లు వేగంగా ప్రవహించడం నాకు తెలుస్తుంది, నా కండ బలం మాత్రమే కాదు బుద్ధి బలం కూడా ఎన్నో రెట్లు పెరిగింది, నా బాడీ కొన్ని వందల కిలోమీటర్లు ప్రయాణించిన తరువాత వేడెక్కిన బుల్లెట్ బండి ఇంజిన్ లా వేడెక్కిపోయి ఉంది, ఒక్క సారి గా లిఖిత మైండ్ నా మైండ్ తో కలిసిపోయింది, లిఖిత ఆలోచనలు ఊహలు తన జ్ఞాపకాలు శక్తులు అన్ని నాలో ఐక్యం అయిపోయాయి.
లిఖిత స్పృహ లో లేక పోతేనే ఇలా ఉంటే ఇక లిఖిత స్పృహలోకి వస్తే నా బలం ఎలా ఉంటుందో అనుకున్నాను...
ఇప్పుడు లిఖిత అమ్మ ఎక్కడుందో నాకు తెలుసు....వెంటనే గాల్లోకి ఎగిరాను, నా మాములు వేగం కన్నా వంద రెట్ల స్పీడ్ తో.... లిఖిత అమ్మ ఉంది శని గ్రహం (saturn) చుట్టు తిరుగుతున్న ఒక నక్షత్రం మీద....వీలైనంత వేగంగా ఎగిరాను....
నక్షత్రం మీద అడుగు పెట్టడానికి నేల లేదు ఆ గ్రహం మొత్తం ఎర్రటి వాయువుల తో నిండి పోయింది, ఒక ఆకర్షణ శక్తి నన్ను ఎప్పుడు లోపలికి లాగేసుకోడానికి సిద్ధంగా ఉంది.
ఇంకో పక్క విపరీతమైన చలి ఎందుకంటే ఆ నక్షత్రం మొత్తం అమ్మోనియం, హైడ్రోజెన్, హిలియం గ్యాస్ తో నిండిపోయింది, నేను ఒక్కణ్ణి వచ్చి ఉంటే ఈ పాటికి స్పృహ కోల్పోయే వాణ్ని...
ఒక్కసారిగా ఎగిరి రాక్షసుల మధ్యలో నిల్చున్నాను, లిఖిత అమ్మని గొలుసుల మధ్యలో కట్టేసి నానా హింసలు పెడుతున్నారు, పది అడుగులు ఉన్న తన ఒంట్లో నుంచి రక్తం ఏర్లయి పారుతుంది.... చుట్టు చూసాను అంతా గోల గోల గా అర్ధం కానీ బాషలో అరుస్తున్నారు, ఒక్కసారిగా నా చుట్టు సర్కిల్ లో ఉన్న అందరూ నా వైపు పరిగెత్తడం మొదలు పెట్టారు....
ఎడమ చేత్తో లిఖిత శక్తిని తలుచుకున్నాను రాక్షసులకి సంబంధించిన రెండు వైపులా పద్దునైన నా అంత పెద్ద గొడ్డలి నా ఎడమ చేతిలో ప్రత్యేక్షమైంది, కుడి చేత్తో నా శక్తులని తలుచుకున్నాను త్రిశులం ప్రత్యేక్షమైంది.....
ఒక చేత్తో గొడ్డలి తో తలలు నరుకుతూనే ఇంకో చేత్తో త్రిశులంతో రాక్షస సంహారం చేయసాగను.... నాకు యుద్ధం చేస్తుండగా అర్ధం అయ్యింది ఏంటంటే వీళ్లంతా కాపలా దారులు మాత్రమే లిఖిత అమ్మని బంధించినది వెరెవరో ఉన్నారు..... ఎర్రటి వాయువులలో ఎర్రటి రక్తం కలిసిపోయింది.
అక్కడున్న అందరిని చంపేసి లిఖిత అమ్మని తీసుకుని తిరిగి భూమ్మిదకి వచ్చేసాను....
లిఖిత అమ్మని నయం చెయ్యాలంటే నా ఒక్కడి శక్తి సరిపోదు అందుకే లిఖిత నా లోపల ఉండగానే తనని నయం చేశాను....
మంచం మీద పడుకుని ఐక్య మంత్రాన్ని వెనక్కి తీసుకున్నాను లిఖిత నా మీద పడింది, తన శరీరమంతా గడ్డ కట్టుకు పోయింది....
ఇందాక నాకు హాని చెయ్యాల్సిన ఆ గ్యాస్ టెంపరేచర్ ని నాకు తెలియకుండానే లిఖిత వైపు మళ్ళించానని గ్రహించాను.
వెంటనే తన పెదాలని అందుకుని గట్టిగా హత్తుకుని నా ఎంగిలి మొత్తం తన నోటిలో పొసేసాను... లిఖిత ని పడుకో బెట్టి వాళ్ళ అమ్మకి అప్పగించి లేచాను.
ఇక రాజినీ కలుద్దాం అని ఒక్క నిమిషం కూడా ఆగకుండా బైలుదేరాను నా రాజీ కోసం.....