25-04-2022, 07:42 PM
(24-04-2022, 06:06 AM)stories1968 Wrote:
- కృత యుగము = 4,800 దివ్య సంవత్సరములు = 17,28,000 మానవ సంవత్సరములు
సత్య యుగం , హిందూధర్మ సమయం ప్రకారం నాలుగు యుగాలలో ఇది మొదటిది.దీనిని కృత యుగం అని కూడా అంటారు.ఇందు భగవంతుడు నారాయణుడు, లక్ష్మీ సహితముగా భూమిని పరిపాలిస్తాడు. దీని కాల పరిమాణము 432000 * 4 = 1728000 అనగా పదిహేడు లక్షల ఇరవై ఎనిమిది వేల సంవత్సరాలు. ఈ యుగంలో ధర్మం నాలుగుపాదాల మీద నడుస్తుంది. ప్రజలు ఎలాంటి ఈతిబాధలు లేకుండా సుఖసంతోషాలతో ఉంటారు.అకాలమరణాలుండవు.వైవశ్వత మన్వంతరములో సత్యయుగం కార్తీక శుద్ధ నవమి రోజు ప్రారంభమైంది.ధర్మం సుప్రీం. మానవని పొట్టితనం 21 మూరలుగా ఉంటుంది.మానవుడు అన్ని భ్రమల నుండి విముక్తి పొందుతాడు.శివుడు, సతీదేవి వివాహ కర్మ సత్య యుగంలో జరిగింది.ధర్మ స్తంభాలన్నీ పూర్తిగా ఉన్నాయి. సత్య యుగంలో, ప్రజలు మంచి, ఉత్కృష్టమైన పనులలో మాత్రమే నిమగ్నమయ్యారు.సత్య యుగంలో, విష్ణువు నాలుగు రూపాల్లో అనగా,మత్స్య,కూర్మ,వరాహ,నరసింహ అవతారలలో అవతరించాడు
అనంతకోటి ధన్యవాదములు మిత్రమ బొమ్మల బ్రహ్మ. అద్భుతమైన వివరణ ఇచ్చారు. నాకొక సందేహం మిత్రమ.
ధర్మం నాలుగు పాదముల నడుస్తున్న కాలములోనే హిరాణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు ఎందుకొచ్చారు?
ధర్మ సంస్థాపన గావించుటకై విష్ణుమూర్తి ఎందుకు అవతారములు ఎత్తవలసి వచ్చింది?