Thread Rating:
  • 28 Vote(s) - 3.18 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Vc
ఎపిసోడ్ ~ 8

సంధ్య : మేము మండీలం.... మిగతా ప్రపంచంతో సంబంధాలు ఉన్నా బయటి ప్రపంచాన్ని ఎప్పుడు మా దెగ్గరికి రానివ్వలేదు....మేము మాములు మనుషుల కంటే కొంచెం బలంగా, మాకు బుద్ధి బలం బాహుబలం మిగతా వాళ్ళ కంటే రెండు రెట్లు ఎక్కువ....మా వంశం లో పుట్టిన వారందరు అంతే...

మా తాత గారు రుద్ర తేజ ఆయనకి ఇద్దరు కొడుకులు...

మా నాన్న గారు రాజా రవీంద్ర ఆయనే మా రాజ్యానికి రాజు, వారికి మేము ముగ్గురము... నేను,  మా అన్న, నా చిన్ని చెల్లెలు ...

మా పెద్ద నాన్న గారు తేజా రవీంద్ర ఆయనకి ఒక కొడుకు, కూతురు.....

పెద్దవారు అయన ఉండగా మా నాన్నకి రాజ్యం ఎందుకు అప్పచెప్పారో మాకు తెలియదు కానీ ఆ విషయంలో మా పెద్దనాన్న కి మాకు అప్పుడప్పుడు గొడవలు జరుగుతు ఉండేవి...

మా వంశనికి మేము ఐదుగురమె వారసులం మిగతా వారంతా ఒక్కక్కారుగా చనిపోసాగారు... మిగిలినది మేమే....

ఎక్కడ తప్పు జరిగిందో తెలియదు కానీ మొదటి సారి నేను పుట్టడంతో అందరికి భయం పట్టుకుంది.... ఎందుకంటే నేను వీళ్ళలా బలంగా లేను నాకు వీళ్ళలా యుద్ధ విద్యలు అబ్బలేదు అందుకే నన్ను దూరంగా పెట్టేవారు, ఇంట్లో అందరు భోజనం చేసేటప్పుడు కూడా నన్ను పిలిచే వారు కాదు అలా చిన్నప్పటి నుంచి నా రూమ్ కే పరిమితమాయ్యను..... అప్పుడే మా తాత గారు పోతు పోతు నన్ను చూసి భయపడి... అందరిని పిలిచి తనకీ తెలిసిన పరిష్కారం చెప్పారు....

"ఇలాంటి ఒక కష్ట కాలం వస్తుందని మా గురువుగారు మాకు ముందే సెలవిచ్చారు.... " అని మా ఐదు గురికి ఐదు రంగుల రత్నాలు గల ఉంగరాలు ఇచ్చాడు..... ఈ పాలస్ వెనుక ఒక ఇరవై కిలోమీటర్ల దూరం లో ఒక పెద్ద కొండ దాని లోనికి వెళ్తే ఒక పెద్ద దీపం మధ్యలో చిన్న రంద్రం.... అందులో ఈ ఐదు ఉంగరాలు వేస్తే పక్కనే ఉన్న చిన్న లాకర్ లాంటిది తెరుచుకుంటుంది... అందులో ఉందట ఈ అమృతం దానిని మా ఐదుగురిని సమానం గా పంచుకోమని అదీ మా అందరికి 21 ఏళ్ళు నిందాకే ఆ అమృతం తాగాలని మా దెగ్గర మాట తీసుకుని అయన కాలం చేసారు.


అను : అమ్మా ఐదు రాళ్లు ఎందుకు వెయ్యాలి ఒక ఉంగరం వేస్తే ఎవ్వరి అమృతం వాళ్ళకి వస్తుంది కదా...

సంధ్య : అత్యాశ కొద్దీ మా పెద్ద నాన్న గారు అలానే చేసారు, దాని వల్ల అయన ప్రాణం పోయింది....

ఐదు ఉంగరాలు విభిన్నమైనవి ఒకొక్క ఉంగరపు రత్నం ఒక్కో వెయిట్ లో ఉంటుంది అన్ని కలిసి వేస్తేనే ఆ వెయిట్స్ అన్ని కాల్క్యూలేట్ అయ్యి అప్పుడే ఆ లాకర్ తెరుచుకుంటుంది కాదని ప్రయత్నిస్తే ప్రాణాలు పోతాయి అని మాత్రమే తెలుసు ఎలా పోతాయో ఎవ్వరికి తెలియదు...

మాకు ఉంగరాలు ఇచ్చేటప్పటికే మా పెద్ద నాన్న కొడుకు, మా పెద్దన్నయ్య కి పెళ్లి అయిపోయింది తన భార్య పేరే దేవి... మానస, రవి వాళ్ళ అమ్మ....

అను : అశ్చర్యంతో "అమ్మా అదేంటి మానసకి రవికి పెళ్లి కూడా అనుకున్నారు వాళ్లిద్దరూ ఒక తల్లీ బిడ్డలా???"

