Thread Rating:
  • 5 Vote(s) - 1.8 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
"అంతరాయం"
#2
"కానివ్వండి కానివ్వండి ముహూర్తం వేళయింది" అరుస్తోంది ఒక ముసలావిడ.

"అబ్బా అమ్మా, ముహూర్తం ఎప్పుడో రాత్రికి. ముహుర్తానికి ఇంకా ఆరు గంటలు ఉంది. నువ్వు హైరానా పడి, మమ్మల్ని హైరానా పెట్టకు" వివరించింది ముసలావిడ కూతురు దమయంతి.

"నోరు మూసుకోవే, ఆరు గంటలంటే ఎక్కువేమీ కాదే. నీ బుద్ధే నీ కూతురికి కూడా వచ్చింది. పెళ్ళి పెట్టుకుని ఫోన్లో ఆ మంతనాలేంటే. ఒసేయ్ అమ్మాయ్, ఆ ఫోన్ పెట్టేసి రావే" కసురుకుంది ముసలావిడ.

"అబ్బా అమ్మమ్మా, ఆయన మాట్లాడుతున్నారు. లేకపోతే ఇప్పుడు ఫోన్లో ఎందుకు ఇంతసేపు మాట్లాడతాను" విషయం చెప్పింది పెళ్ళికూతురు.

"ఇంకా పెళ్లవ్వలేదు, అప్పుడే ఆయనా, మొగుడు అనకు" సణిగింది ముసలావిడ.

అతిధులు ఒక్కొక్కరు వస్తున్నారు. అబ్బాయి తరఫు వాళ్ళు ఒక వైపు, అమ్మాయి తరఫు వాళ్ళు ఇంకొక వైపు కూర్చున్నారు. ఆడ పెళ్ళివారు అందరికీ కాఫీ ఇస్తున్నారు.

"అమ్మాయ్ దమయంతీ, పైన అబ్బాయి తరఫు వాళ్ళెవరో ఇప్పుడే వచ్చారుట, కాఫీలు అందాయో లేదో కనుక్కోమంటున్నారు" లోపలి నించి కాఫీలు తెస్తూ చెప్పింది ముసలావిడ.

"నేను పైన స్టోర్ రూంకి ఎలాగు వెళ్ళాలమ్మా, ఏది ఆ కాఫీలు ఇటివ్వు, నేను తీసుకుళ్తాను" అంది దమయంతి.

కాఫీలు తీసుకుని పైకెళ్ళింది. అబ్బాయి తరఫు వాళ్ళకిచ్చి కిందికి దిగసాగింది.

ఇంతలో "దమయంతీ" అని పిలిచారు పై నించి ఎవరో.

వెనక్కి తిరిగి చూసింది.

దూరపు చుట్టం, వరసకు అన్నయ్య అయ్యే రాము కనిపించాడు.

"అరే అన్నయ్యా, ఎన్నాళయింది నిన్ను చూసి" అంటూ పలకరించింది.

"ఎన్నాళయినా, నీ కూతురి పెళ్ళి అని తెలిసి వచ్చానమ్మా" బదులిచ్చాడు రాము.

"మనవాళ్ళ దగ్గర లేకుండా ఇక్కడున్నావేంటి" ప్రశ్నించింది.

"అబ్బాయి చుట్టం ఒకతను పాత స్నేహితుడే. అతనితో మాట్లాడుతూ ఇక్కడున్నాను. నువ్వు గుర్తుపడతావేమో చూద్దాం" అని దమయంతితో అంటూ... "చంద్రం" అంటూ కేక వేసాడు రాము.

ఒక్కసారిగా షాక్ అయింది దమయంతి. చంద్రం అంటే ముప్పైఅయిదు ఏళ్ళ నాడు డిగ్రీ చదువుతున్నప్పుడు, తమతో కలిసి ఆరు నెలలు చదువుకున్నవాడు, తమతో కలిసి తిరిగినవాడు, తాను ఇష్టపడ్డవాడు, తనని మొదటిసారి తాకినవాడు, మొదటిసారి..., ఆ చంద్రమేనా... ముప్పైఅయిదు ఏళ్ళు వెనక్కి వెళ్ళింది దమయంతి.

