Thread Rating:
  • 28 Vote(s) - 3.18 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Vc
ఎపిసోడ్ ~ 4

చిన్నా : చెప్పు రాజు...

రాజు : నువ్వు పంపిన కార్ నారాయణ అనే వాడి పేరు మీద రిజిస్టర్ అయ్యి ఉంది, వాళ్ళ ఫోన్స్ అన్ని హాక్ చేశాను ఈ నైట్ కి నీ మీద ఎటాక్ ప్లాన్ చేసారు, నీ వల్ల వాళ్ళ ప్లాన్ ఏదో నాశనమైందని చాలా కోపంగా ఉన్నారు..... నువ్వు జాగ్రత్త..

చిన్నా : అలాగే నువ్వు మాత్రం ఈ విషయాలన్నీ అక్కడ ఎవ్వరికి చెప్పకు... ముఖ్యంగా మానసకి..

రాజు : అలాగే...

ఈ పిచ్చి నాకొడుకులకి ఇవ్వాళ మూడింది అనుకున్నాను, సరిగ్గా రాత్రి కావొస్తుండగా ఇంట్లో కరెంటు తీసేసారు ఒక పది మంది ఇంటిని చుట్టూ ముట్టారు సైలెంట్ గా అమూల్య బెడ్ రూమ్ డోర్ బైట నుంచి లాక్ చేశాను,  ఆ పది మందిని కొట్టడానికి నేను అంతగా కష్టపడలేదు, కానీ ఇంట్లో పది మంది మాత్రమే కాదు ఇంకా ఉన్నారనిపించింది, ఒకడు నా కంట పడ్డాడు సడన్ గా లైట్స్ ఆన్ అయ్యాయి, వీడు ఆ పదిమందిలో వాడు కాదు నింజాకి తక్కువ ఆది వాసి కి ఎక్కువగా ఉంది ఆ అవతారం, నా మీదకి వచ్చాడు చాలా ఫాస్ట్ గా ఉన్నాడు, నా మీదకి వస్తూనే మూడు కిక్స్ ఇచ్చి నన్ను కింద పడేసాడు....

రవి తో ఫైట్ తరువాత మళ్ళీ కిందపడటం ఇదే... లేచి ఫైట్ చేశాను లాభం లేదు వీడు చాలా ఫాస్ట్ గా ఉన్నారు, అంతకు మించింది ఏంటంటే నాకు వచ్చిన ప్రతి స్టైల్ అఫ్ ఫైటింగ్ వాడికి వచ్చు అంటే వీడు శశికి సంభందించిన వాడు....చూస్తుండగానే నా చుట్టూ ఇరవై మంది చుట్టూ ముగారు.... నాకేం అర్ధం కాలేదు శశి చనిపోయింది కదా వీళ్ళు శశి కి సంబంధించిన తెగ వాళ్ళ? హా కొన్ని నిజాలు తెలిసే వరకు నాకు ఈ తలపోట్లు తప్పవు ...ఫోన్ కంటిన్యూ గా మొగుతుంది, ఇరవై మంది ఫైటర్స్ మధ్యలో నిల్చుని ఫోన్ చూసాను రషీద్ అదే పని గా చేస్తున్నాడు...

ఇరవై మంది నా మీద పడ్డారు ఇష్టమొచ్చినట్టు కొట్టుకున్నాం అందులో ప్రతి ఒక్కడు ఒక రవి లాగా అనిపించారు, అందరూ కలిసి నన్ను తుక్కు తుక్కుగా కొట్టారు అమూల్య డోర్ ఓపెన్ చేసి అమూల్య ని బలవంతంగా తీసుకెళ్తున్నారు....

వాళ్ళ వెనకాల పడ్డాను కొట్టుకుంటూనే అమూల్య ని హెలికాప్టర్ ఎక్కించారు, నేను వెంటనే ఎగురుతున్న హెలికాప్టర్ ని పట్టుకున్నాను వెనక నుంచి రెండు కత్తి పోట్లు నా వెన్నులో దిగాయి.... అలానే పట్టుకున్నాను...

గాల్లోకి ఎగిరింది లోపల అమూల్య స్పృహ లో లేదు లోపల చూసాను ఒకడు నన్నే చూస్తున్నాడు అప్పటికే చాలా దూరం వచ్చేసాం గాల్లో వేలాడుతూ ఉండగానే నన్ను చూస్తున్న వాడు ఒక్క తన్ను తన్నాడు అంతే హెలికాప్టర్ లో నుంచి బైటకి పడ్డాను, అస్సలు నన్ను కొట్టె అవకాశం లేదు కానీ ఆ కళ్ళు చూడగానే నేను ఆగిపోయాను ఎందుకంటే ఆ కళ్ళు రవి కళ్ళు కాబట్టి అవును నన్ను తన్నిన్ది ఎవరో కాదు రవి....