సంధ్య : అవును మిమ్మల్ని మోసం చెయ్యటానికి ఆ వేషాలు వేసి ఉంటారు.... ముందు నన్ను చెప్పని ఆ తరువాత నీకు తెలిసినది చెప్పు...

ఇదంతా తెలిసిన మా వదినకి దురాశ పుట్టింది మా అన్నకి లేని పోనివి చెప్తూ సంవత్సరాలుగా మా మధ్య దూరం పెంచింది.... ఇదంతా మా తల్లీ తండ్రులు గమనిస్తూనే ఉన్నారు కానీ అందరికంటే వీళ్ళు పెద్దవాళ్ళు అవటంతో ఏమి చెయ్యలేక పోయారు.....


అలానే మా పెద్దన్నయ్య చెల్లెలు (వయసు వ్యత్యాసం ఎక్కువ) అమూల్య ని తనతో కలిపేసుకుంది తన దెగ్గర ఉన్నది పింక్ రంగు ఉంగరం......

మా అమ్మ నాన్నకి విషం పెట్టారు అదీ మా అమ్మ వాళ్ళు తెలుసుకునే సరికి చాలా ఆలస్యం అయిపోయింది, నా పచ్చ రంగు ఉంగరం నా మెడలో వేసి నన్ను ఈ దీవి నుంచి దూరంగా పంపించేశారు.... మా అమ్మ వాళ్ళ మనుషులు నన్ను రోడ్ మీదగా వెళ్తున్న ఒక లారీ ఎక్కించి వాళ్ళు తప్పించుకున్నారు.... అలానే ఏడ్చుకుంటూ లారీ ఎక్కిన నేను ఒక ఐదు గంటల తరువాత పెద్ద శబ్దనికి ఉలిక్కి పడి లేచాను, టైర్ పంక్చర్ అయింది, వాళ్ళని చూడగానే భయం వేసింది లారీ దిగి ఎవ్వరికి కనిపించకుండా రోడ్ ఎమ్మట పరిగెత్తాను.


చుట్టూ అడవి ప్రాంతం...అలా పరిగెత్తికుంటూ వెళ్తున్న నాకు వెనుక ఏదో తరుమూతుంది అనిపించి అడివి లోకి వెళ్లాను ఎంత దూరం పరిగెత్తానో తెలీదు కానీ దూరం గా ఒక మంట కనిపించింది అక్కడికి వెళ్తుండగా ఒక రాయిని తట్టుకుని కింద పడి దొర్లుకుంటూ కింద పడి స్పృహ కోల్పోయాను....

లేచే సరికి నేను తెగ ప్రజల మధ్యలో ఉన్నాను ముందు భయపడ్డా వాళ్ళని చూసి కొంచెం ధైర్యం తెచ్చుకున్నాను.... వాళ్ళు ముద్రగడ తెగ ప్రజలు ఒక వారం అక్కడే ఉన్నాను కోలుకున్నాక నాకు అక్కడ ఉండాలనిపించలేదు, అక్కడ నుంచి దూరంగా వెళ్లిపోవాలనుకున్నాను అలాగే ఆ ఉంగరాన్ని కూడా వదిలించుకోవాలని దాన్ని అక్కడే వదిలేసి అక్కడనుంచి తప్పించుకుని రోడ్ మీద ఒక లారీ కనపడితే అదీ ఎక్కేసాను....

రెండు రోజులు తిండి లేదు వాళ్ళకి కనపడకుండా అలానే లారీ లో నక్కి కూర్చున్నాను, లారీ నేరుగా వైజాగ్ వెళ్లి ఆగింది, నీరసం గానే లారీ దిగి చూసాను ఎదురుగా ఒక అనాధ ఆశ్రమం, అది అనాధ ఆశ్రమం అని కూడా నాకు తెలియదు ఎవరో ఒక అమ్మాయి లోపల ఆడుకుంటూ ఉంది లోపలికి వెళ్లి తన ముందు స్పృహ కోల్పోయి పడి పోయాను,  తానే స్వాతి నా ప్రాణ స్నేహితురాలు....

అక్కడే అనాధ లాగే బతికాను, నాకు స్వాతికి స్నేహం బాగా కుదిరింది ఎన్నో సార్లు నా గతం గురించి అడిగేది కానీ నేనేం చెప్పలేదు, నా గతాన్ని ఇంకొకరితో పంచుకుని దాన్ని పెద్దది చేయదల్చుకోలేదు, స్వాతికి అడిగి అడిగి ఇక అడగడం మానేసి ఆ విషయం గురించి మర్చిపోయింది....

నాకున్న తెలివితేటలతో బానే స్థిరపడ్డాను, నా తో పాటే స్వాతి కూడా..... అప్పుడే శ్రీకాంత్ పరిచయం అయ్యాడు డబ్బు లేకపోయినా పరవాలేదు ప్రేమగా చూసుకుంటే చాలు అనుకుని తనని పెళ్లి చేసుకున్నాను, ఆ తరువాతే తెలిసింది తను నన్ను చేసుకుంది డబ్బు కోసం అని అది కాక ఇంకొకరితో అక్రమ సంబంధం ఉంది అని....కుంగిపోయాను, మోసాన్ని తట్టుకోలేకపోయాను....విక్రమ్ ని చూసుకుంటూ బతికేద్దామని అనుకున్నాను కానీ నా కష్టాన్ని ఎగరేసుకుపోతుంటే చూస్తూ ఊరుకోలేక పోయాను ఎదురు తిరిగాను, ఒక రోజు స్వాతితో ఫోన్ లో మాట్లాడుతుంటే వెనక నుంచి ఎవరో కొట్టినట్టు అనిపించింది తిరిగి లేచి చూస్తే ఇక్కడ ఉన్నాను.....