ఆ చంద్రమే. స్థాయి ఉట్టిపడుతూ, లాల్చీ, పైజమాలో వచ్చాడు.

వస్తూనే దమయంతిని చూసి గుర్తుపట్టినట్టుగా అయ్యి, అంతలోనే మామూలుగా అయ్యాడు.

"చంద్రం, మా పిన్ని కూతురు దమయంతి. కాలేజ్లో మన జూనియర్, గుర్తుందా. కలిసి కొన్ని రోజులు రిక్షాలో వెళ్ళాం. మా పిన్ని వాళ్ళింట్లో మామిడి చెట్టు కింద అన్నం తిన్నాం" ఒక్కొక్కటి చెప్తున్నాడు రాము.

గుర్తొస్తున్నట్టుగా తల ఊపాడు చంద్రం.

"చంద్రం చాలా గొప్పవాడయ్యాడే దమయంతీ. NRI వీడు. మనకి అందనంత ఎత్తులో అమెరికాలో ఉంటున్నాడు" పొగిడాడు రాము.

"హఠాత్తుగా ఏమైపోయారు? డిగ్రీ ఫస్ట్ ఇయర్లో మిమ్మల్ని చివరిసారి చూసింది" అడిగింది దమయంతి.

"మా బామ్మ పోవడంతో, మా నాన్నగారు ట్రాన్స్ఫర్ పెట్టుకుని మమ్మల్ని హైదరాబాద్ తీసుకెళ్ళారు. అంతా హడావిడిగా జరిగింది. మళ్ళీ మీ అందరినీ కలిసే అవకాశం దొరకలేదు" సమధానమిచ్చాడు చంద్రం.

"గొప్పవాళ్ళు అంతేనే. వాళ్ల పరిచయం కలగడమే మనకి గొప్ప" నవ్వుతూ అన్నాడు రాము.

"ఆపరా ఇక. నా లాగా లక్షల మంది ఉన్నారు అమెరికాలో" మామూలుగా అన్నాడు చంద్రం.

"మన జనరేషన్లో ముప్పై ఏళ్ళ నాడే అమెరికాలో సెటిలయింది నువ్వే కదా. మాకు గొప్పే. అంతే కదా దమయంతీ" అన్నాడు రాము.

అంతే అన్నట్టుగా తల ఊపింది దమయంతి.

ఇంతలో ఫోన్ మోగడంతో పక్కకెళ్లాడు రాము.

చుట్టూ చూసింది, ఎవరూ లేరు.

"గుర్తొచ్చానా" అడిగింది.

తలూపాడు చంద్రం.

"అప్పటి విషయాలేవీ గుర్తులేవా"

"అన్నీ గుర్తులేవు, కొన్ని ఎప్పటికీ మర్చిపోలేను"

"ఆ రోజు మా ఇంట్లో, మామిడి కాయల కోసం వచ్చి, నాతో..."

"నిన్నే జరిగినట్టుగా ఉంది అదంతా, ముప్పైఅయిదు ఏళ్ళ క్రితంలా లేదు"

"మీరు వెళ్ళిపోయారు అని తెలిసాక ఎంత ఏడ్చానో తెలుసా"

"నేను మాత్రం ఏడవలేదా"

"ఒక్కసారి కూడా రాలేదు చూడటానికి"

"మా నాన్నగారు పంపలేదు. ఆ వయసులో ఆయనని ఎదిరించలేకపోయాను"

"ఇప్పుడు మాత్రం ఎందుకొచ్చినట్టు"

"నిన్ను చూడాలని. మా వాళ్ళ అబ్బాయి చేసుకుంటోంది మీ అమ్మాయినని తెలిసింది. అందుకే అమెరికా నించి ఈ పెళ్ళి కోసమనే వచ్చాను"

"మీ భార్యా, పిల్లలు?"