గాల్లో తెలుతు కళ్ళు మూసుకున్నాను.... పడటం పడటం ఒక పెద్ద నీళ్ల చెరువులో పడ్డాను పక్కనే రాయి ఉందనుకుంటా బాడీ నీళ్లలో పడినా, నా ఎడమ చేయి ఆ రాయి మీద పడి రక్తం కారడం తెలుస్తుంది నెమ్మదిగా నా కళ్ళు మూసుకుపోతున్నాయి ఎడమ చెయ్యి స్పర్శ తెలియట్లేదు, చిన్నగా హెలికాప్టర్ సౌండ్ దూరం అవసాగింది.

కొంచెం సేపు కదలకుండా అలానే కళ్ళు మూసుకున్నాను నా ఎడమ చేయి ఇంకా రాయి మీదే ఉంది, పడుకుని లేచేసరికి చుట్టూ అడవి ఎటు చూసిన చెట్లు నాకు కళ్ళు తిరిగినట్టు వొమిటింగ్ వస్తునట్టు అనిపిస్తుంది....ఇంకా తెల్లారలేదు అలా అని పూర్తిగా చీకటి లేదు, పాకుదామని చూస్తున్నాను కానీ నా కుడి చేయికి ఆసరా దొరకట్లేదు...

ఈలోగా ఒక నక్క ఎక్కడనుంచి వచ్చిందో నన్నే చూస్తుంది సౌండ్ చెయ్యకుండా, నాకు అర్ధమైపోయింది....నా ఎడమ చెయ్యి మాత్రం దాని నోటికి చిక్కనివ్వకూడదు అని అనుకున్నాను రక్తపు వాసన కి నా ఎడమ చేయి మీదకి దూకింది దాని నోటికి నా కుడి చెయ్యి అందించాను వెంటనే బలాన్ని అంతా కూడ తీసుకుని, నా చేతికి దాని పంటి గాట్ల నొప్పి తెలుస్తుంది, లాక్కేళ్ళడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తుంది.... ఒడ్డు దాకా లాక్కెళ్ళింది ఈ లోగ ఎవరో తెగ ప్రజలనుకుంటా నీళ్ల కోసం బిందెల తో వచ్చారు అన్ని మసక మసకగా కనిపిస్తున్నాయి, కాపాడతారు లే ఇక అని కాన్ఫిడెంట్ గా కళ్ళు మూసుకున్నాను.....


లేచేసరికి నేల మీద పడుకుని ఉన్నాను చేతికి కట్టు కట్టి ఉంది ఆకుల వాసన చాలా ఘాటుగా తగులుతుంది నాకు మొదట గుర్తొచ్చింది రవి, ఎలా అన్న అన్నా అని తిరిగేవాడు నన్ను చంపడానికి కూడా వెనుకడలేదు, అమూల్య తో తనకెలా పరిచయం ఎం అర్ధం కావట్లేదు, మరి మానస అస్సలు మానసకి రవి గురించి ఏమైనా తెలుసా నా ఫోన్ చూసుకున్నాను స్విచ్ ఆఫ్ లో ఉంది, ఆన్ చేశాను ఆన్ అయ్యింది, డేట్ చూసాను నేను ఈ అడవిలో ఉంది ఇవ్వాల్టికి ఎనిమిదవ రోజు, మిస్డ్ కాల్స్ చూసాను ఒక్క కాల్ కూడా రాలేదు, రోజు చేసే మానస అను నుంచి ఒక్క కాల్ కూడా లేదు.... ఈ లోగ ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది మళ్ళీ ఆన్ చేశాను ఆన్ అవ్వలేదు....

చిన్నగా లేచాను ఇంకా నీరసంగానే ఉంది, బైట అంతా గొడవ గొడవగా ఉంది పెద్ద పెద్ద మెషినేరీలు అడవిని కొట్టేయడానికి సరిపోతాయవి అంతా గొడవ గొడవ గా జరుగుతుంది.... చిన్నగా నడుచుకుంటూ వెళ్ళాను గుంపు దెగ్గరికి, అక్కడున్న కుర్రవాళ్లంతా ఆయుధలతో యుద్ధనికి రెడీ గా ఉన్నారు, పెద్ద వారు మాత్రం ఆఫీసర్ లని బతిమిలాడుకుంటున్నారు, ఆఫీసర్లు వాళ్ళని లెక్క చేయడం లేదు.....

పక్కనే ఒకడు కనిపించాడు, తనని పిలిచాను అసహనం గానే వచ్చాడు వాడి ద్వారా ఎం జరుగుతుందో తెలుసుకున్నాను...