నా ఉంగరం వీళ్ళకి దొరకదు, అది దొరికేదాకా వీళ్ళు నన్ను ఏమి చెయ్యలేరు,  ఆ ధైర్యంతోనే నా కొడుకు కోసం ఇన్ని సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నాను.....

ఇది నాకు తెలిసినది నాకు జరిగినది ఇక నువ్వు చెప్పు.......

అను : నాది మీ లాంటి కథే, పెద్ద ఫ్యామిలీ కానీ మా నాన్న ఎందుకు పనికి రాకుండా పొయ్యాడని మేమంటే చులకన.... అప్పుడే మా కంపెనీ అప్పుల పాలయింది, మా ఇంటికి విక్రమ్ వచ్చాడు డబ్బులు వచ్చాయి....వాటితో పాటు విక్రమ్ నాన్న మా అత్తని పెళ్లి చేసుకున్నాడు..... విక్రమ్ ని నాకు ఇచ్చి పెళ్లి చేసారు...

విక్రమ్ వచ్చిన కొత్తల్లో ముభవంగా ఉండేవాడు తనని ఒక పనివాణ్ణి చేసేసారు... పని వాళ్ళైనా ఒక టైం వరకే కానీ విక్రమ్ అలా కాదు కాళ్ళు కూడా పట్టించుకునేవారు తన మొహం ఎప్పుడు చూసినా కళ్ళ కింద ఏడుపు చారలు కనిపించేవి.... ఆ తరువాత ఒకరిని ఒకరం అర్ధం చేసుకున్నాం.... మొదట్లో ముభవంగా ఉండే విక్రమ్ సడన్ గా ధైర్యంగా ఎలా మారిపోయాడో అర్ధం అయ్యేది కాదు, కానీ తరువాత తెలిసింది మీరు ఒకరికి చేసిన హెల్ప్ విక్రమ్ కి కలిసి వచ్చింది అని, కానీ మానస విక్రమ్ చదివే కాలేజ్ లో పరిచయం అయ్యింది నాకు మొన్నటిదాకా మానస గురించి ఏమి తెలియదు, కానీ విక్రమ్ ముందు మానస ని ఏమైనా అంటే చంపేస్తాడు.....అలానే రవి మానస కాబోయే వాడని అలానే తన చెల్లెలు రజినీ....

మానస లో మిమ్మల్ని చూసుకునే వాడు, మానస కూడా విక్రమ్ ని కొడుకు లానే చూసుకునేది, నేను ఎన్నో సార్లు మానస ని చూసాను వాళ్ళది, స్నేహమా కమామ అని కానీ నాకు అది ఎప్పుడు కనిపించలేదు... ఒక్కటి మాత్రం తెలుసు మానస మాత్రం విక్రమ్ విషయం లో నటించలేదు... మీకు నాకు ఇంకా ఎం అవ్వలేదంటే కత్చితంగా దాని వెనక మానస హస్తం ఉండే ఉంటుంది.....


మీరు చనిపోడానికి కారణం మా అత్తయ్య అని, విక్రమ్ కి ఆ గతి పట్టడానికి మా వాళ్లే కారణం అని మానస నాకు చెప్పింది, నాకు తెలిసినవి ఇంతే.... విక్రమ్ ఇండియా లోనే అతి పెద్ద కంపెనీ ఓనర్ అని కూడా నాకు ఈ మధ్యనే తెలిసింది, ఎందుకు దాచిపెట్టాడో తెలియదు ఏది నిజామో ఏది అబద్ధమో అర్ధం కావట్లేదు అంతా అయోమయంగా ఉంది...

సంధ్యా మానస గురించి ఆలోచించడం మొదలు పెట్టింది.... ఈలోగా గొలుసుల తో ఒకరిని లోపలికి తీసుకొచ్చారు..... ఆ వెనుకే దేవి తన వెనుకే అమూల్య కూడా వచ్చింది....

అను భయపడుతు చూస్తుండగా సంధ్య ఏడుస్తూ గట్టిగా ఆ సంకెళ్ళ లో ఉన్న ఆమెని కౌగిలించుకుంది.... శశి అని ఏడుస్తూ.....

శశి : అక్కా ఏడవకు నా కళ్ళలోకి చూడు.....
Like Reply


Messages In This Thread
Vc - by Pallaki - 16-03-2022, 07:43 PM
RE: విక్రమ్--రిచి రిచ్ - by Pallaki - 30-04-2022, 12:27 AM



Users browsing this thread: 26 Guest(s)