06-05-2022, 07:40 AM
(06-05-2022, 04:11 AM)Takulsajal Wrote: మీరు చెప్పిన ప్రతి సవరణ నేను కథ రాస్తున్నప్పుడే గమనించాను...
విక్రమ్ కి నిజాలు తెలుసుకునేంత టైం ఇవ్వకూడదు అనుకున్నాను తన జాతకం లో అన్ని కష్టాలే ఉంటాయి అలాగే తనకిష్టం లేని రక్తపాతమే తను ఎంచుకుని దాని ద్వారా బాధ పడుతుంటాడు... ఇదంతా కధలో జరుగుతున్న స్టోరీ చదువుతుంటేనే పాఠకులకి అర్ధం కావాలని అనుకున్నాను కానీ అందులో విఫలం అయ్యాననే చెప్పాలి..
ఆఫీస్ వర్క్ వల్ల నేను అప్డేట్ రాస్తున్నప్పుడు ఇంతక ముందు అప్డేట్ లో ఏం రాసానో కూడా కొన్ని సార్లు చదివే వాడిని కాదు అది పూర్తిగా నా తప్పే... ఒక అప్డేట్ ఫాస్ట్ గా వెళ్ళిపోడం ఇంకొకటి సాగ పీకడం, నిజం చెప్పాలంటే ఈ కథని ముగించడానికి చాలా వరకు కథని ట్రిమ్ చేశాను అందుకే మీకు సీజన్ 1 కి సీజన్ 2 కి లింక్ తెగినట్టు అనిపించింది ఉంటుంది... నాకు తెలిసి ఇది ఐదు సీజన్ల కద కానీ ఎందుకో నాకు ముగించేయ్యాలనిపించింది..
ఇక ఇంతక ముందు చెప్పినట్టు గానే నేను అస్సలు రైటర్ ని కాదు అలోచించి రాసి మళ్ళీ దాన్ని ఇంకోసారి రివ్యూ చేసుకుని అప్డేట్ చేసేంత టైం నాకు ఉండదు.... నేను ఏ అప్డేట్ ఇచ్చినా అది అప్పటికప్పుడు వేడి వేడి సమోసాల లా రాసినదే... టైపింగ్ లో నే లేట్ తప్ప అరగంట గంట కంటే ఎప్పుడు అంత కంటే ఎక్కువ సేపు ఏ ఎపిసోడ్ రాయలేదు....
ఇక మీ రివ్యూ వల్ల నేను బాధ పడట్లేదు చెప్పాలంటే చాలా ఆనందం గా ఉంది.
మీరు నా బిగ్గెస్ట్ క్రిటిక్
మీరు కామెంట్ చేసిన ప్రతి సారి నా రచన లో మార్పు ని నేను గమనిస్తూనే ఉన్నాను..
మీ వాల్ల నాకు మంచే జరిగింది...
ఇలాగే నా తప్పు ఒప్పులని గుర్తు చేస్తూ మీ సపోర్ట్ ఎల్లప్పుడూ ఉంటుందని ఆసిస్తూ...
ధన్యవాదాలు..
❤️❤️❤️❤️❤️
మీరు constructive feedback ని possitive గా తీసుకున్న విధానాన్నిappriciate చేస్తూ ఉన్నానండి.
"నేను రాసాను, మీరు చదవండి. నేనేమయిన professional రచయితనా అన్ని చూసుకుని రాయడానికి" అన్న mindset తో ఆలోచించకుండా, ప్రతి విమర్శను సానుకూలంగా తీసుకుని ముందుకు సాగాలి అని మా కోరిక ??♀️?.
మరొక మాట,
కొంతమంది కి, updates తొందరగా రావాలని కోరిక, నాలాంటి వారికి update లేట్ అయినా పర్లేదు, రచయిత చెప్పాలి అనుకున్నది చెప్పేందుకు వేగం అడ్డవకూడదు అనే అభిలాష.
చివరగా, మీ వేగానికి నా జోహార్లు.. నేను పరాయి దేశంలో ఉన్నా, ఏ సమయంలో thread ఓపెన్ చేసిన, ఒక update ఉండేది... కృతజ్ఞతలు.. నాకీ message type చేయడానికి almost half an hour పట్టింది, deeni batte మా అందరి కోసం మీరు & మన మిగతా xossipy గొప్ప రచయితలు పెట్టే efforts అర్థం అయ్యాయి.
Thanks.