ఈ తెగ ప్రజలు మాట్లాడేది కన్నడ అయినప్పటికీ ఎన్నో ఏళ్లగా ఈ అడవి మధ్యలో జీవనం సాగిస్తున్నారు, నేను నిలబడ్డ పక్కనే ఒక పెద్ద చెట్టు ఇది కొన్ని వేల సంవత్సరాలుగా ఉందట దీనిని ఇక్కడున్న ప్రజలు దేవుడితో సమానంగా కొలుస్తరాట.

ఇప్పుడొచ్చిన చిక్కెంటంటే ఈ భూమి కింద ఉన్న కానీజాల కోసం వీడి బాస్ 300కోట్లు పెట్టి గవర్నమెంట్ నుంచి స్థలం కొనుక్కుని పర్మిషన్స్ తెచ్చుకుని వచ్చాడు దానికి ఈ ప్రజలు అడ్డు పడుతున్నారు....

వాడికి చెప్పాను మీ బాస్ ని రమ్మను మాట్లాడదాం ఏ గొడవ లేకుండా సమస్య పరిష్కరిస్తాను అని చెప్పాను దానికి వాడు నన్ను సీరియస్ గా చూసి పని ఆపించాడు....

ఆ ఊరి వాళ్ళకి ఎం అర్ధమైందో ఏమో కానీ అందరూ నాకు దండాలు పెట్టారు, ఒకసారి ఆ చెట్టుని చూసాను, దానికి మహిమలు ఉన్నాయో లేవో తెలియదు కానీ ఆ చెట్టు కింద మనసు ప్రశాంతంగా ఉంది.

నన్ను కాపాడిన ప్రజలకి నేను ఇంతకంటే ఋణం తీర్చుకోలేను అనిపించింది ఎం జరిగినా వీళ్ళకి ఈ అడవిని ఇస్తాను అని మనుసులో అనుకున్నాను.

ఆ రోజు అక్కడున్న తెగ ప్రజలు ఆనందంగా ఉన్నారు, మాట్లేడేది కన్నడ అయినప్పటికీ చాలా పురాతన కన్నడం మాట్లాడుతున్నారు....

ఆ రోజు విందుతో నృత్యాలతో గడిచిపోయింది, అక్కడున్న పెద్ద వారు నన్ను అడిగారు, వాళ్ళకి నేను అనుకున్నదే చెప్పాను... వాళ్లంతా చేతులెత్తి మొక్కారు ఈ గొడవల వల్ల వాళ్ళకి ప్రశాంతత లేదట ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారట.... అక్కడ ఆ భూమి కోసం వాళ్ళు చెప్పిన కథలు వాళ్ళు పడ్డ కష్టాలు విని నా కంట్లో తడి చేరింది.


తెల్లారే వాడి బాస్ దిగాడు వాడిని ఒప్పించటానికి నానా తంటాలు పడాల్సొచింది బెదిరించాను, భయపెట్టాను, నేనెవరో చెప్పాను జంకినా కానీ మొండిగా కూర్చున్నాడు, ఇక ఆఖరి అస్త్రం గా ఈ ప్రాజెక్ట్ వల్ల నీకెంత లాభం వస్తుందో  చెప్పు మొత్తం ఇచ్చి కొంటాను అన్నాను, వాడితో సహా అక్కడున్న అందరు షాక్.....

కొంచెం సేపటికి తెరుకొని ఎనిమిది వందల కోట్లు అడిగాడు, నాకు మైండ్ బ్లాక్ అయింది, వాడు అదంతా తవ్వుకుని అమ్ముకున్నా 500 కోట్ల కంటే ఎక్కువ రాదూ కానీ వీడు 800 కోట్లు అడుగుతున్నాడు....

ఈ లోకం లో మంచికి చెడుకి ఏది కావాలన్నా డబ్బే అనుకుని ఒప్పుకున్నాను, మొత్తం నా పేరు మీద రిజిస్ట్రేషన్ చూపించాను డబ్బులు నా అకౌంట్ లో నుంచి వెళ్తే బైట ఎక్సపోజ్ అవుతాను అనిపించింది ఎందుకంటే ఇన్ని రోజులైంది నా గురించి ఒక్కరు వెతకడానికి రాలేదు కొన్ని రోజులు హైడ్ అవుట్ లో ఉండటం మంచిది అనిపించింది....

సునీల్ గారు నన్ను మొదటగా కలిసినప్పుడు ఇచ్చిన అకౌంట్ గుర్తొచ్చింది ఇప్పటి వరకు ఆ అకౌంట్ ఉన్నట్టు నాకు సునీల్ గారికి తప్ప ఇంకెవ్వరికి తెలియదు, వాళ్ళ దెగ్గరే లాప్టాప్ తీసుకుని లాగిన్ చేసి అమోంట్ ట్రాన్స్ఫర్ చేశాను, ఇంకా అకౌంట్ లో 150 కోట్లు ఉన్నాయి....

