Thread Rating:
  • 9 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
ప్రియ శత్రువు
ఎపిసోడ్ ~ 9



శివ రాధ ని డాబా మీదక తీసుకెళ్లాడు, రాధా డాబా మీద పడుకుని ఆకాశం లో చుక్కలు చూస్తూ ఉంది...

శివ తన పక్కనే పడుకుంటూ, "రుద్ర కి ఈ అలవాటు నీ నుంచే వచ్చిందా?" అన్నాడు.

రాధ : నేను ఎప్పుడు ఇలా పడుకోలేదు, ఇదే మొదటి సారి...

శివ : రుద్ర కి బాధ వచ్చినా, కోపం వచ్చినా ఇంకేదైనా ఆలోచనలో ఉన్నా ఇలా రాత్రి పూట వచ్చి చుక్కలు లెక్కపెడుతూ ఉంటాడు... నేను చాలా సార్లు గమనించాను...

రాధ : ఇక ఈ టాపిక్ తనకీ ఇష్టం లేదు అన్నట్టు అటువైపు తిరిగింది....

శివ రాధ నడుము మీద చేతిని వేసి దెగ్గరికి లాక్కుంటూ... "చూసావా రుద్ర ఇద్దరు పిల్లలని ఎంత బాగా చూసుకుంటున్నాడో ఒక రకంగా నీకంటే వాడే బాగా చూసుకుంటాడు తెలుసా" అన్నాడు..

చెయ్యి విధిలించి కొట్టింది కానీ ఎమ్మటే ఇటు వైపుకు తిరిగి శివ గుండెల మీద పడుకుని కళ్ళు మూసుకుంది కళ్ళలో నీళ్లు బైటికి రావట్లేదు తనకీ..

శివ : రేపు గుడికి వెళ్తున్నావా?

రాధ : వెళ్తాను...

శివ : ప్రతి నెలా పున్నమి తెల్లారే వెళ్లి గుడిలో దీపం పెడతావ్ అదేం మొక్కు నాకు అర్ధం కావట్లేదు, నేనెక్కడా వినలేదు ఏం మొక్కుకున్నావో చెప్పవా?

శివ రాధా నిద్ర పోవడం గమనించి తనని జో కొడుతూ ఆకాశం లో ఉన్న నిండు చంద్రుడిని చూస్తూ తను కూడా నిద్ర లోకి జారుకున్నాడు...

ఇప్పటిదాకా పడుకుని ఉన్నందువల్ల లిఖిత కి నిద్ర రావడం లేదు సుబ్బరంగా తినేసి హాల్లోకి వచ్చింది, రుద్ర పిల్లల్ని పడుకోబెట్టుకుని తను కూడా పడుకోడం చూసి వెళ్లి ఫ్యాన్ వేసి మొగుడి పక్కనే గోడకి అనుకుని కూర్చుంది....

ఇందాక నిద్ర లో తన కళ్ళ ముందు మెదిలిన దృశ్యాలు ఒక్కొక్కటిగా కనిపించసాగాయ్... భయపడుతూ రుద్ర ని చూస్తూ అలానే గోడకి అనుకుని నిద్ర పోయింది...


పొద్దు పొద్దున్నే కన్నా గాడు కదలడంతో  మెలుకువ వచ్చింది, లేచి చూస్తే అమ్ములు కన్నా ఇద్దరు లేచే ఉన్నారు.... కన్నా నన్ను చూస్తూ "ఆమ్ తింటా" అన్నాడు.

వెంటనే లేచి లైట్ వేసి బొమ్మలు వాళ్ళిద్దరి ముందు వేసి కిచెన్ లోకి వెళ్లి సిర్లేక్ కలుపుకుని వచ్చాను, గోడకున్న వాచ్ లో టైం చూసాను నాలుగు కావొస్తుంది పక్కనే చూసాను గోడకి ఆనుకుని లిఖిత పడుకుని ఉంది....

