Thread Rating:
  • 28 Vote(s) - 3.18 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Vc
TakulSajal గారు,

నేను మీ రచనా శైలిని ,మీ కథనాన్ని ప్రశ్నించడం లేదు . ప్రతి రచయితకి ఒక ప్రత్యేక శైలి ఉంటుంది. కాబట్టి నేను దాని గురించి మాట్లాడడం లేదు. ఇప్పుడు నేను చెప్పే ఈ మాటలు పూర్తిగా విక్రమ్ ... రిచి రిచ్ కథ కి సంబందించినదే.

విక్రమ్ ... రిచి రిచ్ కథ మొదటి season గురించి నేను ఇదివరకే చెప్పాను. సీజన్ 1 చాలా బాగుంది.

ఇప్పుడు ఈ కామెంట్ season 2  కి సంబందించినది. సీజన్ 2 లో ఇప్పటివరకు మీరు అందించిన అన్నీ అప్డేట్లు చదివిన తరువాతనే ఈ కామెంట్ పెడుతున్నాను. కనుక ఆ విషయం గమనించ మనవి.

ఇక అసలు విషయానికి వస్తే ఇప్పుడు చెప్పే మాటలు పూర్తిగా నా మనసులోని మాటలు.

ఈ సీజన్ 2 లోని ఒక్కో అప్డేట్ విడివిడిగా చదువుతూ ఉంటే  అప్డేట్ లో  ఉన్న ప్రతి సన్నివేశం చాల అద్బుతంగా ఉన్నాయి. అయితే ఆ అప్డేట్ లని కలిపి , మొదటి సీజన్ తో అనుసందానం చేసి చూస్తే ఎక్కడో తేడా వస్తున్నట్టుగా నాకు అనిపిస్తూ ఉంది.

విక్రమ్ తన బలం , అధికారం తో వచ్చిన ప్రతి ఒక్కరినీ చంపుకుంటూ పోయాడే తప్పా ఎప్పుడైనా తెలివిగా  ఆలోచించడా ఈ సీజన్ 2 లో అని అనిపించింది. చంపడం వచ్చు అని చేతిలో కత్తి ఉంటే అడ్డు వచ్చిన వారిని చంపుకుంటూ వెల్లాడే తప్ప ఆగి ఆలోచించి నిజం గ్రహించాడా అని అనిపిస్తూ ఉంది.  విక్రమ్ ఇలా చంపుకుంటూ పోతూ ఉంటే విక్రమ్ కి పల్లవి ( విక్రమ్ నాన్న రెండో భార్య )కి పెద్ద వ్యత్యాసం లేనట్టు నాకు అనిపించింది. ఇద్దరూ డబ్బు , అధికారం ఉంది అని బలం చూపించారు. వారి పగ తీర్చుకున్నారు.

మొదటి సీజన్ లో ని అప్డేట్ లో heroism , violence ఉన్నా అవి సరైన సమయంలో , సరైన రీతిలో ఉన్నట్టు అనిపించింది. నచ్చాయి. కానీ ఈ సీజన్ 2 లో ఉన్న heroism, violence , ఇవన్నీ అతిగా ఉన్నట్టు నాకు అనిపించాయి. మరీ ఆన్ని చావులా ! అని కూడా అనిపించింది.

విక్రమ్ పగ రవి, అలాగే తన శత్రువులతో గా , మద్యలో ఆన్ని వందల గార్డ్స్ ని చంపడం ఏదోలా ఉంది.

అతి సర్వత్ర వర్జయేత్మొదటి సీజన్ తొ పోల్చితే ఈ సీజన్ 2 లో చంపడం నాకు అతి అని అనిపించింది.
ఒక కథలో  heroism , violence , అధికారం ఉంటే నేను చదువుతా, ఇష్టపడుతా ,కానీ అవి సరైన మోతాదులో ఉండాలి. అప్పుడే నాకు నచ్చుతుంది.

నావరకు సీజన్ 1 చాలా బాగుంది, కానీ సీజన్ 2 అంతగా నాకు నచ్చలేదు.

నా కామెంట్ వల్ల మీ కథ ఏమయినా అగుతుందేమో అని ఇప్పటిదాకా చంపడం అతి అని నాయక్ అనిపించింది అనే  ఈ విషయం చెప్పలేదు. ఎలాగో కథ దాదాపు పూర్తయింది ఇక చివరి అప్డేట్ ఉంది అని ఈ కామెంట్ ద్వారా నా మాటల తెలుపుతున్నాను.

ఈ కామెంట్ చదివిన పాఠకులకి అలాగే రచయిత TakulSajal గారికి బహుశా  నా మీద కోపం రావచ్చు ఏమో . కానీ నేను చెప్పాలి అని అనుకున్నా చెప్పాను. ఇక మీరు ఏమన్నా నేను ఏమీ అనుకోను. ఇవి నా మనసులోని మాటలు . తప్పుగా ఏమైన మాట్లాడి ఉంటే నన్ను క్షమించండి.
 
[+] 14 users Like Ravi9kumar's post
Like Reply


Messages In This Thread
Vc - by Pallaki - 16-03-2022, 07:43 PM
RE: విక్రమ్--రిచి రిచ్ - by Ravi9kumar - 05-05-2022, 11:40 PM



Users browsing this thread: 32 Guest(s)