"అమెరికాలోనే ఉన్నారు. నేనొక్కడినే వచ్చాను. మీ వారు...?"

"రెండేళ్ళయింది"

"ఎలా?"

"గుండెపోటు"

"ఐ యాం సారీ దమయంతి"

తలూపింది.

"కష్టపడి అమ్మాయి పెళ్ళి చేస్తున్నావు. నిన్ను ఇలా చూస్తున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది"

"నాకు కూడా. ఇన్నేళ్ళ తర్వాత చూస్తున్నా కదా. అప్పటి విషయాలన్నీ గుర్తొస్తున్నాయి. నాకు ఆ వయసులో ఉన్నట్టే ఉంది మిమ్మల్ని చూస్తుంటే" ఆనందం పట్టలేక అంది.

"నాకు కూడా అలానే ఉంది. నువ్వు లంగా, ఓణిలో పరిగెత్తడం, నేను నీ వెనక రావడం. ఒకసారి నువ్వు మామిడిపళ్ళు కోసుకుంటావని నిన్ను పైకెత్తడం, మీ బామ్మ రావడం. మర్చిపోలేను ఇవ్వన్నీ" నవ్వుతూ అన్నాడు.

"అయితే మీకన్నీ గుర్తున్నాయి"

తలూపాడు.

"పెళ్ళి అయ్యాక కూడా ఉండండి. మిమ్మల్ని చూస్తుంటే, ఆ రోజులు తలుచుకుంటుంటే, కాలం నిజంగా వెనక్కి తిరిగినట్టుగా ఉంది. ఉండండి, మాట్లాడుకుందాం" అని చేతులు పట్టుకుని అడిగి, బదులు కోసం చూడకుండా కిందికి వెళ్ళింది దమయంతి.
Like Reply