పక్కనే కుర్చీ ఉండటం వల్ల లిఖిత మీద నీడ పడి ఉండటం పిల్లలు నిద్ర మత్తు లో ఉండటం వల్ల లిఖితని ఇంకా చూడలేదు, ఇంకా నయ్యం చూసి ఉంటే మళ్ళీ దడుచుకునేవాళ్ళు అని చేతిలో ఉన్న గిన్నె పక్కకి పెట్టి లిఖిత ని ఎత్తబోయాను లేవలేదు....

ఏంటబ్బా ఇది నాకు లేవట్లేదు మళ్ళీ నా పవర్స్ పోయాయా అనుకున్నాను కానీ ఈ లోగా అమ్ములు పాస్ పోసింది వెంటనే ఇద్దరినీ ఎత్తుకుని నా రూంలోకి తీసుకెళ్ళాను.... అమ్ములు కాళ్ళు కడిగి టవల్ తో తుడిచి లోపలికి వెళ్లే లోగా కన్నగాడు కూడా పాస్ పొసేసి దాంట్లో చెయ్యి పెట్టి ఆడుతున్నాడు....

"కన్నా" అన్నాను వాడిని చూస్తూ వాడు గట్టిగా నవ్వుతూ దొల్లుతున్నాడు.... అమ్ములుని బెడ్ మీద కూర్చో బెట్టి ఒక క్లోత్ తీసుకొచ్చి తడి ఉన్న దెగ్గర వేసి, బాత్రూం లో గీజర్ ఆన్ చేసి "నిన్నూ" అంటూ కన్నా గాడిని ఎత్తుకేళ్లి ఒళ్ళంతా కడిగాను....

వాడి ఒంటి మీద బట్టలు లేవు వాడి బట్టలు తేవాలంటే అమ్మ రూమ్ లోకి వెళ్ళాలి, అమ్మని కూడా చూడొచ్చని అని ఇద్దరికీ చెరొక స్పూన్ నోట్లో కుక్కి అమ్మ రూమ్ లోకి వెళ్ళాను, మొదటి సారి అమ్మ రూంకి రావడం....

రూమ్ లో అమ్మ లేదు శివ సర్ కూడా లేడు, చుట్టు చూసాను గోడల నిండా కన్నా,అమ్ములు, శివసర్ అమ్మ పెళ్లి ఫోటోలు తగిలించి ఉన్నాయి.... నా ఫోటో కోసం ఆశగా వెతికాను ఉండదని నాకు తెలుసు కానీ నా కళ్ళు నా మాట వినకుండా వెతుకుతూనే ఉన్నాయ్, మెయిన్ డోర్ చప్పుడు వినిపించి సెల్ఫ్ లో ఉన్న కన్నా గాడి జూబ్బా డ్రాయర్ అందుకుని బైటికి పరిగెత్తాను డోర్ ఎదురుగా అమ్మ..... అమ్మని తగులుకుని ఇద్దరం కింద పడ్డాము నేరుగా అమ్మ మీద పడ్డాను, లేవకుండా అలానే కళ్ళు మూసుకుని అమ్మ వెచ్చదనాన్ని ఆస్వాదిస్తున్నాను అమ్మ నన్ను లేపడానికి ట్రై చేస్తుంది కానీ తనని గట్టిగా కౌగిలించుకున్నాను వదల్లేదు, మోకాలితో తన్ని నన్ను విడిపించుకుని లేచి నిల్చుంది, లేచి నిల్చుని తన కళ్ళ లోకి చూస్తూ చేతిలో ఉన్న జూబ్బ డ్రాయర్ పైకి ఎత్తాను..... చెంప మీద గట్టిగా కొట్టింది.... నాకు నొప్పి తెలుస్తుంది పరవాలేదు ఎన్నైనా అనుభవిస్తాను అనుకున్నాను.....

ఈ లోగా అమ్ములు నోట్లో సిరిలేక్ అయిపోయిందనుకుంటా గట్టిగా ఒక కేక వేసింది అమ్మ అది విని నా రూమ్ లోకి వెళ్లి ఇద్దరినీ సిర్లేక్ గిన్నెని తీసుకుని అమ్మ రూమ్ లోకి వెళ్లి గట్టిగా తలుపేసుకుంది...

