27-04-2022, 06:51 PM
(This post was last modified: 27-04-2022, 07:09 PM by earthman. Edited 1 time in total. Edited 1 time in total.)
"చంద్రం చంద్రం" ఎవరో పిలిస్తున్నట్టు అనిపించి కళ్ళు తెరిచాడు చంద్రం.
ఎదురుగా రాము.
"బాగా అలిసిపోయినట్టున్నావ్, ఎంత లేపినా లేవలేదు" నవ్వుతూ అన్నాడు రాము.
"ఔనురా, మంచి నిద్ర పట్టింది" బదులిస్తూ చుట్టూ చూసాడు చంద్రం.
నలుగురైదుగురు తప్ప ఎవరూ లేరు. పైనంతా ఖాళీ.
"ఏంటిరా రాము. అందరూ వెళ్ళిపోయారా ఏంటీ" అడిగాడు చంద్రం.
"ఔనురా. పెళ్ళి, భోజనాలు అయ్యాయి. లోకల్ వాళ్లందరూ వెళ్ళిపోయారు. పొద్దున్నే బస్, ట్రెయిన్ ఉన్న వాళ్ళు కూడా వెళ్ళారు. అందుకే ఖాళీ అయింది" చెప్పాడు రాము.
"అయితే నేను కూడా హోటల్ కెళ్తానురా"
"సరేరా. నీకు ఎప్పుడు కుదురుతుందో చెప్పు. అప్పుడు బయటకి వెళ్దాం"
ఇంతలో వచ్చింది దమయంతి.
"అన్నయ్యా ఎక్కడికి ఇప్పుడు ప్రయాణం" అడిగింది.
"మనింటికేనే. ఇక్కడంతా అయ్యాక ఇంటికెళ్దాం. చంద్రం హోటల్కి వెళ్తాడు. సాయంత్రమో, రేపో వస్తాడు మనింటికి" అని దమయంతితో అంటూ... "అంతేనా చంద్రం" అని చంద్రాన్ని అడిగాడు రాము.
"అంతేనా అంటే, ఇంకా వ్రతాలు, అవీ ఇవీ ఉంటాయి కదా. నాలుగు రోజులాగే వస్తానులే" అన్నాడు చంద్రం.
"ఊళ్ళో ఇల్లు పెట్టుకుని, స్నేహితుడివై ఉండి, నాలుగు రోజులాగి రావడమేమిటిరా. అయినా నువ్వు అబ్బాయి తరఫు కదా. ఎంత ముందైనా రావచ్చు. ఎన్ని రోజులయినా ఉండచ్చు" నవ్వుతూ అన్నాడు రాము.
"ఔను ఈ రోజే రండి" చంద్రాన్ని చూస్తూ నవ్వుతూ అంది దమయంతి.
ఇంతలో కుర్రాడొకడు వచ్చి, దమయంతిని పిలుచుకెళ్ళాడు.
"నీ ఇష్టంరా చంద్రం. వద్దాం అనుకుంటే రా, లేదు రెస్ట్ తీసుకుని నీకు ఎప్పుడు వీలయితే అప్పుడు రా" అన్నాడు రాము.
"వస్తానురా. నాకు పనులేమీ లేవులే. హోటల్ కెళ్ళి, రెడీ అయ్యి వస్తాను" అన్నాడు చంద్రం, ముందు వెళ్తున్న దమయంతిని చూస్తూ.
రాము మండపంలోకి, చంద్రం హోటల్కి వెళ్ళారు.
రెండు గంటలు పడుకుని, లేచి, టిఫిన్ తిని, రెడీ అయ్యి రాముకి ఫోన్ చేసాడు చంద్రం.
అందరూ దమయంతి వాళ్ళింట్లో ఉన్నారని చెప్పాడు రాము.
"ఒక్కడివే వెతుక్కుంటూ రాగలవా" అడిగాడు రాము.
"వస్తానురా. గుడి ఉంది కదా వీధి మొదట్లో" అడిగాడు చంద్రం.
"ఉంది. గుడి గుర్తుంది కదా, అయితే ఇబ్బంది లేదు, వచ్చెయ్" అంటూ ఫోన్ పెట్టాసాడు రాము.
ముప్పైఅయిదు ఏళ్ళ తర్వాత మళ్ళీ ఆ ప్రాంతం, దమయంతి వాళ్ళ ఇల్లు చూడబోతున్న ఆనందంతో బయటకి వచ్చాడు చంద్రం.