Messages In This Thread
"అంతరాయం" - by earthman - 24-04-2022, 10:51 PM
RE: "అంతరాయం" - by earthman - 24-04-2022, 11:01 PM
RE: "అంతరాయం" - by DasuLucky - 24-04-2022, 11:54 PM
RE: "అంతరాయం" - by vg786 - 25-04-2022, 12:24 AM
RE: "అంతరాయం" - by krantikumar - 25-04-2022, 06:13 AM
RE: "అంతరాయం" - by ramd420 - 25-04-2022, 06:21 AM
RE: "అంతరాయం" - by Kushulu2018 - 25-04-2022, 08:37 AM
RE: "అంతరాయం" - by Bellakaya - 25-04-2022, 09:28 AM
RE: "అంతరాయం" - by Paty@123 - 25-04-2022, 09:51 AM
RE: "అంతరాయం" - by utkrusta - 25-04-2022, 03:03 PM
RE: "అంతరాయం" - by raja9090 - 25-04-2022, 11:45 PM
RE: "అంతరాయం" - by earthman - 25-04-2022, 11:59 PM
RE: "అంతరాయం" - by earthman - 25-04-2022, 11:59 PM
RE: "అంతరాయం" - by krantikumar - 26-04-2022, 05:47 AM
RE: "అంతరాయం" - by manmad150885 - 26-04-2022, 07:04 AM
RE: "అంతరాయం" - by Paty@123 - 26-04-2022, 07:44 AM
RE: "అంతరాయం" - by ramd420 - 26-04-2022, 04:43 PM
RE: "అంతరాయం" - by earthman - 27-04-2022, 06:50 PM
RE: "అంతరాయం" - by earthman - 27-04-2022, 06:51 PM
RE: "అంతరాయం" - by likithaleaks - 27-04-2022, 09:03 PM
RE: "అంతరాయం" - by ramd420 - 27-04-2022, 09:22 PM
RE: "అంతరాయం" - by Paty@123 - 28-04-2022, 05:24 PM
RE: "అంతరాయం" - by earthman - 28-04-2022, 06:09 PM
RE: "అంతరాయం" - by earthman - 28-04-2022, 06:08 PM
RE: "అంతరాయం" - by Manihasini - 29-04-2022, 09:41 AM
RE: "అంతరాయం" - by earthman - 29-04-2022, 06:07 PM
RE: "అంతరాయం" - by murali1978 - 29-04-2022, 10:51 AM
RE: "అంతరాయం" - by Mohana69 - 29-04-2022, 11:54 AM
RE: "అంతరాయం" - by utkrusta - 29-04-2022, 12:11 PM
RE: "అంతరాయం" - by ravi - 29-04-2022, 12:22 PM
RE: "అంతరాయం" - by earthman - 29-04-2022, 06:06 PM
RE: "అంతరాయం" - by earthman - 29-04-2022, 06:08 PM
RE: "అంతరాయం" - by DasuLucky - 29-04-2022, 06:54 PM
RE: "అంతరాయం" - by vg786 - 29-04-2022, 06:29 PM
RE: "అంతరాయం" - by Paty@123 - 29-04-2022, 11:45 PM
RE: "అంతరాయం" - by krantikumar - 30-04-2022, 05:59 AM
RE: "అంతరాయం" - by Manihasini - 30-04-2022, 10:06 AM
RE: "అంతరాయం" - by earthman - 30-04-2022, 08:19 PM
RE: "అంతరాయం" - by Paty@123 - 30-04-2022, 11:55 AM
RE: "అంతరాయం" - by Venkat - 30-04-2022, 12:15 PM
RE: "అంతరాయం" - by saleem8026 - 30-04-2022, 03:25 PM
RE: "అంతరాయం" - by utkrusta - 30-04-2022, 04:41 PM
RE: "అంతరాయం" - by divyaa - 30-04-2022, 04:48 PM
RE: "అంతరాయం" - by earthman - 30-04-2022, 08:17 PM
RE: "అంతరాయం" - by earthman - 30-04-2022, 08:19 PM
RE: "అంతరాయం" - by vg786 - 30-04-2022, 09:15 PM
RE: "అంతరాయం" - by saleem8026 - 30-04-2022, 09:48 PM
RE: "అంతరాయం" - by ramd420 - 30-04-2022, 09:54 PM
RE: "అంతరాయం" - by Nani19 - 30-04-2022, 10:43 PM
RE: "అంతరాయం" - by manmad150885 - 30-04-2022, 11:28 PM
RE: "అంతరాయం" - by BR0304 - 30-04-2022, 11:46 PM
RE: "అంతరాయం" - by Livewire - 01-05-2022, 04:48 AM
RE: "అంతరాయం" - by Livewire - 01-05-2022, 04:49 AM
RE: "అంతరాయం" - by krantikumar - 01-05-2022, 04:55 AM
RE: "అంతరాయం" - by Paty@123 - 01-05-2022, 12:34 PM
RE: "అంతరాయం" - by Vvrao19761976 - 01-05-2022, 02:18 PM
RE: "అంతరాయం" - by raja9090 - 09-05-2022, 03:14 PM
RE: "అంతరాయం" - by utkrusta - 09-05-2022, 03:46 PM
RE: "అంతరాయం" - by vg786 - 09-05-2022, 04:12 PM
RE: "అంతరాయం" - by srinivasulu - 09-05-2022, 04:25 PM
RE: "అంతరాయం" - by Paty@123 - 11-05-2022, 01:16 PM
RE: "అంతరాయం" - by vg786 - 13-05-2022, 12:03 AM
RE: "అంతరాయం" - by Uday - 14-05-2022, 12:06 PM
RE: "అంతరాయం" - by Jay3241 - 05-12-2024, 09:52 AM
RE: "అంతరాయం" - by Jay3241 - 05-12-2024, 09:53 AM
RE: "అంతరాయం" - by appalapradeep - 05-12-2024, 12:07 PM
RE: "అంతరాయం" - by sri7869 - 19-12-2024, 12:19 PM



Users browsing this thread: 2 Guest(s)