ఆ శబ్దనికి లిఖిత లేచి కూర్చుంది, నన్ను చూసి కిచెన్ లోకి వెళ్లి ప్లేట్ నిండా ఫ్రూట్స్ కట్ చేసుకోచ్చి నా చేతిలో పెట్టి "రాత్రి నుండి ఏం తినలేదు తిను" అని నా చేతికిచ్చి లోపలికి వెళ్ళింది.

నిజమే విపరీతంగా ఆకలేస్తుంది, ప్లేట్ అందుకుని తన వెనకాలే వెళ్లి బెడ్ మీద కూర్చుని తింటున్నాను.

ఆకలి మీద గబ గబా తినడం చూసి గట్టిగా నవ్వింది పోవే నీ తిండి ముందు నాది ఎంత అనుకున్నాను.

దానికి లిఖిత నా టేబుల్ సోరుగు లో ఉన్న ఎండిపోయిన పువ్వుని చూపించి ఈ ఎండిపోయిన పువ్వుని ఎందుకు దాచుకున్నావ్ అని పువ్వుని నలిపేసింది.... నేను కోపం ఆపుకోలేక "నీ అమ్మ నీకెందుకే........................" నేను కోపంతో మాట్లాడుతుండగానే లిఖిత కళ్ళు ఎర్రబడిపోయాయి, కాలితో నా గుండెల మీద తన్నిన్ది ఎగిరి రూమ్ గోడ పగలకొట్టుకుని అమ్మ వాళ్ళ డోర్ కూడా విరిగిపోయి అవతల గోడలో ఇరుక్కు పోయాను..... నా నోట్లో నుంచి రక్తం వస్తుంది....నాకు పవర్స్ పోవడం ఇది ఐదవ సారి...

మళ్ళీ ఏం జరుగుతుందో అర్ధం కాలేదు, ఎదురుగా చూసాను లిఖిత కోపం గా వచ్చి ఇంకొక తన్ను తన్నిన్ది అంతే ఇక అంతా సూన్యం....

శివకి మెలుకువ వచ్చి చూసుకుంటే డాబా మీద ఉన్నాడు పక్కన రాధ లేదు, ఇవ్వాళ పొద్దున్నే ఐదు గంటలకే గుడికి వెళ్తుంది కదా అనుకుని లేచి కిందకి వెళ్ళాడు, రూమ్ లో చూస్తే పిల్లలిద్దరికీ సిర్లేక్ పెట్టుకుంటుంది...

శివ : రాధ గుడికి వెళ్లలేదా ఇవ్వాళా?

రాధ : లేదండి వెళ్తాను.... అంటుండ గానే రూమ్ డోర్ విరిగి రుద్ర గాల్లో ఎగురుకుంటూ గోడకి గుద్దుకుని పడ్డాడు నోట్లో నుంచి రక్తం కారుతుంది....

శివ కంగారుగా రుద్ర దెగ్గరికి వెళ్ళాడు, కోపంగా లిఖిత వచ్చి రుద్ర ని ఇంకొకటి తన్నిన్ది.... అంతే రుద్ర స్పృహ కోల్పోయాడు....

లిఖిత బలాన్ని చూసిన శివ రాధ ఇద్దరు భయపడ్డారు, రాధ వెంటనే ఏడుస్తున్న పిల్లలిద్దరినీ శివ కి ఇచ్చేసి ఏడుస్తూనే స్కూటీ కీస్ అందుకుని బైటకి పరిగెత్తింది.

లిఖితకి తను ఏం చేసిందో అప్పుడు గుర్తొచ్చింది కానీ ఆశ్చర్యపోయింది నేను తంతే రుద్ర కి ఈవిధంగా జరిగిందేంటి అని, రుద్ర చాలా బలవంతుడు కదా అన్న సందేహం తోనే రుద్ర స్పృహ కోల్పోడం తో తనని ఎత్తుకుని ఏడుస్తూ బెడ్ మీద పడుకోబెట్టి తన తలని తొడల పై వేసుకుని తన్నిన చోట చూద్దామని రుద్ర షర్ట్ గుండీలు తీసింది.

