26-04-2022, 05:13 PM
ధన్యవాదములు మిత్రమ బర్రె. వేటాడే రోజుల్లో మనుషులు సమూహములుగా ఉండేవారు ఇప్పటికి అడవి కుక్కలు, తోడేళ్ళు, కోతులు, సింహాలు, ఏనుగులు మొదలైనవి ఉన్నట్టు. పాప పుణ్యాల విషయానికొస్తే ఈ జన్మలో వేటాడిన ప్రాణి మరు జన్మలో వేటాడబడుతుంది. వేటాడి చంపగలిగే అవకాశం ఎదురైనా సరే క్షమించి వదిలేస్తే అప్పుడు ఆ కర్మ చక్రం నుండి బయటపడుతుంది ఆ ప్రాణి. అవకాశం లేకపోయినా కల్పించుకుని మరీ వేటాడినప్పుడు కొత్త కర్మ చక్రం మొదలౌతుంది. ఇది గ్రహించాక మనిషి మెల్లిగా వేటాడటం తగ్గించాడు చాలా మంది మాంసాహారమే మానేసారు. ఇది ఒక నమ్మకం మిత్రమ.