అక్కడ అగ్రిమెంట్ కి వచ్చిన వాళ్లంతా నన్ను పిచ్చి వాడిలా చూస్తే అక్కడున్న తెగ ప్రజలు మాత్రం దేవుడిలా చూసారు, రిజిస్ట్రేషన్ అండ్ అగ్రిమెంట్ కాయితాలు ఒక సెట్ ఆ ప్రజలకి ఇచ్చాను ఇక మీ జోలికి ఎవ్వరు రారు అని....

ఆ రోజంతా పండగ చేసుకున్నారు, అక్కడున్న ప్రతి చిన్న పెద్ద అందరి కంట్లో ఆనందాబాష్పాలు, అంత  డబ్బు ఖర్చుపెట్టినా నాకు ఏమనిపించలేదు, ఎందుకో మరి ఇంకా మనసుకి చాలా సంతోషంగా అనిపించింది....

నాకు ఒకసారి అనాధ ఆశ్రమం లోని పిల్లలు గుర్తొచ్చారు, వాళ్ళ వెబ్సైటు ఓపెన్ చేసి ఒక రెండు కోట్లు ట్రాన్స్ఫర్ చేశాను, అక్కడున్న వాళ్ళతో ఒక కొత్త సిం తెప్పించాను, లాప్టాప్ కి నెట్ కనెక్ట్ చేసి ఓపెన్ చేశాను.....

కొత్త సిం నా పేరు మీద లేదు ఎవరు ట్రాక్ చెయ్యలేరు, నా ఫోన్ మంటల్లో కాల్చేశాను... కొత్త ఫోన్ లో కొత్త సిం వేసి సునీల్ గారికి కాల్ చేశాను ఎంగేజ్ వస్తుంది .....

న్యూస్ ఓపెన్ చేశాను సునీల్ గారి ఇంట్లో మూడు రోజుల క్రితం బాంబు బ్లాస్ట్ అందరు చనిపోయినట్టు, ఆ న్యూస్ చదవగానే నాకు కాళ్ళు చేతులు ఆడలేదు, వెంటనే రషీద్ గుర్తొచ్చాడు కాల్ చేశాను రింగ్ అవుతుంది కానీ ఎత్తట్లేదు కొంచెం సేపటి తరువాత వేరే కొత్త నెంబర్ నుంచి కాల్ వచ్చింది...

ఎత్తాను కానీ ఎం మాట్లాడలేదు, అవతల కూడా సైలెంట్ గానే ఉంది ఇక లాభం లేదని "రషీద్" అన్నాను.

రషీద్ : సర్ మీరు బతికే ఉన్నారా?

చిన్నా : అదేంటి అలా అడుగుతున్నావు, అస్సలు ఎం జరిగింది బాంబు బ్లాస్ట్ నేను విన్నదంతా నిజమేనా??

రషీద్ : సర్ ఇప్పుడు నేను మీతో ఎక్కువ సేపు మాట్లాడలేను ట్రాక్ చేస్తారు నన్ను చంపడానికి మీ ఫ్రెండ్ రవి మనుషులు నాకోసం కుక్కల్లా తిరుగుతున్నారు,  మీ లొకేషన్ పంపించండి నేను అక్కడికి వచ్చి కాల్ చేస్తాను, ఇప్పటివరకు జరిగినదాని వెనక ఉంది ఎవరో కాదు మీ ఫ్రెండ్ మానస, అవును తను పూజ కలిసే సునీల్ గారిని చంపేశారు, మిమ్మల్ని కలిసిన తరువాత నేను అంత మీకు వివరంగా చెపుతాను... ఈ నెంబర్ తీసేస్తున్నాను నేనే వేరే నెంబర్ నుంచి కాల్ చేస్తాను...

అని కాల్ కట్ అయింది.....

నేను కింద కులబడిపోయాను, అస్సలు ఎం జరుగుతుంది సంబంధం లేకుండా ఒకరికొకరు, ఇంకా మనసా ఏంటి ఇది??? బుర్ర బద్ధాలు అవుతుండగా రషీద్ ని కలిసే వరకు ఏమి తెలియదు అని బలవంతంగా కళ్ళు మూసుకున్నాను.....
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.


Messages In This Thread
Vc - by Pallaki - 16-03-2022, 07:43 PM
RE: విక్రమ్--రిచి రిచ్ - by Pallaki - 27-04-2022, 05:23 PM



Users browsing this thread: 26 Guest(s)