ఇదంతా చూసిన శివకి ఏం అర్ధం కాలేదు, అస్సలు ఏం జరుగుతుంది ఇక్కడ అనుకున్నాడు, అటు సొంత తల్లీ ఇంత జరిగితే స్కూటీ కీస్ తీసుకుని బైటికి వెళ్ళిపోయింది, ఇటు తన్నిన పెళ్ళాం ఏమో ఏడుస్తూ ఎత్తుకుని పోయింది... అయినా లిఖిత కి ఇంత బలమా.... ఎవరు ఈ లిఖిత..... రుద్ర రాజీని అంతగా ప్రేమించి ఈ లిఖిత ని ఎందుకు పెళ్లి చేసుకున్నాడు...

లోపలికి వెళ్లిన లిఖిత రుద్ర గుండె పై లిఖితకి తన పాదం స్పష్టంగా కనిపిస్తుంది ఎర్రగా కమిలిపోయి పచ్చటి నరాలు పైకి తేలాయి...

కానీ చిన్నగా నయం అవ్వడం లిఖిత గమనించి అలా ఏడుస్తూనే రుద్ర మొహానికి తన మొహాన్ని ఆనించి కళ్ళు మూసుకుంది....


లిఖిత నన్ను తన్నిన్ది గుర్తుకొచ్చి సడన్ గా కళ్ళు తెరిచాను నా కళ్ళ ఎదురుగా లిఖిత మొహం కళ్ళు మూసుకుని ఉంది, తన కంటి చివర ఒక కన్నీటి బొట్టు వేలాడుతూ ఉంది....

లేచి లిఖిత మొహం తప్పించి లేచాను తను కూడా లేచింది....

ఒకసారి చూసుకున్నాను ఒళ్ళంతా బానే ఉంది, గుండె చూసుకున్నాను అదీ బానే ఉంది....పవర్స్ మళ్ళీ పని చేస్తున్నాయి అనిపించింది... లిఖిత ని చూస్తూ "ఒకసారి కొట్టు" అన్నాను.

లిఖిత అయోమయంగా నన్ను చూసింది.... "పర్లేదు కొట్టు" అన్నాను చెయ్యి ఊపింది చిన్నగా.... గట్టిగా పట్టుకున్నాను...


దానితో లిఖిత కొంచెం గట్టిగా కొట్టింది మళ్ళీ బ్లాక్ చేశాను.... ఈ సారి లిఖిత కాలితో మళ్ళీ గుండెల మీద తన్నిన్ది కానీ ఏం కాలేదు అలానే నిలబడ్డాను...

లిఖిత బెడ్ మీద కూర్చుంది.... తన రెండు చేతులు పట్టుకుని "లిఖితా నన్ను క్షమించు ఏదో ఆవేశంలో నోరు జారాను, నిజంగా మీ అమ్మనని కాదు నా ఉద్దేశము కాదు కోపం లో అలా వచ్చేసింది సారీ" అన్నాను....

దానికి లిఖిత లేచి గట్టిగా హత్తుకుని ఏడ్చింది, నాకు విదిలించుకోవాలని ఉన్నా జరిగిన దాంట్లో నా తప్పు ఉంది అందుకే మౌనంగా నిల్చున్నాను....

బైట ఉన్న శివ పిల్లలని పడుకోబెట్టి ఆలోచించసాగాడు....రుద్ర ఎటువంటివాడో నాకు తెలుసు అలా ప్రేమించిన అమ్మాయిని పక్కన పెట్టె రకం కాదు, చాలా మొండోడు... అలాంటివాడు లిఖిత ని పెళ్లి చేసుకోడం ఏంటి.... ఎందుకు లిఖిత ముందు అంత తగ్గి ఉంటున్నాడు.... లిఖితకి అంత బలం ఎక్కడిది ఎవరు ఈ లిఖిత అని తల పట్టుకు కూర్చున్నాడు...

ఇందాక జరిగిన దానికి నేను అమ్మ రూమ్ చూద్దామని వెళ్ళాను పిల్లలు పడుకుని ఉన్నారు... శివ సర్ ని పలకరించాను నన్నే ఆశ్చర్యంగా చూస్తున్నాడు....