ఆటో ఎక్కి ఏరియా పేరు చెప్పి, గుడి దగ్గర ఆగాడు.
గుడి నించి నడుచుకుంటూ వస్తున్నాడు. మొత్తం మారిపోయింది. ఒక్క బిల్డింగ్ కూడా గుర్తు పట్టలేకపోయాడు. అన్నీ కొత్తగా కట్టినట్టు ఉన్నాయి. నడుస్తున్నాడు. పాత ఇళ్ళు మొదలయ్యాయి. దమయంతి వాళ్ళ ఇల్లు కనిపించింది. అతని మనసుకి చెప్పలేని ఆనందం కలిగింది.
లోపలికి వెళ్ళాడు చంద్రం. అప్పటిలానే ఉంది ఇల్లు. ఏదీ మారలేదు.
రాము కనిపించాడు. నవ్వాడు.
"ఏరా వచ్చావా, రా. ఎలా ఉంది ఇల్లు. అప్పటికీ, ఇప్పటికీ ఏమీ మారలేదు కదా" అన్నాడు రాము.
తలూపాడు చంద్రం.
"భోజనం వేళకొచ్చావు. అయిపోతోంది లోపల. కాసేపట్లో తినేద్దాం"
తలూపాడు చంద్రం.
"ఒకసారి లోపల చూస్తాను" అన్నాడు చంద్రం.
దమయంతిని చూడాలని అతని కోరిక.
"నువ్వెళ్ళరా, నేను ఒకటి ముట్టుసాను" అంటూ సిగరెట్ ముట్టించాడు రాము.
లోపలికెళ్ళాడు చంద్రం.
దమయంతి కనిపించింది. చంద్రాన్ని చూడగానే నవ్వింది.
లోపల ఎక్కువమంది లేరు. కార్యక్రమం కూడా అయిపోవచ్చింది.
"వచ్చారా. సంతోషం"
నవ్వాడు.
"మామిడి చెట్టుని చూసారా"
లేదన్నట్టు తలూపాడు.
"రండి" అంటూ ముందు నడిచింది.
ఇద్దరూ చెట్టు దగ్గరికెళ్ళారు.
అలానే ఉంది చెట్టు. అన్ని ఏళ్ళయినా అలానే ఉండటంతో ఆనందంతో చెట్టుని తాకాడు.
దమయంతి వైపు చూసాడు. దమయంతికి విషయం అర్ధమై నవ్వింది.
"ఆ రోజు కాయల కోసం నన్ను ఎత్తారు కదా. నాకు ఎగిరితే అందేవి. మీరు కావాలనే ఎత్తారు కదా" నవ్వుతూ అంది.
"ఔను. మరి నీకు అందుతాయి అనుకున్నప్పుడు ఆ మాట చెప్పచ్చు కదా" నవ్వుతూ అన్నాడు.
"మీరు ముట్టుకుంటే బాగుంటుందని" అతని చేతిని పట్టుకుంటూ అంది.
"నాకు ఇప్పుడు కూడా ఎత్తాలని ఉంది" ఆమె చేతిని నొక్కుతూ అన్నాడు.
నవ్వింది.
అంతే ఒక్కసారి దమయంతిని గట్టిగా పైకి ఎత్తి కిందికి దించాడు.
ఇలా చేస్తాడని ఊహించని దమయంతి షాక్ అయింది. కంగారు పడుతూ వెనక్కి తిరిగి చూసింది. ఎవరూ చూడకపోవడంతో ఊపిరి పీల్చుకుంది.
"మనమేమీ కుర్రపిల్లలం కాదు. కాస్త కంట్రోల్ చేసుకోండి. అందరూ వెళ్ళేదాకా ఓపిక పట్టండి" చిరుకోపంతో అంది.
"సారీ దమయంతి. ఆపుకోలేకపోయాను, అప్పటిదే గుర్తొచ్చింది. వెనక ఎవరూ లేరని చూసే చేసాను. సారీ" అన్నాడు.
సరే అన్నట్టు తలూపింది.
ఇంతలో లోపల నించి "పెద్దమ్మా" అని కేక వినిపించింది.
లోపలికెళ్ళింది దమయంతి.
చెట్టు కింద ఉన్న కుర్చీలో కూర్చుని ఏమేం జరుగుతాయా అని ఆలోచనలో పడ్డాడు చంద్రం.