శివ : రుద్ర నువ్వు ఎలా? లిఖిత.....

రుద్ర : సర్ అదంతా నేను మీకు తరవాత చెప్తాను, అమ్మ ఎక్కడ?

శివ : ఎక్కడికెళ్ళిందో నాకు తెలుసు నువ్వు పిల్లలని చూస్తూ ఉండు నేను వెళ్లి వస్తాను....

శివ సర్ బైటికి వెళ్ళాక ఫ్రెండ్ కి కాల్ చేసి పని వాళ్ళతో పగిలిన గోడలు బాగు చేపించమని పురామయించాను..

శివ కార్ తీసి గుడికి పోనిచ్చాడు.... లోపలికి వెళ్ళాక తను చూసింది....

రాధ ఒక పెద్ద శివలింగం ముందు రుద్రాక్ష తో తపస్సు చేసుకునే పద్ధతి లో కూర్చుని ఏదో ప్రార్ధిస్తుంది....

రాధ ప్రార్ధన అయిపోయేదాక ఉండి రాధని కార్ ఎక్కమన్నాడు కానీ రాధ స్కూటీ వేసుకుని ఇంటికి వచ్చింది....

పిల్లలు లేచారు అమ్మ తన రూమ్ లోకి వచ్చింది నేను వెంటనే తన రూమ్ నుంచి బైటికి వచ్చేసాను...

శివ సర్ లోపలికి వచ్చి నన్ను చూస్తూ లోపలికి వెళ్ళాడు.. నేను హాల్లో నే నిల్చున్నాను.

అమ్మ మాటలు నాకు వినబడుతున్నాయి....

రాధ : ఏవండీ మనం ఇక్కడనుంచి వెళ్లిపోతున్నాం.

శివ : రాధా?

రాధ : "ఇంకేం మాట్లాడొద్దు వెళ్తున్నాం అంతే నేను పిల్లలని తీస్కుని కార్ లో కూర్చుంటాను ప్రస్తుతానికి కావాల్సినవి తీస్కుని వచ్చేయండి".. అని అమ్ములు ని ఎత్తుకుని బైటికి వచ్చింది...

నాకు ఏదోలా అనిపించింది పొద్దున్న అమ్మ తో అలా ప్రవర్తించినందుకే అనుకున్నాను...

వెళ్లి తన కాళ్ళ మీద పడ్డాను ఆగింది... "అమ్మ  ప్లీజ్ మా వెళ్లొద్దమ్మ ఇంత పెద్ద శిక్ష వెయ్యకమ్మా " అని ఏడ్చాను..

నా చేతిని తన్ని "అమ్మా అని పిలవకు అసహ్యంగా ఉంది నాకు ఉంటే నువ్వైనా ఉండాలి లేదా నేనైనా ఉండాలి అంతే"

రుద్ర :  ఇంత అవమానం, నీస్సిగ్గుగా నాకు ఎప్పుడు అనిపించలేదు, ఈ అవమానాన్ని తట్టుకోలేక పోయాను.. అమ్మ మీద కోపం వస్తుంది...."నేనే వెళ్లి పోతాను " అన్నాను..

రాధ : వెంటనే వెళ్ళిపో....

అలానే బైటికి వచ్చేసాను.... పిల్లలిద్దరికి నుదిటి మీద ముద్దు ఇచ్చి బైటికి వచ్చాను..... పిల్లలకి ఏమర్ధమైందో తెలీదు కానీ ఏడుస్తున్నారు... శివ సర్ వెనక వచ్చాడు రెండు సార్లు పిలిచాడు నేను పాలకలేదు..... బైటికి వచ్చి గాల్లోకి ఎగిరి నా స్థావరానికి వచ్చేసాను.... నా వెనుకే లిఖిత కూడా వచ్చేసింది ...
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.


Messages In This Thread
RE: ప్రియ శత్రువు - by Pallaki - 06-05-2022, 08:48 PM



Users browsing this thread: 70 Guest(s)